సెక్టోరియల్ ఆఫీసర్లుగా
తీసుకోవాలని ఎస్పీడీ నిర్ణయం
త్వరలోనే అధికారిక ఉత్తర్వులు
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)లో ఖాళీ అయిన సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీలో నెలకొన్న సందిగ్ధతకు అతి త్వరలోనే తెర పడనుంది. బయటి నుంచి కాకుండా ప్యానల్ జాబితాలో ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయిం చారు. జీసీడీఓ విజయకుమారి, సీఎంఓ దివాకర్‌రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ గురుప్రసాద్, అలెస్కో శ్రీనివాసరావు ఇటీవల రిలీవ్ అయ్యారు. వీరి స్థానాలు భర్తీ చే యడం ఆసక్తిగా మారింది. కొందరు టీచర్లు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తూ వచ్చారు. ఒక సామాజిక వర్గం వారు ఈ సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టులు తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ కీలక ప్రజాప్రతినిధులతో జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తూ వచ్చారు.
తమకు అనుకూలమైన వారి పేర ్లతో జాబితా కూడా తయారు చేసి వీరినే సెక్టోరియల్ ఆఫీసర్లుగా నియమించాలంటూ ముఖ్య ప్రజాప్రతినిధి ద్వా రా కలెక్టర్‌కు, ఎస్పీడీకి కూడా పంపారు. ఇదే సమయం లో ప్యానెల్ జాబితా మేరకు భర్తీ చేయాలని సూచిస్తూ రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. జిల్లా అధికారులు కూడా దీనిపై ఆచీతూచి అడుగులేస్తూ వచ్చారు. విద్యాశాఖ అధికారులు మరోసారి ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్ట్ అధికారి ద్వారా మౌఖిక ఆదేశాలతో ప్యానెల్ జాబితాలో ఉన్న వారి పేర్లను సూచిస్తూ కలెక్టర్‌కు ఫైలు పెట్టడంతో ఆమోద ముద్ర పడింది.
ఎస్పీడీ కూడా ఈ ఫైలుపై ఆమోద ముద్ర వేశారు. ప్యానల్‌జాబితా సీనియార్టీ మేరకు రొద్దం మండలం పెద్దమంతూరు జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం బీ. రవినాయక్, పుట్టపర్తి మండలం బీడుపల్లి జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం ఎస్. గోపాల్‌నాయక్, విడపనకల్లు మండలం హావలిగి జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం వెంకటరమణనాయక్, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం వాణీదేవి నియామకం దాదాపు పూర్తయినట్లే. మరో నాలుగైదు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెల్లడయ్యే అకవాశం ఉంది.
ప్యానల్ జాబితాకే పట్టం !
Published Thu, Aug 6 2015 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement
Advertisement