బొబ్బిలి :అధికారం మా చేతిలో ఉంది... మేం చెప్పిన వారికే పనులివ్వాలి... చేస్తే మా వాళ్లే చేయాలి..లేకపోతే అలాగే వదిలేయండి... ఇదీ మూడు నెలలుగా అధికార పార్టీ నాయకులు ఇరిగేషన్ అధికారులపై తెస్తున్న ఒత్తిడి. గత ఏడాదిలో వచ్చిన హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న వెంగళరాయ సాగర్ కాలువ మరమ్మతులకు అధికారులు సిద్ధమైతే.. అధికార పార్టీ నాయకులు మూడు నెలలుగా అడ్డుపడుతూనే ఉన్నారు. మరో మూడు నెలలు ఇలాగే కాలయాపన చేస్తే సాగర్ ద్వారా ఖరీఫ్‌కు సాగునీరు అందకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో అధికారులకు ఏమి చేయాలో తెలి యని స్థితిలో ఉన్నారు.
బొబ్బిలి సబ్ డివిజన్‌లోని వెంగళరాయసాగర్ బొబ్బి లి, సీతానగరం మండలాల పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వా రా సుమారు 15 వేల ఎకరాల వరకూ సాగునీరు అందుతుం ది. గత ఏడాది అక్టోబరు నెలలో వచ్చిన హుద్‌హుద్ తు పాను వల్ల సాగర్ కాలువలకు గండ్లు పడడంతో పాటు ఆక్విడెక్టులు దెబ్బతిన్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 14 పనులను గుర్తించారు. వాటికి అంచనాలు తయారు చేసి దాదాపు రూ. 73 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రతిపాదనలు వెళ్లినా.. ప్రభుత్వం నిధుల మం జూరుకు మీనమేషాలు లెక్కించింది.
చివరకు మూడు మా సాల కిందట బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు ఇరిగేషన్ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం బయట పడడంతో వెంటనే కలెక్టరుతో మాట్లా డి పనులకు మంజూరు తీసుకువచ్చారు. వీటిలో 37 లక్షల 50 వేల రూపాయల విలువ కలిగిన 5 పనులకు టెండర్లు కూడా ఆహ్వానించారు. మిగిలిన 9 పనులను నామినేటెడ్ పద్ధతిలో చేయాల్సి ఉంది. అయితే జనవరి నుంచి నామినేషన్ పద్ధతిలో కేటాయింపులు జరగడం లే దు. ఆయకట్టు సంఘాల్లో ఉండే వ్యవసాయదారుడు ఈ పనులు చేయడానికి అర్హులు. వారిని ఎంపిక చేసే బాధ్యత ఆప్రాంతంలో ఉన్న జన్మభూమి కమిటీపై ఉంది. ఎంపిక చేసిన రైతుకు ఆయకట్టులో పొలం ఉందని నిరూపిస్తూ వీఆర్‌ఓ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇన్ని ఉన్నా అధికార పార్టీ నా యకులు మాత్రం వారికి చెప్పిన వారికే పనులు ఇ వ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నీటిపారుదలశాఖ పైనా, పనులపైనా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి ఉండడంతో నిబంధనలకు అనుగుణంగా వెళతామని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో మూడు మాసాలుగా పనులు జరగక ఎక్కడవక్కడే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో టెండర్లు చేయాల్సిన పనులు కూడా ఇప్పటికీ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. ఆన్‌లైన్‌లో పాల్గొన్న కాంట్రాక్టర్లు మాత్రం వాటిని దక్కించుకోనే పనిలో అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. మరో మూడు మాసాల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆ సమయానికి మరమ్మతులు పూర్తయితేనే కింది వరకూ నీరు వచ్చిన అవకాశం ఉంది. లేకపోతే వేలాది ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ ప్రాంత రైతులకు ప్రధా న నీటి వనరులు వెంగళరాయసాగర్ కాలువే. దానికి మరమ్మతుకు ప్రభుత్వం నిధులిచ్చినా నియోజకవర్గంలో రాజకీయాల వల్ల పనులు జరగడం లేదు.
అంతా మా ఇష్టం!
Published Sun, Mar 22 2015 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement