ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయకపోగా ఇప్పుడు పేదలకు చెందిన అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా నూతన రాజధానిలో పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేదల అసైన్డ్ భూములను మంత్రులు, అధికార పార్టీ నేతలు బలవంతంగా తక్కువ ధరలకు కాజేశారు. ఇప్పుడు ఆ భూములను క్రమబద్ధీకరణ చేసి, చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇదంతా ఓ పథకం ప్రకారం వ్యూహాత్మకంగా నడిపించారు.