ఖరీఫ్–2025పై కేంద్రం ప్రకటన
సాక్షి, అమరావతి: ఖరీఫ్ –2025 సీజన్ కోసం రాష్ట్రానికి 17.31లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయిస్తూ కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో జరిగిన ఖరీఫ్–2025 పంటల జోనల్ సదస్సులో ఈ మేరకు ప్రకటన చేసింది. సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో ప్రధానంగా 55.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 71 శాతం నేలల్లో నత్రజని, 17.56 శాతం నేలల్లో భాస్వరం, 13 శాతం నేలల్లో పొటా‹Ù, 38 శాతం నేలల్లో సూక్ష్మపోషకాలైన జింక్, 31 శాతం నేలల్లో ఐరన్, 21 శాతం నేలల్లో బోరాన్, 13 శాతం నేలల్లో మాంగనీస్ లభ్యత తక్కువగా ఉన్నట్టుగా గుర్తించామన్నారు. యూరియా, డీఏపీ ఎరువుల స్థానంలో నానో యూరియా, నానోడీఏపీ వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment