
డీలర్లను అక్రమంగా తొలగించడం దారుణం
పులివెందుల : అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ప్రభుత్వ అధికారులు చిన్న, చిన్న తప్పులను సాకుగా చూపి రేషన్ డీలర్లను అక్రమంగా తొలగించడం దారుణమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన బ్రాహ్మణపల్లె గ్రామస్తులతో కలిసి తహశీల్దార్ శ్రీనివాసులును కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బ్రాహ్మణపల్లె రేషన్ డీలర్‌ను అకారణంగా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని.. ఇన్‌చార్జి డీలర్‌గా రంగాపురం రేషన్ డీలర్‌ను నియమించామని తహశీల్దార్ తెలియజేశారు. దీంతో బ్రాహ్మణపల్లె గ్రామస్తులు రేషన్ బ్రాహ్మణపల్లెలోని ఓ టీడీపీ నేత ఇంట్లో నిల్వ చేసి అక్కడికి వచ్చి రేషన్ తీసుకోవాలని చాటింపు వేశారని.. దీనికి మేం ఎట్టి పరిస్థితులలో ఒప్పుకొనే ప్రసక్తేలేదని తహశీల్దార్‌కు తేల్చి చెప్పారు.
ఎర్రంరెడ్డిపల్లె చెరువును పరిశీలించిన ఎంపీ :
పులివెందుల మండలంలోని ఎర్రంరెడ్డిపల్లె చెరువును గురువారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరిశీలించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఎర్రంరెడ్డిపల్లె చెరువుకు నీరు వచ్చాన సందర్భంగా ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీతో తేర్నాపంల్లె గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు మాట్లాడారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను మోసం చేశారని మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంగముని, మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చిన్నప్ప, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బలరామిరెడ్డి, కౌన్సిలర్లు జగదీశ్వరరెడ్డి, బ్రాహ్మణపల్లె నాయకులు మల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.