చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి ఫోన్
మంత్రులు, డీజీపీతో చంద్రబాబు భేటీ
అనంతరం రాజ్‌నాథ్‌కు ఫోన్ చేసిన బాబు
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ టాస్క్‌ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్) మంగళవారం ‘‘ఎన్‌కౌంటర్’’లో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను చంపేయటం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో నిరసనలు రగులుకోవటంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించడం.. తమిళనాడులో నిరసనలు వ్యక్తమవడంతో చంద్రబాబు హడావుడిగా అందుబాటులో ఉన్న మంత్రు లు దేవినేని ఉమామహేశ్వరావు, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడులతో సచివాలయంలో సమావేశమయ్యారు.
తమిళనాడు నుంచి భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు శేషాచలం అడవుల్లోకి వస్తున్నారన్న పక్కా సమాచారంతోనే సోమవారం నుంచి టాస్క్‌ఫోర్స్ బలగాలను కూంబింగ్‌కు పంపామని.. మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ బలగాలపై దాడులకు దిగాయని.. పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించారని సీఎంకు డీజీపీ వివరించారు. కాల్పుల్లో గాయపడన వారందరికీ వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాల్పుల్లో చనిపోయిన స్మగ్లర్ల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ అనంతరం వారి కుటుంబాలకు అప్పగించాలని సీఎం ఆదేశించారని.. మృతుల ఫోటోలను విడుదల చేసి వారి సంబంధీకులకు వివరాలు తెలియజేయాలని సూచించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా తీసుకోవలసిన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
కేంద్రానికి తమిళనాడు ఫిర్యాదు
Published Wed, Apr 8 2015 3:11 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement