ruling party leaders
-
నోటి మాట... దోపిడీ బాట
ఆ మధ్య సఖినేటిపల్లి బాడిరేవులో అనధికారికంగా ఇసుక ర్యాంపును ప్రారంభించారు. యూనిట్ ఇసుకను రూ.1500 నుంచి 2వేల వరకు విక్రయించారు. రోజుకు 200 నుంచి 300 ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు నిలదీస్తే కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో ర్యాంపు నడుపుతున్నట్టు రెవెన్యూ అధికారులు సెలవిచ్చారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇసుక అక్రమాలకు అధికా రులే తెరలేపుతున్నారా? అడ్డగోలు సంపాదనకు అధికారులే రాచబాట వేస్తున్నారా? ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ ప్రకారం అధికారులు నడుచుకుంటున్నారా? తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారా? మౌఖికం పేరుతో ఇసుకను అడ్డగోలుగా తరలించేస్తున్నారా? జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. జిల్లాలో అనేక చోట్ల అనధికారికంగా గోదావరిని గుల్ల చేసేస్తున్నా రు. కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ మౌఖిక ఆదేశాలని చెప్పి ఇసుకను మింగేస్తున్నారన్న విమర్శలున్నాయి. సఖినేటిపల్లి బాడుగ, బోడసకుర్రు, వెదుళ్లపల్లి...ఇలా ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకుల అండదండలతో అక్రమాలు జరిగిపోతున్నాయి. నేతలు సూ త్రధారులుగా, అధికారులు పాత్రధారులై ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. అభివృద్ధి పనులకు, గృహ అవసరాలకోసమని ఇసుకను తోడేస్తున్నారు. నిజంగా అవసరమైతే పర్యావరణ ఇబ్బందుల్లేని చోట అధికారిక ఉత్తర్వులతో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయాలి. కానీ, అవసరాల ముసుగులో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చడం కోసం మౌఖిక ఆదేశాల పేరుతో ఇష్టారీతిన ర్యాంపులు నడుపుతున్నారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఇప్పుడు మౌఖిక ఆదేశాల ట్రెండ్ నడుస్తోంది. అనుమతుల్లేకుండా అడ్డగోలు తవ్వకాలు జరపడం చూశాం... ఒకచోట అనుమతులు తీసుకుని మరోచోట తవ్వకాలు జరపడం విన్నాం... నిర్దేశిత విస్తీర్ణంతో అనుమతి తీసుకుని అంతకుమించిన విస్తీర్ణంలో తవ్వకాలు జరిపిన దాఖలాలున్నాయి. కానీ, మౌఖిక ఆదేశాలని ఎటువంటి ఉత్తర్వుల్లేకుండా అధికారులే అక్రమ తవ్వకాలకు తెరలేపడం విచిత్రంగా ఉంది. ఉచితమని చెప్పి అధికారుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇష్టమొచ్చిన రేటుకు ఇసుక విక్రయించి జేబులను నింపుకుంటున్నారు. ఇటీవల అల్లవరం మండలం బోడసకుర్రు వద్ద వైనతేయ నదిపై ఉన్న వంతెన పక్కనే ఇసుక దందాకు పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం మూసివేసిన ఇసుక ర్యాంపును ఈ దందాపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించి మూడు రోజుల కిందట ఈ అనధికార ర్యాంప్ మూసవేశారు. సీసీ రోడ్లు, గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరిట కలెక్టర్ అనుమతి ఇచ్చారంటూ ఈ ఇసుక తవ్వకాలకు తెరదీశారు. కలెక్టర్ ఉత్తర్వులు, ఆదేశాలు అని చెప్పి ఆర్డీవో ద్వారా అల్లవరం ఎమ్మార్వో ఈ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనిపై కలెక్టర్ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారని ‘సాక్షి’ తహసీల్దార్‌ను వివరణ కోరినప్పుడు లిఖిత పూర్వకంగా ఇవ్వలేదని.., మౌఖికంగా ఆదేశించారని చెప్పుకొచ్చారు. దీంతో ఇసుక అక్రమ దందాకు అధికార టీపీపీ నేతల హస్తం ఉందన్న వాస్తవం వెలుగు చూసింది. ఇక, సఖినేటిపల్లి బాడవ వద్ద అనధికారికంగా జరిగిన తవ్వకాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగితే కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో ర్యాంపునకు అనుమతి ఇచ్చామని సమర్థించుకున్నారు. లిఖితపూర్వకంగా రాసివ్వండని రెవెన్యూ అధికారులను అడిగితే ససేమిరా అన్నారు. తాజాగా వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు విషయంలో కూడా దాదాపు అదే సమాధానం వచ్చింది. అనుమతుల్లేవని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా తహసీల్దార్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ సబ్ కలెక్టర్ ఆదేశాలతో ర్యాంపును నిర్వహించామని చెప్పుకొచ్చారు. మొత్తానికి విజిలెన్స్ అధికారుల ఆదేశాలతో ర్యాంపును మూసివేయగా, విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి జిల్లాలో మౌఖిక ఆదేశాల ముసుగులో ఇసుకను ఏకంగా తోడేస్తున్నారని రుజువైంది. -
ఆధికార పార్టీ నేతలు ఆయిల్ దోపిడి
-
నిగ్గు తేల్చేనా?
అక్రమ మైనింగ్ విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇంటి దొంగలను రక్షించేందుకు అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తే ఎక్కడ గుట్టురట్టవుతుందోననే భయంతో.. తమ చెప్పుచేతల్లో ఉండే సీబీ సీఐడీకి ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు మైనింగ్ అధికారులు చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగానే సీబీసీఐడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మైనింగ్ తిమింగలంపై కాకుండా.. కేవలం అమాయకపు చేప పిల్లలపైనే కేసులు నమోదు చేశారు. సాక్షి, గుంటూరు: ఏ రోజుకారోజు కొత్త పాత్రలు ప్రవేశిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అక్రమ మైనింగ్‌లో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధాలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ పెద్దల వివరాలు బయటపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి హైకోర్టు ఆగ్రహంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, దాచేపల్లి మండలం నడికుడి, కోనంకి గ్రామాల్లో నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే విచారణ చేపట్టిన మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్‌కు సూత్రధారులైన అధికార పార్టీ ఎమ్మెల్యే, మైనింగ్ మాఫియాను రక్షించడంలో భాగంగా వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లను బలిపశువులను చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కథ ఇక్కడితో ఆగలేదు.. 13న పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేయడం, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అక్రమార్కులను తప్పించేందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సీబీసీఐడీ అధికారులకు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను అప్పగించినట్టు తెలుస్తోంది. ïసీబీసీఐడీ ఏడీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో, డీఐజీ కాలిదాసు రంగారావు పర్యవేక్షణలో ఎనిమిది మంది డీఎస్పీలు, 14 మంది సీఐలు ఎనిమిది బృందాలుగా ఏర్పడి అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. 20 ప్రశ్నలు సంధించిన పోలీస్ శాఖ.. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్‌పై సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు 31 లక్షల మెట్రిక్ టన్నులు తెల్లరాయిని అక్రమంగా తవ్వి దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీస్ శాఖ మైనింగ్ అధికారులకు 20 ప్రశ్నలు సంధించింది. అయితే వీటికి మైనింగ్ అధికారులు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. ఆ ప్రశ్నలతో సహా ఇప్పటి వరకూ జరిగిన మొత్తం విచారణను నివేదిక రూపంలో సీబీసీఐడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. మైనింగ్ అ«ధికారులు పెట్టిన కేసులపైనే విచారణ.. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణకు సిద్ధమైన సీబీసీఐడీ నిజాలను నిగ్గు తేలుస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలను బలపరుస్తూ సీబీసీఐడీ అక్రమ మైనింగ్‌పై మొదటి నుంచి కొత్తగా దర్యాప్తు చేపట్టకుండా మైనింగ్ అధికా>రులు ఎమ్మెల్యే, మైనింగ్ మాఫియాను రక్షించడంలో భాగంగా అమయాకులపై పెట్టిన కేసుల విచారణను కొనసాగించనునన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమ మైనింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మైనింగ్ డీడీ, ఏడీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టిన కేసులపై దర్యాప్తు కొనసాగిస్తే అసలు నేరస్థులు బయట వచ్చే పరిస్థితి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. అసలు దొంగలు బయటపడతారా..? పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, అతని ముఖ్య అనుచరులను తప్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు శతవిధాల ప్రయత్నించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్టు బయటపడుతుండటంతో సీబీఐకు విచారణ అప్పగిస్తే నిజాలు నిగ్గుతేలుతాయనే భయంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీబీసీఐడీకు విచారణ బాధ్యతలు అప్పగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీస్ శాఖలోని కొంత మంది అధికారుల పాత్ర అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని నీరుగార్చేందకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ అయినా నిజాలు నిగ్గు తేల్చి అసలు దొంగలను పట్టుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
కొండల్ని కొల్లగొడుతున్నారు!
సాక్షి, చోడవరం : మండలంలో అక్రమ మెటల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి తోచిన స్థాయిలో వారు కొండలను తవ్వేస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ..గోవాడ, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, అంభేరుపురం గ్రామాల పరిధిలోని కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నిర్వహిస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ దోచుకున్నవారికి దోచుకున్నంతగా ఈ కొండలను కొల్లగొడుతున్నారు. వాస్తవానికి ఎర్ర మెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, గనులశాఖల అనుమతి తప్పనిసరి. కాని చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లో.. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎవరికి తోచినంత వారు తవ్వేసుకొని తరలించుకుపోతున్నారు. గోవాడ–భోగాపురం గ్రామ మధ్య ఉన్న కొండపై అడుగడుగునా ఈ అక్రమ మెటల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఖండిపల్లి, భోగాపురం, దుడ్డుపాలెం, అడ్డూరు క్వారీల్లో పొక్లెయిన్, జేసీబీ యంత్రాల సాయంతో ఎక్కడికక్కడ కొండను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటికి స్థానిక అధికారపార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ సర్పంచ్ల అనుచరులే.. ఖండిపల్లి, దుడ్డపాలెం గ్రామాల్లో అధికారపార్టీ సర్పంచ్ల అనుచరులే నేరుగా కొండను తవ్వేసి మెటల్‌ను అమ్మేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రియల్ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంధవరం, అడ్డూరు గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి భూములను ఎత్తుచేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీఆర్వోలపై విమర్శలు.. స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సహకారంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మండల రెవెన్యూ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం గ్రావెల్ క్వారీలకు మండలంలో ఎటువంటి అనుమతులు లేవు. అక్రమంగా తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటాం. తవ్వకాల నిరోధించేందుకు ఆయా గ్రామాల వీఆర్వోలతో తనిఖీ బృందం ఏర్పాటుచేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. – కేవీఎస్ రవి, తహసీల్దార్, చోడవరం -
న్యాయం జరిగేదెలా..!?
యడ్లపాడు మండలం సంగం గోపాలపురానికి చెందిన షేక్ చిన్న కమాల్ ఇరవై ఏళ్ల కిందట గుంటూరుకు చెందిన మేరి వద్ద స్థలం కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని తన ముగ్గురు కుమార్తెలకు పంచడంతో వారు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఆ స్థలంపై స్థానిక అధికార పార్టీ నాయకుడు కన్నేశాడు. పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. అయితే ఈ సారి స్థలం ఖాళీ చేయాలని అధికార పార్టీ నాయకుడు పోలీసులతో కుమ్మక్కై వేధింపులు తీవ్రం చేశాడు. అర్ధరాత్రి వేళలో ఇంటికి వెళ్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించడంతో గత్యంతరం లేని స్థితిలో బాధితులు రూరల్ ఏఎస్పీని కలిసి గత సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల హెచ్చరికతో పోలీసులు ఓ అడుగు వెనక్కి వేశారు. సదరు నాయకుడు మాత్రం ఎలాగైనా స్థలం కాజేయాలనే పనిలో నిమగ్నమయ్యాడు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు: ‘సారూ.. ఆ ఎస్ఐ మమ్మల్ని పట్టించుకోవడంలేదయ్యా.. తమరే మా కు న్యాయం చేయాలి..’ అంటూ ఓ వృద్ధ దంపతులు మొరపెట్టుకోగా.. ‘ఎస్పీ గారూ.. మా స్థలం కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారికి పోలీసులు వత్తాసుపలికి, ఫిర్యాదిచ్చిన మా మీదనే బెదిరింపులకు దిగుతున్నారంటూ...’ బాధితులు రూరల్, అర్బన్ ఎస్పీల గ్రీవెన్స్‌లో వాపోతున్నారు. పోలీసులు బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి.. తక్షణమే వారి సమస్యలపై స్పందించాలని అర్బన్, రూరల్ ఎస్పీలు పదేపదే క్రైం సమీక్షల్లో చెబుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండటం లేదనిపిస్తోంది. అచ్చంగా కాసులొచ్చే కేసులపైనే మక్కువ చూపుతూ.. అన్యాయం జరిగిన వారిని సైతం బెదిరిస్తూ పబ్బంగడుపుకోవాలని కొందరు ఎస్ఐ, సీఐలు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోన్న క్రమంలో బా«ధితులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఓ అడుగు ముందుకు వేస్తే..అధికార పార్టీ నాయకుల అండతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేసేందుకు సైతం వెనుకాడటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సివిల్ వివాదాల్లో తలదూర్చి.. జిల్లాలో ఇటీవల వివిధ స్టేషన్ల పరిధిలోని కొందరు ఎస్సై, సీఐ స్థాయి అధికారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారితో అమర్యాదగా మాట్లాడటం, వారి చెప్పినట్లు వినకపోతే ఇరుపక్షాల కేసులను నమోదు చేసేందుకు కూడా వెనుకాడటంలేదు. జిల్లాలోని అర్బన్ పరిధిలో 18 స్టేషన్లు, రూరల్ పరిధిలో 64 స్టేషన్లు ఉండగా, వాటి పరిధిలో సరాసరిగా చూస్తే నెలకు 2400 కేసులు వరకు నమోదవు తున్నాయి. గతంలో స్టేషన్ కొచ్చిన ఫిర్యాదులన్నింటిని జనరల్ డైరీ (జీడీ)లో నమోదు చేసి.. ఆ సమాచారాన్ని ప్రతీ రోజూ సాయంత్రానికి జిల్లా కేంద్రానికి పంపేవారు. అయితే, నేడు కొన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఫిర్యాదుల సమాచారమే రావడం లేదని అధికార వర్గాల సమాచారం. సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్న పోలీస్ అధికారులపైనే ఉన్నతాధికారులకు అధికంగా ఫిర్యాదులందుతున్నాయి. రాజధాని నేపథ్యంలో స్థలాల ధరలు పెరగడం, డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వంటి వ్యవహారాలు సంగతి తెలిసిందే. అయితే, ఆయా కేసుల్లో బాధితులకు అన్యాయం చేసిన వారితో పాటు పోలీస్ అధికారులపైనా ఆరోపణలు రావడం గమనార్హం. గ్రీవెన్స్ సెల్లో ఒకే స్టేషన్ పరిధిలో రెండు, మూడు సార్లు ఫిర్యాదులు వస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికి ఫలితంలేకుండా పోయింది. ఇలాగైతే బాధితులకు న్యాయం ఎలాజరుగుతుందనే విమర్శలు లేక పోలేదు. మండల స్థాయిలో నమ్మకం లేకనే మండల స్థాయిలో అధికారపార్టీ నాయకుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న పోలీసులు ఎటూ మాట్లాడలేక మిన్నకుండిపోతున్నారు. గ్రీవెన్స్‌లో అధికంగా ఆస్తుల వివాదాలు, బెదిరింపుల వ్యవహారాలు, కొట్లాట కేసుల్లో న్యాయం జరగడం లేదని, మండలస్థాయిలో స్టేషన్లపై నమ్మకం ఉండటం లేదని బాధితులు అర్బన్, రూరల్ ఎస్పీలను కలుస్తున్నారు. ఇదిలావుంటే, జిల్లా కేంద్రంకు వచ్చే ఫిర్యాదుల్లో కొంత భాగం అవాస్తవాలు కూడా నమోదవుతున్నాయని ఎస్పీలే చెబుతున్నారు. ఏది ఏమైనా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది బాధితుల పట్ల వ్యవహరించే శైలిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లంచాలే ఆయనకు దివ్య‘ప్రసాద’ం రాజధాని ప్రాంతంలో కొంతమంది పోలీస్ అధికారుల అవినీతి మితిమీరిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ స్టేషన్ బాస్ అయితే.. లంచాల రూపంలో ‘ప్రసాదం’ ముడితే.. తప్పు చేసిన వాళ్లను వదిలేసి.. బాధితులనే వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోతున్నారు. ఈ అధికారి అక్రమంగా సంపాందించిన సొమ్ముతోనే రాజధాని ప్రాంతంలోని వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఉన్న ప్లాటును బినామీ పేరు మీద కొనుగోలు చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా జిల్లా పోలీస్ బాస్, డివిజన్ బాస్ తెలుసుకోవడంతో ఈ స్టేషన్ బాస్‌పై ఫైర్ అయినట్టు వినికిడి. -
పాస్టర్ ముసుగులో అఘాయిత్యం
జెడ్ మేడపాడు (మండపేట): విధి వంచితురాలైన దివ్యాంగురాలిపై పాస్టర్ ముసుగులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అధికారపార్టీ నేతల అండతో రాజీకి ప్రయత్నించాడు. విషయం బయటకు పొక్కడంతో స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని జెడ్ మేడపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జెడ్ మేడపాడుకు చెందిన 22 ఏళ్ల యువతి పుట్టు మూగ కావడంతోపాటు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు రాంబాబు వద్ద ఉంటోంది. రాంబాబు ఉదయాన్నే రైస్ మిల్లులో ఊక మోసేందుకు వెళుతుంటాడు. అతడి భార్య కూలి పనికి వెళుతుంటుంది. బాధితురాలు ఇంటి వద్దనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండలంలోని అర్తమూరుకు చెందిన ఓశెట్టి దుర్గారావు అలియాస్ రాజారావు (60) భార్య చనిపోగా 20 ఏళ్ల క్రితమే జెడ్ మేడపాడు వచ్చేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇంటింటికీ తిరిగి ఇనుస సామాను సేకరించి అమ్ముతుంటాడు. సాయంత్రం సమయంలో పాస్టర్‌గా చలామణి అవుతూ ఇంటింటికీ వెళ్లి ప్రార్థనలు చేస్తుంటాడు. ఈ క్రమంలో వికలాంగ యువతికి పింఛన్ సొమ్ములు ఇప్పించేందుకంటూ ఆమెను రాజారావు తన మోటారు సైకిల్‌పై తీసుకెళుతుండేవాడు. వారం కిందట యువతి తీవ్ర కొడుపునొప్పితో బాధపడుతుండటంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా, ఏడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయమై కుటుంబసభ్యులు యువతిని ప్రశ్నించగా రాజారావు తనను తల్లిని చేసినట్టుగా సైగల ద్వారా తెలిపింది. దీనిపై ఆయన్ని నిలదీయడంతో గ్రామంలో అధికార పార్టీకి చెందిన పెద్దలను ఆశ్రయించాడు. పుట్టే బిడ్డను ఆశ్రమంలో చేర్పించడంతోపాటు మూగ యువతికి రూ.50 వేలు చెల్లించాలని పెద్దలు నిర్ణయించినట్టు రాంబాబు, స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించారు. ఈ విషయం తెలిసి బాధితురాలి ఇంటికి సోమవారం మీడియా వెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. పాస్టర్‌నని చెప్పుకుంటూ తన సోదరిని గర్భవతిని చేశాడంటూ రాంబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం స్థానికులు రాజారావు ఇంటికెళ్లి అతడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
పాలకులపై పవన్ మండిపాటు
సాక్షి, అమరావతి : ఎంతో అనుభవం, నైపుణ్యం కలిగిన ప్రస్తుత రాజకీయ నేతలు చేస్తున్న ప్రయోగాలు వ్యవస్థకు మంచి చేయకపోగా కీడు చేస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. లోప భూయిష్టమైన పబ్లిక్ పాలసీలు, అసమాన ఆర్థికాభివృద్ధి, బలహీన వర్గాలపై బలంగా పనిచేసే చట్టాలు, బలంగా ఉన్న వారిపై బలహీనంగా పనిచేసే చట్టాలు... ఇలా ఎన్నో అంశాలు వ్యవస్థను పీడిస్తున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు ఆక్వాపార్కు అంశాన్ని ఉదాహరణగా పేర్కొంటూ.. ఆ ప్రాంతానికి చెందిన యువకులు తనను కలిశారని, పాలకులు తమకు కనీసం స్వచ్ఛమైన గాలి, నీరు కూడా లేకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రాథమిక హక్కుల కోసం కూడా ప్రజలు పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఇదే భావనలో ఉన్నారన్నారు. ప్రజల పట్ల, వ్యవస్థల పట్ల రాజకీయ నేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం వ్యవస్థను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
తమిళ దేవుడికి.. ‘తెలుగు తంబిల’ టోపీ
ఎక్కడో తమిళనాడుకు చెందిన దేవుడికి ఓ భక్తుడు ఇచ్చిన భూములవి. విస్తీర్ణం ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 26 ఎకరాలు. సుమారు రూ.50 కోట్ల విలువైన ఆ భూములపై రైతుల ముసుగులో ఉన్న ఇద్దరు అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఇంకేముంది.. దేవుడికే శఠగోపం పెట్టేశారు. వాటిని ఎలాగోలా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. వరిసాగుతో ఒరిగేదేమీ లేదనుకున్నారో ఏమో మరి! ఏకంగా ఆక్వా సాగు ప్రారంభించారు. చెరువులను తిరిగి లీజుకిచ్చేసి రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. అటు ఆలయానికి లీజు.. ఇటు రెవెన్యూకు శిస్తు చెల్లించకుండా.. దేవుడి సొమ్మును దర్జాగా దోచుకుంటూ.. అధికారం అండతో.. ఆ ‘తెలుగు తంబిలు’ సాగిస్తున్న దందా ఇదీ.. పిఠాపురం: తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబు దూర్ అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్యస్వామి ఆలయానికి పిఠాపురం రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 802–2లో సుమారు 26 ఎకరాల భూములు ఉన్నాయి. మా ర్కెట్ రేటు ప్రకారం ప్రస్తుతం వాటి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంది. సుమారు 50 ఏళ్ల కిందట పిఠాపురానికి చెందిన ఒక దాత తనకు వారసులు లేకపోవడంతో.. తమ కులదైవమైన శ్రీపెరంబుదూర్ ఆదికేశవస్వామివారి ఆలయానికి ఈ భూములను విరాళంగా ఇచ్చారు. తమిళనాడు దేవాదాయ శాఖ అధికారులు ఆ భూములను స్థానిక రైతులకు లీజుకు ఇచ్చారు. ఈ భూ ములపై కన్ను వేసిన అధికార టీడీపీకి చెందిన ఇద్దరు వాటిని రెండేళ్ల లీజుకు తీసుకున్నారు. ఇదంతా పదిహేనేళ్ల కిందటి బా గోతం. లీజు కాలం పూర్తయిన తరువాత కూడా పంటలు దెబ్బ తిన్నాయని, నష్టం వచ్చిందని సాకులు చెబుతూ, వాటిని ఖాళీ చేయకుండా, రాజకీయ పలుకుబడితో ఆ భూములపై పెత్తనం సాగిస్తున్నారు. సుమారు 15 ఏళ్లుగా ఎటువంటి లీజూ చెల్లించకుండా, తమ సొం త భూముల మాదిరిగా పంటలు సాగు చేసుకుంటూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని దిగమింగుతున్నారని, చివరకు రెవెన్యూకు చిల్లిగవ్వ కూడా భూమి శిస్తు చెల్లించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు కూడా అయినందువల్లనే అధికారులు మిన్నకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమ ఆక్వా చెరువులు తమిళ దేవుడికి ఇక్కడ భూములున్న విషయం ఎవ్వరికీ తెలియకపోవడంతో ఇక తమను అడిగేవారే లేరనుకున్న ఆ నేతలు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వేశారు. తమిళనాడు దేవాదాయ శాఖ ఎటువంటి లీజుకూ ఇవ్వకపోయినా, ఎవరి అనుమతీ తీసుకోకుండానే ఏకంగా రొయ్యల సాగు చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలని తమిళనాడు దేవాదాయ శాఖ ప్రయత్నించింది. అయితే, ఆ భూములు ఖాళీగా లేవని, వాటిల్లో ఆక్వా చెరువులు తవ్వారనే విషయాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సదరు నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు నిర్వహిస్తున్నారు. ఒకపక్క అక్కడ రొయ్యల సాగు చేస్తూనే అధికార పార్టీ ముఖ్య నేత అండతో రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పంటభూములుగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతుల ఆందోళన పచ్చని పంట పొలాల మధ్య చిచ్చు పెడుతూ రొయ్యల చెరువులు తవ్వుతున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల చెరువుల వల్ల చుట్టుపక్కల ఉన్న సారవంతమైన పంట పొలాలు చౌడుబారి పోతున్నాయని, తీవ్ర నష్టాల పాలవుతున్నామని వారు వాపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా చెరువులు తవ్వేసినా, అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు పట్టించుకోవడంలేదని, దీంతో తమ పొలాలు నాశనమవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఆ భూములకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా లీజు రావడం లేదు. కొన్నేళ్లుగా శిస్తు చెల్లించడం లేదు. ఇటీవల ఆ భూములను లీజుకు ఇచ్చేందుకు వేలం వేయాలని ప్రయత్నించగా, ఎవరో ఆక్రమించుకుని రొయ్యల చెరువులు తవ్వినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయస్థానంలో కేసు వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. పిఠాపురంలో ఒక న్యాయవాది ద్వారా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. – ఎ.నరసింహన్, దేవాదాయ శాఖ అధికారి, అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్య స్వామివారి ఆలయం, శ్రీపెరంబుదూర్, తమిళనాడు అవి దేవుడి భూములే, ఆచెరువులు అక్రమ చెరువులే తమిళనాడు దేవస్థానానికి చెందిన భముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వినట్లు గుర్తించాము. ఈవిషయాన్ని ఆదేవస్థానం అధికారులకు నోటీసులు పంపించాము. ఆభూముల్లో రొయ్యల చెరువులు ఉండగా రెవిన్యూ రికారుండల్లో పంట భూములుగానే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాము. రెవిన్యూ శిస్తు సైతం గత మూడేళ్లుగా చెల్లించడం లేదు. పలుమార్లు నోటీసులు పంపినా సమాధానం లేదు. – బి.సుగుణ, తహసీల్దార్, పిఠాపురం -
ఆక్వా మంటలు
పిఠాపురం: పచ్చని పంట పొలాలు తెల్లారేసరికి రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఏ అనుమతులతో పని లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు చెరువులు తవ్వుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. పంట పొలాల మధ్య చెరువులు తవ్వడం వల్ల చవుడుబారి పనికిరాకుండా పోతున్నాయని వాపోతూ ఆందోళనకు దిగినా పట్టించుకునే వారే లేరని రైతులు మండిపడుతున్నారు. కొత్తపల్లి మండలం రమణక్కపేట, నాగులాపల్లి గ్రామాల మధ్యలో గత నెల రోజులుగా పొక్లైన్లతో చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంబంధితాధికారులకు భారీగా ముడుపులు ముడుతుండడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం కనుమరుగు కానుందా..? కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కేఎస్ఈజెడ్) కోసం కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి మండలం తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో వరి పంట పొలాలు సుమారు 2 వేల ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిపై ఆధారపడి 4 వేల మంది రైతులు, 10 వేల మంది వ్యవసాయ కూలీలు, పరోక్షంగా మరో 10 వేల మంది వ్యాపారులు, ఇతర వర్గాలు జీవిస్తున్నారు. ఉన్న కొద్ది పంట పొలాలను సాగుచేసుకుని జీవిస్తున్న వీరిపై రొయ్యల చెరువుల తవ్వకాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయంటున్నారు. ప్రస్తుతం వందల ఎకరాల పంట పొలాల మధ్యచెరువులు తవ్వడం వల్ల కలుషిత జలాలు విడుదలై చుట్టుపక్కల పొలాలు పనికిరాకుండాపోతాయని రైతులు వాపోతున్నారు. అత్యంత వ్యవసాయాధారమైన ఇక్కడి పంట కాలువ పెదేరులో ఈ కలుషిత జలాలు కలవడంతో అన్ని పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతల అరాచకం.. రైతుల అభివృద్ధే తమ ధ్యేయమంటూ ప్రకటనలు గుప్పించే అధికార పార్టీ నేతలు ప్రత్యక్షంగా వ్యవసాయాన్ని నాశనం చేస్తూ వాటిపై ఆధారపడి జీవిస్తున్న తమ పొట్టకొడుతున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పంట పొలాలపై కన్నేసిన కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఆ పొలాలను లీజు పేరుతో తన సొంతం చేసుకుని ఆ పార్టీ నేతల అండదండలతో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వకాలు చేపట్టినట్టు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులు తవ్వాలంటే... వ్యవసాయ భూముల్లో ఎటువంటి రొయ్యల చెరువులు తవ్వకూడదనే ఖచ్చితమైన నిబంధన ఉంది. చెరువులు ఒకవేళ తవ్వాల్సి వస్తే రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పొల్యూషన్, భూగర్భ, మత్స్యశాఖ వంటి 22 శాఖల అనుమతులు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చెరువుల తవ్వకాలు చేపడుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ‘తమ పొలాల మధ్య అక్రమ చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని, వాటి వల్ల తమ పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులకు స్థానిక రైతులు ఫిర్యాదు చేసినా అరణ్య రోదనవుతుందేతప్ప సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇప్పటికే సుమారు 150 ఎకరాల్లో తవ్వకాల కోసం పచ్చని చెట్లను కూల్చేశారని, పొలాల గట్లను తీసేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యంచేసుకొని అక్రమ చెరువుల తవ్వకాలను నిలిపివేసి ... తమ పొలాలకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. మాకేం సంబంధం... ఈ విషయంపై కొత్తపల్లి తహసీల్దారు రత్నకుమారిని వివరణ కోరగా ఏదైనా కట్టడం కడితే తప్ప వ్యవసాయ భూముల్లో ఏమి చేసుకున్నా మాకు సంబంధం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. -
అంతా పక్కా స్కెచ్
సాక్షి, అమరావతి: అధికార పార్టీ పెద్దలు, కీలక నేతలు పకడ్బందీ స్కెచ్‌తోనే ప్రభుత్వ భూములను కొట్టేశారని స్పష్టమవుతోంది. రికార్డులను మాయం చేసి ట్యాంపరింగ్ చేసి విలువైన ప్రభుత్వ భూములను సొంతం చేసుకునేందుకు సుదీర్ఘ కాలం కిందటే ప్లాన్ చేసుకున్నారు. నిషేధిత ఆస్తుల (క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయకూడని) జాబితా (పీఓబీ) వివరాలను 2016 మార్చిలోగా సమర్పించాలని హైకోర్టు 2015 డిసెంబరులో ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కడం వెనుక ఆంతర్యం ఇదే. హైకోర్టు ఆదేశాల ప్రకారం 2016 మార్చిలో పీఓబీ జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులు వెబ్సైట్లో పెడితే తర్వాత వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వ భూములను కైవశం చేసుకునే ఆస్కారం ఉండదు. అందువల్లే 2016లో పీఓబీ జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులకు ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని అధికార పక్ష నేతలు కట్టడి చేశారు. విలువైన స్థలాలు/ భూములపై కన్నేసి రికార్డులు తారుమారు చేశారు. బినామీ పేర్లతో కైవసం చేసుకునే వరకూ ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్, గ్రామ మ్యాపులు, ఇతర రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయనే విషయం ప్రభుత్వానికి 2016 జూలైలోనే తెలుసు. భూ రికార్డుల డిజిటలైజేషన్ సందర్భంగా రికార్డులు కనిపించని విషయాన్ని క్షేత్ర స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇది గత ఏడాది చివర్లోకలెక్టర్ల కాన్ఫరెన్సులో కూడా ప్రస్తావనకు వచ్చింది. అయినా ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించకుండా ఉండడాన్ని బట్టే కీలక నేతలు ఉద్దేశపూర్వకంగానే దీనిని దాచి ఉంచారని, ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకున్న తర్వాత ఏమీ ఎరుగనట్లు విచారణ పేరుతో నాటకం ఆడుతున్నారని తేటతెల్లమవుతోంది. -
బదిలీ.. కాస్త రేటెక్కువ!
పోస్టింగ్స్ వీరికే ఇవ్వండి! – జాబితాలను పంపుతున్న ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు – పోస్టును బట్టి రేటు వసూలు చేస్తున్న కొద్దిమంది అధికారపార్టీ నేతలు – ప్రతీ శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్న వైనం - నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్న అధికారులు - సీఐలు, ఎస్ఐల బదిలీల్లోనే ఇదే తరహా తంతు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీల వ్యవహారం అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది. భారీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో పోస్టింగుల కోసం రేటు కట్టి మరీ అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన బదిలీల్లో తాము సూచించిన వారికే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి పోస్టు(ఫోకల్) కోసం రెవెన్యూ, పోలీసు శాఖల్లో భారీగా డిమాండ్ ఉంది. దీంతో నేతలు అడిగిన మొత్తం ఇచ్చేందుకు కూడా ఆయా శాఖలకు చెందిన అధికారులు సిద్ధపడుతున్నారు. ఎవరు ఎక్కువ మొత్తం ఇస్తే వారికే పోస్టింగులకు అధికార పార్టీ నేతలు సిఫారసు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే/ఇన్చార్జి సిఫారసు లేఖలతో బదిలీల కోసం ఉద్యోగులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొద్ది మంది అధికార పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి తమ నియోజకవర్గాల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పోస్టింగు కోసం తమ వద్దకు వస్తే.. ఆయా నియోజకవర్గ నేతలతో మాట్లాడి పోస్టింగులు ఇప్పిస్తున్నారు. మొత్తం మీద ఉద్యోగుల బదిలీల జాతర కాస్తా అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. పోస్టును బట్టి రేటు అధికార పార్టీ నేతలు పోస్టులకు ఉండే డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయిస్తున్నారు. మంచి ఆదాయం ఉన్న పోస్టులకు భారీగా ధర నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక ఆదాయం ఉన్న ప్రాంతాల్లో ధర మరీ ఎక్కువ పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో సీఐల పోస్టింగుల కోసం ఏకంగా రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక ఎస్ఐల బదిలీలపైనా జోరుగా పైరవీలు జరుగుతున్నట్టు సమాచారం. తమకు కావాల్సిన పోస్టు కోసం కొద్ది మంది అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పోస్టును బట్టి సదరు నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూలోనూ ఇదే తంతు నడుస్తోంది. వ్యవసాయశాఖతో పాటు ఇతర అన్ని శాఖల బదిలీల్లోనూ ఇదే వ్యవహారం జరుగుతోంది. ఈ విధంగా అన్ని శాఖల ఉన్నతాధికారులకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల నుంచి బదిలీల జాబితా అందుతున్నట్టు తెలుస్తోంది. అక్కడా పోస్టులు ఇప్పిస్తాం! తమ నియోజకవర్గంలోని పోస్టింగులతో పాటుగా ఇతర నియోజకవర్గాల్లో కూడా కొందరు నేతలు వేలు పెడుతున్నట్టు చర్చ జరుగుతోంది. ఇతర నియోజకవర్గాల్లోనూ తమకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేలతో సిఫారసు చేయించుకుని మరీ పోస్టింగులు ఇప్పిస్తామని తమ వద్దకు వచ్చే వారికి చెబుతున్నారు. ఇందుకోసం వసూలు చేస్తున్న మొత్తంలో చెరీ సగాన్ని పంచుకుతినేందుకు సిద్ధమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ బదిలీ వ్యవహారంలో ఈ విధంగా ఒక ఇన్చార్జి రూ.5 లక్షలు తీసుకుని మరీ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే వద్దకు పంపి సిఫారసు లేఖ ఇప్పించినట్టు సమాచారం. సదరు ఎమ్మెల్యేకు కూడా రూ.10 లక్షల వరకూ ముట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే బదిలీల వ్యవహారంలో ఈ విధంగా చేదోడువాదోడుగా మరింత ఎక్కువ మొత్తం సంపాదించుకునేందుకు అధికారపార్టీ నేతలు సిద్ధమవుతున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది. -
పింఛన్ల ఘోష పట్టదా!
బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో మొత్తం 20వేల పింఛన్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. దీనిలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తుదారుల ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే పరిశీలన చేయకుండానే ఆన్లైన్లో నమోదు చేశారు. దీనిపై సాక్షి దినపత్రికలో ఇటీవల పింఛన్ దారి మళ్లెన్ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. జరిగిందిలా.. కలెక్టర్ ఆదేశాలతో అన్ని మండలాలతో పాటు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇన్చార్జి ఎంపీడీఓ నరసింహరావు పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆన్లైన్ నమోదు చేయాలని సూచించారు. అయితే పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన దాఖలాలు లేవు. పింఛన్ల నమోదులో తమ్ముళ్ల గోల పింఛన్ల నమోదులో అధికారపార్టీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆన్లైన్ నమోదు చివరి రెండు రోజులు రాత్రింబవళ్లు ఎంపీడీఓ కార్యాలయంలో కొలువుదీరారు. ఎవరికివారు తమ పేర్లు నమోదు చేయమని పట్టుబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, లక్షాధికారుల పేర్లను పంపి పింఛన్ మంజూరు చేయించారు. నిబంధనలు ఇలా.. దరఖాస్తు చేసుకున్న పింఛన్‌దారులకు సంబంధించి నూరుశాతం ఫీల్డ్ లెవల్ వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్‌కు సంబంధించి పింఛన్ కమిటీలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు కూడా తప్పనిసరిగా ఉండాలి. నూతన పింఛన్ మంజూరుకు సంబంధించి జీఓ 135ను విధిగా పాటించాలి. దీనిలో భాగంగా ఎస్టీలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఎస్సీలతో పాటు చేతివృత్తుల వారికి, వికలాంగులకు, నిరుపేదలకు పింఛన్లు మంజూరు చేయాలి. అయితే జీఓకు విరుద్ధంగా జరిగిన పింఛన్ల మంజూరుపై దేవాదాయశాఖ ఉద్యోగి కుటుంబంలో , వడ్డీ వ్యాపారులకు, లక్షాధికారులకు పింఛన్లు మంజూరు చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు మండలంలోని అధికారపార్టీ నేతలు, అధికారుల కుమ్మక్కు రాజకీయంతో తమకు పింఛన్ రాదని తెలుసుకున్న మండలంలోని పోలినాయుడు చెరువుకు చెందిన పొట్లూరు లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులు మీడియా ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ప్రేమ్‌చంద్ సాల్మన్ క్షేత్రస్థాయి విచారణ జరిపి పింఛన్ల మంజూరుకు ఇన్చార్జి ఎంపీడీఓకు సిఫార్సు చేశారు. వారికి పింఛన్లు మంజూరైన దాఖలాలు లేవు. పింఛన్ ఇప్పించండి సారూ నేను, నా భర్త ఏ పనిచేయలేకున్నాం. మం దులకు డబ్బుల్లేవు. పూట గడవడం కష్టం గా ఉంది. పింఛన్ ఇప్పించండి సారూ. కలెక్టర్ సారూ పట్టిం చుకుని న్యాయం చేయాలి. –పొట్లూరు లక్ష్మమ్మ,పోలినాయుడు చెరువు పరిశీలన జరిపి తొలగిస్తాం అంగన్వాడీ కార్యకర్తకు పింఛన్ మంజూరు చేసిన విషయం తెలియదు. పరిశీలన చేసి ఆమె పేరును తొలగిస్తాం. అనర్హుల పేర్లను గుర్తించి చర్యలు తీసుకుంటాం. –బుచ్చినాయుడు, పంచాయతీ కార్యదర్శి, బుచ్చిరెడ్డిపాళెం -
వేంపల్లె మండల ఉపాధ్యక్షుడి హత్య
- బైక్‌ను సుమోతో ఢీకొట్టి.. ఆపై కొడవళ్లతో దాడి - ఐదుగురు అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి(42) శుక్రవారం మధ్యాహ్నం దారుణహత్యకు గురయ్యారు. అధికారపార్టీకి చెందిన ప్రత్యర్థులే రామిరెడ్డిని హతమార్చారని వారి బంధువు రామిరెడ్డి శేఖరరెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాలస్వామిరెడ్డి, ఆయన సోదరులు రాజశేఖరరెడ్డి, మరియానందరెడ్డితో పాటు పేరం కృష్ణారెడ్డి, జూద రాఘవరెడ్డి రామిరెడ్డిపై కొడవళ్లు, ఇనుపరాడ్లతో దాడిచేసి హతమార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామిరెడ్డి శేఖరరెడ్డి కథనం మేరకు..వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చెందిన గజ్జెల రామిరెడ్డి గత సెప్టెంబర్ 29న మండల ఉపాధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ సభాభవనంలో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం మధ్యాహ్నం 2గంటలకు అయిపోగానే.. బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. బస్టాండ్ వద్ద రామిరెడ్డి శేఖరరెడ్డి, పుల్లారెడ్డి ఉండగా.. ఇంటికి రమ్మని పిలిచాడు. దీంతో శేఖరరెడ్డి, పుల్లారెడ్డి అతని వెనుక మరో బైకుపై బయలుదేరారు. అయ్యవారిపల్లె–అలవలపాడు మధ్యలో ప్రత్యర్థులు ఒక తెలుపురంగు సుమోతో రామిరెడ్డి బైక్‌ను ఢీకొట్టారు. అతను కిందపడిన తర్వాత ప్రత్యర్థులు వేటకొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడిచేశారు. అది చూసిన శేఖరరెడ్డి, పుల్లారెడ్డి ప్రాణభయంతో పారిపోయారు. అదే సమయంలో అలవలపాడు వైపు నుంచి వెంకటేశ్వరరెడ్డి, చిన్న నాగిరెడ్డి ఆటోలో వేంపల్లెకు వస్తుండగా మధ్యలో రామిరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేస్తుడటం చూసి కేకలు వేశారు. దుండగులు వారిపైకీ వెళ్లడంతో ప్రాణభయంతో పారిపోయారు. పారిపోయిన నలుగురు అలవలపాడుకు వెళ్లి విషయం చెప్పారు. అంతలోపే ఎవరో రామిరెడ్డి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ మేరకు వేంపల్లె పోలీస్‌స్టేషన్‌లో శేఖరరెడ్డి ఫిర్యాదు చేశారు. -
అధికార భూమాయ
శ్రీకాళహస్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నడుం బిగించిన తరుణంలో అధికార పార్టీ నాయకులు అప్పనంగా పరిహారం పొందేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించుకునేశారు. రెవెన్యూ అధికారులతో కలసి తమ అనుభవంలోనే ఈ భూములు ఉన్నట్లు కనికట్టు చూపుతున్నారు. శ్రీకాళహస్తి రూరల్: వెలంపాడు పంచాయతీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఏకమై ఈ ఏడాది జూలై నెలలో ఓ ప్రైవేటు సర్వేయర్ సాయంతో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఓ రెవెన్యూ అధికారిని మచ్చిక చేసుకుని చెట్టుపుట్ట కొట్టి తీర్చుకుని 60 ఎకరాలు పంచుకుని దర్జాగా మినుము పంట సాగుచేసిన ఘటన మండలంలోని వెలంపాడులో తాజాగా వెలుగు చూసింది. గతేడాది ఇవే భూములను ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా అప్పట్లో సాక్షి దినపత్రికలో భూ ఆక్రమణలపై కథనాలు రావడతో అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్ అడ్డుకట్ట వేశారు. అరుుతే నాలుగు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ బదిలీపై వెళ్లడం, దీనికి తోడు భూ సేకరణకు సంబంధించి ప్రక్రియ మండలంలో జోరుగా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి టీడీపీ తమ్ముళ్లు పరిహారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు. రూ.6 కోట్లు పై మాటే మన్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు రెవెన్యూ పరిధిలో 178, 185 వ బ్లాక్‌లో 225 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 150 ఎకరాల భూమిని ప్రభుత్వం రెండేళ్ల కిందట ఏపీఐఐసీకి అప్పగించింది. అప్పట్లో ఏపీఐఐసీ మేనేజర్ ప్రతాప్, అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్‌తో కలసి భూములను పరిశీలించి భూములకు సంబంధించి రికార్డులను సిద్దం చేసి, వారికి అందించారు. అరుుతే తాజా భూసేకరణ నేపథ్యంలో ఆక్రమణ చోటు చేసుకుంది. ఓ రెవెన్యూ అధికారి సహకారంతో ఇదే అదునుగా భావించి వెలంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బ్లాక్ నంబర్ 178లో దామరాకులగుంట నుంచి మామిడిగుంటకు వెళ్లేదారిలో 30 ఎకరాలు, అదే బ్లాక్‌లో రేపల్లికండ్రిగ చెరువు వద్ద 30 ఎకరాలు దర్జాగా ఆక్రమించారు. అనంతరం జేసీబీ యంత్రాలు పెట్టి చెట్టు, పుట్ట కొట్టి ప్రభుత్వ భూములను తీర్చేశారు. వారం రోజుల కిందట ఆ భూములను చదును చేసి మినుము పంట సాగుచేశారు. ఈ ఆక్రమిత భూములు విలువ రూ.6 కోట్లు పైమాటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలిసినా ఖాతరు చేయకుండా గత వారం రోజుల నుంచి ఇదే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. కొంత మంది స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీఐఐసీ పరిశ్రమలు తీసుకొచ్చేలోపు ఆ భూముల్లో పంటలు సాగుచేసి భూ సేకరణ బృందానికి తమ పేర్లను సూచించి అనుభవం డబ్బులు కాజేయాలని రచించిన పన్నాగం పూర్తరుుంది. అనుభవంలోకి మార్చడానికి ప్రయత్నాలు వెలంపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా 60 ఎకరాల్లో చెట్లను తొలగించి ఏదో ఒక పంట సాగు చేస్తే అనుభవం కింద మార్చివేస్తానని ఓ రెవెన్యూ అధికారి టీడీపీ తమ్ముళ్లకు భరోసా ఇచ్చారని సమాచారం. వచ్చిన పరిహారంలో రెవెన్యూ అధికారికి వాటా ఇచ్చేలా రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం . మాకు సంబంధం లేదు ఏపీఐఐసీకి భూములు అప్పగించాక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. ఇప్పుడు ఆ భూములపై మాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటనా స్థలానికి రెవెన్యూ సిబ్బందిని పంపించి విచారిస్తాం. తర్వాత ఏపీఐఐసీ అధికారులకు సమాచారం అందిస్తాం. - రమేష్‌బాబు, తహశీల్దార్, శ్రీకాళహస్తి -
అనుచిత దోపిడీ
మహిళా సంఘాలకు ఇసుక అమ్మకం అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ షాడో నేతలు సిద్ధమైపోయారు. మహిళా సంఘాలు డమ్మీలైపోయాయి. నేతలు ఇష్టానుసారం ఇసుక అమ్ముకున్నారు. కోట్లకు కోట్లు సంపాదించారు. ప్రభుత్వ నిర్వాకంపై ప్రజలు దుమ్మెత్తిపోశారు. నాయకుల తీరుతో సర్కారు డిఫెన్సలో పడింది. ఇది గతం. ప్రభుత్వం కొత్త ఇసుకపాలసీని తెచ్చింది. ఇసుక పుణ్యమాని మూటగట్టుకున్న అపప్రధ నుంచి తప్పించుకునేందుకు ఉచితం అంటూ కొత్త నినాదం తీసుకొచ్చింది. ఇళ్లు కట్టుకున్నవారు నిరభ్యంతరంగా ఇసుక తీసుకెళ్లవచ్చన్నారు. ఇక్కడా నాయకుల జోక్యం పెరిగిపోయింది. నిరభ్యంతరంగా నేతలే తరలించేస్తున్నారు. పేదలకు ఇసుక భారమైంది. పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదీ ప్రస్తుత స్థితి. ఏ నిర్ణయమైనా... అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా మారిపోతోంది. వారు ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడుతున్నారు. పేదలకు మాత్రం ఇసుక భారమైపోతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఉచితం పేరిట ఇసుక దోపిడీ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద దందా సాగుతోంది. సామాన్య ప్రజలకు ఎవరికీ ఇసుక ఉచితంగా దొరకడం లేదు. టీడీపీ నేతలకు మాత్రమే ఉచితంగా లభ్యమవుతోంది. చంపావతి నదిని తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. వారికి మాత్రమే అనుమతిచ్చినట్టుగా నిర్భయంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతుల్లేని నాతవలస వంతెన, కొప్పెర్ల, లెంకపేట ఇసుక రేవులను ఏకంగా గుల్ల చేసేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. పక్కనున్న కళ్లాలు, ఖాళీ స్థలాల్లో దర్జాగా పోగులేసి నిల్వ చేస్తున్నారు. సాయంత్రం, రాత్రిపూట యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. ట్రాక్టర్ లోడు రూ. 1200ల నుంచి రూ.1500లకు విక్రయించగా, లారీ లోడును రూ. 5వేల నుంచి 7వేల వరకు అమ్ముతున్నారు. ప్రతీ రోజూ అనధికారికంగా రూ. లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరికి నియోజకవర్గ కీలక నేతల అండదండలున్నాయి. పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లోనే... పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో ఉన్న ఇసుక రేవులన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఏ రేవు ఏ మండలంలోకి వస్తుందో కూడా అంచనా వేయలేం. అధికారులు సైతం గుర్తించలేని పరిస్థితి నెలకుంది. పూసపాటిరేగ పరిధిలోకి వచ్చే రేవులో తవ్విన ఇసుకను డెంకాడ మండల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో నిల్వ చేయగా, డెంకాడ పరిధిలో గల రేవులో తవ్వే ఇసుకను పూసపాటిరేగ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య తమ పరిధిలోకి రాదని రెవెన్యూ అధికారులు సైతం తప్పించుకుంటున్నారు. మొత్తానికి అనధికారికంగా పోగులేసిన ఇసుకను సాయంత్రం, రాత్రి సమయంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ లోడును రూ. 1200నుంచి రూ. 1500వరకు, లారీ లోడును రూ. 5వేల నుంచి 7వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రతీ రోజూ ఈ మూడు రేవుల నుంచి సరాసరి 300లోడుల ఇసుక అనధికారికంగా తరలివెళ్లిపోతోంది. దీని ద్వారా స్థానిక అధికార పార్టీ నేతలు రోజూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. కీలక నేతలు భారీగా ముడుపులు అందుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా చోద్యం చూస్తోంది. కిమ్మనని అధికారులు నేతల అండదండలతో ఇసుక అక్రమ భాగోతం నడుస్తుండటంతో తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతం లో ఇదే తరహాలో జరిగే ఇసుక దం దాను అడ్డుకున్నందుకు స్థానిక పోలీసు అధికారులు, ఎస్పీపై ఇక్కడి నేతలు నేరుగా మంత్రులకు ఫిర్యాదు చేసి బెదిరింపులకు దిగారు. నాటి నుంచి పోలీసులు సైతం ఇసుక అక్రమ దం దాను అంతగా పట్టించుకోవడం లేదు. ఇదే విషయమై పూసపాటిరేగ, డెంకాడ తహసీల్దార్లు పేడాడ జనార్దనరావు, పెంటయ్య వద్ద ’సాక్షి’ ప్రస్తావించగా అనుమతుల్లేని ఇసుక రేవుల్లో తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, అక్రమంగా పోగులేసినా చర్యలు చేపడుతామన్నారు. -
‘ఉన్నతి’ పథకంలో అవినీతి కుంభకోణం
• నిందితులకు కాపుకాస్తున్న అధికారపార్టీ నేతలు • వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కారుమురి ధ్వజం తణుకు:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉన్నతి’ పథకంలో అత్తిలి మండలంలో అవినీతి కుంభకోణం వెలుగు చూస్తే నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమకంలో భాగంగా మండంలో పర్యటించిన సందర్భంలో ఈ అవినీతి కుంభకోణం తన దృష్టికి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ నిరుపేదలకు దక్కాల్సిన నిధులను బల్లిపాడు, స్కిన్నెరపురం, అత్తిలి, వరిఘేడు గ్రామాల్లో బినామీలకు అందజేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 13 మంది అధికారులు నిందితులుగా గుర్తించగా ఆరుగురిపై అత్తిలి పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్ కేసు నమోదైందని, అయితే ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాతలు, దీపావళి సామాగ్రి అమ్మే దుకాణ యజమానులు ఇచ్చిన విరాళంతో నిర్మాణం చేపట్టిన ఆర్చి భవిష్యత్‌లో కూలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని కారుమూరి ప్రశ్నించారు. సజ్జాపురం శ్మశానంలో సైతం ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మునిసిపల్ స్థలం కాకుండానే శ్మశానంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానం చేయడం సరికాదన్నారు.పార్టీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు గుర్రాల సత్యప్రియ, అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దాల నాగేశ్వరరావు పాల్గొన్నారు -
తుంగభద్రను తోడేస్తున్న తమ్ముళ్లు
► దర్జాగా అధికార పార్టీనేతల ఇసుక దందా ► నిషేధిత నిడ్జూరు ఇసుక రీచ్ నుంచి అక్రమ రవాణా ► చర్యలకు వెనకాడుతున్న అధికారులు కర్నూలు సిటీ: తుంగభద్ర నదిని అడ్డాగా చేసుకున్న అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ఇసుక దందా నడుపుతున్నారు. గతేడాది ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం ఇసుక అమ్మకాలు చేపట్టింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ ఏడాది ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నట్లు ప్రకటించి ఎంపిక చేసిన రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో పూడూరు, ఆర్.కొంతలపాడుతో పాటు మరో మూడు చోట్ల మాత్రమే ఇసుక ఉచితంగా తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చారు. కానీ అధికార పార్టీ నేతలు అక్రమార్కులతో చేతులు కలిపి తుంగభద్ర నదిని తోడేస్తునానరు. అడ్డుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్నారు. తుంగభద్ర, హంద్రీ, వేదావతి నదుల్లో నాలుగు రీచ్‌లకు మాత్రమే ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఉన్నాయి. కానీ తుంగాతీరంలోని జి.శింగవరం, నిడ్జూరు గ్రామాల తీరంలోని నది నుంచి ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు కాసుల దాహంతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. అనుమతులు ఉన్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు చేయాల్సి ఉన్నా రీచ్‌లు దూరంగా ఉన్నాయనే సాకుతో నిడ్జూ రు రీచ్‌పై కన్నేశారు. దీంతో రేయింబవళ్లు తేడా లేకుండా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మునగాలపాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే మనుషులమని చెప్పి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. నదిలో నుంచి తీసిన 20 ట్రాక్టర్ల ఇసుకను ఎమ్మెల్యే సమీప బంధువు నందికొట్కూరు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. పూడూరు దగ్గర తవ్వుతున్న ఇసుకను ఓ వ్యక్తి తన లారీలతో తరలిస్తున్నాడు. ఇందుకు ఓ రెవెన్యూ అధికారి అతనికి అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కర్నూలు తహశీల్దారు కార్యాలయ అధికారులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్ చేస్తే అధికార పార్టీ నేత వాటిపై కేసు నమోదు చేయవద్దని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ట్రా క్టర్ల రాకపోకలపై తీవ్ర అవస్థలు పడుతున్నామని సమీప గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నిడ్జూరు రీచ్‌లో తవ్వకాలు నిషేధించాం తుంగభద్ర నదిలో రెండు రీచ్‌ల్లో మాత్రమే ఉచితంగా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చు. నిడ్జూరు రీచ్‌లో తవ్వకాలు నిషేధించాం. ఇక్కడి నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. తుంగభద్ర తీర ప్రాంతంలో రెవెన్యూ సిబ్బందిని అలర్ట్ చేసి ఇసుక అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తాం. - రఘుబాబు, కర్నూలు రెవెన్యూ డివిజన్ అధికారి -
అధికారిక దోపిడీ
* నక్కవాగులో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకం * అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్న అధికారులు అన్నపర్రు (పెదనందిపాడు): అధికార పార్టీ నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను యథేచ్ఛగా తోలుకుంటున్నారు. దీనిని ఆపాల్సిన అధికారులు అధికార పార్టీ వారికే కొమ్ము కాస్తున్నారు. గతంలో అనుమతి లేకుండా గ్రావెల్ తోలుకున్నారని వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ నేతపై కేసు పెట్టించి జైలుకు పంపిన అధికారులు ప్రస్తుతం స్పందించటం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను అమ్ముకుంటున్న అధికార పార్టీ నేతలను మాత్రం వారు పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని అన్నపర్రు గ్రామంలో ఉన్న నక్కవాగులో గ్రావెల్‌ను అధికార పార్టీ నేతలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి గ్రామస్థులు డ్రెయినేజి అధికారులకు సమాచారం అందించినా ప్రయోజనం శూన్యం. అధికారులు రేపు వస్తాం అంటూ.. వచ్చే ముందు అధికార పార్టీ నేతలకు సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు వచ్చే సమయానికి ఆ ప్రదేశం ఖాళీగా మారుతుంది. ఈ ప్రభుత్వంలో సామాన్యులను న్యాయం జరగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు ఇప్పుడు ఎందుకు చేయరు? గ్రామానికి చెందిన ఎంపీటీసీ గ్రావెల్‌ను యథేచ్ఛగా అధిక ధరకు అమ్ముకుంటున్నారు. గతంలో పొలానికి కట్ట వేయటానికి గ్రావెల్‌ను తోలుకుంటే నాపై అక్రమంగా డ్రెయినేజి ఏఈ స్వాతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నన్ను జైలుకు కూడా పంపారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ అమ్ముకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. వారిని ఎందుకు అరెస్టు చేయటం లేదు. ఇదేనా అధికారుల పని తీరు. - వైఎస్సార్సీపీ నాయకుడు కల్లూరి నాగేశ్వరరావు(నాగు) -
కాంట్రాక్టర్ల కంట్లో ఇసుక
► ఇసుక టెండర్లు రద్దు చేసిన సర్కారు ► దరఖాస్తుల సొమ్ము తిరిగి చెల్లించని వైనం ► అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు జిల్లాలో ఇసుక రీచ్‌ల టెండర్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల రూపంలో వసూలు చేసిన సుమారు రూ.2 కోట్ల ఊసే ఎత్తడం లేదు. టెండర్లు రద్దు చేసినందున తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు భూగర్భ వనరుల శాఖ అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సాక్షి ప్రతినిధి,నెల్లూరు: రాష్ర్టంలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం తొలుత మహిళా సంఘాలకు కట్టబెట్టింది. ఇసుక రీచ్‌ల ద్వారా వచ్చిన ఆదాయంలో సంఘాలకు వాటా ఇచ్చేలా విధాన నిర్ణయం తీసుకుంది. పేరు మహిళా సంఘాలదే అయినా ఇసుక రీచ్‌లను కాంట్రాక్టర్లే నిర్వహిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. జిల్లాలో కూడా ఇదే విధానం అమలవడంతో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు, నాయకులు ఇసుక ద్వారా కోట్ల రూపాయలు పిండుకున్నారు. దీంతో మహిళా సంఘాల నుంచి ఇసుక రీచ్‌లను రద్దు చేసి వేలం విధానంలో మళ్లీ కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని 25 ఇసుక రీచ్‌లను 6 నెలల నుంచి ఏడాది పాటు లీజుకు ఇవ్వడానికి ఈ ఏడాది జనవరి 24న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 6లోగా ఆన్లైన్లో దరఖాస్తులు పొంది 9లోగా దాఖలు చేయాలని గడువు నిర్ణయించింది. పోటా పోటీగా దరఖాస్తుల దాఖలు మహిళా సంఘాల పేరుతో అనధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహించిన కాంట్రాక్టర్లతో పాటు పలువురు ఆశావహులు ఇసుక రీచ్‌ల టెండర్లు దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. వేలం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఎంఎస్టీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఆ కంపెనీకి ఎస్ బ్యాంక్‌లో ఖాతా ఉండటంతో కాంట్రాక్టర్లంతా ఎస్ బ్యాంకులో దరఖాస్తులకు సంబంధించిన రుసుం, ఈఎంఐ చె ల్లించాలని ఎంఎస్టీసీ షరతు విధించింది. ఇసుక రీచ్‌ల్లో గుర్తించిన ఇసుక పరిమాణం ఆధారంగా దరఖాస్తును రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించింది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 50 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు కొనుగోలు చేసి ఈఎంఐ చెల్లించారు. అయితే ప్రభుత్వం హఠాత్తుగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికే నిర్వహించిన టెండర్లను రద్దు చేసింది. దీంతో జిల్లాలో కూడా టెండర్లు రద్దయ్యాయి. కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎంఐ మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసింది. అయితే దరఖాస్తుల రూపంలో వసూలు చేసిన కోట్లాది రూపాయల విషయాన్ని పట్టించుకోలేదు. ఈ మొత్తం జిల్లాలో సుమారు రూ.2కోట్లు ఉండగా, రాష్ర్ట వ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. టెండర్లు రద్దు చేసినందున తాము దరఖాస్తుల కోసం చెల్లించిన మొత్తాన్ని కూడా వెనక్కు ఇప్పించాలని కాంట్రాక్టర్లు భూగర్భవనరుల అధికారులు, అధికార పార్టీ నేతలను కలిసి విన్నవించుకున్నారు. -
మంత్రి గారి వియ్యంకుడు.. నదిలో పాగా!
► అనుమతులు లేకుండానే నదిలో తిప్పేందుకు లాంచీ సిద్ధం ? ► బ్యారేజీ గేట్లకు పొంచివున్న ముప్పు అయినా ధనార్జనే లక్ష్యంగా ఏర్పాట్లు ► అన్నీ తెలిసినా నోరుమెదపని అధికారులు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకుల తీరు లక్షలాది మంది సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న బ్యారేజీ గేట్లకు ముప్పు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే కృష్ణానదిలో ఎటువంటి అనుమతులూ లేకుండా తిప్పుతున్న బోట్లకు తోడు మరో భారీ లాంచీని కూడా సిద్ధం చేశారు. దీనికి అనధికారికంగా ప్రారంభోత్సవం కూడా చేసేశారు. ఎలాంటి అనుమతులూ లేకపోయినా నదిలో తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీ గేట్లకు ముప్పు పొంచి ఉంది. 70 టన్నుల పైనే బరువు గల భారీ లాంచీని నిబంధనలకు విరుద్ధంగా నదిలో తిప్పేందుకు రంగం సిద్ధం చేయటమే దీనికి కారణం. దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులూ లేవు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర మంత్రి వియ్యంకుడిది కావడంతో దీనిపై అధికారులు కూడా నోరుమెదపడం లేదు. లాంచి, బోట్లను కృష్ణానదిలో తిప్పేందుకు వినియోగిస్తే బ్యారేజీ గేట్లకు ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకెళితే... 1884లో బ్రిటీష్ హయాంలో ప్రారంభించిన కృష్ణా బ్యారేజీ 1957 నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ఈ బ్యారేజీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటికి వరప్రదాయినిగా మారింది. సుమారు 14 లక్షల ఎకరాలకు సాగు నీరందించటంతో పాటు వందలాది గ్రామాలు, నగరాలు, పట్టణాలకు తాగునీరు అందిస్తోంది. గతంలో బ్యారేజ్ గేట్లు మూడడుగులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 12 అడుగుల గేట్లు 70 ఉన్నాయి. ఒక్కో గేటు సుమారు 50 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ, గేట్ల రక్షణను దృష్టిలో ఉంచుకుని నదిలో ఎటువంటి లాంచీలు, బోట్లు తిప్పకూడదని నిబంధనలు ఉన్నాయి. బ్రిటీష్ వారి హయాంలో నిర్మించిన కట్ట, మూడడుగుల గేట్లను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో చట్టం చేసినట్లు సమాచారం. అనుమతులు లేకుండా బోట్లు, లాంచీలను నదిలో తిప్పితే అప్పట్లో 50 పైసలు అపరాధ రుసుం విధించేవారని తెలుస్తోంది. ప్రస్తుతం అటువంటి నిబంధనలేవీ అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం కృష్ణానదిలో అనధికారికంగా 150 బోట్లు తిప్పుతున్నట్లు సమాచారం. వీటికితోడు తాజాగా రాష్ట్ర మంత్రి బంధువు లాంచీని నదిలో తిప్పేందుకు సిద్ధం చేశారు. ఇటీవలే అనధికారికంగా ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ లాంచీ బరువు 70 టన్నులపైనే ఉంటుందని, ఐరన్ వరకే 60 టన్నులని సమాచారం. లాంచీ ఎత్తు 22 అడుగులు, పొడవు 40 అడుగులు ఉంది. పొంచివున్న ముప్పు... ప్రస్తుతం నదిలో నడుపుతున్న బోట్లకు తోడు లాంచీని కూడా తిప్పితే బ్యారేజీ గేట్లకు ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. వరదలు వచ్చి, పెద్ద గాలులు వీస్తే నీటితో పాటు లాంచీ బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకునే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. భారీ లాంచీ కావడంతో దాని బరువు, నీటి అలలు, గాలి ఉధృతికి గేట్లను ఢీకొంటే అవి దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. ఈ నెల ఆరున కురిసిన భారీ వర్షానికి నదిలో ‘0’ పాయింట్ వద్ద తాడుతో కట్టి ఉంచిన లాంచీ గాలికి తిరగబడింది. దీంతో విజయవాడ మారుతీనగర్‌కు చెందిన తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ (48) లాంచీ కిందపడి మరణించాడు. సుమారు 70 టన్నులకు పైగా ఉన్న లాంచీని ప్రస్తుతం చిన్న చిన్న తాడులతో బండకు కట్టి ఉంచటం గమనార్హం. పెద్ద గాలి వీస్తే తాడు తెగి లాంచీ కొట్టుకుని వెళ్లి బ్యారేజీ గేట్లను గుద్దుకునే అవకాశముంది. 70 టన్నుల లాంచీ గుద్దితే గేటు 50 టన్నుల సామర్థ్యం ఉన్న గేటు ఎటువంటి పరిస్థితుల్లో నిలిచే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కృష్ణానదిలో లాంచీని ఉంచితే ప్రమాదం ఉందని అధికారులకు తెలిసినా నోరెత్తటానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం లాంచీని కృష్ణాలో అద్దెకు నడిపేందుకు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. లాంచీలో వినోదాలు, విహారం, ఫంక్షన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు లాంచి అద్దె రూ.3 లక్షలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బ్యారేజీని తాకితే ఇబ్బందే కృష్ణానదిలో ఏర్పాటుచేసిన లాంచీ ప్రమాదవశాత్తూ బ్యారేజీని తాకితే ఇబ్బందులు ఎదురవుతాయి. మత్స్యకారు ల వలలకూ ఇబ్బందే. ఇవన్నీ ఆలోచించకుండా అధికారులు లాంచీని నదిలోకి ఎలా దిగనిచ్చారో మరి. - ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే -
ఎర్రదందాలో పచ్చనేతలు
► ఇప్పటికే ఒకరిపై పీడీ యాక్టు నమోదు ► పరారీలో మరికొంత మంది అధికారపార్టీ కార్యకర్తలు ► స్మగ్లర్ల కోసం పోలీసుల వేట చంద్రగిరి : ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తర చూ చెబుతుంటారు. ఆయన సొంత గ్రామమైన నారవారిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న రంగంపేటలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో టీడీపీ నాయకులు రాఘవుల నాయుడు, మల్లెల చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. రాఘవుల నాయు డు ఎర్రచందనం అక్రమంగా తరలించి రూ.కోట్లు ఆర్జించి బినామీ పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాక అతనిపై లెక్కకు మించి ఎర్ర కేసులు ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్టు నమోదు చేశారు. గత నెల 16న నాగయ్యగారిపల్లి టేకుప్లాంట్ వద్ద పోలీసులు జరిపిన దాడులలో రంగంపేటకు చెందినమరో టీడీపీ నాయకుడు మల్లెల చంద్రతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగంపేటకు చెందిన మార్కొండయ్య, శంకర్ యాదవ్, రంగంపేట హరిజనవాడకు చెందిన ఎర్ర య్య అలియాస్ ఎర్రోడు పారిపోయారు. ఐదు రోజుల క్రితం మార్కొండయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఎర్రయ్య అలియాస్ ఎర్రోడు అప్పట్లో కాంగ్రెస్ తరఫున రంగంపేట సర్పంచ్‌గా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. మరో స్మగ్లర్ శంకర్ యాద వ్ గతంలో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మరో స్మగ్లర్ మార్కొండయ్య సైతం రంగంపేటలో టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితులుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసు లు చెబుతున్నారు. అధికార బలంతో ఎలాైగె నా ఎర్ర కేసుల నుంచి బయట పడాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ టీడీపీ నాయకుడి తో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. వీరే కాకుండా రంగంపేటలో మరికొంతమంది టీడీపీ నాయకులు ఎర్రచ ందనం అక్రమ రవాణా చేసి రూ.కోట్లు ఆర్జించిన ట్టు పలువురు బహిరంగా విమర్శిస్తున్నా రు. ఎర్రచందనం కేసుల్లో తమ పార్టీకి చెందిన వారే ఉండడంతో టీడీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఏది ఏమైనా దుంగల అక్రమ రవాణాను అరికట్టాలంటే ముందుగా స్థానిక స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. -
అవినీతి రెవెన్యూ
► రికార్డుల తారుమారులో నంబర్ 1 ► ప్రభుత్వ, పట్టా భూములు మాయం ► అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు.. ధనదాహం ► ఇప్పటికి ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్ ► ఆర్ఐలు, వీఆర్వోలు కూడా.. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెవెన్యూ శాఖకు రోజుకొక అవినీతి మరక అంటుకుంటోంది. మొన్న సూళ్లూరుపేట తహసీల్దార్ మునిలక్ష్మి, నిన్న కలిగిరి తహసీల్దార్ లావణ్య.. నేడు నెల్లూరు రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్. మరికొందరు ఆర్ఐలు, వీఆర్వోలు. వీరంతా అవినీతికి పాల్పడ్డారనే కారణాలతో కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా దుత్తలూరు, సంగం, దగదర్తి తహసీల్దార్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి పాసుపుస్తకాలు తారుమారు చేయటం, మరికొందరు పాసుపుస్తకాలు ఇచ్చే విషయంలో మామూళ్లు పుచ్చుకోవటం షరామామూలైపోయింది. జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ, డాటెడ్, ప్రైవేటు భూములు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూములు, స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను కొందరు తహసీల్దార్లు, ఆర్ఐ, వీఆర్వోలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడో కంటికి తెలియకుండా ఒకరి పేరుతో ఉన్న భూములను వేరొకరికి మార్చి సొమ్ముచేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి కుటుం బాల రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరు. అదే అధికారపార్టీ నాయకులు, లంచం ఇచ్చేవారికే ఎదురెళ్లి స్వాగతం పలికి మరి పనులు చేసిపెడుతున్నారు. కంచే చేను మేస్తోంది పల్లెలు, పట్టణాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ప్రజలకు ఎదురయ్యే సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించాలి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. అయితే ప్రస్తుతం రెవెన్యూశాఖ అందుకు విరుద్ధంగా తయారైంది. కొందరు అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు భూములను వేరొకరికి కట్టబెట్టి సొమ్ము చేసుకోవటం ఆనవాయితీగా మార్చేసుకున్నారు. గతంలో సూళ్లూరుపేట తహసీల్దార్‌గా పనిచేసిన మునిలక్ష్మి వాకాటి రామనాథమ్మ కు చెందిన భూములను వాకాటి రమేష్రెడ్డివిగా రికార్డులు తారుమారు చేశారు. అధికారపార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఒత్తిడి, డబ్బులపై ఆశతో ఆమెచేత ఈ పనిచేయించింది. దీంతో మునిలక్ష్మి, ఆర్ఐ కిరణ్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా కలిగిరి తహసీల్దార్‌గా పనిచేసిన లావణ్య కొండాపురం మండలం గానుగపెంట, పొట్టిపల్లిలోని 120 ఎకరాల అటవీ, మంత్రి ఘంటా శ్రీనివాసరావు భూములకు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారనే ఆరోపణలతో ఆమెను విధుల నుంచి తొలగించారు. తాజాగా నెల్లూరు రూర ల్ మండల తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్ శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూముల్లోని టేకుచెట్ల నరికివేతకు సహకరించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువచేసే టేకుచెట్ల కొట్టివేతకు కారణమయ్యారు. దీంతో జనార్దన్‌పై వేటు వేయటంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ జానకి ప్రకటించారు. అదేవిధంగా దుత్తలూరు, సంగం, దగదర్తి తహసీల్దార్లు పాసుపుస్తకాల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా రు. భూ సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులే భక్షకులుగా అవతారం ఎత్తుతుంటే ప్రజల సమస్యలను పరిష్కరించే వారు ఎవరనే ప్రశ్న సామాన్యుల్లో తలెత్తుతోంది. భూసమస్యల పరిష్కారం కో సం తహసీల్దార్ కార్యాలయం తొక్కాలంటే ప్రజలు వణికిపోతున్నారు. రికార్డులను తారుమారు చేసి వేరొకరికి కట్టబెడుతారేమోనని భయపడుతున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాసమస్యల పట్ల స్పందించి పరి ష్కరించే దిశగా కృషిచేయాలని కోరుకుంటున్నారు. -
ఇసుక.. మస్కా
► ఉచిత విధానంతో విచ్చలవిడిగా వెలుస్తున్న డంప్‌లు ► అందినకాడికి దోచేసుకుంటున్న ► అధికార పార్టీ నేతలు, రియల్టర్లు ► సాధారణ ప్రజలకు దొరికేది కష్టమే ► పట్టించుకోని అధికారులు సాక్షి ప్రతినిధి, కర్నూలు : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందామన్న చందంగా అధికార పార్టీ నేతలు.. రియల్టర్లు ఉచిత ఇసుకను దోచేసుకుంటున్నారు వందల కొద్దీ ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి భారీ స్థాయిలో ట్రాక్టర్లను రంగంలోకి దించి దర్జాగా ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకే సరిపోతాయనే అంచనాలు సాధారణ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. డంప్‌లే.. డంపులు ఏ రోజు అవసరాలకు ఆ రోజే ఇసుకను సరఫరా చేసుకోవాలని అలా కాకుండా అక్రమంగా నిల్వ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థల వారు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేస్తోంది. ఇప్పటికే ఆలూరు సమీపంలో ఒక ప్రైవేట్ పవన విద్యుత్ ప్లాంట్‌తో పాటు మంత్రాలయంలో శ్రీమఠం అధికారులు ఇసుకను భారీ స్థాయిలో డంపు చేసినట్టు ఆధారాలతో సహా ‘సాక్షి’ బయటపెట్టింది. అలాగే చాలాచోట్ల అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా ఇసుకను డంప్ చేసినట్లు తెలుస్తోంది. వందల ట్రాక్టర్ల ఇసుకను రాత్రనక... పగలనక తవ్వుకుంటూ డంప్ చేస్తున్నారు. కంటి చూపు మేరలో ఇసుక డంప్‌లు దర్శనమిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు చూసేందుకు సాహసించడం లేదు. ఉన్న కొద్దిపాటీ ఇసుక నిల్వలను ఈ విధంగా డంప్ చేసుకుంటూ పోతే మరికొద్ది రోజుల్లో సాధారణ ప్రజలకు ఇంటి నిర్మాణానికి కూడా ఇసుక లభించే పరిస్థితి లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 9 నెలలకే ఖలాస్ జిల్లాలో మొత్తం నాలుగు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇందులో కర్నూలు మండలంలోని ఆర్. కొంతలపాడు, పుడూరు, నందవరం మండలంలోని గురజాలతో పాటు పత్తికొండ నియోజకవర్గంలో కనకలదిన్నెలో రీచ్‌లు ఉన్నాయి. ఈ నాలుగు రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలు కేవలం 3 లక్షల క్యూబిక్‌మీటర్లు మాత్రమే. గతంలో రాయల్టీ విధానం అమలులో ఉన్న సమయంలోనే ఏడాది కాలంలోనే ఏకంగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను జిల్లా ప్రజలు కొనుగోలు చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకు మించి సరిపోయే అవకాశం లేదు. ఆ తర్వాత జిల్లాలో ఇసుక దొరికే అవకాశమే లేదనే అభిప్రాయం నెలకొంది. కొత్త రీచ్‌లకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించడం లేదు. దీంతో ఈ రీచ్‌లల్లో ఇసుకను తవ్వేందుకు అవకాశం లభించడం లేదు. ఇక ఇతర ప్రాంతాల్లో మరికొన్ని కొత్త రీచ్‌లకు అనుమతి ఇచ్చేందుకు స్థానికం భూగర్భ జలవనరులశాఖ అధికారులు అంగీకరించడం లేదు. అలాచేస్తే భూగర్భ నీటి నిల్వలు మరింత ప్రమాదకర స్థాయికి తరిగిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు. -
ప్రభుత్వ భవనం... ప్రైవేటు వ్యాపారం
► పాలకేంద్రంలో కన్స్ట్రక్షన్ సెంటర్ ► అధికార పార్టీ నాయకుడి నిర్వాకం..? వేములవాడ రూరల్ : ఏం చేసిన చెల్లుతుందనే భరోసా.. ఎవరికీ ఫిర్యాదు చేసిన ఏమవుతుందిలే అనే ధీమాతో అధికారపార్టీ నాయకులు అడుగడుగునా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఎమ్మెల్యే అండ ఉందనే అధికారపార్టీ నాయకుడు ఏకంగా ప్రభుత్వ భవనంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్యాలయూన్ని ప్రారంభించాడు. బోర్డు పెట్టేసి శుక్రవారం పూజ కార్యక్రమాలు సైతం చేసేశాడు.మధ్యమానేరు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న అనుపురం గ్రామస్తులకు పునరావాసం కింద ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలంలో ప్రస్తుతం నిర్మించిన పాలకేంద్ర భవనం ఉంది. ఆ భవనంలో అనుపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు ఎర్రం మహేశ్ ఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌గా బోర్డు పెట్టేశారు. ఏకంగా పలువురు ప్రజాప్రతినిధులను పిలిపించి శుక్రవారం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కొద్దిరోజుల్లో ఈ ప్రాంతంలో పునరావాస స్థలంలో అనుపురం గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలను చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందస్తుగా సదరు నాయకుడు ఆ ప్రాంతంలో ఆ భవనాన్ని తీసుకుని కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకోవడం చర్చనీయూంశమైంది. ప్రభుత్వ భవనాన్ని పూర్తిచేసి పంచాయతీ అధికారులకు అప్పగించిన తర్వాత దాన్ని ప్రైవే టు వ్యక్తులు ఉపయోగించుకోరాదనే నిబంధనలను సైతం కాలరాశారు. ఈ విషయంపై సర్పంచ్ మ్యాకల రవిని వివరణ కోరగా.. తమకు భవనాన్ని ఇంకా అప్పగించలేదని చెప్పారు. పాలకేంద్రం అధ్యక్షుడిని వివరణ కోరగా ఎర్రం మహేశ్ నాలుగు రోజులు వాడుకుంటానని కోరారే తప్పా వ్యాపార కార్యక్రమాల కోసం అద్దెకు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అరుుతే ఇందులో వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నా.. వారు మాత్రం పాలకేంద్రం కమిటీ ఒప్పందంతోనే తీసుకున్నామని చెప్పడం కొసమెరుపు. తప్పు చేస్తే చర్యలు తప్పవు.. ప్రభుత్వ ఆస్తులను అనుమతి లేకుండా వినియోగించుకున్న వారెవరైనా సరే చర్యలు తప్పవని డీపీవో సూరజ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ పాలకేంద్ర భవనంలో క న్‌స్ట్రక్షన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంపై విచారణ జరుపుతానని, ప్రభుత్వ భవనాలను ఎవరికి కేటాయించే అవకాశం లేదని తెలిపారు. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే దీనికి సంబంధించిన అందరిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. -
దర్జాగా కబ్జా
► మిలిటరీ కాలనీ భూములపై అధికార పార్టీ నేతలు కన్ను ► బోర్లు వేసి ప్రహరీ కట్టిన గార్గేయపురం సర్పంచ్ ► అధికారులను ఆశ్రయించిన బాధితుడు కర్నూలు సీక్యాంప్: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. 1948లో కర్నూలు నగర శివారులోని నందనపల్లె పంచాయతీ పరిధిలో దాదాపు 72 మంది సైనిక కుటుంబాలకు ఐదు వందల ఎకరాలకు పైగా కేటాయించారు. వాటిని కొందరు అమ్ముకోగా.. మరి కొందరు వారసత్వంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు - విజయవాడ రహదారి పక్కనే ఉన్న ఈ పొలాలను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే గద్దల్లా వాలుతున్నారు. రాత్రికిరాత్రే ఆక్రమించేస్తున్నారు. 673 సర్వేలో దాదాపు మూడు ఎకరాల పొలంపై కన్నేసిన గార్గేయపురం సర్పంచ్ అక్కడ అక్రమంగా బోర్లు వేయించాడు, రక్షణగా గోడను కూడా నిర్మించాడు. మరో వైపు జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యుడిగా కొనసాగుతున్న ఓ వ్యక్తి కూడా ఇక్కడ పొలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. టీడీపీ సీనీయర్ నేత తమ్ముడు అండతోనే రెచ్చిపోతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితుడు అధికారులను, పోలీసులను ఆశ్రయించగా తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. అయితే అధికార పార్టీనేతలు బాధితులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు 673 సర్వే నంబర్లో మాకు మూడు ఎకరాల పొలం ఉంది. ఆ పొలం లో గార్గేయపురం సర్ప ంచ్ అక్రమంగా బోర్లు వేశాడు. రహదారి పక్కనే ఉండటంతో ఆక్రమించేందుకు యత్నించాడు. అధికారులను ఆశ్రయించగా ప్రస్తుతం పనులు నిలిపేశారు. అయితే అప్పటి నుంచి చంపుతామని బెదిరిస్తున్నారు. అధికారులు రక్షణ కల్పించాలి. - రాజు, మిలిటరీ కాలనీ -
వేటుకు వేళాయె!
49 మంది డీలర్ల మెడపై కత్తి ⇒ 5లోగా సరుకులు పంపిణీ చేయలేదని సాకు ⇒ సమస్యలను పట్టించుకోకుండా చర్యలు ⇒ ఏకపక్ష నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత ⇒ అస్తవ్యస్తంగా పౌరసరఫరాల శాఖ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల సిఫారసులకు అనుగుణంగా ఇదివరలో వందలాది మంది రేషన్ డీలర్లపై వేటు పడింది. తాజాగా రేషన్ సరుకులను సకాలంలో పంపిణీ చేయలేదనే సాకు చూపి తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో కొద్ది మంది రేషన్ డీలర్లు సకాలంలో సరుకులు ఇవ్వకపోవడం జరుగుతోంది. అయితే అందరినీ ఒకే గాటిన కట్టి చర్యలకు సిద్ధపడటం ఏమిటనే అభిప్రాయం డీలర్లలో వ్యక్తమవుతోంది. మొత్తంగా జిల్లాలో 49 మంది డీలర్లపై కత్తి వేలాడుతోంది. మార్చి నెలలో 5వ తేదీ వరకూ 5 శాతం కూడా సరుకులను సరఫరా చేయని డీలర్లను జిల్లావ్యాప్తంగా 49 మందిని గుర్తించారు. వీరిలో కొందరిని తొలగించడం, మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే, ఇప్పటికే డీలర్ల తొలగింపుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. చర్యలు తీసుకునేందుకు ఆర్డీఓలు జంకుతున్నారు. ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవాల్సిందేనని ఒత్తిడి చేస్తోంది. మరోవైపు పౌర సరఫరాలశాఖకు రెగ్యులర్‌గా ఒక అధికారి లేకపోవడం కూడా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ కాస్తా దారి తప్పేందుకు కారణమయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముగ్గురు అధికారుల మార్పు సాధారణ బదిలీల్లో భాగంగా గత ఏడాది డీఎస్‌ఓగా ఉన్న వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఈయన స్థానంలో ప్రభాకర్‌రావు వచ్చారు. ఈయన ఉద్యోగంలో చేరేందుకు నెలన్నరకు పైగా సమయం తీసుకున్నారు. వివిధ అవినీతి ఆరోపణలతో ఈయనపైనా బదిలీ వేటు పడింది. తర్వాత కొంతకాలం రెగ్యులర్ అధికారి లేకుండానే నెట్టుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం విజయరాణి బాధ్యతలు చేపట్టారు. ఈమె కూడా ఎక్కువ రోజులు పనిచేయలేకపోయారు. ప్రస్తుతం ఇన్చార్జిగా తిప్పేనాయక్ వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పౌర సరఫరాలశాఖ కాస్తా అధికారి లేని అనాథగా మారిపోయింది. ఈ కారణంగా మొత్తం వ్యవస్థనే గాడితప్పే పరిస్థితి ఏర్పడింది. -
గ్రా‘వెల్’ దోపిడీ
అక్రమంగా భారీ తవ్వకాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మం డల స్థాయి అధికారులను మేనేజ్ చేసుకొని అక్రమార్కులు ఈ తంతుకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో దీనిని అడ్డుకోవలసిన అధికారులు మామూళ్ల మత్తులోనో..అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకో తలొగ్గి ఫిర్యాదులొచ్చినా ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరే గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సీరియస్ అవుతున్నా మండల స్థాయి అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. అనుమతులు లేని తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అధికారుల కళ్లెదుటే జరుగుతున్న ఈ తంతు తమకు సంబంధించింది కాదులే..అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి నుంచి మర్రి పాడు మండలం బాట వరకు 565వ జాతీయ రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులకు అవసరమైన గ్రావెల్‌ను అక్రమంగా భారీగా తరలిస్తున్నారు. ఒకట్రెండు చోట్ల అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు పెద్దమొత్తంలో మట్టిని కొల్లగొడుతున్నారు. రామాపురం,వరికుంటపాడు,చింతలగుంట, దుత్తలూరు, వేంపాడు తదితర ప్రాం తాల్లో పెద్దఎత్తున అక్రమంగా గ్రావెల్ తరలించి రోడ్డు పనులకు వినియోగిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఆయా ప్రాం తాల్లోని అధికారులకు ముడుపులు అప్పజెప్పి తమ పని సులువుగా కానిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అభ్యంతరాలు వచ్చినప్పటికీ అధికారుల నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో స్థానికులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లతో గ్రామస్థాయి రాజకీయ నేతలు అవగాహనకు వచ్చి తామే దగ్గరుండి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవంగా రోడ్డుకు గ్రావెల్ తరలించాలంటే ముందు గా గనుల శాఖ నుంచి అనుమతి తీసుకొని లీడ్ పొం దాలి. కానీ ఈ వ్యవహారం పాక్షికంగానే జరిగింది. ప్రభుత్వ పథకాలకూ ఇదే తంతు ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్ల కోసం గ్రావెల్ తరలిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో రూ.10 కోట్లతో పంచాయతీల్లో సిమెంటు రోడ్ల పనులు జరిగాయి. ఈ రోడ్ల మార్జిన్లలో మట్టి నింపేందుకు ఆయా ప్రాంతాల్లో భారీగా గ్రావెల్ తరలించారు. జెడ్పీ నిధులతో జరిగే ఈ రోడ్డు పనులకు కూడా పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. ఇటీవల నియోజకవర్గంలో పలు మార్గాల్లో తారురోడ్లు వేశారు. వీటి మార్జిన్లు నింపేం దుకు గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. సోమవారం విం జమూరులోని మల్లపరాజు చెరువు నుంచి భారీ ఎత్తున ప్రొక్లెయిన్ ద్వారా గ్రావెల్ తరలించారు. దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ తెలియదన్నట్లుగానే తప్పించుకున్నారు. మొత్తమ్మీద నియోజకవర్గంలో ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కువ లోతుతో గుం తలు తీసినందున వర్షాకాలంలో వాటిలోకి నీరు చేరి కొ న్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజీలకు జైకొడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. -
నీటి దోపిడీ... నిజమే
► అన్నదాతల కడుపుకొట్టి.. రూ.కోట్లు కొల్లగొట్టారు ► ఈఈపై వేటు వేసి తప్పించుకునే యత్నం ► ఇరిగేషన్ అధికారుల రహస్య సమావేశం.. ► కలెక్టర్ చర్యలపై అధికారుల అసహనం ► అధికారుల నిర్వాకంపై రగిలిపోతున్న రైతులు దేవుడు వరం ఇచ్చి జిల్లాకు 116 టీఎంసీల నీటిని అందించాడు. రైతుల ఆనందానికి అవధుల్లేవు. రెండు పంటలకు దిగుల్లేదనుకున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు, అధికారపార్టీ నేతల ఆగడాలతో రెండో పంట నీటికోసం అన్నదాతలు రోడ్డెక్కాల్సి వచ్చింది. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను పంపిణీ చేయాల్సిన అధికారులు వాటిని అమ్ముకున్నారన్న అపప్రదను మూటకట్టుకోవాల్సి వచ్చింది. వారి నిర్వాకం తెలిసి రైతులు రగిలిపోతున్నారు. ►సోమశిల నుంచి బకెట్ నీళ్లు కూడా వృథాగా పో లేదు.. చెంబు నీళ్లు అక్రమంగా ఇవ్వలేదు.. రైతు ల శ్రేయస్సే ధ్యేయంగా నీటి ని అందించాం.. ఇవి ఇరిగేషన్ అధికారులు తియ్యగా చెప్పిన ‘నీటి’ సూక్తులు. ► ఒక్క నీటిబొట్టును వృథా చే యం.. ఒక్క టీఎంసీతో 10వేల ఎకరాలు పండిస్తాం..ఇవీ తరచూ అధికారపార్టీ నాయకులు చేసే ఆర్భాటం. ఇందుకుభిన్నంగా సో మశిలలో అక్రమాలు జరిగాయి. ఆచర్యల్లో భాగంగానే ఈఈపై సస్పెన్షన్ వేటు. దీంతో నీటిస్వా హా నిజమేనని తేలిపోయింది. ► ఏ మేరకు నీరు అక్రమం గా పంపిణీ చేశారు, ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయన్న అంశంపై విచారణ జరగాల్సి ఉంది. రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని కేవలం ఈఈపై వేటువేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : గత డిసెంబర్ 12న జరిగిన ఐఏబీ మీటింగ్ నాటికి సోమశిల జలాశయంలో 66.7 టీఎంసీల నీరు ఉంది. అదేనెల 18వ తేదీ నుంచి నీటి పంపిణీ ప్రారంభించారు. సరిగ్గా నెలకు సోమశిల జలాశయం నీటి మట్టం 53 టీఎంసీలకు చేరుకుంది. నీటి ఆవిరి, లీకులవల్ల జరిగే వృథాను అంచనా వేసి కేటాయింపు లు చేస్తారు. అయితే పంపిణీ అయిన 12 టీఎంసీలలో కాలువలు బలహీనంగా ఉండటంతో రోజు వారీ విడుదల చేస్తున్న నీరు సంగం వృథా అవుతుందని అప్పట్లో అందరూ అపోహపడ్డారు. ఐఏ బీ తీర్మానం ప్రకారం ఖరీఫ్ పంటకు పెన్నార్ డెల్టా కు 20.445 టీఎంసీలు, కనుపూరు కాలువకు 1.934 టీఎంసీలు, కావలి కాలువకు 2.881, నార్త్‌ఫీడర్ 4.781, సౌత్‌ఫీడర్ 1.884 టీఎంసీల నీటిని కేటాయించారు. అయితే రోజువారి కాలువలకు పంపిణీల్లో పూర్తిస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళనలు ప్రారంభిం చారు. దీంతో కొంత నీరు వృథాగా పోయిందని అప్పట్లో అధికారులు నమ్మబలికారు. నీటిని అమ్ముకున్నారు కాలువలపై పర్యవేక్షణ లోపం, లష్కర్లు లేకపోవడంతోపాటు స్థానిక అధికారపార్టీ నాయకుల ఆగడాలతో నీటిని ఇష్టం వచ్చినట్లు పొలాలకు వదులుకున్నారు. ఇదే అదనుగా భారీ ఆయకట్టు ఉన్న రైతులకు నీటిని అమ్ముకున్నారన్న వాస్తవం ప్రస్తు తం రైతాంగం జీర్ణించుకోలేకపోతుంది. కావలి, కనుపూరు కాలువల ద్వారా అక్రమ నీటి పంపిణీతో రూ.కోట్లు అధికారులు తమ జేబుల్లో వేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోటార్ల విని యోగంపై ప్రభుత్వానికి రావాల్సిన రూ.40కోట్లు అధికారులు నొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. మోటార్‌కు రూ.10వేలు చొప్పున వసూ లు చేశారని రైతులు చెబుతున్నారు. నీటి ‘కాకి’లెక్కలు... 24 టీఎంసీల నీటి గల్లంతుపై కలెక్టర్ నివేది కలు ఇవ్వాలంటూ తహశీల్దార్లను సోమశిలకు పంపిన రోజునే 4 టీఎంసీల నీటి లెక్కలు తేలకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ సంబంధిత ఈఈని సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఉన్నతస్థాయి అధికారులతోనే.. సదరు ప్రాజెక్ట్‌లో నీటిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈఈ స్థాయి వ్యక్తి పంపిణీ చేయరని కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతస్థాయి అధికారులతోనే నీటి అమ్మకాలు జరిగి ఉంటాయనేది వారి వాదన. పథకం ప్రకారమే అధికారులు నీటిని అమ్ముకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పథకం ప్రకారమే అమ్ముకున్నారు.. విస్తారంగా నీరు ఉన్నప్పటికీ పథకం ప్రకారమే ఇరిగేషన్ అధికారులు నీటి ని అమ్ముకున్నారని తేలి పోయింది. నీరు-చెట్టు, ఎఫ్డీఆర్ పనుల్లో సైతం భారీ అవి నీతి చోటుచేసుకుంది. నాయకుల అండదండలతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా వారిని కట్టడి చేసి రైతులను ఆదుకోవాల్సి ఉంది. - బెజవాడ గోవిందరెడ్డి, రైతు నాయకులు ఐఏబీ మీటింగ్ అప్పుడే చెప్పాం.. ఎన్నడూలేని విధంగా చిత్తూ రు జిల్లా ఆయకట్టుకు నీటిని కేటాయించడం సరికాదని అప్పుడే చెప్పాం. అయినా కేటాయించారు. ఆ పంపిణీపై ఇంతవరకు ఎవరూ నోరు మెదపడంలేదు. మరి నీరు ఎటుపోయింది. - నిరంజన్‌రెడ్డి, రైతు నాయకులు -
చోటా నేతా.. ఏంటా రోత?
► టీడీపీ యువనేత పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలంతాపసుపు మయం ► ప్రధాన రోడ్లతో పాటు సందు.. గొందుల్లోనూ విచ్చలవిడిగావెలిసిన ఫ్లెక్సీలు ► అన్ని చోట్లా పోలీసుల నిఘా నేత్రాలకు కట్టిన గంతలు ► మహానేత వైఎస్సార్ విగ్రహాన్నీ వదలని తమ్ముళ్లు ► శ్రుతిమించిన నేతల అడ్డగోలు వ్యవహారాలు ఒంగోలు క్రైం : జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు హెచ్చుమీరుతున్నారుు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సామాన్యులకు చీదర పుట్టిస్తున్నారు. వర్ధంతికి.. జయంతికి తేడా లేకుండా ఫ్లెక్సీలు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ నాయకుల రాకకు, పార్టీ మీటంగ్లకు కాదేది అనర్హం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ చోటా నేత పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీల పేరుతో హల్చల్ చేస్తున్నారు. పుట్టిన రోజేమో శనివారం. దీనికి నాలుగు రోజుల ముందు నుంచే నగరంలోని ప్రధాన రహదారితో పాటు అన్ని కూడళ్లలో ఫ్లెక్సీలే...ఫ్లెక్సీలు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అయితే నిబంధనలను నిలువునా తుంగలో తొక్కి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంత అడ ్డగోలుగా ఏర్పాటు చేశారంటే నగరంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కళ్లకు సైతం గంతలు కట్టారు. పోలీసులు ప్రకాశం భవనం ముందు రోడ్డుపై వీధి లైట్ల స్తంభానికి కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉన్నారు. అది కనిపించకుండా ఆ చోటా నాయకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నగరంలో నిత్యం ఏం జరుగుతుందో గమనించే పోలీసు కమాండ్ కంట్రోల్ అధికారులు, సిబ్బంది గమనించారో లేదో తెలియదు. సదరు నేత అధికార పార్టీకి చెందిన చోటా నాయకుడు కావడం.. అందునా ఒంగోలు ఎమ్మెల్యేకు వరుసకు సోదరుడు కావటంతో పోలీసులు మనకెందుకులే అనుకున్నారో ఏమో. నాలుగు రోజుల నుంచి ఫ్లెక్సీలు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు. నేతల వెర్రివెతలపై ప్రజల ఆగ్రహం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని అవుట్ గేటు వద్ద మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఆనవాళ్లు కూడా కనపడకుండా సదరు నాయకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే వారి వెర్రివెతలు ఏ స్థారుులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నగరపాలక సంస్థ అధికారులు సైతం నోరు మెదపకపోవడం గమనార్హం. పోలీసులు, వివిధ శాఖల అధికారులు ఫ్లెక్సీల నియంత్రణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పోలీసు అధికారులు వెళ్లి సదరు చోటా నాయకునికి కేకు ముక్క నోట్లో పెట్టి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వస్తున్నారంటే వారేం చర్యలు తీసుకుంటారులే.. అని మరి కొందరు వ్యగ్యంగా అంటున్నారు. చివరకు ఆయన స్వగ్రామం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పటం, బందోబస్తు నిర్వహించటం నగర పోలీసులు బాధ్యతగా నిర్వహించడం విస్మయం కలిగించింది. ఎంత అధికార పార్టీ అయినా ఒక స్థాయి నాయకులకు అయితే సామాన్యుడైనా పోనీలే అనుకుంటాడు. ఏ స్థాయి నాయకుడని సదరు నేతకు పోలీసులు, అధికారులు సకల మర్యాదలు చేశారో ప్రజలకు అంతుపట్టడం లేదు. ‘కొండపి’నీ వదలని తమ్ముళ్లు టీడీపీ నేతలు కొండపి నియోజకవర్గాన్నీ వదల్లేదు. టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, కొండపి, మర్రిపూడి మండలాల్లో కూడా ఫ్లెక్సీలు రోడ్డుకు అడ్డంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. ఆయూ మండలాల అధికారులు సైతం సదరు చోటా నేత వద్దకు వెళ్లి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. కొందరైతే ఏకంగా సాష్టాంగ నమస్కారం చేశారు. -
ఇదేం జన్మభూమిరా.. బాబు?
కొత్త వినతులు ఎందుకు? సభల్లో జనం నిలదీత రాంపురం సర్పంచ్‌పై ఎమ్మెల్య్యే శివాజీ వీరంగం చంద్రన్న సరకులతో సభలో రగడ కమిటీల తీరుపై విమర్శలు శ్రీకాకుళం టౌన్ : జన్మభూమి అంటూ చేపట్టిన గ్రామసభలతో ఇటు అధికారులు, అటు అధికార పార్టీ నేతలు ఎందుకొచ్చిన కర్మభూమిరా! అంటూ తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సభల్లో కూడా అధికారులకు, పాలకులకు జనం నుంచి నిలదీతలు తప్పలేదు. పింఛన్లు, రేషన్ సరుకులపై రగడ తప్పలేదు. దీంతో ఎందుకొచ్చిన జన్మభూమి అంటూ అధికారులు, అధికార పార్టీ నేతలు బయటకు చెప్పలేక లోలోపన మదనపడుతున్నా రు. ముఖ్యంగా జన్మభూమి కమిటీల పెత్తనం నేపథ్యంలో అధికారులకు, పాలకులు తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. ఎక్కడికక్కడే సభల్లో ప్రజలే నిలదీస్తున్నారు. సంతకవిటి మండలం కాకరాపల్లి గ్రామంలో రేషన్ కార్డుల కోసం జనం ఆందోళన చేశారు. గ్రామసభకు అధికారులు హాజరు కాగానే రేషన్‌కార్డుల జాబితా ఇవ్వాలని కోరారు. అందుకు అధికారులు నిరాకరించడంతో గ్రామసభను బహిష్కరించారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు కూడా ఈ సభకు హాజరై పింఛన్ల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని నిలదీశారు. దీంతో జన్మభూమి కమిటీ సభ్యు లు అడ్డుతగలడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పాతవి పరిష్కరించకుండా కొత్తగా వినతులు ఎందుకు తీసుకుంటున్నార ంటూ ప్రశ్నించారు. అధికారులు అందుకు సమాధానం చెప్పకుండా ఉండడంతో జన్మభూమిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఏకపక్షంగా గ్రామసభను నిర్వహించుకున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో గ్రామసభల్లో ఎప్పటిలాగే ఘర్షణ వాతావరణం కొనసాగింది. గ్రామసభలు నిర్వహించిన 20 చోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది. మంత్రి అచ్చెన్న వర్గీయులకు, మాజీమంత్రి శత్రచర్ల వర్గాల మధ్య సమన్వయం కొరవడడంతో గ్రామసభల్లో వాగ్వివాదం చోటు చేసుకుంది. అనేక చోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు వారికి సర్దిచెప్పి సభలను నిర్వహించారు. ఎల్‌ఎన్‌పేట మండలం తుమ్మవలస గ్రామంలో సర్పంచి రెడ్డి లక్ష్మణరావు గ్రామసభను బహిష్కరించారు. మందస మండలం రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే గౌతుశివాజీ గ్రామ సర్పంచిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి జుత్తు జగన్నాయకులు మరదలు, గ్రామ సర్పంచి విజయలక్ష్మి ప్రభుత్వ పథకాలు ప్రజలందరికి చెందాలని కోరడంతో ఎమ్మెల్యే శివాజీ ఆగ్రహం చెందారు. పథకాలను అమ్ముకుంటున్నారన్న సర్పంచి వాదనను ఆయన తప్పుపట్టారు. దీంతో అక్కడే ఉన్న సర్పంచి ప్రతినిది కూర్మారావుతో టీడీపీ వర్గీయులు వాగ్వానికి దిగారు. మందస మండలం నారాయణపురంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గత జన్మభూమి వినతులపై పరిష్కారం చూపాలంటూ నిలదీయడంతో ఎంపీడీఓ వారికి నచ్చజెప్పి గ్రామసభ నిర్వహించారు. మహిళలంటే ప్రభుత్వానికి చిన్న చూపు టెక్కలి : మహిళల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలను హీనంగా చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. అక్కవరం గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమం లో పాల్గొని ప్రజల తరఫున ఆమె మాట్లాడారు. అధికారంలోకి వస్తే మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తామంటూ హామీలిచ్చిన చంద్రబాబు తరువాత మోసం చేస్తూ అసమర్ధ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారని, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దీనంగా మారిందన్నారు. సంక్రాంతి పండగ వేళ రైతుల ధాన్యం కళ్లాల్లో దైన్యంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, సర్పంచ్ పి.భూలక్ష్మి, వైఎస్ఆర్ సీపీ రాష్ర్ట మహి ళా విభాగం ప్రధాన కార్యదర్శి దువ్వాడ వాణి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజుగణపతి, అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాష్ పాల్గొన్నారు. -
‘పెద్దలకు’ ప్రేమతో..!
-
‘పెద్దలకు’ ప్రేమతో..!
పేదల ‘అసైన్డ్’ భూములను కొల్లగొట్టిన వారికి సర్కారు అండదండ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయకపోగా ఇప్పుడు పేదలకు చెందిన అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా నూతన రాజధానిలో పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేదల అసైన్డ్ భూములను మంత్రులు, అధికార పార్టీ నేతలు బలవంతంగా తక్కువ ధరలకు కాజేశారు. ఇప్పుడు ఆ భూములను క్రమబద్ధీకరణ చేసి, చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇదంతా ఓ పథకం ప్రకారం వ్యూహాత్మకంగా నడిపించారు. రాజధానిలో మీ భూములు పోతాయని, ప్రభుత్వమే తీసేసుకుంటుందని, పైసా ఇవ్వదంటూ మంత్రులు, అధికార పార్టీ నేతలు పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. రూ.కోట్లు విలువ చేసే భూములను చౌకగా కొనుగోలు చేసి బినామీల పేరు మీద రాయించేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ రాతపత్రాలను, డబ్బులివ్వడాన్ని వీడియోల్లో చిత్రీకరించారు. అలా రాజధాని ప్రాంతంలోని వేల ఎకరాల అసైన్డ్ భూములను తన పార్టీ నేతలతో కొనుగోలు చేయించాక చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అసైన్డ్ భూములను విక్రయించుకునే వెసులుబాటు పేదలకు కల్పిస్తున్నామనే ముసుగులో అధికార పార్టీ నేతలకు ఆ భూములపై చట్టబద్ధత కల్పించి రూ.కోట్ల లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 1977 అసైన్డ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ చట్టంలో సవరణలకు సవివరమైన ప్రతిపాదనలు అత్యవసరంగా పంపాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం సీసీఎల్ఎకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అసైన్డ్ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలపై పూర్తి వివరాలను అందజేయాల్సిందిగా గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు వచ్చిన తరువాత పూర్తి వివరాలతో చట్ట సవరణకు సీసీఎల్ఏ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. పార్టీ నేతల ప్రయోజనం కోసమే... వైఎస్ సర్కారు అసైన్డ్ భూముల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయగా... ఇప్పుడు చంద్రబాబు సర్కారు మాత్రం ఆ చట్టం స్పూర్తికే తూట్లు పొడుస్తూ అసైన్డ్ భూములను కొల్లగొట్టిన అధికార పార్టీ పెద్దలకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరిస్తోంది. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీలుగా వైఎస్ ప్రభుత్వం 2007- 2008లో అసైన్డ్ చట్టానికి సవరణలు కూడా చేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారపార్టీ నేతలకు రూ.కోట్ల లబ్ధి చేకూర్చేందుకు అసైన్డ్ చట్టానికి సవరణలు చేసి పేదల కడుపులు కొట్టేందుకు సిద్ధమవుతోంది. 1954 ముందే అసైన్డ్ భూముల చట్టం ఉంది. అయితే ఆ చట్టం ప్రకారం అసైన్డ్ భూములను విక్రయించరాదని, కొనుగోలు చేయరాదనే నిబంధన ఏదీ లేదు. 1954 తరువాత అసైన్డ్ భూములను విక్రయించరాదనే నిబంధనను తీసుకువచ్చారు. ఆ తరువాత 1964లో చట్ట సవరణ, 1977 చట్ట సవరణల్లో అసైన్డ్ భూములను విక్రయించరాదని, కొనుగోలు కూడా చేయరాదనే నిబంధనను విధించారు. కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే నిబంధనను 1977 చట్ట సవరణలో పేర్కొన్నారు. అయినా అధికార పార్టీ నేతలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యధేచ్ఛగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు. అందుకోసం అన్ని రకాల అక్రమాలకూ పాల్పడ్డారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని, పరిహారం కూడా ఇవ్వదని రైతులను భయపెట్టారు. అసైన్డ్ భూములను ఎకరా కేవలం రూ.పది లక్షలకే సొంతం చేసుకున్నారు. భూమిదారులకు ఎలాంటి పత్రాలు లేకపోయినా ఫర్వాలేదంటూ... కేవలం రేషన్‌కార్డు, ఆధార్ కార్డు చూసి భూములు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములను ఎలాగైనా రెగ్యులరైజ్ చేయించుకోగలమనే ధీమాతోనే వారు అలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేయడం ద్వారా అక్రమంగా కొన్న భూములను సక్రమం చేసి అధికార పార్టీ నేతలకు రూ.కోట్ల రూపాయల్లో లబ్ధి చేకూర్చేందుకు సర్కారు సన్నాద్ధమవుతోంది. రాజధాని నగర పరిధిలో 2,028 ఎకరాలు అసైన్డ్ భూములు రాజధాని నగర పరిధిలో దాదాపు 2,028 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే రాజధాని పరిధిలోని 13 లంకల్లో అన్ని రకాల భూములు కలిపి 2,159.17 ఎకరాలున్నాయి. ఈ మొత్తం 4,187 ఎకరాల్లో అధికభాగం భూములను అధికార పార్టీ నేతలు కారుచౌకగా కొనుగోళ్లు చేశారు. ప్రస్తుత అసైన్డ్ చట్టం ప్రకారం చేతులు మారిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ భూములు అధికార పార్టీ నేతల చేతుల్లో ఉండటంతో ప్రభుత్వం అలా చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసినప్పటికీ పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. రాజధాని నగర పరిధిలో 60 ఎకరాలు మాజీ సైనికోద్యోగులకు, రాజకీయ సామాజిక బాధితులకు కేటాయించారు. ఆయా భూములను పదేళ్లపాటు అనుభవించిన తరువాత విక్రయించుకునే హక్కులున్నాయి. ఆ భూములకు కూడా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. బలహీన వర్గాలకు తీవ్ర నష్టం సీసీఎల్ఏ వద్ద గత ఏడాదివరకు ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో 28 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంపిణీ చేసినట్లు లెక్కలున్నాయి. ఇందులో ఏడు లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు, మరో మూడు లక్షల ఎకరాలకు రికార్డులను తేల్చాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ వారికి లబ్ది చేకూర్చేందుకు రెండు జిల్లాల్లో చేస్తున్న సవరణలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే అసైన్డ్ భూములు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతారని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బడుగువర్గాల అవసరాలను ఆసరాగా తీసుకుని బలవంతులు అసైన్డ్ భూములు కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ చేయించుకుంటారని, ఫలితంగా బడుగులు శాశ్వతంగా భూమికి దూరమవుతారని హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు పలుకుబడి ఉపయోగించి పేదలకు భూములు మంజూరు చేయించి, ఆ తర్వాత వారే కొనుగోలు చేసే అవకాశాలూ లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు అన్యాయం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య ప్రస్తుత చట్టం 9 ఆఫ్ 1977 అసైన్డ్ చట్టం ప్రకారం ఎవరూ అసైన్డ్ భూములను కొనుగోలు చేయరాదు, విక్రయించరాదు. అసైన్డ్‌దారుల నుంచి ఎవరైనా కొనుగోలు చేసినా చట్ట ప్రకారం ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ స్వాధీనం చేసుకున్న భూములను ఒరిజనల్ అసైన్డ్‌దారు జీవించి ఉంటే అతనికే అప్పగించాలి. ఒరిజనల్ అసైన్డ్‌దారు జీవించి లేకపోతే చట్టబద్ధమైన వారసులుంటే వారికే ఆ భూములను అప్పగించాల్సి ఉంది. ఎట్టిపరిస్థితుల్లోను అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు వీలు కల్పించరాదు. అలా చేస్తే చట్టం స్ఫూర్తికి తూట్లు పొడవడమే. ఈ చట్టం ప్రకారం భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన వ్యవసాయ భూమిని ఎట్టిపరిస్థితుల్లోను మరొకరికి హక్కు కల్పించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ చట్ట సవరణ చేస్తే ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ చట్టంలో సవరణ చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. -
తమ్ముళ్లదే ‘మనీ-సెక్స్’ రాకెట్!
-
తమ్ముళ్లదే ‘మనీ-సెక్స్’ రాకెట్!
♦ పోలీసుల సోదాలలో పలు ఆధారాలు లభ్యం ♦ డీఈ కారు కూడా స్వాధీనం ♦ అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నేతృత్వం ♦ కేసును నీరుగార్చేందుకు ముమ్మర యత్నాలు ♦ పోలీసులపై కేంద్ర మంత్రి ఒత్తిళ్లు ♦ తెరపైకి కొత్త కేసులు, ఆరోపణలు ♦ అప్పులు మాఫీ చేస్తామంటున్న అధికారపార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకుని వ్యభిచార కూపంలో దించుతున్న కాల్‌మనీ (అధికవడ్డీలకు అప్పులిచ్చే) ముఠాకు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నది అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులేనని తేలింది. విజయవాడ పటమట పంటకాల్వ రోడ్డులోని నిందితుల కార్యాలయంలో పోలీసులు జరిపిన సోదాలలో ఈ మేరకు పలు ఆధారాలు లభిం చాయి. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తుల తాలూకు పత్రాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్) ఎం.సత్యానందానికి చెందిన ఓ ఖరీదైన కారును కూడా అధీనంలోకి తీసుకొన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఆయన సోదరుడు, ఒక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నారని తేలింది. ఈ కేసులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డీఈ సత్యానందం, ఎమ్మెల్యేతో కలిసి విదేశీ యాత్రలో ఉన్న వెని గళ్ల శ్రీకాంత్ మరికొందరు పరారీలో ఉన్నారు. కేంద్రమంత్రి ఒత్తిళ్లు... కొత్త ఫిర్యాదులు మరోవైపు కాల్‌మనీ కేసులో నిందితులను కాపాడేందుకు పై స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న అధికార పార్టీ నేత ఒకరు, కొందరు ఎన్జీవో నేతలు పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపుల అంశాన్ని మరుగున పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అధికారపార్టీకి చెందిన ముఖ్యనేతల పేర్లు తెరపైకి రాకుండా, చర్చనీయాంశం కాకుండా చేసేందుకు వీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం నాడు వల్లూరి సూర్య రమేష్, అడపా సత్యబాబు, భీమేశ్వరరావు అనే ముగ్గురు వ్యక్తులు తాము యలమంచిలి రాము, వెనిగళ్ల శ్రీకాంత్‌ల చేతిలో మోసపోయామంటూ విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు, వారిని బలవంతంగా వ్య భిచార కూపంలోకి దించడం వంటి అంశాలను నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలే కొందరి చేత ఇలా అదనపు కేసులు నమోదు చేయిస్తున్నారని వినిపిస్తోంది. అలాగే ఇప్పటికే పట్టుబడిన నిందితుల ఆర్థిక మూలాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసేందుకు కూడా అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసుల నుంచి బైటపడేందుకు వ్యూహం... కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో కీలకంగా ఉన్న యలమంచిలి రాముకు గతంలో దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఇటీవలే గిడ్డంగుల కార్పొరేషన్ పదవి పొందిన ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్‌కు యలమంచిలి రాము బంధువు. అలాగే కృష్ణా జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులుకు వరుసకు కుమారుడు. బంధుత్వాలను అడ్డంపెట్టుకొని కేసుల నుంచి బయటపడేందుకు వ్యూహం పన్నుతున్నారని వినిపిస్తోంది. సెక్స్‌రాకెట్‌ను మరుగున పరచేందుకు.. మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించడం, వారిపై లైంగిక దాడులు జరగడం వంటి అంశాలను తప్పుదారి పట్టించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీకృష్ణలు రంగంలోకి దిగారు. అప్పులు తీసుకున్న వారు తమను సంప్రదిస్తే పూర్తిగా రద్దుచేయిస్తామంటూ ప్రకటించారు. అసలు సమస్య కాల్‌మనీ ఒక్కటే కాదని, మహిళలను బలవంతంగా సెక్స్‌రాకెట్‌లోకి దించిన అంశం ప్రధానమని బాధితులు అంటున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కేసుల విషయంలో చెరోవిధంగా వ్యవహరిస్తుండడం అధికార పార్టీ నేతల్లో కలవరం రేపుతోంది. నిందితులను కాపాడేందుకు ఒకరు యత్నిస్తుండగా మరొకరు నిందితులకు శిక్ష పడాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు. పోలీసులను బెదిరించి నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తే తాను పైస్థాయి వరకు వెళతానని ఎంపీ నాని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.. కాల్‌మనీ ముఠా చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావని వీరి వ్యవహారాలు తెలిసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యలమంచిలి రాము సోదరుని సంవత్సరీక కార్యక్రమం హనుమాన్‌జంక్షన్ వద్ద కాకులపాడులో నవంబరు 26న జరిగింది. ముందురోజు రాత్రి స్థానిక రైసుమిల్లులో కాల్‌మనీ ముఠాకు చెందిన పలువురు ముఖ్యులు కలుసుకున్నారని, తమ గుప్పిట్లో చిక్కుకున్న కొందరు మహిళలను ఇక్కడకు తీసుకొచ్చి తెల్లవార్లూ విందువినోదాలలో మునిగితేలారని సమాచారం. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పాల్గొనడంతో పోలీసులు ఆవైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదని వినిపిస్తోంది. పటమటలో ఈ ముఠా అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని శేషగిరిరావు కూడా వీరి ఆగడాల గురించి పోలీసు కమిషనర్‌కు వివరించారు. ఇటీవలే తన కుమారుడు హైదరాబాద్ నుంచి వచ్చినందున ఇల్లు తమకే అవసరమౌతున్నదని, అందువల్ల ఖాళీ చేయాల్సిందిగా వారిని కోరానని ఆయన తెలిపాడు. అయితే ఇల్లు ఖాళీ చేయమన్నందుకు తనను కొట్టారని, తలపై నాలుగుకుట్లు పడ్డాయని ఆయన వివరించాడు. -
పచ్చ నేతలకు మేత
సాక్షి, చిత్తూరు : చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ కోసం నీరు-చెట్టు కింద నగర పరిధిలోని కాజూరు చెరువుకు ప్రభుత్వం రూ.9 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు సాక్షాత్తు చిత్తూరు ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలోనే జరిగాయి. పలమనేరు రోడ్డులోని నీవానది ఆనుకుని ఉన్న తన పొలాన్ని చదును చేసుకునేందుకు నీరు-చెట్టు పథకాన్ని ఆమె ఉపయోగించుకున్నారు. చెరువు మట్టిని ఏ ఒక్క రైతుకు ఇవ్వకుండానే ఎమ్మెల్యే సొంత పొలాన్ని లెవెల్ చేసుకునేందుకే వాడారు. ఆ పొలంలో గతంలో లిక్కర్ ఫ్యాక్టరీ వ్యర్థాలను తోలారు. ఇప్పుడు వాటిని కనిపించకుండా భూమిని లెవెల్ చేసి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వినియోగించనున్నట్లు సమాచారం. పదుల ఎకరాల్లో ఉన్న ఆ పొలాన్ని సొంతంగా లెవెల్ చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంది. కానీ నీరు-చెట్టు మాటున ఎమ్మెల్యే తన సొంత పొలాన్ని పైసా ఖర్చు లేకుండా చదును చేసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నీరు- చెట్టు పేరుతో రూ.9 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా నీరు-చెట్టు కార్యక్రమం సాక్షాత్తు ఎమ్మెల్యే సొంతానికి ఉపయోగపడింది. ఐరాాల మండలం పందికొట్టూరు చెరువు కోసం నీరు-చెట్టు పేరుతో ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసింది. చెరువును ఆధునీకరించాల్సిన అధికార పార్టీ నేత ఆ పనులను పక్కన పెట్టి చెరువులో ఉపాధి పనుల్లో భాగంగా తీసిన పాత గుంతలపై జేసీబీలతో నగిషీలు చెక్కి బిల్లులు చేసుకున్నారు. ఇదే మండలం కలికిరిపల్లె గ్రామచెరువులో అధికార పార్టీ నేతలు మొక్కుబడిగా పనులు చేసి నీరు-చెట్టు నిధులను మింగినట్లు ఆరోపణలున్నాయి. పుంగనూరు మండలం గుర్రపల్లె కొత్తచెరువు నీరు-చెట్టు పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్షాత్తు అధికారపార్టీకి చెందిన ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి పనులను రెండు రోజుల క్రితం అడ్డుకోవడం తెలిసిందే. ఇటీవలే అదే చెరువులో రూ.20 లక్షలు ఉపాధి పనులు చేశారు. తాజాగా నీరు-చెట్టు కింద రూ.6 లక్షల పనులు చేపట్టారు. రూ.6 లక్షలు స్వాహా చేసేందుకు పాత పనులపైనే మళ్లీ పని చేస్తుండడంతో ఆగ్రహించిన కేశవరెడ్డి పనులను అడ్డుకున్నారు. నీరు-చెట్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తు టీడీపీ నేతలే ఆరోపిస్తుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 2015-16 ఏడాదికి గాను నీరు-చెట్టు కింద ప్రభుత్వం 17,677 పనులను మంజూరు చేసింది. ఇందుకు గాను రూ.412.48 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 13,990 పనులను ప్రారంభించగా, 8866 పనులు పూర్తిచేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకోసం రూ.124.19 కోట్లు వెచ్చించారు. మరో 5,124 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో పుంగనూరు, పీలేరు, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరుతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల పరిధిలో నీరు-చెట్టులో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పచ్చ నేతలకు నీరు-చెట్టు ఆదాయ వనరుగా మారడంతో అందిన కాడికి దండుకుంటున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో అధికార పార్టీ నేతల జోలికి వెళ్లేందుకు అధికారులు సాహసించడం లేదు. పనులు బాగా లేవంటే బదిలీ వేటు తప్పదని, అలాంటప్పుడు ఊరకుండడమే ఉత్తమమని చాలా మంది అధికారులు ఆ వైపు చూడడం లేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ.124.19 కోట్లల్లో 70 శాతం నిధులు స్వాహా అయినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నాలు
మదనపల్లె : మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలోని అమ్మచెరువు మిట్ట సమీపంలో దాదాపు రూ.5 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కదిరి-మదనపల్లె ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న గుట్టను జేసీబీ సహాయంతో చదును చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిని కాజేయాలని పథకం పన్నారు. మొత్తం 39 కుంటల స్థలాన్ని చదును చేసి ప్లాట్లుగా తయారు చేసి విక్రయించేం దుకు చర్యలు చేపట్టారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడం, నిర్లక్ష్యం కారణంగా ఈ స్థలాన్ని ఆక్రమించకుండా చర్యలు చేపట్టలేకపోతున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయలు రెవెన్యూ అధికారుల చేతులు మారిందనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ స్థలానికి సంబంధించి ఒక అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయని ఆరోపణలు ఉన్నాయి. కబ్జాదారులు కూడా తాము లక్షల రూపాయలు రెవెన్యూ అధికారులు ఖర్చు పెట్టామని బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. కబ్జాదారులకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుల అండదండలు అందిస్తున్నారు. ఈ పట్టాలను కూడా వారే సృష్టించి ఆధారాలను చూపుతున్నారు. ఇక్కడ ఒక్క కుంట స్థలం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం కబ్జాకు గురవుతున్న స్థలంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా ఆ స్థలం పూర్తిగా ప్రభుత్వానికి చెందిన డీకేటీ అంటున్నారు. మొత్తం 39 పట్టాలలో ఏ ఒక్కటి కూడా నిజం కాదని ప్రస్తుత రెవెన్యూ అధికారులు అంటున్నారు. గతంలో తహశీల్దార్ ఇచ్చాడని వారు చూపుతున్న పట్టాలు బోగస్ అని వివరించారు. -
డీలర్లను అక్రమంగా తొలగించడం దారుణం
పులివెందుల : అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ప్రభుత్వ అధికారులు చిన్న, చిన్న తప్పులను సాకుగా చూపి రేషన్ డీలర్లను అక్రమంగా తొలగించడం దారుణమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బ్రాహ్మణపల్లె గ్రామస్తులతో కలిసి తహశీల్దార్ శ్రీనివాసులును కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బ్రాహ్మణపల్లె రేషన్ డీలర్‌ను అకారణంగా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని.. ఇన్చార్జి డీలర్‌గా రంగాపురం రేషన్ డీలర్‌ను నియమించామని తహశీల్దార్ తెలియజేశారు. దీంతో బ్రాహ్మణపల్లె గ్రామస్తులు రేషన్ బ్రాహ్మణపల్లెలోని ఓ టీడీపీ నేత ఇంట్లో నిల్వ చేసి అక్కడికి వచ్చి రేషన్ తీసుకోవాలని చాటింపు వేశారని.. దీనికి మేం ఎట్టి పరిస్థితులలో ఒప్పుకొనే ప్రసక్తేలేదని తహశీల్దార్‌కు తేల్చి చెప్పారు. ఎర్రంరెడ్డిపల్లె చెరువును పరిశీలించిన ఎంపీ : పులివెందుల మండలంలోని ఎర్రంరెడ్డిపల్లె చెరువును గురువారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరిశీలించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఎర్రంరెడ్డిపల్లె చెరువుకు నీరు వచ్చాన సందర్భంగా ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీతో తేర్నాపంల్లె గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు మాట్లాడారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను మోసం చేశారని మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంగముని, మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చిన్నప్ప, వైఎస్ఆర్సీపీ నాయకులు బలరామిరెడ్డి, కౌన్సిలర్లు జగదీశ్వరరెడ్డి, బ్రాహ్మణపల్లె నాయకులు మల్రెడ్డి, రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల ‘గనులు’
♦ అడ్డూ అదుపూ లేకుండా గ్రానైట్ అక్రమ ఎగుమతులు ♦ {పభుత్వ ఆదాయానికి భారీగా గండి ♦ కనీస చర్యలు తీసుకోని యంత్రాంగం ♦ అక్రమార్కులకు అధికారపార్టీ నేతల సహకారం పన్నులు కట్టకుండా తరలిస్తున్నా... పట్టించుకునే నాథుడే ఉండరు. ఎగుమతుల పేరుతో వందల కోట్ల రూపాయల రాయల్టీని ఎగవేస్తున్నా.. {పభుత్వాలు చర్యలు తీసుకోవు. ఇంకా మాట్లాడితే తమ అక్రమాలకు అధికారులు, అధికారపార్టీ నాయకుల వాహనాలను, చిరునామాలనూ ఉపయోగించగలరు. శ్రుతిమించిన గ్రానైట్ అక్రమ వ్యాపారం అనంతపురం జిల్లాలో ఏకంగా రైలును ఢీకొట్టి ఓ ఎమ్మెల్యేతో పాటు నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల ఆగడాలపై కథనం.. సాక్షి, చిత్తూరు : గ్రానైట్ గనులు.. జిల్లాలోని వ్యాపారులకు మణి, మాణిక్యాలుగా మారాయి. దీంతో జిల్లాలో వీరి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యంతోపాటు... అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతోంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్‌ను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోని మంగళూరు ఫోర్ట్‌ల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నుంచి అరబ్ దేశాలతో పాటు యూరోపియన్ యానియన్ ,చైనా, జపాన్ దేశాలకు గ్రానైట్ ఎక్కువగా తరలిపోతోంది. మైనింగ్ అధికారులతో పాటు వాణిజ్య పన్నులు, రవాణా, పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ తదితర విభాగాలు అందిన కాడికి దండుకుని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికారపార్టీ నేతల మితిమీరిన జోక్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పైగా చాలా మంది నాయకులకు ఈ వ్యాపారంతో ప్రతక్ష్య, పరోక్ష సంబంధాలు ఉండడం కూడా అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 330 పైగా వర్కింగ్ గ్రానైట్ గనులు ఉన్నాయి. జీ-20, ఇంగ్లీష్ టీక్, మేప్లవర్, మదనపల్లివైట్, పుంగనూరువైట్, గ్రీన్, పీకార్గ్రీన్, వైట్‌రోజ్, చిత్తూరు ఫ్యారడైజ్ తదితర గ్రానైట్ రకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు చాలా రకాల గ్రానైట్‌కు ఇతర దేశాలలో డిమాండ్ ఉంది. దీంతో గ్రానైట్ యజమానులు లారీల ద్వారా కృష్ణపట్నం, చెన్నై, మంగుళూరు పోర్టులకు తరలించి అక్కడి నుండి విదేశాలకు చేరవేస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి క్యూబిక్ మీటర్ల బ్లాకులకు తగ్గకుండా గ్రానెట్ రాయి ఎగుమతి అవుతోంది. ఎగుమతి బ్లాకులలో 75 శాతం పైగా అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 400 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండగా వాటి పరిధిలో రెండు వేల కటింగ్ మిషన్లు ఉన్నాయి. ఒక్కో కటింగ్ మిషన్ పరిధిలో రోజుకు ఒక్క క్యూబిక్‌మీటర్ రాయి చొప్పున మొత్తం రెండు వేల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. ఇక వెయ్యి క్యూబిక్‌మీటర్లకు పైగా రాయి ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. మొత్తం కలిపితే రోజుకు మూడువేల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. ఈ లెక్కన జిల్లాలోని 330 గనుల పరిధిలో రోజుకు 10 క్యూబిక్ మీటర్ల రాయిని తీయాల్సి ఉంది. ఒక్కో క్యూబిక్ మీటరు రాయికి రూ. రెండు వేలు రాయల్టీ చెల్లించాల్సివుంది. ఈ మూడువేల క్యూబిక్ మీటర్లకు ఏడాదికి రూ.220 కోట్ల రాయల్టీ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఏడాదికి కేవలం 84 కోట్లకు మించి రాయల్టీ రావడం లేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడుతో గ్రానైట్ తరలుతోంది. పర్మిట్లు ఉండవు, వాణిజ్య పన్నులశాఖకు పన్నులు చెల్లించరు. గతంలో అక్రమ రవాణా రాత్రిళ్లు జరిగేది. టీడీపీ అధికారంలోకి రావడంతో అక్రమ రవాణా పగటిపూట సాగుతోంది. గ్రానైట్ రాయిని 400 లారీలు నిత్యం ఎగుమతి చేస్తుండగా వాటిల్లో 350 లారీలు అధికార పార్టీ ముఖ్యనేతలవే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఓ అధికారి సాక్షితో చెప్పడం పరిస్థితిని తెలియజేస్తోంది. -
సీటు.. నోటు
- అదనపు ఆదాయం ఉన్న సీట్లపై వ్యవసాయ శాఖ ఉద్యోగుల కన్ను - అధికార పార్టీ నేతలతో సిఫార్సులు, ఫోన్లు - ఆదాయమే పరమావధిగా పోటాపోటీ యత్నాలు - జేడీకి సవాలుగా మారిన సీట్ల సర్దుబాటు కడప అగ్రికల్చర్ : వ్యవసాయ శాఖలో కుర్చీలాట మొదలైంది. అదనపు ఆదాయం లభించే సీట్లపై పలువురి దృష్టి పడింది. ఎలాగైనా సరే కీలకమైన కుర్చీలు దక్కించుకోవడానికి ఎవరంతకు వారు పావులు కదుపుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖలో ఇటీవలే బదిలీలు పూర్తయ్యాయి. అన్ని విభాగాల అధికారులు, టెక్నికల్ ఏఓలు, వివిధ సెక్షన్ల సిబ్బంది బదిలీ అయ్యారు. ఊటుకూరులోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో నాలుగు విభాగాలు ముఖ్యమైనవి. అందులో నాణ్యత ప్రమాణాల విభాగం, యాంత్రీకరణ విభాగం, జాతీయ ఆహార భద్రత, జాతీయ నూనె గింజల ఉత్పత్తి విభాగం, విత్తన కేటాయింపులు, పంట పెట్టుబడి రాయితీ, కరువు నివేదికలు, పంటల బీమా విభాగాలను టెక్నికల్ ఏఓలు చూస్తుంటారు. భూసార సంరక్షణ, రైతు శిక్షణ కేంద్రంలోనూ టెక్నికల్ ఏఓలు ఉన్నారు. సీ-1 నుంచి సీ-8 వరకు వివిధ సెక్షన్లలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. అయితే ఆదాయం ఉన్న కుర్చీల కోసం వీరి మధ్య పోటీ మొదలైంది. కొందరు అధికార బలం, మరికొందరు డబ్బు బలం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలానా స్థానం.. ఫలానా సెక్షన్ తాము సూచించిన వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు జేడీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆదాయం వచ్చే సీట్లు వారికిచ్చి ఆదాయంలేని సీట్లు మాకిస్తే ఎలా అని మరికొందరు ఉద్యోగులు జేడీ వద్ద వాదనలు వినిపించినట్లు తెలిసింది. సెక్షన్లు మార్చండి.. ‘ఎల్లకాలం మేమే ఆ సీటుకు అంకితం కావాలా.. ఇదెక్కడి న్యాయం సార్.. ఇప్పుడు సెక్షన్లలో ఉన్న వారిని ఇంకో విభాగానికి మార్చండి సార్..’ అని టెక్నికల్ ఏఓలు కొందరు జేడీపై ఒత్తిడి తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదాయం ఉండే సీట్ల కోసం కొందరు ఏఓలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పోటీపడుతున్నారు. ప్రధానంగా క్వాలిటీ కంట్రోల్, ఫాం మెకనైజేషన్ విభాగాల్లో వేయించుకోవడానికి పోటీ మరీ తీవ్రంగా ఉందని సమాచారం. ఈ తతంగాన్ని కొలిక్కి తెచ్చి విధులు అప్పగించడం నూతనంగా బాధ్యతలు చేపట్టిన జేడీకి పెద్ద సవాల్‌గా మారింది. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ జేడీ ఠాకూర్ నాయక్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. సెక్షన్లలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. టెక్నికల్ ఏఓలలో కొందరికి పని భారం ఉందని, వారికి ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించమని చెప్పారు. ఆయా ఉద్యోగులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. -
పట్టుకున్నారు..వదిలేశారు
- చెన్నంపల్లి రీచ్ నుంచి లారీల్లో ఇసుక తరలింపు - దాడుల చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు - రసీదులు సక్రమంగా ఉన్నాయని వదిలేసిన వైనం - అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల వల్లే వదిలేశారని ఆరోపణలు కంబదూరు: మండలంలోని చెన్నంపల్లి గ్రామ ఇసుక్ రీచ్ నుంచి ఇసుక తరలింపు విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. రీచ్ నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించాలనే నిబంధన ఉండగా కొందరు వ్యక్తులు లారీల ద్వారా ఇసుక తరలించారు. గురువారం రాత్రి ఇసుక రీచ్‌లో పది చక్రాల లారీ( కేఏ.41ఏ.8532, కేఏ-10.2259)ల్లో ఇసుక నింపారు. సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఏమైందో..ఏమోగాని వాటిని వదిలేశారు. అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఒత్తిడి తేవడంతోనే ఆ లారీలను వదిలేసినట్లు విమర్శలున్నాయి. దీనికితోడు రాత్రి సమయంలో ఇసుక తరలించరాదనే నిబంధనలున్నాయి. అయినా కర్ణాటకకు చెందిన పది చక్రాల లారీల్లో రాత్రి వేళ ఇసుక నింపడం అనుమానాలకు తావిస్తోంది. మీసేవలో ఇసుక తరలింపునకు ట్రాక్టర్ల ద్వారా చేపడుతామని అనుమతులుండగా పది చక్రాల లారీలలో తరలిస్తుండడం అనుమానాలను రేకిత్తిస్తోంది. ఈ ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీపీ, ఓ సర్పంచ్ హస్తముందనే ఆరోపణలున్నాయి. మీ సేవాలో రసీదులను పరిశీలిస్తే... రామగిరి మండలం పేరూరు మీసేవలో రామాంజినేయులు అనేవ్యక్తి మడకశిర ప్రాంతంలోని గోవింద్‌పురం గ్రామానికి ఇసుకను రవాణా చేసుకోనేందుకు 18 క్విబిక్ మీటర్లు ఇసుకకు, అశోక్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి ఇసుక వరలించేందుకు 15 క్విబిక్ మీటర్లు ఇసుకను తీసుకెళ్లడానికి మీసేవలో ఎస్ఓపీ రశీదును పోందారు. ఎస్ఓపీ రశీదు ఆధారంగా కాకుండా కర్ణాటక లారీలో ఇసుకను తరలించేందుకు స్వయం సహాయక సభ్యులు ఈ-ట్రాన్సిట్ ఫారలను అందజేసినట్లు ఆధారాలు చూపుతున్నారు. పోలీసులు వాటిని పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు గుర్తించి లారీలను వదిలేశారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు అధికార పార్టీ నాయకులు ఇలాంటి ఎత్తుగడ వేసినట్లు ఆధారాలు కనిపిస్తున్న పోలీసులు మాత్రం వాటిని గాలికొదిలేశారు. -
ప్యానల్ జాబితాకే పట్టం !
సెక్టోరియల్ ఆఫీసర్లుగా తీసుకోవాలని ఎస్పీడీ నిర్ణయం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)లో ఖాళీ అయిన సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీలో నెలకొన్న సందిగ్ధతకు అతి త్వరలోనే తెర పడనుంది. బయటి నుంచి కాకుండా ప్యానల్ జాబితాలో ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయిం చారు. జీసీడీఓ విజయకుమారి, సీఎంఓ దివాకర్‌రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ గురుప్రసాద్, అలెస్కో శ్రీనివాసరావు ఇటీవల రిలీవ్ అయ్యారు. వీరి స్థానాలు భర్తీ చే యడం ఆసక్తిగా మారింది. కొందరు టీచర్లు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తూ వచ్చారు. ఒక సామాజిక వర్గం వారు ఈ సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టులు తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ కీలక ప్రజాప్రతినిధులతో జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తూ వచ్చారు. తమకు అనుకూలమైన వారి పేర ్లతో జాబితా కూడా తయారు చేసి వీరినే సెక్టోరియల్ ఆఫీసర్లుగా నియమించాలంటూ ముఖ్య ప్రజాప్రతినిధి ద్వా రా కలెక్టర్‌కు, ఎస్పీడీకి కూడా పంపారు. ఇదే సమయం లో ప్యానెల్ జాబితా మేరకు భర్తీ చేయాలని సూచిస్తూ రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. జిల్లా అధికారులు కూడా దీనిపై ఆచీతూచి అడుగులేస్తూ వచ్చారు. విద్యాశాఖ అధికారులు మరోసారి ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ అధికారి ద్వారా మౌఖిక ఆదేశాలతో ప్యానెల్ జాబితాలో ఉన్న వారి పేర్లను సూచిస్తూ కలెక్టర్‌కు ఫైలు పెట్టడంతో ఆమోద ముద్ర పడింది. ఎస్పీడీ కూడా ఈ ఫైలుపై ఆమోద ముద్ర వేశారు. ప్యానల్జాబితా సీనియార్టీ మేరకు రొద్దం మండలం పెద్దమంతూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బీ. రవినాయక్, పుట్టపర్తి మండలం బీడుపల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఎస్. గోపాల్‌నాయక్, విడపనకల్లు మండలం హావలిగి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వెంకటరమణనాయక్, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వాణీదేవి నియామకం దాదాపు పూర్తయినట్లే. మరో నాలుగైదు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెల్లడయ్యే అకవాశం ఉంది. -
పదవుల పందేరం షురూ!
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నేతలు ఏడాదిగా నిరీక్షిస్తున్న పదవుల పందేరానికి ముహూర్తం ఖరారైంది! వివిధ కారణాలతో వాయిదాపడుతూ వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు టీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధమైంది!! దీంతో ఇన్నాళ్లూ ఆశగా ఎదురు చూసిన నేతలు తమకు తప్పక అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పుష్కర హడావిడి ముగియడంతో పదవుల భర్తీపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిసారించనున్నారని...ఇక పదవుల భర్తీకి మోక్షం కలిగిన ట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆషాఢ మాసం ముగిశాక ఈ నియామకాలు ఖరారవుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు దీనిపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలోని 12 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతోపాటు డిసెంబర్ చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు, వరంగల్ లోక్‌సభా స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగాల్సి ఉన్న దృష్ట్యా నామినేటెడ్ పదవులు భర్తీ చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకోరని పార్టీలోని కొందరు నేతలు సూత్రీకరించారు. అయితే ఈ ఎన్నికలకు, పదవుల పందేరానికి సంబంధం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అన్ని ఎన్నికలు పూర్తయ్యాకే పదవులు ఇవ్వాలంటే ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి లెక్కగడితే ఏడాదిన్నర గడిచిపోయినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పార్టీ నేతలు, శ్రేణుల్లో నిస్తేజం ఆవరించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన జరగని కారణంగానే నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం అయిందని చెబుతున్నా వీటితో సంబంధంలేని సంస్థలు కూడా ఖాళీగానే ఉన్నాయి. ముందు కొన్నింటితో మొదలు పెడితే విడతలవారీగా అన్నింటినీ పూర్తి చెయ్యొచ్చన్న చర్చ జరిగినట్లు సమాచారం. ఈ కారణంగానే పదవుల పందేరంపై అధినేత కేసీఆర్ దృష్టిపెట్టనున్నారని చెబుతున్నారు. కేబినెట్లో కొత్త వారికి బెర్తులు! ఇదే సమయంలో మంత్రివర్గంలోనూ కొన్ని మార్పుచేర్పులు తప్పకపోవచ్చన్న ప్రచారమూ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. కొందరికి అవకాశం కల్పించాల్సి రావడంతో మార్పులు ఉంటాయనే అంటున్నారు. కొందరు అమాత్యుల పనితీరూ అనుకున్నంతగా ఆకట్టుకోకపోవడం, వారిపట్ల సీఎం ఒకింత అసంతృప్తిగా ఉండటంతో కొత్తవారికి బెర్తులు దొరుకుతాయని పేర్కొంటున్నారు. కేబినెట్లో మహిళా ప్రాతినిధ్యం లేకపోవడంపైనా ఇంటా, బయట చర్చ జరుగుతోంది. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టడంలో భాగంగా తొలి నుంచీ పార్టీలో ఉంటున్న వారికీ, వివిధ హామీలపై పార్టీలోకి వచ్చిన వారికీ అవకాశం ఇవ్వడంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో కనీసం మూడు, నాలుగు మార్పులుండే అవకాశాన్ని పార్టీ వర్గాలు కొట్టిపారేయడం లేదు. అయితే మార్పులకు కచ్చితమైన ముహూర్తంపై మాత్రం ఎవరూ పెదవివిప్పడం లేదు. పార్టీ అవసరాల రీత్యా, ద్వితీయ శ్రేణిలో ఉత్సాహం నింపాల్సిన అవసరం వచ్చిందని, ఈ కారణంగానే అటు నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు, మంత్రివర్గంలోనూ మార్పులు చేర్పుల నిర్ణయం జరగొచ్చని అంటున్నారు. -
శాంతియుత ర్యాలీపై పోలీసుల దాష్టీకం
- అధికారపార్టీ నేతలఆదేశాలతో జంగా అరెస్ట్ - యరపతినేని అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయం - పోలీసులపై మండిపడ్డ వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు - మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పోలీసులు అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా చేపట్టే ర్యాలీలపై జులుం ప్రదర్శిస్తున్నారు. అక్రమాలు బయటకు రాకుండా అధికారపార్టీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అధికారపార్టీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడటం, ఎదురుతిరిగిన వారిపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేయడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, రేషన్ మాఫియాలకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తూ కోట్లు గడిస్తున్నారు. దీనిని ప్రతిఘటిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలపై పోరాడేందుకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై గత రెండు రోజులుగా పోలీసులు ప్రవర్తిస్తున్నతీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది. బుధవారం దాచేపల్లిలో యరపతినేని అక్రమాలకు నిరసనగా నల్లజెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన జంగాను దౌర్జన్యంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన సంఘటన తెల్సిందే. దీనికి నిరసనగా గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు జంగా గుంటూరుకు పాదయాత్రగా బయలుదేరారు. రాజుపాలెం మండలం, కోటనెమలిపురి గ్రామ బస్టాండు వద్దకు రాగానే పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా అక్కడ చేరుకుని జంగాను అరెస్టు చేసి రాజుపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. జంగా అరెస్టుకు నిరసనగా వైఎస్సార్ సీపీ రాజుపాలెం జడ్పీటీసీ మర్రి సుందర్రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పోలీసుస్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వారినిసైతం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెల్సుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాచర్ల, బాపట్ల ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు తదితర నాయకులు రాజుపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని జంగాను పరామర్శించారు. ఈ విషయం ఇంతటితో వదిలేది లేదనీ, జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రమానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాయకులు చెప్పారు. పోలీసులు అక్రమాలకు పాల్పడే రౌడీలు, గూండాలకు వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర చేస్తున్న జంగాను అరెస్టు చేయడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. -
అనుకూలంగా ‘గంట’ కొట్టేస్తున్నారు
ఆర్అండ్బీ అధికారుల నిర్వాకం మంత్రి జిల్లాలోనే నిబంధనలకు తూట్లు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణం ఇక్కడ నిబంధనలు చెల్లవు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే అధికారులు నడుచుకోవాలి. స్వయంగా ఆర్అండ్బీ శాఖ మంత్రి సొంత జిల్లా కావడంతో నిబంధనలు కూడా వారికి అనుకూలంగా తిరగ రాసేసుకుంటున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులు అమలు చేసేస్తున్నారు. ఆర్అండ్బీ శాఖలో అన్నిచోట్ల నిబంధనలు తుంగలోతొక్కి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో మిగిలిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నా ఫలితం లేకుండా పోతోంది. -సాక్షి ప్రతినిధి, ఒంగోలు నిబంధన ఇలా : ఎక్కడైనా టెండర్లు పిలిస్తే బిడ్ దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్‌కు కనీస గడువు ఉంటుంది. పద్ధతిగా టెండర్లయితే పదిహేను రోజులు, అత్యవసర టెండర్లయితే మూడు నుంచి ఏడు రోజుల వరకూ గడువిస్తారు. అయితే మామూలు మరమ్మతు పనులకు జిల్లా ఆర్అండ్బీ అధికారులు ఇచ్చిన సమయం ఎంతో తెలిస్తే ఓ గంట మాత్రమే. తుంగలో ఇలా: గంటలోనే టెండర్లు వేయాలంటూ కొత్త నిబంధన అధికార పార్టీ రచించింది. లేకపోతే ఆన్లైన్ బిడ్ క్లోజ్ అయిపోతుందని హెచ్చరిస్తోంది. ఇదీ కనిగిరి ఆర్అండ్బీ డివిజన్లో అవలంబిస్తున్న కొత్త ఎత్తుగడ. ముందుగానే ఎమ్మెల్యే మనుషులకు చెప్పి ఫలానా టెండర్‌కు ఈఎండీ కోసం డీడీలు తీసి సిద్ధం చేయిస్తారు. అకస్మాత్తుగా ఉదయం 10.30 గంటలకు ఆన్లైన్లో టెండర్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా గంట తర్వాత బిడ్ క్లోజ్ చేస్తారు. ఈలోగానే బిడ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించుకున్నవారు మాత్రమే దీనిలో టెండర్లు వేయడానికి వీలవుతుంది. వివరాలు లేకుండానే : లక్ష రూపాయలకు మించిన ఏ పనైనా ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీని ప్రకారం బుధవారం ఉదయం కనిగిరి డివిజన్‌కు సంబంధించి రెండు రోడ్లను మరమ్మతులు చేయడానికి రూ.9.41 లక్షలు అంచనా విలువతో టెండర్లు పిలిచారు. దీనికి బిడ్ సెక్యూరిటీగా రూ.9,500 నిర్ణయించారు. కనీసం ఏ రోడ్లు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ మరమ్మతులు చేయాలన్న కనీస వివరాలు కూడా లేకుండానే ఆన్లైన్ టెండర్లు పిలిచారు. మరో టెండర్ కందుకూరు, పామూరు రోడ్డు, దొనకొండ - కనిగిరి - దోర్నాల రోడ్డు మరమ్మతుల కోసం రూ.3.93 లక్షలు పిలిచారు. దీనికి కూడా కేటాయించిన సమయం గంట మాత్రమే. ఇటీవల కాలంలో కనీసం ఎనిమిది టెండర్లను ఇదే పద్ధతిలో పిలిచినట్లు సమాచారం. దీనిపై అధికారుల వివరణ కోరగా తాము నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, దీన్ని ఎందుకు వివాదం చేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం ఉంటే వారికి అనుకూలంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, తమ ఇబ్బందులు అర్థం చేసుకోవాలని ఆ అధికారి చెప్పుకొచ్చారు. -
సస్పె (టె) న్షన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అధికారుల్లో టెన్షన్ ప్రారంభమైంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పని చేస్తూ ఇసుక అక్రమమే కాదు ఇతరత్రా అవకతవకలను కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న కొంత మంది అధికారులకు తాజా సస్పెన్షన్లు ముచ్చెమటలు ఎక్కిస్తున్నాయి. ‘మేం వెనకున్నాం ... అంతా మేం చూసుకుంటాం’ అని భరోసా ఇచ్చిన నేతలెవ్వరూ చిక్కుల్లో పడ్డప్పుడు చిక్కుముడులు విప్పడానికి ముందుకు రాకపోవడంతో ‘విడవమంటే పాముకు కోపం ... కరవమంటే కప్పకు కోపం’ చందంగా అధికారుల పరిస్థితి తయారైంది. మొన్న రాచర్ల, నేడు కందుకూరు తహసీల్దార్లపై వేటు పడింది. కందుకూరు ఆర్టీవో కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ సుజాతా శర్మ తీసుకున్న నిర్ణయం జిల్లాలో చర్చనీయాంశమైంది. పని చేయని ఉద్యోగులకు ఛార్జి మెమోలు ఇస్తూ వచ్చిన కలెక్టర్ సస్పెన్షన్ల బాట పట్టారు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై కలెక్టర్ వేటు వేయడం సాహసోపేతమైన చర్యగానే భావించాలి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించే విధంగా కందుకూరు తహసీల్దార్ నివేదిక ఇవ్వడంతో వేటు తప్పలేదు. కందుకూరు ఇసుక తవ్వకాల విషయంలో డీఆర్డీఎ అధికారులు, సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. వారి పాత్ర కూడా ఉన్నట్లు స్పష్టమైతే వేటుపడే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు పౌరసరఫరాల శాఖకు సంబంధించి కూడా ఇద్దరు సిబ్బందిపై వేటు పడింది. ఈ సస్పెన్షన్లు అక్రమాలను ఎంతవరకూ అడ్డుకుంటాయని ఓ వర్గం ధీమాగా ఉంది. ఒకవైపు అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక సస్పెండ్ చేస్తే పైనుంచి తమపై వేటు పడుతోందని, చేయకపోతే అధికార పార్టీ నాయకులనుంచి బెదిరింపులు వస్తున్నాయని అధికారులు వాపోతున్నారు. కలెక్టర్ వచ్చిన తర్వాత అక్రమ ఇసుక రవాణపై దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. అయితే పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలే నేరుగా ఈ అక్రమ రవాణాలో ఉండటంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న తహసీల్దార్లలో ఎక్కువ మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల వద్ద నుంచి తెచ్చుకున్న రికమండేషన్ లెటర్లతోనే పోస్టింగ్‌లు వచ్చాయి. దీంతో ఆ నియోజకవర్గ ఇంఛార్జి మాటను కాదని పని చేసే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్న. కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతే ఇసుక అక్రమ రవాణాకు నేతృత్వం వహిస్తుంటే తహసీల్దార్ వ్యతిరేకంగా నివేదిక ఎలా ఇవ్వగలరని అధికారులు వాపోతున్నారు. ఇప్పుడు బదిలీలు కూడా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చేతుల మీదుగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ జోక్యంతో జరిగే బదిలీలలో వారికి వ్యతిరేకంగా తాము పనిచేయలేని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో ఇంజినీరింగ్ విభాగంలో ఏడు లక్షల రూపాయల వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ మా పార్టీ కాదు కాబట్టి అతనికి బిల్లు ఇస్తే నీ సంగతి చూస్తానని నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆ అధికారిని బెదిరించినట్లు సమాచారం. కందుకూరులో కూడా ఒక అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
సర్కారీ జాగాలో తమ్ముళ్ల పాగా
- గుంటూరు స్వర్ణభారత్ నగర్లో నిరుపేదలను అడ్డుకొని ఆక్రమణ - మంత్రి ఆదేశాలతోనే బీఫారాలు ఇచ్చామంటున్న రెవెన్యూ అధికారులు సాక్షి, గుంటూరు : తెలుగుతమ్ముళ్ల ఆగడాలకు అడ్డ్డులేకుం డాపోతోంది. గుంటూరు నగర శివారులో రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను అధికారపార్టీ నేతలు ఆక్రమించారు. వీరికి ఓ మం త్రి అండదండలు ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలను ర క్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రే అక్రమార్కులకు అండగా నిలవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వర్ణభారత్ నగర్ మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారిపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడతామంటూ పోలీస్స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాలను పరిశీలిస్తే... స్వర్ణభారత్ నగర్ మెయిన్‌రోడ్డులో గతంలో కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకుని ని వాసం ఉంటున్నారు. ఆ మధ్య అగ్ని ప్రమా దం జరగడంతో గుడిసెలన్నీ దగ్ధమై అంతా రోడ్డు పాలయ్యారు. వీరికి అక్కడే సి-బ్లాక్‌లో బీ ఫారాలు ఇచ్చి పంపారు. అప్పటి నుంచి అక్కడ సుమారు ఎకరా భూమి ఖాళీగా ఉంది. ఈ స్థలంలో ముస్లిం పిల్లల కోసం మదరసా ఏ ర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలనే ఉద్దేశంతో దీన్ని ఖాళీగానే ఉంచారు. కొంత స్థలం లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. మిగతా స్థలం ఖాళీగా ఉండటంతో ఇటీవల అదే కాలనీకి చెందిన కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకున్న అధికార పార్టీ నేతలు వారిపై దాడులు చేసి గాయపర్చడమేకాకుండా, పోలీసులకు ఫి ర్యాదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్లనిర్మాణం చేపడుతున్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ అధికారులు బీ ఫారాలు మంజూరు చేయగా, మరికొందరికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు, స్థానికులు వీఆర్ఓ, తహశీల్దార్‌ను నిలదీయడంతో తడబాటుకు గురయ్యారు.ఈ విషయంపై గుంటూ రు రూరల్ మండల తహశీల్దార్ శివన్నారాయణమూర్తిని ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించాననీ, పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. మంత్రి సిఫార్సుతోనే బీఫారాలు.. జిల్లాకు చెందిన ఓ మంత్రి లేఖ పంపడంతో రెవెన్యూ అధికారులు సుమారు 40 మందికి బి ఫారాలు ఇచ్చేశారు. దీనికి ప్రతిఫలంగా ఒక్కో బి ఫారం పట్టాకూ రూ.3 లక్షల చొప్పున మంత్రికి ముడుపులు అందాయని రెవెన్యూ అధికారులు బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. -
మద్యం దుకాణాలకు నామమాత్రపు స్పందన
సాక్షి, గుంటూరు : జిల్లాలో రెండేళ్ళపాటు మద్యం దుకాణాలు కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ నెల 22న మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. గుంటూరు నగరంలోని మహిమాగార్డెన్స్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఎక్సైజ్ అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం వరకు ఒక్క దరఖాస్తు కూడా బాక్సుల్లో పడలేదు. గురువారం 14 షాపులకుగానూ 21 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తెనాలి డివిజన్ నుంచి 3, గుంటూరు డివిజన్ నుంచి 6, నరసరావుపేట డివిజన్ నుంచి 12 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా రెండురోజుల గడువు మాత్రమే ఉంది. శుక్ర, శనివారాల్లో దరఖాస్తులు అధిక సంఖ్యలో రావచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. గతేడాది దరఖాస్తు ఫీజు రూ. 25వేలు ఉండగా, ఈ ఏడాది మూడు శ్లాబులుగా విభజించి రూ. 30, రూ.40, రూ.50 వేలు చొప్పున నిర్ణయించారు. లెసైన్స్ ధరలు పెంచడంతోపాటు దరఖాస్తు ఫీజు కూడా పెంచడంతో దరఖాస్తు చేసుకోవడానికి అంతగా ఆసక్తి సూపడంలేదని మద్యం వ్యాపారులే చెబుతున్నారు. ప్రభుత్వ దుకాణాలు ఇవే.. గుంటూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో గుంటూరులోని 8, 31, 27 డివిజన్లలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరి, తాడికొండ, తుళ్ళూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, అమరావతిలలో ఏర్పాటు చేస్తారు. నరసరావుపేట ఎక్సైజ్ పరిధిలో నరసరావుపేట 19వ డివిజన్, నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో, చిలకలూరిపేట 3వ డివిజన్, సత్తెనపల్లి 12వ డివిజన్, కొండమోడు, క్రోసూరు, అచ్చంపేట, పిడుగురాళ్ల, కారంపూడి, గురజాల, మాచర్ల, దుర్గి, వినుకొండలోని 10వ డివిజన్, నూజెండ్ల గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. తెనాలి ఎక్సైజ్ జిల్లా పరిధిలో తెనాలిటౌన్, నారాకోడూరు, వేమూరు, కొల్లిపర మండలంలోని దావులూరు, కొల్లూరు, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం, బాపట్ల, కర్లపాలెం, పొన్నూరు, కాకుమాను గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. అధికార పార్టీకి అనుకూలంగా.. ప్రభుత్వం కూడా తమ పార్టీ నాయకుల సూచనల ప్రకారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం దుకాణాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తుందని మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు తక్కువ ధరలు ఉండగా, ప్రస్తుతం వాటిని మండల, మున్సిపల్ కేంద్రానికి 2 కి.మీ లోపు దూరంలో ఉన్నట్లు చూపుతూ వాటితో సమానంగా రేట్లు నిర్ణయించడం సమంజసం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు దాచేపల్లి మండలం నడికుడి మేజర్ గ్రామపంచాయితీలో ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం 17 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. ఇక్కడ ఒక్క మద్యం దుకాణం మాత్రమే ఉంది. ఇక్కడ మద్యం దుకాణం లెసైన్స్ ఫీజు నిబంధనల ప్రకారం * 37 లక్షలు ఉంది. గతంలో ఈ షాపును రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా * 5.20 కోట్లకు టెండర్ వేసి దక్కించుకున్నారు. హైవే పక్కనే ఉండటంతో వ్యాపారం కూడా ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. దీంతో ఈ షాపునకు పోటీ సైతం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ మరో షాపు రాకుండా కనీసం ప్రభుత్వ మద్యం దుకాణాన్ని సైతం పెట్టకుండా అధికారపార్టీ ముఖ్యనేత అడ్డుకోగలిగారు. ఈ షాపునకు ఎవరూ దరఖాస్తు చేసుకున్నా ఒప్పుకునేది లేదంటూ ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. -
పార్కింగ్ ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పుష్కర ఘాట్ల పనులే కాదు.. పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసే స్థలాల పనుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 13 ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాల ఏర్పాటు కోసం మంజూరైన సుమారు రూ.58.45 లక్షల అంచనా వ్యయం గల 13 పనులను అధికారులు నామినేషన్‌పై అప్పగిస్తున్నారు. వీటిలో ఒకటి, రెండింటికి మినహా మిగిలిన అన్ని పనులకూ ఎలాంటి టెండర్లు పిలువలేదు. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీ నేతలకు పనులు కట్టబెట్టాలని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో రూ.5 లక్షల కంటే తక్కువ అంచనా వ్యయం పనులను నామినేషన్‌పై అప్పగించే వీలుంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాకు మంజూరైన సుమారు రూ.అరకోటికి పైగా అంచనా వ్యయం పనులను అధికార పార్టీ నేతలకు కట్టబెడుతున్నారు. అన్ని పనులను కలిపి ఒక ప్యాకేజీగా ఏర్పాటు చేసి టెండర్లు పిలిస్తే అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయేది. కానీ.. ఈ దిశగా అధికారులు చొరవ చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘాట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాలివే.. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు వచ్చే వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు జిల్లాలో ఇప్పటికే నిర్మించిన, ప్రస్తుతం నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జన్నారం మండలం చింతగూడ, లక్ష్మణచాంద మండలం చింతల్చాందా, దండేపల్లి మండలం ద్వారకా, ఖానాపూర్, ముథోల్ మండలం లోకేశ్వరం, లక్ష్మణచాంద మండలం పీచర, మామడ మండలం పొన్కల్, దిలావర్పూర్ మండలం సంగ్వి, నిర్మల్ మండలం సోన్-1, సోన్-2, జైపూర్ మండలం వెల్మల్‌లో ఈ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో స్థలానికి రూ.రెండు లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో ఓ పార్కింగ్ స్థలానికి రూ.6 లక్షలు, మరో స్థలానికి రూ.13 లక్షలు కూడా కేటాయించారు. ఇందులో రెండు పనులకు మినహా మిగిలిన అన్ని పనులనూ అప్పనంగా కట్టబెట్టారు. స్థలాల గుర్తింపులో జాప్యం.. ఆయా ఘాట్ల వద్ద రెవెన్యూ అధికారులు గుర్తించిన స్థలాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కరాల సమయం దగ్గర పడుతున్నా ఈ స్థలాల గుర్తింపులో జాప్యం జరుగుతోంది. కొన్ని చోట్ల స్థలాలను గుర్తించినా, ఆ స్థలాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించకపోవడంతో పనులు ప్రారంభించేందుకు వీలు పడటం లేదు. ఒక్క చింతల్‌చాంద, ఖానాపూర్, లోకేశ్వరం, పీచర, పొన్కల్, సంగ్వి, సోన్-1, సోన్-2, వేలాల ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను అప్పగించిన అధికారులు, మిగిలిన చోట్ల వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ‘రూ.5 లక్షలలోపు కంటే తక్కువ అంచనా వ్యయం గల పనులను నామినేషన్‌పై ఇచ్చేందుకు వీలుంది. రూ.ఐదు లక్షల కంటే ఎక్కువ అంచనా వ్యయం గల పనులన్నింటికీ టెండర్లు పిలిచాం’ అని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ మారుతి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
జన్మభూమిలో జనాగ్రహం
జిల్లావ్యాప్తంగా తొలిరోజు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రజలు కొన్ని చోట్ల అడ్డుకోగా, మరికొన్ని చోట్ల బహిష్కరించారు. తాగునీరు, పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డులు లేకుండా జన్మభూమి కార్యక్రమానికి ఎందుకొచ్చారంటూ అధికారులను నిలదీశారు. దీంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. సాక్షి, చిత్తూరు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమం రద్దయినట్లు ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా తమకు ఆదేశాలు రాలేదంటూ అధికారులు పలుచోట్ల జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. అధికారపార్టీ నేతలు సైతం నిబంధనలను తుంగలో తొక్కి జన్మభూమిలో పాల్గొన్నా అధికారులు అడ్డుచెప్పలేదు. పలమనేరు రూరల్ మండలం మొరం గ్రామంలో అర్హులైన వారి పింఛన్లు తొలగించారంటూ అధికార పార్టీ నేతలే జన్మభూమి సభను అడ్డుకున్నారు. పింఛన్లు ఇచ్చేంత వరకు గ్రామంలో సభ జరగనివ్వమని హెచ్చరించారు. ప్రజలతో తిట్లు తినాల్సి వస్తోందని, గ్రామంలో తలెత్తుకుని తిరగలేకున్నామని స్థానిక నేతలు అధికారులను నిలదీసి చివాట్లు పెట్టారు. నగరి మున్సిపాలిటీ 1,2,3 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభలను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వలేమన్నప్పుడు సభలెందుకంటూ మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్‌ను నిలదీశారు. సభను జరగనివ్వమంటూ భీష్మించుకు కూర్చొన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. అనంతరం సభలను బహిష్కరించి వెళ్లిపోయారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని పీఎస్ అగ్రహారంలో జరిగిన సభలో అధికారులు లేకుండా టీడీపీ నేతలు కొందరు వేదికపై కూర్చోవడంతో వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ శ్యామ్‌సుందర్ వారిని నిలదీశారు. అధికారులు లేకుండా జన్మభూమి ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచి వారు లేచి వెళ్లిపోయారు. పీలేరులో తాగునీటి సమస్యను ఎంతచెప్పినా పరిష్కరించడం లేదంటూ స్థానికప్రజలు అధికారులను నిలదీశారు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో జరిగిన సభలో పింఛన్లు పంపిణీ చేయకుండా మొక్కుబడిగా సభను ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ఎంపీపీ, జడ్పీటీసీలను ప్రశ్నించడంతో సభ ఆగిపోయింది. శ్రీకాళహస్తి పట్టణంలో తొలిరోజు ఏడు వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాలను అధికారులు మొక్కుబడిగా నిర్వహించారు. మంత్రి వస్తున్నారంటూ ఉదయం 9 గంటలకే సభ అంటూ పింఛన్‌దారులతోపాటు గర్భవతులను సభల వద్దకు తరలించారు. 11 గంటలైనా మంత్రి రాకపోవడంతో అసహనానికి గురైన ప్రజలు అధికారులపై చిందులు తొక్కారు. మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. దీంతో కమిషనర్ జన్మభూమి ప్రారంభించారు. ఇంతలో మంత్రి వేరే వార్డులో ఉన్నారని తెలుసుకుని అర్థాంతరంగా కమిషనర్ మంత్రి వద్దకు పరుగులు పెట్టడంతో ప్రజలు చీవాట్లు పెట్టారు. జన్మభూమి సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య గొడవ జరిగింది. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండల కేంద్రంలో అధికారులు మొక్కుబడిగా జన్మభూమి నిర్వహించి అర్జీలు తీసుకుని వెళ్లిపోయారు. చిత్తూరురూరల్ ఆనగల్లులో జన్మభూమి సభ మొక్కుబడిగా సాగింది. సభకు వచ్చిన కొద్దిపాటి మహిళలు సైతం రుణమాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాలు ఇవ్వలేదంటూ నేతలను నిలదీశారు. -
రంగు పడుద్ది!
►అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగనున్న బదిలీలు ►వారికి నచ్చితే సరి.. లేదంటే మరో చోటుకు ►ఐదేళ్లు పూర్తి అయిన గెజిటెడ్ అధికారులకు జిల్లా మార్పిడి ►ఇతర ఉద్యోగులను సొంత మండలాల్లో వేయొద్దని ఆదేశం జడ్పీ ఉద్యోగులలో సందిగ్ధత ఇంతవరకు జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి బదిలీల పక్రియను జడ్పీ చెర్మైన్, జడ్పీ సీఈవోలు మాత్రమే నిర్వహించడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఇన్‌ఛార్జి మంత్రి చెర్మైన్‌గా ఏర్పడిన కమిటీ జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుందా.. లేక జడ్పీ చెర్మైన్, సీఈవోలే నిర్వహిస్తారా అన్న సందిగ్ధంలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా జీవోలో ఎలాంటి వివరాలు పొందుపరచలేదు. అందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి, కడప : అనుకున్నదొక్కటి.. అయ్యింది మరొకటి.. అన్నట్లు తయారైంది గెజిటెడ్ అధికారుల పరిస్థితి. కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుగుతాయనుకుంటే అధికార పార్టీ నేతలకు ప్రాబల్యాన్ని పెంచుతూ, ఇన్‌ఛార్జి మంత్రి సిఫార్సులకు పెద్ద పీట వేస్తూ.. మంత్రుల కనుసన్నల్లోనే బదిలీలు జరగాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గెజిటెడ్ అధికారులను సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అధికారులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. అవసరమైన మేరకే బదిలీలు నిర్వహిస్తామంటూనే.. అనుకూలమైన వారందరికీ కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చేలా పథక రచన చేశారు. ఈనెల 18 నుంచి 31 వరకు బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని ఆయా శాఖల్లో బదిలీకు సంబంధించిన జాబితాను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రెండేళ్లు పూర్తి అయిన వారికి బదిలీ లేకపోయినా.. ‘అవసరం మేరకు’ అనే కారణంతో తమకు కావాల్సిన వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెద్దపీట వేయనున్నారు. సరిపోకపోతే ఏదో ఒక కారణం చెప్పి మండలం దాటించే ప్రమాదం ఉందని ఎన్జీఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండేళ్లు పూర్తి అయిన వారు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. గెజిటెడ్ అధికారులకు ఝలక్.. ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన జీవో నెంబరు 57లో గెజిటెడ్ అధికారులకు కొంత షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు ఇది వర్తిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. బదిలీల జాబితాలో లేని గెజిటెడ్ అధికారులెవరైనా సొంత జిల్లాల్లో పనిచేస్తుంటే వారికీ బదిలీ తప్పదా.. లేక కనీస కాల పరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్జీఓలను సైతం సొంత మండలానికి కాకుండా ఇతర మండలాలకు బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు త్వరలో ఉత్తర్వులు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని శాఖలకు సంబంధించి బదిలీలను మినహాయించింది. ఆ శాఖలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొంది. ఎక్సైజ్, రవాణా, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, విద్య, మెడికల్ అండ్ హెల్త్ తదితర శాఖలకు సంబంధించిన బదిలీలు త్వరలో జరుపుకొనేలా ఆదేశాలు ప్రత్యేకంగా రానున్నాయి. -
పచ్చ కలెక్టర్
► అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదం ► వారు చెప్పిన చోటే అభివృద్ధి పనులు ► ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాల్లో పనులు నిల్ ► మంజూరైన పనులు సైతం రద్దుచేస్తున్న వైనం సాక్షి, చిత్తూరు : జిల్లాలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడడమేగాక వివక్షకు తావులేకుండా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాల్సిన జిల్లా కలెక్టరే.. వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ నేతలు సూచించిన నియోజకవర్గాలకు మాత్రమే పనులు మంజూ రు చేస్తూ ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతి నిధులు ఉన్నచోట పనులిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఒకవేళ పనులు మంజూరు చేసినా పచ్చపార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు చిటికెలో ఆ పనులను రాత్రికి రాత్రే రద్దుచేసి స్వామిభక్తిని చాటుకుంటున్నారు. కలెక్టర్ తీరును కిందిస్థాయి అధికారులే అసహ్యించుకునే పరిస్థితి దాపురించింది. పలమనేరు నియోజకవర్గంలో దాదాపు 20 చెరువులకు సంబంధించి రూ 1.18 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 13న ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసింది. పనులు ప్రారంభమయ్యాయి. ఇంతలో మార్చి 22న జిల్లా కలెక్టర్ ఆ పనులను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. పైగా ఆ నియోజకవర్గ పచ్చ చొక్కానేత ప్రతిపాదనలు, మంత్రి ఆదేశాల మేరకే పనులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. అంతటితో వదలక అధికార పార్టీ నేత ప్రతిపాదించిన గ్రామాల్లోనే పనులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదీ జిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలకు, కలెక్టర్ తీరుకు ఓ ఉదాహరణ. పలమనేరు శాసనసభ్యుడు అమరనాథరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ అత్యధిక పంచాయతీల్లోనూ ఆ పార్టీ సర్పంచులే ఉన్నారు. ఇంకేముంది కళ్లుకుట్టిన దేశం నేతలు హుకుం జారీచేయడంతో ఘనత వహించిన కలెక్టర్ రాత్రికి రాత్రే 20 చెరువు పనులను రద్దు చేశారు. దీంతో అమరనాధరెడ్డి ఆందోళనకు దిగారు. కలెక్టర్ తీరును తప్పబట్టారు. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఒక్క పలమనేరే కాదు నగరి, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పీలేరు, పూతలపట్టు... జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఒకవేళ తెలిసో తెలియకో ఒకటీ అరా పనులు మంజూరు చేసినా పచ్చచొక్కాల నేతల ఆదేశాల మేరకు వాటిని రద్దు చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు వివక్షపూరితంగా వ్యవహ రిస్తేనో.. తప్పు చేస్తేనో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుం టారు. పార్టీ అధికారిగాగాక ప్రభుత్వ అధికారిగా వ్యవహరిస్తారు. కిందిస్థాయి అధికారులను మందలించైనా సరే వీలైనంతవరకూ అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారిగాకాక అధికార పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న ఆ రోపణలున్నాయి. తాజాగా పలమనేరు చెరువు పనుల రద్దు వ్యవహారంతో ఈ విషయం తేటతెల్లమైందని వైఎస్సార్సీపీ శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదేమన్యాయమని ప్రశ్నించేందుకు వెళ్లినా జిల్లా కలెక్టర్ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులతో మాట్లాడేందుకు కూడా అంగీకరించడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకపక్క కరువు, చేసేందుకు పనులు లేవు. అందరికీ పనులు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు చెరువులను బాగుచేసుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి మైకులు పగిలేలా ఊదరగొడుతుండగా ఆయన సొంత జిల్లాలోనే అధికారపార్టీ నేతలు, అధికారులు కలిసి వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అభివృద్ధిపనులే కాదు కొత్త పించన్లు,రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు సైతం కలెక్టర్ విముఖత వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
అంతా మా ఇష్టం!
బొబ్బిలి :అధికారం మా చేతిలో ఉంది... మేం చెప్పిన వారికే పనులివ్వాలి... చేస్తే మా వాళ్లే చేయాలి..లేకపోతే అలాగే వదిలేయండి... ఇదీ మూడు నెలలుగా అధికార పార్టీ నాయకులు ఇరిగేషన్ అధికారులపై తెస్తున్న ఒత్తిడి. గత ఏడాదిలో వచ్చిన హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న వెంగళరాయ సాగర్ కాలువ మరమ్మతులకు అధికారులు సిద్ధమైతే.. అధికార పార్టీ నాయకులు మూడు నెలలుగా అడ్డుపడుతూనే ఉన్నారు. మరో మూడు నెలలు ఇలాగే కాలయాపన చేస్తే సాగర్ ద్వారా ఖరీఫ్‌కు సాగునీరు అందకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో అధికారులకు ఏమి చేయాలో తెలి యని స్థితిలో ఉన్నారు. బొబ్బిలి సబ్ డివిజన్లోని వెంగళరాయసాగర్ బొబ్బి లి, సీతానగరం మండలాల పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వా రా సుమారు 15 వేల ఎకరాల వరకూ సాగునీరు అందుతుం ది. గత ఏడాది అక్టోబరు నెలలో వచ్చిన హుద్‌హుద్ తు పాను వల్ల సాగర్ కాలువలకు గండ్లు పడడంతో పాటు ఆక్విడెక్టులు దెబ్బతిన్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 14 పనులను గుర్తించారు. వాటికి అంచనాలు తయారు చేసి దాదాపు రూ. 73 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రతిపాదనలు వెళ్లినా.. ప్రభుత్వం నిధుల మం జూరుకు మీనమేషాలు లెక్కించింది. చివరకు మూడు మా సాల కిందట బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు ఇరిగేషన్ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం బయట పడడంతో వెంటనే కలెక్టరుతో మాట్లా డి పనులకు మంజూరు తీసుకువచ్చారు. వీటిలో 37 లక్షల 50 వేల రూపాయల విలువ కలిగిన 5 పనులకు టెండర్లు కూడా ఆహ్వానించారు. మిగిలిన 9 పనులను నామినేటెడ్ పద్ధతిలో చేయాల్సి ఉంది. అయితే జనవరి నుంచి నామినేషన్ పద్ధతిలో కేటాయింపులు జరగడం లే దు. ఆయకట్టు సంఘాల్లో ఉండే వ్యవసాయదారుడు ఈ పనులు చేయడానికి అర్హులు. వారిని ఎంపిక చేసే బాధ్యత ఆప్రాంతంలో ఉన్న జన్మభూమి కమిటీపై ఉంది. ఎంపిక చేసిన రైతుకు ఆయకట్టులో పొలం ఉందని నిరూపిస్తూ వీఆర్ఓ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని ఉన్నా అధికార పార్టీ నా యకులు మాత్రం వారికి చెప్పిన వారికే పనులు ఇ వ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నీటిపారుదలశాఖ పైనా, పనులపైనా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి ఉండడంతో నిబంధనలకు అనుగుణంగా వెళతామని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో మూడు మాసాలుగా పనులు జరగక ఎక్కడవక్కడే ఉన్నాయి. ఆన్లైన్లో టెండర్లు చేయాల్సిన పనులు కూడా ఇప్పటికీ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. ఆన్లైన్లో పాల్గొన్న కాంట్రాక్టర్లు మాత్రం వాటిని దక్కించుకోనే పనిలో అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. మరో మూడు మాసాల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆ సమయానికి మరమ్మతులు పూర్తయితేనే కింది వరకూ నీరు వచ్చిన అవకాశం ఉంది. లేకపోతే వేలాది ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ ప్రాంత రైతులకు ప్రధా న నీటి వనరులు వెంగళరాయసాగర్ కాలువే. దానికి మరమ్మతుకు ప్రభుత్వం నిధులిచ్చినా నియోజకవర్గంలో రాజకీయాల వల్ల పనులు జరగడం లేదు. -
పేరు మహిళలది.. పెత్తనం నేతలది
సాక్షి, కర్నూలు : జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి రూ. 5 కోట్ల ఇసుక అమ్మకాలు జరిగాయి. పరిస్థితులు, అవసరాలు అంచనా వేస్తే ఇప్పటికే రూ. వంద కోట్ల వరకూ వ్యాపారం సాగాలి. వాస్తవానికి అనధికారికంగా అంత వ్యాపారమూ జరిగింది. వివిధ రాజకీయ నాయకుల ప్రమేయంతో అధిక మొత్తం ఇసుకను పక్కదారి పట్టించారు. అన్ని రీచ్‌లలో ఇసుక అమ్మకాలను నేతలు అంతా తామే అయి నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చి పెట్టేందుకు ప్రజాప్రతినిధులు తమవంతు పాత్ర పోషించాలి. అవసరమైన సలహాలు ఇవ్వాలి. లోపాలుంటే సరిదిద్దాలి. అధికారులకు సహకరించాలి. అయితే ఇసుక ఆదాయం విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి వీరిలో కొందరు ప్రజాప్రతినిధులే గండికొడుతున్నారు. తెరవెనుక ఉంటూ తమవంతు పాత్ర పోషిస్తుండగా.. నియోజకవర్గ స్థాయి నేతలు కొందరు వారికి వంత పాడుతున్నారు. దీంతో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. అడ్డుకుంటున్న అధికారులపై అధికారపార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అసభ్య పదజాలంతో బెదిరిస్తున్నారు. దీంతో కొందరు అధికారులు మౌనపాత్ర పోషించక తప్పడం లేదు. మరికొందరు అధికారులు మాత్రం నేతల అడుగులకు మడుగులొత్తుతూ అక్రమాలకు ఉడతాభక్తిగా సాయపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్న మహిళలు కేవలం పాత్రధారులు మిగిలిపోతుండగా స్థానిక నాయకులే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో 12 రీచ్‌లను డ్వాక్రా మహిళలకు అప్పగించారు. ఏ గ్రామంలోనైతే రీచ్ ఉందో ఆ ప్రాంతంలో చురుగ్గా ఉన్న మహిళలకుగాని, మండలం మొత్తం మీద ఉన్న మండల సమాఖ్యలో ఆసక్తి కలిగిన మహిళలకు గానీ రీచ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గతంలో ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించే వారు. ప్రభుత్వం ధర నిర్ణయిస్తే దానికంటే ఎంత ఎక్కువగా పాడితే వారికి ఆ రీచ్‌ను అప్పగించేవారు. రెండో సంవత్సరం అదే కాంట్రాక్టరు 20 శాతం అదనంగా చెల్లించి రీచ్‌లను నిర్వహించేవారు. ప్రభుత్వం మారాక ఈ విధానంలో మార్పు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వాస్తవానికి మహిళ సంఘాలకు అంత ఆర్థిక ప్రతిపత్తి లేదు. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అందుకు అనుకూలంగా వీరికి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు అప్పగించారు కానీ క్షేత్రస్థాయిలో వీరు నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశమే కనిపించడం లేదు. -
అధికార పార్టీ నేతల.. ఇంజినీ‘రింగ..రింగా’..!
ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదనను హైజాక్ చేసే యత్నం తమ పరిధిలో ఏర్పాటు చేయాలని అంబేద్కర్ వర్సిటీ విజ్ఞప్తి అందుబాటులో 21వ శతాబ్ది గురుకుల భవనాలు రూసా నిధుల మంజూరుకూ అవకాశం ఇవన్నీ కాదని టెక్కలి ప్రాంతంలో ప్రైవేట్‌రంగంలో ఏర్పాటుకు ఒత్తిడి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలన్న ప్రతిపాదన విషయంలో అధికార పార్టీ నేతల వైఖరి రెండు విధాలా నష్టం కలిగించేలా ఉంది. ఇంజినీరింగ్ కళాశాలను టెక్కలి ప్రాంతంలో ఏర్పాటు చేయించాలని కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వరంగంలో ఏర్పాటు కావాల్సిన కళాశాల ప్రైవేటురంగానికి మరలిపోతుంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్ష అభియాన్(రూసా) నిధులు మంజూరు కావు. అదే విధంగా ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సమీపంలో నిరుపయోగంగా ఉన్న 21 శతాబ్ది గురుకుల భవనాలు వినియోగంలోకి రాకుండాపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొన్నాళ్లుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దాన్ని వర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని అంబేద్కర్ వర్సిటీ అధికారులు ప్రభుత్వాన్ని ఇప్పటికే రాతపూర్వకంగా కోరారు. మరోవైపు జేఎన్టీయూ కూడా ఇంజినీరింగ్ కళాశాల నిర్వహణకు ముందుకొచ్చింది. ఈ రెండింటిలో ఏ ప్రతిపాదన ఆమోదం పొందినా ప్రభుత్వపరంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటవుతుంది. ప్రస్తుతం వృథాగా ఉన్న 21 శతాబ్ది గురకుల భవనాల్లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది అంబేద్కర్ వర్సిటీ అధికారుల ఆలోచన. అందుబాటులో గురుకుల భవనాలు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు 21 శతాబ్ది గురుకులాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీ పక్క నే 50 ఎకరాల స్థలంలో 8 బ్లాకులతో గురుకులానికి భవనాలు నిర్మించారు. అయితే గురుకులాలు ప్రారం భం కాకపోవడంతో మొదట్లో ఈ భవనాలను యూని వర్సిటీకి అప్పగించారు. కొన్నాళ్లు వాటిని వర్సిటీయే నిర్వహించేది. ఆ తర్వాత వీటిలో రాజీవ్ యువకిరణాలు పథకం కింద నిరుద్యోగులకు ఉపాధి శిక్షణలు నిర్వహించడం ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం గా ఈ భవనాలు వర్సిటీ పరిధి నుంచి జిల్లా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 2013 తర్వాత శిక్షణలు కూడా నిలిచిపోవడంతో భవనాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రతిపాదన వచ్చింది. గురుకుల భవనాలను తమకు అప్పగిస్తే తమ ఆధీనంలోనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, దీని వల్ల వసతి సమస్య తీరడంతోపాటు గురుకుల భవనాలు వినియోగంలోకి వస్తాయని, ఇంజినీరింగ్ కళాశాల వల్ల ఏడాదికి ఎలా లేదన్నా రూ.30 లక్షల వస్తుం దని.. అది వర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని బీఆర్‌ఏయూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నేతల వ్యూహాలు అయితే స్వార్థంతో ఆలోచిస్తున్న అధికార పార్టీ నేతలు ఈ ప్రయోజనాలన్నింటికీ గండికొట్టేలా పలాస-టెక్కలి మధ్య ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇందుకోసం భూ సేకరణకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ సంస్థలకు కళాశాల మంజూరు చేస్తే ‘రూసా’ నిధులు మం జూరయ్యే అవకాశం ఉండదు. పైగా విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందే రాయితీలు ఇతర సౌకర్యాలు అందకుండాపోతాయి. ప్రైవేట్ కళాశాలలో ఫీజుల భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ వర్సీటీకే ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలన్న డిమాండ్ విద్యార్థివర్గాల నుంచి పెరుగుతోంది. యూనివర్సిటీ పరిధిలోనే ఉండాలి గత చైర్మన్ కె.సి.రెడ్డి హయాంలో గురుకుల నిర్వహణ యూనివర్సిటీ పరిధిలోనే ఉండేది. తర్వాత ప్రభుత్వానికి అప్పగించారు. వర్సిటీ అనుబంధంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే దానికి గురుకుల భవనాలు ఉపయోగపడతాయి. దానివల్ల ఏడాదికి ఎలా లేదన్నా రూ.30 లక్షల ఆదాయం వస్తుంది. వర్సిటీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ఇంజినీరింగ్ కళాశాల ఉండాలన్నదే మా ప్రతిపాదన. ప్రభుత్వానికి కూడా నివేదించాం. కళాశాల మంజూరు విషయంలో నేతలు చొరవ చూపాలి. -హెచ్.లజపతిరాయ్, ఉప కులపతి, బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ -
ప్రజాప్రతినిధులే దళారులు..!
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాల్లో వారిదే పాత్ర సీఐడీ విచారణలో తేటతెల్లం ఆసిఫాబాద్‌లో పార్టీ నాయకులపై విచారణ 11 మంది నేతల అక్రమాలు వెలుగులోకి.. 16, 17న ఖానాపూర్, గిన్నెరలో విచారణ పలుకుబడి ఉపయోగించే పనిలో నాయకులు సాక్షి, మంచిర్యాల : అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి మరీ తమ అనుయాయులు.. బం ధువులకు అక్రమంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించిన ప్రజాప్రతినిధుల గుట్టురట్టవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై ఇప్పటికే బోగస్ లబ్ధిదారులు.. హౌసింగ్ క్షేత్రస్థాయి సిబ్బంది.. మండల స్థాయి అధికారులను ప్రశ్నించిన సీఐడీ అధికారులు వారి ఫిర్యాదు మేరకు ప్రజాప్రతినిధులు, నాయకులనూ విచారించే పనిలో పడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై తుది విచారణను త్వరితగతిన పూర్తిచేసేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పదకొండు మంది ప్రజాప్రతినిధులు, నాయకులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో వారిచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఖానాపూర్ మండలం తిమ్మాపూర్, ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతిని ధులను విచారించనున్నారు. సాధ్యమైనంత త్వరగా తొలి విడత విచారణ పూర్తి చేసి నెలాఖరులోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సీఐడీ డిఎస్పీ రవికుమార్ తెలిపారు. జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్, తిమ్మాపూర్ (ఖానాపూర్ మండలం), కిష్టాపూర్ (రెబ్బెన), గిన్నెర (ఇంద్రవెల్లి) గ్రామాల్లో సీఐడీ అధికారులు ఈ ఏడాది ఆగస్టులో ఇం దిరమ్మ ఇళ్ల అక్రమాలపై తొలి విడత విచారణ చేపట్టారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 109 మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించిన అధికారులు నవంబర్‌లో వారి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. అదే నెల 11న సీఐడీ వరంగల్ రీజినల్ కార్యాలయంలో 30 మంది అధికారులు, సిబ్బందిని విచారించారు. అధికారులిచ్చిన వివరణలో పలువురు ప్రజాప్రతినిధుల పేర్లూ ఉండడంతో వారినీ విచారిం చేందుకు అనుమతి తీసుకున్నారు. అర్హత లేకున్నా బం దుప్రీతితో తన వాళ్లకు ఇళ్లు మంజూరు చేయించుకున్న, బినామీ పేర్లతో ఇళ్లు మంజూరు చేయించుకుని వాటిని అమ్ముకున్న ప్రజాప్రతినిధులను విచారిస్తున్నారు. అక్రమార్కుల ‘రాజకీయం’ ఇందిరమ్మ ఇళ్ల అక్రమాల్లో ప్రజాప్రతినిధుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వీరిపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోనని జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉద్యోగులు, లబ్ధిదారులు, దళారుల అక్రమాలు రుజువైన నేపథ్యంలో అక్రమార్కులైన ప్రజాప్రతినిధులకూ శిక్ష పడాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే అక్రమాలకు పాల్పడ్డ ప్రజాప్రతినిధులు, నాయకులు సమస్య నుంచి గట్టెక్కేందుకు రాజకీయాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు నాయకులు, ప్రజాప్రతినిధులపై విచారణ చేపట్టకపోవడం.. తాజాగా ఒకే ప్రాంతంలో.. ఒకే గ్రామంలో చేపట్టిన విచారణలోనే 11 మంది అక్రమాలు వెలుగులోకి రావడంతో అక్రమార్కుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో తమను తాము కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలను ఆశ్రయించే పనిలో పడ్డారు. అక్రమార్కులు ఎంతటి వారైనా జైలు శిక్ష తప్పదని సంబంధిత అధికారులు చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఏ మేరకు సఫలీకృతమవుతుందోనని జిల్లా ప్రజలు వేచిచూస్తున్నారు. -
తవ్వినకొద్దీ అవినీతి!
పలాస, శ్రీకాకుళం పాతబస్టాండ్: తక్కువ రీచులకే అనుమతులు ఇవ్వడం.. ధర ఎక్కువగా నిర్ణయించడం.. మహిళా సంఘాల ముసుగులో అధికార పార్టీ నేతల దందాల కారణంగా జిల్లాలో ఇసుక అక్రమాలకు అంతులేకుండాపోతోంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటంతో పాటు తీరప్రాంతాలను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పర్యావరణానికీ ముప్పు ఏర్పడుతోంది. జిల్లాలో ప్రధా న నదులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ తీర ప్రాంతాల్లో ఇసుకాసురుల అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ‘సాక్షో’ పరిశీలనలో తేలింది. 13 రీచులకే అనుమతి జిల్లాలో మొత్తం 70 రీచ్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 13 రీచుల నిర్వహణకే ఇంతవరకు అనుమతి లభించింది ఒడిశా-ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న బల్లిమడ, సింగిడి, సోమరాజుపురం, కడుము, సిరుసువాడ ర్యాంపులకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. కాగా 13 రీచుల నిర్వహణకు డ్వాక్రా సంఘాలకు అప్పగించిన కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.675 ధర నిర్ణయించింది. ఇసుక కావలసిన వారు డీడీ తీసి మీసేవ కేంద్రంలో దాన్ని ఇచ్చి రసీదు పొందాలి. సంబంధిత రీచుల్లో దాన్ని చూపిస్తే ఇసుక సరఫరా చేస్తారు. రవాణాకు పంచాయతీ కార్యాలయంలో వే బిల్లు కూడా తీసుకోవాలి. ఇసుక ర్యాంపు వద్ద స్థానిక అధికారులతో పాటు కమిటీల పర్యవేక్షణలో డ్వాక్రా సంఘాల మహిళలు ఇసుక విక్రయాలు నిర్వహించాలని. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకే క్వారీ నిర్వహించాలని నిబంధనలు విధించారు. టీడీపీ నేతల హల్చల్ అయితే ఎక్కడా అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. అధికారులు వస్తున్నా ఏదో కొద్దిసేపు కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో డ్వాక్రా సంఘాల ముసుగులో ఉన్న తెలుగుదేశం నేతలు అడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహారం సాగుతోంది. పేరుకు మహిళా సంఘాలకు రీచులను అప్పగించినా, తెరవెనుక టీడీపీవారి పెత్తనమే సాగుతోంది. వారు అధికారులతో కుమ్మక్కై ఒకే వేబిల్లుతో నాలుగైదు ఇసుక లోడ్లు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తూరు మండలంలో ఈ దందా అంతా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఆ పార్టీ మండల కమిటీలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక నాయకుడికి ఇదే నిత్యకృత్యం. స్థానికుల వ్యతిరేకత కొన్ని చోట్ల ఇసుక తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటున్నారు. బూర్జ మండలం కాఖండ్యాం ఇసుక ర్యాంపును అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. జేసీ వివేకయాదవ్ కూ డా పరిశీలనకు వెళ్లారు. తమ ఇబ్బందులు తెలియజేస్తూ ఇక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని స్థానికు లు విజ్ఞప్తి చేశారు. నాగావళి నది బలహీనపడుతుంద ని, తెలుగుదేశం నాయకుల స్వలాభం కోసమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రీచుల్లో సామాన్య ప్రజలకు ఇసుక లభించడం లేదు. ప్రభుత్వ నిబంధనల కారణంగా ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి లభిస్తోంది. దీంతో టైరు, నాటుబళ్లతో ఇసుక అమ్ముకు నే చిన్నా చితకా వ్యాపారులు ఉపాధి కోల్పోతున్నారు. అడ్డదారుల్లో రవాణా తక్కువ రీచులకు అనుమతి లభించడం, తీర ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో అనేక చోట్ల నదీ గర్భాల్లోని ఇసుకను వ్యాపారులు అక్రమంగా తవ్వి భూగర్భ జలాలకు నష్టం కలిగిస్తున్నారు. మహేంద్రతనయ పర్వతాల నుంచి ఒడిశా సరిహద్దులోని భామిని, కొత్తూరు, పాతపట్నం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాల్లోని వివిధ గెడ్డలు, మహేంద్రతనయ పాయల నుంచి అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. వంశధార, నాగావళి తీరప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించడానికి సుమారు 40 రీచ్‌లకు సమీపంలో తీరంలో అధికారులు కందకాలు తవ్వించారు. అక్కడ ప్రభుత్వ సిబ్బందిని కమిటీలుగా వేసి కాపలా పెట్టారు. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. అనుమతులున్నచోట బహిరంగంగానే అక్రమాలు జరుగుతుండగా.. లేనిచోట దొంగచాటుగా జరుగుతున్నాయి. అధికార రేటుకు మించి.. అవసరమైనంత ఇసుక లభించని పరిస్థితుల్లో వ్యాపారులు రేట్లను అమాంతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం లారీ(సుమారు 12 క్యూబిక్ మీటర్లు) ఇసుకను రూ.15 వేలకు అమ్ముతున్నారు. ప్రభుత్వానికి మాత్రం రూ.8,100 చెల్లిస్తున్నారు. అయితే రవా ణా ఖర్చులు, డ్రైవర్ బేటా, ఇతర ఖర్చులు సుమారు రూ.5 వేలు అవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో లారీ ఇసుక సుమారు రూ.8 వేలు ఉండగా, ఇప్పుడది దాదాపు రెట్టింపు కావడంతో నిర్మాణాలు నిలిచిపోయి, తమకు పనులు లేకుండాపోతున్నాయని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల బడా కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులే లబ్ధి పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై డీఆర్డీఎ ఏపీడీ(లాండ్) జి.సుజాత‘సాక్షి’తో మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే అంతా జరుగుతుందని, ఎక్కడా అవకతవకలు లేవన్నారు. -
ఇష్టారాజ్యంగా టీచర్ల బదిలీలు
నెల్లూరు(విద్య): రాజకీయ పలుకుబడి.. ఆర్థిక బలంతో జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు ఇష్టారాజ్యంగా జరిగాయి. ప్రభుత్వం నేరుగా బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా అధికారపార్టీ నేతల ప్రమేయంతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి టీచర్లు అనుకున్న ప్రాంతాలకు నేరుగా బదిలీ చేయించుకున్నారు. ఈ మేరకు సోమవారం బదిలీల ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరాయి. బదిలీ అయిన వారిలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు, 10 మంది ఎస్ఏలు , ఒక ఎల్పీ, తొమ్మిది మంది ఎస్జీటీలున్నారు. మొత్తం 22 మంది టీచర్లు తామనుకున్న పాఠశాలలకు బదిలీలు చేయించుకున్నారు. డీఈఓ కార్యాలయానికి సంబంధం లేకుండానే నేరుగా విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈ బదిలీలో ఒకే ప్రాంతానికి ఇద్దరిని బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతమందికి ఖాళీలు లేని పాఠశాలల్లో పోస్టింగ్‌లు ఇచ్చారని తెలుస్తోంది. కొన్ని బదిలీల్లో సబ్జెక్టును నమోదు చేయకుండా ఉత్తర్వులు అందాయని సమాచారం. కార్యాలయంతో సంబంధం లేకుండా, ఖాళీలను చూసుకోకుండా నేరుగా ప్రభుత్వ బదిలీల వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. రాజకీయ రంగు విద్యారంగానికి కూడా పులుముకుంది. ఇప్పటికే జిల్లాలో ఏఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో ఖచ్చితంగా తేలని పరిస్థితి. ఈ రాజకీయ బదిలీలవల్ల పూర్తిగా ఆయోమయ పరిస్థితిలోకి విద్యాశాఖ వెళ్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారు 100 మంది ఇలానే ప్రభుత్వం నేరుగా బదిలీ చేసింది. 9 నెలలు గడవకముందే మళ్లీ ప్రభుత్వ బదిలీలు అన్యాయమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడి రిటైర్మెంట్ దగ్గరకొచ్చిన వారికి దక్కాల్సిన స్థానాలు దక్కడంలేదని, డబ్బుతో, రాజకీయ పలుకుబడితో కొందరు నేరుగా బదిలీల ఉత్తర్వులు తెచ్చుకోవడం దారుణమని అర్హులైన ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. ఈ ఉత్తర్వుల ప్రభావం టెట్, టీఆర్టీ (డీఎస్సీ)పై పడనుంది. జిల్లాలో భర్తీ చేయనున్న 416 పోస్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అటు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కొత్త ఉద్యోగాల్లో చేరబోయే వారికి ఈ రాజకీయ బదిలీలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఉపాధ్యాయవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. -
ఎక్కడైనా.. మేమే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాదేదీ దందాకు అనర్హం అనే రీతిలో అధికారపార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ఇటు ఇసుక, అటు మైనింగ్‌తో పాటు అధికారుల పోస్టింగుల్లోనూ తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఇదేదో ప్రతిపక్షాలు చేసిన విమర్శలు కాదు. జిల్లాలో అన్ని అక్రమాల్లో అధికారపార్టీ నేతల హస్తం ఉందని స్వయంగా స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు నిగ్గుతేల్చిన నిజాలు. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు కొద్దిరోజుల క్రితం అధికారికంగా ఒక నివేదికను సమర్పించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అధికారపార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుతో అటు అధికారుల్లో... ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కూడా ఈ నివేదికలో ఎస్బీ అధికారులు స్పష్టం చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొత్తం అక్రమాల వెనుక ఉన్న అధికార పార్టీ ‘పెద్ద’లు, వారి అన్నదమ్ముళ్ల గురించి కూడా నివేదికలో పేర్కొన్నట్టు ఈ వర్గాలు వివరించాయి. అయితే, ఇంత స్పష్టంగా నివేదికలు ఉన్నప్పటికీ జిల్లాలోని నేతలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు జంకుతుండటం గమనార్హం. మైనింగ్‌లో మజా చేస్తున్నారు...! జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో కింది నుంచి పైస్థాయి వరకూ అధికారపార్టీ నేతలే ఉన్నారు. ప్రధానంగా డోన్, బనగానపల్లె, వెల్దుర్తి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ భారీగా జరుగుతోందని ఎస్బీ తన నివేదికలో పేర్కొంది. ఈ అక్రమ మైనింగ్ వెనుకా, ముందు కూడా టీడీపీ నేతలే ఉన్నారని.. సక్రమంగా మైనింగ్ జరుగుతున్న కంపెనీల నుంచి కూడా భారీగా వసూలు చేస్తున్నారని ఈ నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారని.. సర్వే నెంబరు వివరాలతో సహా ఈ నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి అన్ని అనుమతులు ఉన్న కంపెనీల నుంచి టన్నుకు రూ.250 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. లేనిపక్షంగా మైనింగ్ జరపకుండా అడ్డుకున్నారన్న విమర్శలున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందని తాజాగా ఎస్బీ నివేదిక తేటతెల్లం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అక్రమ మైనింగ్‌లో పోలీసుల పాత్ర ఉందని కూడా ఎస్బీ నివేదికలో పేర్కొనడం ఆ వర్గాల్లో గుబులు రేపుతోంది. నెలవారీ మామూళ్లు తీసుకుని అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని...మామూళ్లు ఇవ్వకపోతేనే వాహనాలను సీజ్ చేస్తున్నారని వివరించింది. ఇసుక దందాలోనూ వీరిదే పైచేయి...! ‘జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇసుక దందాలోనూ తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. అనుమతులు లేకుండానే ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. కర్నూలు నుంచి ప్రతీ రోజూ హైదరాబాద్‌కు ఇసుక తరలిపోతోంది. ఈ మొత్తం దందాలో ప్రభుత్వంలో ఉన్న పెద్దల హస్తం కూడా ఉంది. అక్రమంగా తవ్విన ఇసుకను గుట్టలుగుట్టలుగా పోసి నిల్వ ఉంచుకున్నారు’ అని ఎస్బీ తన నివేదికలో పేర్కొంది. చివరకు ఇసుక తవ్వకాలు ప్రభుత్వమే మహిళా సంఘాల ద్వారా చేపట్టే సరికి ఇసుకే లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి పంపిన నివేదికలో విజిలెన్స్‌శాఖ కూడా స్పష్టం చేయడం గమనార్హం. పోస్టింగుల్లోనూ వసూల్ రాజాలు! అటు ఇసుక, ఇటు మైనింగ్ అక్రమాలతో ఆగకుండా అధికారుల పోస్టింగులపైనా అధికారపార్టీ నేతల కన్ను పడింది. అధికారుల పోస్టింగులోనూ భారీగా డబ్బు చేతులు మారుతోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా జిల్లావ్యాప్తంగా జరిగిన అధికారుల బదిలీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న విమర్శలున్నాయి. ఆర్డీవో పోస్టులకు రూ. 35 లక్షల మేరకు వసూలు చేశారని తెలుస్తోంది. ఎమ్మార్వో పోస్టులకు రూ.10 లక్షల మేరకు వసూలు చేశారని, డీఎస్పీ పోస్టులకు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)తో పాటు స్వయంగా సీఎంకు చేరాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా అక్రమంగా చెలరేగుతున్న జిల్లాలోని అధికారపార్టీ నేతలకు కనీసం హెచ్చరించిన దాఖలాలు కూడా లేమ. ఇదే అదనుగా భావించి తెలుగు తమ్ముళ్లు మరింత చెలరేగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇదే బదిలీల లక్షణం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ప్రభుత్వ సిబ్బంది బదిలీల ప్రక్రియ ప్రహసనంగా సాగుతోంది. పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న ఈ తంతు కొందరు నేతలకు కాసులు కురిపిస్తుండగా.. మరోవైపు పనిలో పనిగా కుల, ప్రాంత సమీకరణలు, కక్ష సాధింపు చర్యలకూ బదిలీలను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. చోటామోటా నేతలు కూడా బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పదేళ్ల తర్వాత అధికారం రుచి చూస్తున్న టీడీపీ నేతలు జిల్లాలో పూర్తి పట్టు సాధించాలన్న ధ్యేయంతో తమకు అనుకూలంగా ఉన్నవారికి పోస్టింగులు ఇప్పించుకునేందుకు కుల సమీకరణలకు తెర తీస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రితో పాటు పొరుగు జిల్లాల నేతల పలుకుబడినీ ఉపయోగించుకుంటున్నారు. నేతలకు ఇచ్చే బదులు తమ ఉన్నతాధికారులకే అంతో ఇంతో ముట్టజెబితే పని అవుతుందన్న ఉద్దేశంతో ఉద్యోగులున్నా ఈ విషయంలో తమదే పూర్తి అధికారం అన్నట్లు అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. స్థానికంగా అనుకూల ఉద్యోగులు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. కీలకమైన పంచాయతీరాజ్, నీటిపారుదల, జిల్లాపరిషత్, పోలీస్ శాఖల బదిలీల విషయంలో పోస్టును బట్టి రేటు కట్టేసి దండుకుంటున్నారు. జెడ్పీలో దీర్ఘకాలంగా పని చేస్తున్న ఓ ఇంజినీర్ తనను ఇక్కడే కొనసాగించాలంటూ నేతలను ఆశ్రయించారని సమాచారం. ఇందుకు వారికి భారీగానే ముట్టజెప్పారని తెలిసింఇ. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ స్థాయి బదిలీలకు కూడా టీడీపీ నేతలు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కక్ష సాధింపులకూ ఇదే సమయం గత ప్రభుత్వ హయాంలో తమకు పనులు చేయని, ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై పనిలోపనిగా బదిలీ వేటు వేయించాలని నేతలు ఉబలాటపడుతుఆన్నరు. బదిలీలన్నీ పారదర్శకంగా జరుగుతాయని బయటకు చెబుతున్నా అంతర్గతంగా జరిగాల్సిందంతా జరిగిపోతోంది. ప్రభుత్వం అధికారికంగా సోమవారం వనమహోత్సవం నిర్వహించినా చాలా మంది నేతలు గైర్హాజరై విశాఖలో ఉన్న సీఎం, మంత్రులు వద్దకు బదిలీల చిట్టాలు పట్టుకెళ్లారని తెలిసింది. రెవెన్యూ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది మంత్రి ఓఎస్డీ తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం కక్ష సాధింపులు ఏస్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది. కుల సమీకరణలకూ ఇదే అదను పనిలో పనిగా కులసమీకరణలకూ నాయకులు తెరతీశారు. శ్రీకాకుళం, టెక్కలి ప్రాంతాలకు వెలమ సామాజికవర్గ అధికారులు, సిబ్బందిని, ఆమదాలవలస, జిల్లాపరిషత్, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాలకు కాళింగ సామాజిక వర్గానికి చెందిన సిబ్బందిని తెప్పించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. గతంలో ఓ మంత్రికి అనుకూలంగా ఉన్న ఒక ఇంజినీర్‌ను ఇక్కడ నుంచి తప్పించే మార్గాలు మూసుకుపోవడంతో, స్థానిక నేతలు పొరుగు జిల్లా నేతలను ఆశ్రయించారని తెలిసింది. జెడ్పీలోని మరో అధికారి విజయనగరం జిల్లా ఎమ్మెల్యే సహా ఆయన బంధువులను ఆశ్రయించి కావాల్సిన పోస్టింగ్‌కు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇక పోలీస్‌శాఖలో బదిలీలకు మంత్రి బంధువులను రంగంలోకి దింపారని తెలుస్తోంది. మంత్రి సోదరుడు కూడా ఇదే శాఖలో పనిచేస్తుండడంతో ఆయన ద్వారా పనులు చక్కబెట్టుకునేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. తమకు జూనియర్‌గా ఉన్న వ్యక్తితో బదిలీల పైరవీలు చేయించుకునేందుకు సిద్ధంగా లేమని బాహటంగానే చెబుతున్నట్టు సమాచారం. మంత్రి బంధువులు కూడా ఇది సరి కాదంటూ నేతలకు సర్ది చెబుతున్నట్టు తెలిసింది. మొత్తానికి బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదన్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలకూ, ఇక్కడి నేతల నిర్వాకానికి పొంతన కుదరడం లేదు. -
‘తాండవ’ గుండెకు తూట్లు
వేలాది ఎకరాలకు నీరందించే తాండవ గుండెకు ‘పచ్చదళం’ కోత పెడుతోంది. అర్థబలం, అంగబలం ఉందనే తెగింపుతో పగలు, రాత్రి తేడా లేకుండా నది నడుమ ఇసుకను తవ్వి లక్షలు గడిస్తున్నారు. ఆయకట్టు రైతులను నట్టేట ముంచేస్తున్నారు. ఒడ్డునున్న శ్మశానవాటిక నదిలో కలిసిపోతుందని తెలిసినా వారికి ఖాతరే లేదు. పంచాయతీల నుంచి ఒక రశీదు తీసుకుని, దాని మాటునే పది, పదిహేను ట్రాక్టర్ల ఇసుక తవ్వుకుపోతున్నారని తెలిసినా అధికారులు చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు. * యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు * ఒక రశీదు మాటున పదుల ట్రాక్టర్ల తరలింపు * అండగా నిలుస్తున్న అధికార పార్టీ నాయకులు * రోజూ లక్షలు దండుకుంటున్న తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ : యాభై వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ నది విశాఖ జిల్లానాతవరం నుంచి మొదలై తుని మీదుగా పెంటకోట వరకూ ప్రవహిస్తోంది. ఆ నది పరీవాహక ప్రాంతం ఇప్పుడు తెలుగుతమ్ముళ్లకు, వారి అనుచరులకు లక్షలు కురిపిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా తాండవలో ఇసుక తవ్వేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక తవ్వుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు అనుమతి ఇవ్వాలి. అదీ ఒక లబ్ధిదారుడికి ఒక ట్రాక్టర్ ఇసుక మాత్రమే. ఇంటి నిర్మాణం జరుగుతున్నట్టు గృహనిర్మాణశాఖ నుంచి అనుమతి పత్రం చూపి, రూ.120 జమచేస్తే పంచాయతీ నుంచి రశీదు ఇస్తారు. ఆ అనుమతి కూడా రెండు రోజులకు ఒకటి వంతున ఇంటి నిర్మాణానికి అవసరమైన మేరకు మాత్రమే విడుదల చేయాలి. కేవలం నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల కోసం ఈ వెసులుబాటు ఇచ్చారు. అది కూడా తాండవ నదీ గర్భంలో 3 నుంచి 4 మీటర్లు ఉండాలి. అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటే ఇసుక తీయకూడదనేది నిబంధన. కానీ ఆ నిబంధనలను తోసిరాజంటూ యథేచ్ఛగాా తవ్వకాలు జరిపించేస్తున్నారు. తెలుగుతమ్ముళ్ల బినామీలే.. తుని, కోటనందూరు మండల్లో తెలుగుతమ్ముళ్లు, వారి పేరుతో బినామీల కనుసన్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. పైసా పెట్టుబడి లేకుండా ఇసుక అడ్డగోలు రవాణాతో లక్షలు వెనకేసుకుంటున్నారు. విశాఖ జిల్లా నాతవరం నుంచి పాయకరావుపేట మండలం పెంటకోట వరకు తాండవ సుమారు 36 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. జిల్లా పరిధిలోకి వచ్చే అల్లిపూడి, కోటనందూరు, కేఓ అగ్రహారం, డి.పోలవరం, బొద్దవరం, కొలిమేరు, నందివంపు, మరువాడ, రేఖవానిపాలెం, కుమ్మరిలోవ, ఉప్పరగూడెం, రామభద్రపురం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వడం వల్ల నది ప్రవాహ గమనం మారి విలువైన పంటభూములు కోతకు గురవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం గోదావరి, కృష్ణావంటి జీవనదుల్లోనే ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. కానీ ఇక్కడ ఏ విధమైన అనుమతులు లేకుండానే యంత్రాలతో ఇసుక దర్జాగా తవ్వుకుపోతున్నారు. కాగా ఇసుకలపేటకు సమీపాన రోటరీ రూ.అరకోటి వెచ్చించి నిర్మించిన హిందూ శ్మశాన వాటిక ఇసుక తవ్వేస్తుండటంతో కిందకు దిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 1500 ట్రాక్టర్లకు పైమాటే.. ఇంటి నిర్మాణం పేరుతో ఒక ట్రాక్టర్ ఇసుక కోసం రూ.133, ఎడ్లబండికి రూ.46 చెల్లించి పంచాయతీల నుంచి రశీదు తీసుకుంటున్నారు. అధికారికంగా ఒకటి, రెండు రశీదులు తీసుకుంటున్న అక్రమార్కులు వాటిపైనే 10 నుంచి 25 లోడులను తరలించుకుపోయి దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.133 చెల్లిస్తున్న అక్రమార్కులు మార్కెట్లో రూ.1000కు విక్రయిస్తున్నారు. తాండవ పరీవాహక ప్రాంతంలో రోజూ 1500 ట్రాక్టర్ల పైబడే ఇసుకను తరలించుకుపోతున్నట్టు అంచనా. ఎడ్లబళ్లకు అయితే లెక్కేలేదంటున్నారు. మొత్తం మీద రోజుకు రూ.15 లక్షల చొప్పున అంటే నెలకు నాలుగున్నర కోట్లు తెలుగుతమ్ముళ్లు నొక్కేస్తున్నారు. తునిమండలంలో అధికారపక్షానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, కోటనందూరు మండలంలో ఒక ప్రజాప్రతినిధి ఇసుక అక్రమ తవ్వకంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. మండల రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా కొంత వాటా ముట్టచెప్పడం, ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డూఅదుపూ లేదు. అడపాదడపా గనులశాఖ అధికారులు దాడులు నిర్వహించినా మొక్కుబడి కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు. ఈ విషయమై తుని ఇన్చార్జి ఎంపీడీఓ శేషారత్నంను వివరణ కోరగా ట్రాక్టర్‌కు రూ.133 వంతున, ఎడ్లబండికి రూ.46 వంతున జమ చేసుకుని వే బిల్లు ఇచ్చిన తరువాతే ఇసుక తరలించేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. అనధికారికంగా ఇసుక తరలించే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
అధికార పార్టీ అండ ఉంటే..
బొబ్బిలి రూరల్: నాయకుడి అండ ఉండి..మనోడు అని నాయకుడు భావిస్తే ఎలాంటి నిబంధనలూ వర్తించవు. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలున్న ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్‌ను పునర్నియమించారు. మండలంలోని కోమటపల్లిలో వడ్డివెంకటరమణ అనే గ్రామీణఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ గతంలోఅనేక అవకతవకలకు పాల్పడ్డాడు. కోమటపల్లి-లింగంవలస పంచాయతీరాజ్ రోడ్డు పనుల్లో ఇతరుల పేరిట బిల్లులు స్వాహాచేశారనే ఆరోపణలతో 2014 మార్చి 4న విధుల్లో నుంచి తొల గించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వెంకట రమణ తన ప్రయత్నాలను ప్రారంభించారు. చోటామోటా నాయకులను పట్టుకుని తన పని సాధించాడు. మళ్లీ తన ఉద్యోగం పొందాడు. ఈ ఏడాది ఆగస్టు 6న వెంకటరమణ రూ.7,500 అపరాధ రుసుము చెల్లించినందున ఆతనిని తిరిగి నియమిస్తున్నట్లు డ్వామా పీడీ గోవిందరాజులు నుంచి ఈనెల 10వతేదీన ఏపీఓ కె.కేశవరావుకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సోమవారం నుంచి వెంకటరమణ విధుల్లో చేరారు. ఒక్కొక్కరికి ఒక్కోరూలా? సోషల్ ఆడిట్లో రూ.3,600 స్కాం రుజువైందని రంగరాయపురం ఫీల్డు అసిస్టెంట్ గేదెల శ్రీనివాసరావును ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలగించారు. నిజానికి సోషల్ ఆడిట్లో ఆరోపణలు వస్తే రికవరీ చేసి నిబంధనల మేరకు కొనసాగిస్తారు. అయితే శ్రీనివాసరావు సోదరుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నందునే కక్షసాధింపుగా ప్రభుత్వం తొలగించిందని, కోమట పల్లి ఫీల్డు అసిస్టెంట్‌కు ఒక రూలు రంగరాయపురం ఫీల్డ్ అసిస్టెంట్‌కు మరో రూలా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఖద్దరు చుట్టూ ‘ఖాకీ’ చక్కర్లు..!
కామారెడ్డి : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ పాత్ర కీలకమైనది. అందరి దృష్టి ఖాకీలపైనే ఉంటుంది. ప్రభుత్వంలో పోలీసు శాఖ ఎంత ముఖ్యమైనదైనప్పటికీ నేతల కనుసన్నల్లోనే మెలగాల్సిందే. దీంతో ఖద్దరుకు ఖాకీ సెల్యూట్ చేయాల్సిందే. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలతో పోలీసులకు మరింత అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అధికార పార్టీ నేతలు తమకు అనుకూలురైన అధికారులకు పోస్టింగులు ఇప్పించుకోవాలని చూడడం మామూలే. అందుకు తగ్గట్టుగానే అధికారులు కూడా తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతలను ఆశ్రయిస్తుంటారు. ప్రభుత్వం మారడంతో... తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో అన్ని విభాగాల్లో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. ఐపీఎస్, ఐఎఎస్ అధికారుల బదిలీలు పూర్తయిన వెంటనే, కిందిస్థాయి అధికారుల బదిలీలు జరుగుతాయన్న ఉద్దేశంతో బదిలీలు, పోస్టింగుల కోసం అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో బదిలీల పైరవీలు జోరుగా సాగుతున్నట్టు తెలిసింది. జిల్లాలో డీఎస్పీలు, సీఐల పోస్టింగుల విషయంలో చాలామంది అధికారులు అధికార పార్టీ నేతల వద్ద పైరవీలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు అప్పటి పాలకులకు అనుకూలురన్న ముద్రను మూటగట్టుకున్న అధికారులను బదిలీ చేస్తారన్న ప్రచారం జరగడంతో, కొందరు అధికారులు ప్రస్తుత అధికార పార్టీ నేతలను ఆశ్రయించి తమను కొంతకాలం కదపవద్దని వేడుకుంటున్నారు. మరికొందరు తమకు బదిలీ తప్పదన్న బావనతో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు చెందిన నేతల వద్దకు వెళ్లి తమకు పోస్టింగు ఇప్పించమని కోరుతున్నట్టు తెలిసింది. ఇతర జిల్లాల నుంచి... కాగా జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు సీఐలు ఇక్కడ పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతలను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాలో పనిచేసిన వెళ్లి ఓ డీఎస్పీ పదోన్నతిపై ఇదే జిల్లాకు అదనపు ఎస్పీగా రావచ్చని భావిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో, సదరు అధికారికి పోస్టింగు దక్కవచ్చంటున్నారు. అలాగే జిల్లాలోని మిగత సబ్ డివిజన్లు, సర్కిళ్లలో పనిచేస్తున్న అధికారుల బదిలీలు జరిగే అవకాశాలున్నట్టు తెలిసింది. త్వరలోనే డీఎస్పీల బదిలీలు ఉంటాయని, తరువాత సీఐల బదిలీలు జరుగవచ్చని పోలీసు వర్గాల సమాచారం. అయితే ఇప్పటికే డీఎస్పీ పోస్టింగుల కోసం పైరవీలు చేసి అధికార పార్టీ నేతల ఆశీస్సులు పొందిన వారు, ఆదేశాలు వెలుబడగానే వచ్చి జాయిన్ అవుతారని తెలిసింది. అలాగే సీఐలు కూడా బదిలీల జాతర ఎప్పుడు మొదలవుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు సీఐలు పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతల నుంచి ఆశీర్వాదం పొందారని సమాచారం. అధికారుల బదిలీలతో తమ సత్తా చాటుకోవాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో తాము ప్రజాప్రతినిధులుగా ఉన్నా అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యతనిచ్చారని పలువురు ప్రజాప్రతినిధులు సదరు అధికారులపై గుర్రుగా ఉన్నారు. తమ ప్రభుత్వం రావడంతో వారిని బదిలీ చేయించి, తమకు అనుకూలమైన వారిని తెచ్చుకోవడం ద్వారా తమ పంతం నెగ్గించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. -
‘వంట’ ఏజెన్సీలపై తమ్ముళ్ల కన్ను!
కొలిమిగుండ్ల: మధ్యాహ్న భోజన పథకంపై అధికారపార్టీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజెన్సీలుగా తమ వాళ్లే ఉండాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..స్థానిక జెడ్పీ ఉన్నత, మోడల్ స్కూల్‌తో పాటు ప్రాథమిక మెయిన్, బీసీ, ఎస్సీ ప్రాథమిక పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా గ్రామైక్య సంఘాల మహిళలు మధ్నాహ్న భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా వీరు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక ఆ పార్టీనాయకులు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న వంట ఏజెన్సీలను తొలగించి తమవారికి అవకాశం కల్పించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరికొందరు రెండు రోజులుగా గ్రామాల్లో కలియ తిరుగుతూ ఇతరులు వంట చేస్తున్నారని, నిర్వహణ సరిగా లేదని విద్యార్థులతో గుట్టుచ ప్పుడు కాకుండా సంతకాలు సేకరిస్తున్నారు. తర్వాత ఈసంతకాలు, ఫిర్యాదులతో ఎంఈవోను కలిసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇటిక్యాల డిపెప్ ప్రాథమిక పాఠశాలలో టీడీపీ వర్గీయులకు చెందిన ఓ మహిళ ఏకంగా ఇంటి వద్దనే వంట చేసి తీసుకెళ్లి పాఠశాలలో విద్యార్థులకు వడ్డించింది. ఈమెకు ఎవరూ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించలేదు. ఇదే విషయాన్ని అదే పాఠశాలలో ఐదేళ్లుగా వంట తయారు చేస్తున్న నిర్వాహకురాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తనకు తెలియజేయకుండా మరొకరికి ఏజెన్సీ ఎప్పుడు అప్పగించారని ప్రశ్నించింది. ఖంగుతున్న అధికారులు విచారించి ఐదేళ్లుగా కొనసాగుతున్న నిర్వాహకురాలికే బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం వివిధ గ్రామాలకు చెందిన వంట ఏజెన్సీలు ఇన్చార్జి తహశీల్దార్‌తో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులను కలిశారు. కారణం లేకుండా తమను తొలగించరాదని, మధ్యాహ్నభోజన పథకంలో రాజకీయ జోక్యం తగ్గించాలని వారు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. -
ఓట్లు..కోట్లు..!
సాక్షి, గుంటూరు: ఎన్నికల కాలం వచ్చేసింది. కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. అధికారపార్టీ నేతలు ఓటర్లకు గాలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల మనుగడ కష్టమని తేలిపోవడంతో ఆయా పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో డీలాపడిపోయారు. వ్యక్తిగత ఇమేజ్‌తో ఓటర్లను ఆకర్షించే ‘దురాలోచన’ చేస్తున్నారు. దీని కోసం మద్యం దుకాణాలను ఎంచుకుంటున్నారు. వీధివీధినా బెల్టు దుకాణాల ఏర్పాటుకుకసరత్తు చేస్తున్నారు. ఇలాగైతే డబ్బుతోపాటు నలుగురీనీ ఆకట్టుకోవచ్చనే పన్నాగం పన్నుతున్నారు. రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్ శాఖ నుంచి సమకూరే ఆదాయంలో జిల్లాది అగ్రస్థానం. జిల్లా వ్యాప్తంగా 342 వైన్ దుకాణాలు, 180 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు రూ.కోటి విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది. దుకాణాల లెసైన్స్ గడువు కొద్దినెలల్లో ముగియనున్నది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలు పెంచి ఓ పక్క రూ.కోట్లు మరో వైపు ఓట్లు సంపాదించాలనే ప్రయత్నంలో వున్నారు. ఇప్పటికే ప్రాంతాలవారీగా కాంగ్రెస్, టీడీపీ నేతలు మద్యం సిండికేట్లతో ములాఖత్ అయినట్లు సమాచారం. మద్యం నిల్వలను బెల్టుదుకాణాలకు తరలించి విక్రయించాలని, అమ్మకాల్లో పర్సంటేజీ ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, దాచేపల్లి, నరసరావుపేట, వినుకొండ, రాజుపాలెం తదితర చోట్ల కిందటినెల నుంచే బెల్టు దుకాణాలు విస్తరించాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ నెలాఖరు నుంచి నేతల కనుసన్నల్లో బెల్టుదుకాణాలు నడపనున్నట్టు తెలిసింది. సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల కార్యకర్తలకు బెల్టుదుకాణాలు అప్పగిస్తూ నేతలు పెట్టుబడులు పెడుతున్నారని తెలిసింది. తద్వారా ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్నది నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఎమ్మార్పీ ఉల్లంఘనతో లాభాలు లెసైన్స్డ్ దుకాణాల్లో ప్రముఖ బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉండటం లేదు. సమీప బెల్టుదుకాణాల్లో ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో క్వార్టర్‌పై రూ.10 చొప్పున ధర పెంచి అమ్ముతున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా లెసైన్స్డ్ దుకాణాలు కాకుండా అనధికారికంగా సుమారు నాలుగువేల బెల్టుదుకాణాలు నడుస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల కిందట జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గుంటూరు, నరసరావుపేట, తెనాలి ఈఎస్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ డీసీ కుళ్లాయప్ప ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్టుదుకాణాల విస్తరణపై మండిపడ్డారు. ఓట్లవేటతో పాటు డబ్బు సంపాదనకు బెల్టుదుకాణాల విస్తరణను మార్గంగా ఉపయోగించుకోవడంపై అధికారపార్టీ నేతలపై మహిళలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలతో బెల్టుదుకాణాలు ఏర్పాటు చేయించడంపై చర్చకు తెరలేచింది. -
కబ్జాకోరల్లో రూ.10 కోట్ల స్థలం!
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపూలేకుండాపోతోంది. వారు చెప్పిందే న్యాయం.. వారు చేసిందే చట్టం అన్నట్టుగా అధికార యంత్రాంగం తల ఊపుతుండడంతో అంతా వారి ఇష్టారాజ్యమైపోరయింది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం ఉండడంతో దీపం ఉండగానే ఖాళీ జాగాలో పాగా వేయాలన్న చందంగా పట్టణంలో కనిపించిన ప్రతి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. తాజాగా సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంపై కొందరు కన్నేశారు. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేపట్టారు. పట్టణంలోని దాసన్నపేట నుంచి కొత్తపేట వెళ్లే రింగ్‌రోడ్డు సమీపంలోని బుంగవీధికి శ్మశానం ఉంది. ఈ శ్మశానానికి ఆనుకుని ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన సుమారు ఏడు ఎకరాల స్థలం ఉంది. బుంగవీధి వాసులు దీన్ని బహిర్భూమిగా వాడుతున్నారు. ఈ స్థలంలో పెద్ద పెద్ద గుట్టలు కూడా ఉన్నాయి. ఈ గుట్టలను సైతం తొలచి కొందరు అక్రమార్కులు స్థలాన్ని చదును చేస్తున్నారు. శ్మశానం ముందు ప్రాంతంలో కల్కి భగవాన్ ఆశ్రమాన్ని నిర్మించారు. బుంగవీధికి చెందిన చిన్న పిల్లలు మృతి చెందితే ఈ ఆశ్రమం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో పూడ్చుతారు. అరుుతే ఈ స్థలం కూడా ఆక్రమణకు గురవుతోంది. సిమెంట్ ఇటుకలతో అడ్డంగా గోడ నిర్మిస్తున్నారు. దీంతో ఆ వీధికి చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా చనిపోతే పూడ్చడానికి ఆరడుగుల స్థలమైనా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరామ దీక్షితులు పేరిట ఉన్న ట్రస్ట్ కార్యకలాపాలను దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తోంది. శ్మశానం పక్కనే ఉన్న ఈ ట్రస్ట్‌కు చెందిన ఖాళీ స్థలంలో కూడా చిన్నపాటి రోడ్డు నిర్మించి, తరువాత నెమ్మదిగా లేఅవుట్ వేసేందుకు అధికార పార్టీ నేతలకు చెందిన కొందరు అనుచరులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇంతస్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నా.. ఇటు మున్సిపల్ అధికారులు గాని, అటు దేవాదాయ శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదు. తెర వెనుక అధికార పార్టీ నాయకులు మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల వెనుక జిల్లాకు చెందిన ముఖ్యనేత, పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఉన్నట్టు తెలుస్తోంది. తమ అనుచర గణాన్ని ప్రభుత్వ స్థలాలపైకి పంపి కబ్జా చేసేలా వారు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నారుు. కబ్జాదారులు ఆక్రమించిన స్థలాల వద్దకు వెళ్లి మున్సిపల్ అధికారులు పనులను నిలిపివేసినా.. వారు వెళ్లగానే మళ్లీ పనులను ప్రారంభిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడం వల్లే ఆక్రమణదారులు ఇలా రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
తస్మదీయులా..లేపెయ్యండి పేర్లు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : ఓటు హక్కు పవిత్రమైదని, అర్హులైన ప్రతివారూ ఓటు నమోదు చేయించుకోవాలని ఎన్నికల సంఘం పదేపదే ప్రకటనలు చేస్తోంది. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, సిబ్బంది అర్హులందరినీ జాబితాలోకి ఎక్కించేందుకు కృషి చేయాల్సి ఉంది. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇప్పటికే ఓటర్లుగా నమోదై, జాబితాల్లో ఉన్న వారి పేర్లను మూకుమ్మడిగా తొలగించే కుతంత్రం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు కాక ప్రత్యర్థి పక్షాలకు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అనుమానం ఉన్న వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని అధికార పార్టీ నాయకుడొకరు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఓడిపోతానన్న భయం పీడిస్తున్న ఆ నేత అడ్డదారుల్లోనైనా గెలుపు బాట వేసుకోవడానికి బరి తెగిస్తున్నారని, నియోజకవర్గంలోని కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలతో పాటుగా మున్సిపల్ పరిధిలో మొత్తం సుమారు 20 వేల మంది తస్మదీయుల (తమకు చెందని వారు) ఓట్లను తొలగించాలని ఆయా మండల తహశీల్దార్లను ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని తమ కార్యకర్తలతో తయారు చేయించిన ‘తొలగింపు’ జాబితాలను తహశీల్దార్లకు అందించగా.. వారు వాటిని సంబంధిత జాబితాలను బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) అందించినట్టు తెలుస్తోంది. సదరు నేత ఆదేశాలను తలదాల్చిన ఓ తహశీల్దార్ ‘ఫారం-7(మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, వివాహమై అత్తింటికి వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు నిర్దేశించినది)లు ఎన్ని వచ్చాయి? మీకిచ్చిన ‘తొలగింపు’ జాబితాలను ఏం చేశారు?’ అంటూ బీఎల్ఓలను ఒత్తిడి చేస్తున్నారు. అధికార పార్టీ నేత కుటిల వ్యూహం నేపథ్యంలోఏ బూత్‌లో ఎవరి ఓటు గల్లంతవుతుందోనన్న ఆందోళన నియోజకవర్గంలోని ఓటర్లను పీడిస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లలో అత్యధికులు.. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాల వారు ైవె ఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉంటున్నారు. దీంతో రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటమి తప్పదని కలవరపడుతున్న అధికార పార్టీ నేత ఇప్పటి నుంచే పథకం ప్రకారం అలాంటి ఓట్ల తొలగింపునకు పూనుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని జాబితాలను తయారు చేయించి మండల స్థాయిలో ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లకు అందించారు. ఇలాంటి జాబితాల్లో అత్యధికంగా బీసీ, ఎస్సీ ఓటర్ల పేర్లు ఉండటం గమనార్హం. చనిపోయిన వారి పేర్లతో పాటు పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లతోనూ ఫారం-7లు నింపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఓట్ల తొలగింపునకు ముందస్తుగా ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి. అనంతరం గ్రామ సభలను ఏర్పాటు చేసి ఓట్లను తొలగించాలి. కానీ కొన్ని గ్రామాల్లో నోటీసులు కూడా లేకుండానే ఓట్లను తొలగిస్తున ్నట్లు ఓటర్లు గ గ్గోలు పెడుతున్నారు. కె.గంగవరం మండలంలో తొలగించాల్సిన ఓటర్లకు పాత తేదీలను వేసి నోటీసులు అందించాలని ఉన్నతాధికారి బీఎల్ఓలను ఆదేశించినట్టు సమాచారం. అధికార పార్టీ నేత అందించిన జాబితాల ప్రకారం ఓట్లను తొలగించాలని ఒత్తిడి చేయడంతో బీఎల్ఓలు ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా కూలి పనులకు వలస వెళ్లిన వారి ఓట్లు ఎలా తొలగిస్తారని కొ ంత మంది ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయని, ప్రతి నెలా రేషన్‌ను తీసుకుంటున్నా ఊర్లో ఉండటం లేదని కొందరు చెపుతున్న అవాస్తవాలను పరిగణించడమేమిటని నిలదీస్తున్నారు. బీసీ, ఎస్సీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకోవడంపై ఆయా వర్గాల వారు మండిపడుతున్నారు. జాబితాలు అందించడం అవాస్తవం.. ఓటర్ల తొలగింపుపై కె.గంగవరం మండల తహశీల్దార్ ఎన్.రమేష్‌ను వివరణ కోరగా గ్రామాల్లో తాత్కాలికంగా వలస వెళ్లిన వారికి నిబంధనల మేరకు నోటీసులు అందిస్తున్నామన్నారు. గ్రామసభలను పెట్టి సమాచారం సేకరించిన అనంతరమే జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అధికార పార్టీ వారు జాబితాలను అందించిన మాట అవాస్తవమని, తాను బీఎల్ఓలకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని స్పష్టం చేశారు.