‘ఉన్నతి’ పథకంలో అవినీతి కుంభకోణం | big correption in unnati scheme | Sakshi
Sakshi News home page

‘ఉన్నతి’ పథకంలో అవినీతి కుంభకోణం

Published Sun, Aug 14 2016 4:33 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

big correption in unnati scheme

నిందితులకు కాపుకాస్తున్న అధికారపార్టీ నేతలు
వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి కారుమురి ధ్వజం
తణుకు:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉన్నతి’ పథకంలో అత్తిలి మండలంలో అవినీతి కుంభకోణం వెలుగు చూస్తే నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమకంలో భాగంగా మండంలో పర్యటించిన సందర్భంలో ఈ అవినీతి కుంభకోణం తన దృష్టికి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ నిరుపేదలకు దక్కాల్సిన నిధులను బల్లిపాడు, స్కిన్నెరపురం, అత్తిలి, వరిఘేడు గ్రామాల్లో బినామీలకు అందజేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 13 మంది అధికారులు నిందితులుగా గుర్తించగా ఆరుగురిపై అత్తిలి పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైందని, అయితే ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు.

తణుకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో దాతలు, దీపావళి సామాగ్రి అమ్మే దుకాణ యజమానులు ఇచ్చిన విరాళంతో నిర్మాణం చేపట్టిన ఆర్చి భవిష్యత్‌లో కూలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని కారుమూరి ప్రశ్నించారు. సజ్జాపురం శ్మశానంలో సైతం ఇండోర్‌ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మునిసిపల్‌ స్థలం కాకుండానే శ్మశానంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు కేటాయిస్తూ కౌన్సిల్‌ తీర్మానం చేయడం సరికాదన్నారు.పార్టీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్‌ఎస్‌ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు గుర్రాల సత్యప్రియ, అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్‌ మద్దాల నాగేశ్వరరావు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement