ఎర్రదందాలో పచ్చనేతలు
► ఇప్పటికే ఒకరిపై పీడీ యాక్టు నమోదు
► పరారీలో మరికొంత మంది అధికారపార్టీ కార్యకర్తలు
► స్మగ్లర్ల కోసం పోలీసుల వేట
చంద్రగిరి : ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తర చూ చెబుతుంటారు. ఆయన సొంత గ్రామమైన నారవారిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న రంగంపేటలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో టీడీపీ నాయకులు రాఘవుల నాయుడు, మల్లెల చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. రాఘవుల నాయు డు ఎర్రచందనం అక్రమంగా తరలించి రూ.కోట్లు ఆర్జించి బినామీ పేర్లపై ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాక అతనిపై లెక్కకు మించి ఎర్ర కేసులు ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్టు నమోదు చేశారు.
గత నెల 16న నాగయ్యగారిపల్లి టేకుప్లాంట్ వద్ద పోలీసులు జరిపిన దాడులలో రంగంపేటకు చెందినమరో టీడీపీ నాయకుడు మల్లెల చంద్రతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగంపేటకు చెందిన మార్కొండయ్య, శంకర్ యాదవ్, రంగంపేట హరిజనవాడకు చెందిన ఎర్ర య్య అలియాస్ ఎర్రోడు పారిపోయారు. ఐదు రోజుల క్రితం మార్కొండయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఎర్రయ్య అలియాస్ ఎర్రోడు అప్పట్లో కాంగ్రెస్ తరఫున రంగంపేట సర్పంచ్‌గా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. మరో స్మగ్లర్ శంకర్ యాద వ్ గతంలో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మరో స్మగ్లర్ మార్కొండయ్య సైతం రంగంపేటలో టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
వీరు ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితులుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసు లు చెబుతున్నారు. అధికార బలంతో ఎలాైగె నా ఎర్ర కేసుల నుంచి బయట పడాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ టీడీపీ నాయకుడి తో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. వీరే కాకుండా రంగంపేటలో మరికొంతమంది టీడీపీ నాయకులు ఎర్రచ ందనం అక్రమ రవాణా చేసి రూ.కోట్లు ఆర్జించిన ట్టు పలువురు బహిరంగా విమర్శిస్తున్నా రు. ఎర్రచందనం కేసుల్లో తమ పార్టీకి చెందిన వారే ఉండడంతో టీడీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఏది ఏమైనా దుంగల అక్రమ రవాణాను అరికట్టాలంటే ముందుగా స్థానిక స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.