district officials
-
హైదరాబాద్ జిల్లా అధికారులపై ఈసీకి వరుస ఫిర్యాదులు
-
అమ్మాయి పేరులోనే ఉన్నది గుర్తింపు
మన సమాజాలలో కూతురి పేరును ఇంటి బయట నేమ్ప్లేట్గా బిగించడం ఎంత విస్తృతంగా చూస్తాం? చాలా కొన్ని ఇళ్లకి భార్య పేరుతో ఇంటి పేరు పెట్టడం కనిపిస్తుంది. కాని ఎక్కువ ఇళ్లకు భర్త ఉద్యోగాన్ని, హోదాని, ఆ ఇంటి యజమాని ఎవరో తెలిపే వివరాన్ని చెప్పే నేమ్ప్లేట్లే ఉంటాయి. న్యాయమూర్తులైనా, పోలీస్ ఆఫీసర్లైనా, ఐ.ఏ.ఎస్లైనా, టీచర్లైనా, వ్యాపారవేత్తలైనా ఎవరైనా సరే వారి పేరు ఇంటి బయట నేమ్ప్లేట్గా పెట్టుకుంటారు. ఆ ఇళ్లలో భార్య మంచి ఉద్యోగంలో ఉన్నా ఆమె నేమ్‌ప్లేట్ కనిపించదు. ఇక ఇంట్లో కూతురు ఉంటే ఆ కూతురికి ఆ ఇల్లు ఎప్పటికీ చెందదనే వారసత్వ భావజాలం తరతరాల్లో ఉంది. ‘ఇలా ఉంటే అమ్మాయి పుడితే బెంబేలు పడే రోజులు ఎలా పోతాయి’ అనుకున్నారు ఉత్తరాంచల్ పౌరి గర్వాల్ జిల్లా అధికారులు. దానికి కారణం ఉంది. పౌరి గర్వాల్ జిల్లా కొండ ప్రాంతం. ఆడపిల్ల, మగపిల్లాడు అనే తేడా పెద్దగా అంటని ప్రాంతమే అయినా మెల్లగా పరిస్థితులు మారాయి. అక్కడ 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1103 మంది స్త్రీలు ఉండేవారు. కాని తాజాగా 0–6 ఏళ్ల వయసు పిల్లల లెక్కలు తీసినప్పుడు వెయ్యి మంది అబ్బాయిలకు 904 మంది అమ్మాయిలే తేలారు. అమ్మాయిల వల్ల ‘పెళ్లి ఖర్చు’ అనేది తల్లిదండ్రుల సమస్య. అమ్మాయి ఏ ఇంట్లో పుట్టినా పెళ్లి తర్వాత ఆమెకు ఆ ఇంటి మీద ఏ హక్కు ఉండదు కదా అని ఆ అమ్మాయిని చేసుకుని వెళ్లేవారి సమస్య. అంటే ఇరువైపుల నుంచి ఆర్థిక విషయంగానే అమ్మాయిని చూసి ఆమె జననాన్ని నిరాకరించే పరిస్థి్థతులు ఏర్పడుతున్నాయి. నేమ్ప్లేట్లను పంచుతున్న జిల్లా యంత్రాంగం ‘అమ్మాయి చదవగలదు. మంచి ఉద్యోగం చేయగలదు. తాను స్వావలంబన పొందడమే కాదు... ఇంటిని, సమాజాన్ని కూడా ముందుకు నడపగలదు. ఆమెకు ఆస్తిలో హక్కు ఉంటుంది. అమ్మాయికి ఇంటిలో సమాన వాటా ఉంటుంది అని పదే పదే చెప్తే తప్ప మనుషులు గ్రహించరు’ అని పౌరి గర్వాల్ యంత్రాంగం గ్రహించింది. వెంటనే వారొక ఉద్యమాన్ని మొదలెట్టారు. ఆ ఉద్యమం పేరు ‘ఘౌర్ కి పచయన్... నౌని కి నౌ’. అంటే ‘ఇంటి కూతురిని బట్టి.. ఇంటిని గుర్తించు’ అని అర్థం. అధికారులు ఈ ఉద్యమం ప్రకారం జిల్లాలోని పల్లెలకు వెళ్లి సొంత ఇల్లు ఉన్న అన్ని కుటుంబాలతో మాట్లాడటం మొదలెట్టారు. ‘మీ అమ్మాయి పేరుతో నేమ్‌ప్లేట్ చేసిస్తాం. మీ ఇంటి బయట తగిలించండి’ అని కోరసాగారు. ఆశ్చర్యకరంగా ముందుగా ఈ ప్రతిపాదనకు తల్లులే స్పందించారు. ‘మా పెద్దమ్మాయి పేరు పెట్టండి’, ‘మా చిన్నమ్మాయి పేరు పెట్టండి’ అని సూచించసాగారు. ఇందుకు తండ్రులు, ఇళ్లల్లో ఉన్న కుమారులు పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు. ‘నా పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్ దగ్గర నిలబడి నా ఇంటి ఫొటో దిగడం నాకు చాలా ఆత్మవిశ్వాసం ఇచ్చింది’ మథనా గ్రామానికి చెందిన ఆర్తి చెప్పింది. ఆమె సోషియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. ‘ఇక మీదట మా ఇంటిని మా నాన్న పేరుతో కాకుండా ఇది ఆర్తీ ఇల్లేనా అని ఎవరైనా అడగాల్సిందే’ అని ఆ అమ్మాయి సంతోషపడింది. ఆర్తికి ఇంటర్ చదువుతో మానేసిన తమ్ముడు ఉన్నాడు. ఇంకో చెల్లెలు కూడా ఉంది. ‘ఇది మా ముగ్గురి ఇల్లు అనే భావం ఆ కుర్రాడి మనసులో మొదలయ్యేందుకు ఇలాంటి పనులు తోడ్పడతాయి’ అని ఒక ప్రభుత్వ అధికారి అన్నారు. మల్లి అనే ఊళ్లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ముకేష్ కుమార్ ఈ ఉద్యమంలో భాగంగా తన ఇంటికి తన 14 ఏళ్ల కూతురు ‘సిమ్రన్’ నేమ్‌ప్లేట్ బిగించాడు. ‘పూర్వపు రోజులు పోయాయి. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే’ అని అతడు సంతోషంగా అన్నాడు. అతను ఆ మాట అనడంతోటే పక్కనే ఉన్న సిమ్రన్ ‘ఇక నాకు దిగులు పోయింది. నా తల్లిదండ్రులు నన్ను పై చదువులు చదివిస్తారనే భావిస్తున్నా’ అని అంది. ఉత్తరాంచల్‌లో ఆడపిల్లలకు చదువు, ఉపాధి, కెరీర్‌ను ఎంపికను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఘర్షణతో సాధించుకోవాలి. కాని ప్రభుత్వం చేసే ఇలాంటి పనులు, ఆయా సంస్థలు చేసే చైతన్య కార్యక్రమాలు, మీడియా మార్పును తీసుకురాగలవు. ఇప్పుడు ఉత్తరాంచల్‌లో ఇంటింటా వెలుస్తున్న కూతురి పేర్ల నేమ్ప్లేట్లు ఆ సంగతినే చెబుతున్నాయి. – సాక్షి ఫ్యామిలీ -
కరోనా వైరస్: త్రిముఖ వ్యూహం..
సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సిక్కోలును కరోనా బారి నుంచి కాపాడడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి మధ్యనే గడు పుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నా రు. లాక్డౌన్లో జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. లాక్డౌన్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం అంతా చక్క గా పనిచేసినా వారిని సమన్వయపరచుకుని ముందుకెళ్లడంలో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విజయవంతమయ్యారు. ఈ ము గ్గురు అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కలెక్టర్ చొరవ ప్రశంసనీయం కరోనా ప్రభావం దేశంలో మొదలైన దగ్గరి నుంచే కలెక్టర్ జె.నివాస్ అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్నేసి ఉంచారు. అధికారుల దగ్గరి నుంచి వలంటీర్లు, ఆశ కార్యకర్తల వరకు అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక, వైరస్ వ్యాప్తి జోరుగా జరుగుతున్న వేళ స్వయంగా జనంలోకి వచ్చి అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ని త్యావసర సరుకులు, మందులు, కూరగాయలు అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత ధరలకు ప్రజల దరి చేర్చా రు. లాక్‌డౌన్‌కు ముందు ఒక్కసారిగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రావడంతో వారిని ఊళ్లలోకి పంపించకుండా ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు పెట్టారు. జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి రాగా వారిలో 562 మందిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లలో పెట్టి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి బాగోగులు కూడా చూసుకున్నారు. 819 మందికి ఉచితంగా సరుకులు డోర్ డెలివరీ చేయించారు. వలస కూలీల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి రోజుకో రకం భోజనం పెడుతున్నారు. అనాథలు, నిరాశ్రయులకు కూడా రెడ్‌క్రాస్ సాయంతో రోజూ భోజనం పెడుతున్నారు. ప్రభు త్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. సొంత వ్యూహంతో ముందుకువెళ్లారు. ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి ముస్లిం పెద్దలతో సమావేశమై సమస్త వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు అండగా ఓ బృందాన్నే అక్కడకు పంపారు. ఎస్పీ అవిశ్రాంత యోధుడు జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక మరింత వేగం పెంచి, రోడ్లపైనే ఎక్కువగా ఉంటున్నారు. కరోనాపై స్వయంగా అవగాహన కలి్ప స్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. ప్రతి రోజూ పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ముఖ్యమైన ఆదేశాలిస్తూ వస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ముందుగా గుర్తించి క్వారంటైన్లో ఉంచడమే కాకుండా వారు బయటికి రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో రాష్ట్రంలో ప్రతి చోట పోలీసుల తీరుపై కొన్ని విమర్శలు వచ్చినా ఇక్కడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దూసుకుపోతున్న జేసీ లాక్డౌన్ అమల్లోకి రాగానే తిండికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. వైరస్ వస్తే ఎలా ఉంటుందో తెలీదు గాని తినడానికి తిండి దొరకకపోతే ఇలాగే చనిపోతేమోనన్న ఆందోళన మొదట్లో ఉండేది. కానీ వాటిన్నింటినీ జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పటాపంచలు చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు దొరకలేదన్న విమర్శలు రాకుండా చూసుకోగలిగారు. సామాజిక దూరాన్ని పాటించేలా షాపుల వద్ద చర్య లు తీసుకుంటూనే కూరగాయలు, మొబైల్ రైతు బజా ర్లు, కూరగాయలు డోర్ డెలివరీ, నిత్యావసర సరుకు లు, మందులు డోర్ డెలివరీ ఇలా ప్రతీది ప్రజల వద్దకే తీసుకొచ్చారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ధరలు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రేడర్స్, పౌల్ట్రీ యజమానుల సమావేశమై ధరలపై దిశా నిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేశారు. వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా చూడగలిగారు. జిల్లా యంత్రాంగం పనితీరు భేష్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం మన అదృష్టమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వ్యాధి నియంత్రణలో ఉందని అన్నారు. శ్రీకాకుళంలో రోడ్డుపై వాహనచోదకులను ఆపి జాగ్రత్తలు చెబుతున్న దాసన్న కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు స మన్వయంతో చక్కగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి అహరి్నశలు ప్రజా సంక్షేమం తపిస్తోందన్నారు. కరోనా కట్టడిలో ఇది కీలక సమయమని, ఇక ముందు కూడా పూర్తి నిబద్ధత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రతినిధులకు బియ్యంతో పాటు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. అలాగే సోమవారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై తిరుగుతున్న వారిని మంత్రి ఆపి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో ఒక్క పాటిజివ్ కేసు కూడా నమోదు కాలేదని ఇకపై కూడా రాకుండా మనమంతా కలిసికట్టుగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. -
31 జిల్లాల ఉన్నతాధికారులతో సీఈసీ సమావేశం
-
పంచాయతీలను పటిష్టం చేద్దాం
సాక్షి, వికారాబాద్: పంచాయతీలను బలోపేతం చేయడానికి, గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడానికి గానూ వందశాతం పన్నులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా నగరంలోని ప్రగతి భవన్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో మంగళవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దీనికి జిల్లా నుంచి కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఇన్చార్జ్ జేసీ సంధ్యారాణి, డీపీఓ మాజిద్ హాజరయ్యారు. ముఖ్యంగా పంచాయతీల పాలనపై సీఎం కేసీఆర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8,684 పంచాయతీలున్నాయని, పరిపాలనా సౌలభ్యంకోసం కొత్తగా మరో 4వేల జీపీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 500లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, వెయ్యి మంది జనాభా దాటితే రూ.10 లక్షలు, ఆపైన స్థాయిని బట్టి పంచాయతీకి రూ.15, రూ.20, రూ.25 లక్షల నిధులు అందజేస్తామని వివరించారు. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నామని, ఆలోగానే కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి, సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలను సైతం శాసన ప్రక్రియ ద్వారానే నిర్వహించాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రత్యక్ష ఎన్నికలా.. పరోక్ష ఎన్నికలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పటిష్ట పంచాయతీ వ్యవస్థ నిర్మాణానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. మార్చి 11న గ్రామాల్లో ఈ– పాసు పుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ గ్రామానికి ఒక అధికారిని నియమించి అదే రోజు పాసు పుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. రికార్డుల ప్రక్షాళన తర్వాత భూములు వివరాలన్నీ ధరణి వెబ్సైట్లోనే ఉంటాయని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకురానున్నామని సీఎం వివరించారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు లేనిచోట తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారం కట్టబెడుతామన్నారు. జిల్లాలోని 18 మండలాలకు గానూ ప్రస్తుతం 4 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మినహా 14 మండలాల్లో తహసీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ అధికారాలు వరించనున్నాయి. తాగునీరు, విద్యుత్, సాగునీటి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఈ ఫలాలు ప్రతిఒక్కరికీ అందాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలను తెలుసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాల అమలుకు మరింత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. -
గొర్రెల పంపిణీలో భేష్
సాక్షి, కామారెడ్డి : యాదవులకు గొర్రెల పంపిణీ లో కామారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్ట ర్ సత్యనారాయణను అభినందించారు. భూరికార్డుల ప్రక్షాళనపైనా ప్రశంసలు అందించారు. 88 శాతం గొర్రెల పంపిణీతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉంది. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన సరాసరి 93 శాతం కాగా.. కామారెడ్డిలో మాత్రం 96 శాతం పూర్తయ్యింది. దీంతో సీఎం జిల్లా అధికారులను అభినందించారు. మంగళవారం ప్రగతిభవన్ వేదికగా కలెక్టర్లు, జేసీలు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుబుక్కుల పంపిణీ, కొత్తపంచాయతీల ఏర్పాటు, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాల్లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన 93 శాతం పూర్తయ్యిందని, 92 శాతం ఖాతాలు వివాద రహితమైనవని తేలాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు రెÐవెన్యూ కోర్టులు నిర్వహించి వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏకకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాలని, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం నోడల్ ఆఫీసర్లను నియమించి, వారికి వాహనాన్ని సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి వారంలో ప్రతిపాదనలు పంపించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయాలని సూచించారు. 500 జనాభా ఉన్న పంచాయతీకి రూ. 5 లక్షలు, జనాభాను బట్టి నిధులు సమకూర్చనున్నట్లు సీఎం తెలిపారు. పంచాయతీ పన్నులు, జాతీయ స్థాయిలో అందే నిధులు, ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకుని గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తహసీల్ కార్యాలయాల్లో వసతుల కల్పనకు జిల్లాకు కోటి రూపాయ లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు సమన్వయ సమితుల స భ్యులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ కేసులు పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ సత్యనారాయణ, జేసీ సత్తయ్య, డీపీవో రాములు తదితరులు పాల్గొన్నారు. -
హాలహర్వి ఎస్సై సస్పెన్షన్
హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి పోలీసు స్టేషన్ ఎస్సై కృష్ణమూర్తిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే సస్పెండ్ చేశారని ఆలూరు సి.ఐ అబ్దుల్ గౌస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను వేధింపులకు గురిచేయడం, ఇసుక అక్రమ రవాణాలో ఎస్సై భాగస్వామి కావడంతోనే ఆయన్ను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
వింటే సరి.. కాదంటే బదిలీ
►జిల్లా అధికారులపై సవారీ చేస్తున్న అధికారపార్టీ నేతలు ►తాము చెప్పినట్టే వినాలంటూ బెదిరింపులు ►కలెక్టర్ సుజాతశర్మకూ తప్పని బదిలీ ►ఇప్పుడు ఇరిగేషన్ ఎస్ఈ శారద వంతు.. ►అక్రమాలకు పాల్పడితే సస్పెన్షన్ వేటు ►అంతర్మథనంలో అధికారులు ఒంగోలు: అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు జిల్లా అధికార యంత్రాంగంపై సవారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు తాము చెప్పిందే వినాలంటూ ఆదేశిస్తున్నారు. కాదంటే బదిలీ తప్పదంటూ బెదిరిస్తున్నారు. తమ మాట వినకపోతే శంకరగిరి మాన్యాలే.. అంటూ హెచ్చరిస్తున్నారు. నిజాయితీగల అధికారిగా పేరున్న కలెక్టర్ సుజాతశర్మను ఇక్కడి అధికార పార్టీ నేతలు నానా ఇబ్బందులకు గురి చేశారు. తాము చెప్పిన అక్రమాలల్లా చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. వారి అక్రమాలకు ఏ మాత్రం తలుపకపోవడంతో పట్టుపట్టి మరీ ఆమెను బదిలీ చేయించారు. తాజాగా ఇరిగేషన్ ఎస్ఈ శారదదీ అదే పరిస్థితి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయానికి ఇవ్వలేదంటూ టీడీపీ జిల్లా ముఖ్యనేత అక్కసు పెంచుకున్నారు. పలు రకాలుగా ఒత్తిడి తెచ్చినా ఆమె ససేమిరా అనడంతో ఇరిగేషన్ మంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు. ఇక జిల్లాలో కింది స్థాయి అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయడమా... లేదా బదిలీపై వెళ్లడమా.. తప్ప వేరే మార్గం లేదు. నేతలు చెప్పినట్లు చేసి బలిపశువులుగా మారిన అధికారులూ లేకపోలేదు. దీంతో ఈ జిల్లాలో ఉద్యోగం మాకొద్దు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోతున్నారు అధికారులు. ►తాము చెప్పిన పనులల్లా చేయలేదంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుజాతశర్మపై అక్కసు పెంచుకున్నారు. ఆమె తమ పనులు చేయడం లేదంటూ పదే పదే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అక్రమాలు అడ్డుకట్ట వేయడాన్ని జీర్ణించుకోలేని నేతలు పట్టుపట్టి ఆమెను బదిలీ చేయించారు. ►తాజాగా ఇరిగేషన్ ఎస్ఈ శారద బదిలీ వ్యవహారం ఓ ఉదాహరణ. ఎన్ఎస్పి స్థలాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంకు ఇచ్చేందుకు అనుమతినివ్వలేదన్న అక్కసుతో అధికార పార్టీ నేత ఆమెను పట్టుపట్టి బదిలీ చేయించారు. తొలుత బెదిరించినా శారద వినలేదు. సదరు స్థలంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నామంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు నేత ఇరిగేషన్ మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆమెను బదిలీ చేయించారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్ మొదలుకొని అధికార వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ► వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదన్న అక్కసుతో ఇటీవల ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ వెంకటరమణను పట్టుపట్టి మరీ బదిలీ చేయించారు. ►జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు గొడవలో సుప్రీంకోర్టు అంక్షితలు వేయడంతో అప్పటి జడ్పీ సీఈఓ ప్రసాద్ పని చేయలేక సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ► అద్దంకిలో అధికార పార్టీ వర్గవిభేదాల నేపథ్యంలో అధికారులు పని చేయలేని పరిస్థితి నెలకొంది. అద్దంకి సిఐ బేతపూడి ప్రసాద్‌ను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్టుపట్టి బదిలీ చేయించారు. ఈయనతో పాటు అద్దంకి ఆర్‌డబ్లు్యఎస్ ఏఈ ఏపీఎం సైమన్, బల్లికురవ తహశీల్దార్, మెప్మా అధికారిని ఇక్కడి నుంచి సాగనంపారు. ►కందుకూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావును తమ మాట వినడం లేదంటూ ఎమ్మెల్యే పోతుల రామారావు పట్టుపట్టి బదిలీ చేయించారు. ►ఇక అధికార పార్టీ నేతలు చెప్పిదల్లా చేసి దెబ్బతిన్న అధికారులకూ కొదువ లేదు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ మొదలుకొని అన్ని శాఖల పరిధిలో కొందరు అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పిన అక్రమాలల్లా చేశారు. ఉన్నతాధికారుల విచారణలో అక్రమాలు బయటపడి వారు సస్పెండ్ అయి బలి పశువులుగా మారారు. ► మార్కాపురం అధికార పార్టీ నేత భూసెటిల్‌మెంట్‌లో కీలకభూమిక పోషించిన మార్కాపురం డీఎస్పీ శ్రీహరిబాబు, ఎస్సై సుబ్బరావులు సస్పెండ్ అయ్యారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. ►చీరాల టీడీపీ నేత ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన ముగ్గురు సీఐలతో పాటు పలువురు అధికారులు సస్పెండ్ కావడమే కాకుండా వీఆర్‌కు వెళ్లారు. ►ఒంగోలు తహశీల్దారు శ్రీకాంత్ కేధారనా«థ్ డిసెంబర్ నెలలో సస్పెండ్ అయ్యారు. చెరువుకొమ్ముపాలెం భూమికి సంబంధించి పాస్‌బుక్‌లు మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని అప్పటి జిల్లా కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. టంగుటూరుకు చెందిన తహశీల్దార్ కామేశ్వరరావును ఇన్చార్జిగా నియమించగా ఆయన పని చేయలేక వెళ్లిపోయారు. ► కొత్తపట్నం తహశీల్దార్ రవిబాబును సైతం అప్పటి కలెక్టర్ సుజాతశర్మ సస్పెండ్ చేశారు. 115 ఎకరాల భూమిని 13 మందికి ఆన్లైన్ చేశారన్న కారణంతో ఈయన్ను సస్పెండ్ చేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లా కలెక్టర్ స్థాయి అధికార పార్టీ నేతలకు తలొగ్గి పని చేస్తుండటంతో జిల్లాలో కింది స్థాయి అధికారుల పరిస్థితి మరింత ఆధ్వానంగా మారింది. వారిలో అంతర్మథనం నెలకొంది. -
రుణ మాఫీ మాయ!
పొందూరు :స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జిల్లా అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 62 కుంటుంబాల వారితో పాటు 15 స్వయంశక్తి సంఘాల సభ్యులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది. ఎస్బీఐ శ్రీకాకుళం ఏడీబీ శాఖ, రాజాం ఎస్బీఐ, నరసన్నపేట ఎస్బీఐ, ఆమదాలవలస ఎస్బీఐ, కొత్తూరు ఎస్బీఐ శాఖలు సక్రమంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతంలోని మొత్తం 47 చేనేత కుటుంబాల వారికి మాఫీ జరిగింది. ప్రభుత్వం 2014 మార్చి 31 నాటికి రుణ బకాయిలు ఉన్న వారికి మాఫీని వర్తింపజేశారు. అయితే దేశంలోనే చేనేత రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిన తమకు అన్యాయం జరిగిందని పొందూరు చేనేత కార్మికులంతా వాపోతున్నారు. తమ సంక్షేమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం అత్యంత దారుణమని పేర్కొంటున్నారు. స్థానిక సారుుబాబా చేనేత సహకార సంఘం పరిధిలోని 40 కుటుంబాల వారికి 2008 నుంచి 2013 వరకు ఇచ్చిన రుణాలతో పాటు ప్రైవేటు రంగంలో మరో 22 కుటుంబాల వారికి అలాగే ఎస్‌హెచ్‌జీల కింద ఉన్న కార్మికులకు ఇచ్చిన రుణాలు మాఫీ కాలేదు. ఒక్కో చేనేత కార్మికుడు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలు తీసుకొన్నారు. కొన్నాళ్లుగా బకారుులను చెల్లించాలని బ్యాంకు అధికారులు విపరీతమైన ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. తాము పొదుపు చేసుకొన్న మొత్తాలను తమ అనుమతి లేకుండానే బకారుుల కింద దపదఫాలుగా జమ చేసుకొన్నారని కొందరు కార్మికులు ఆరోపించారు. బ్యాంకు నుంచి రుణ బకారుుల జాబితాలు జిల్లా పాలనా యంత్రాంగానికి పంపకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. జిల్లా అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇకనైనా బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే బకాయిలను పాక్షికంగా చెల్లించిన వారికి తిరిగి ఆ మొత్తాలను మాఫీలో భాగంగా వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. అనుమతి లేకుండానే... నా అనుమతి లేకుండానే పొదుపు ఖాతాలో రూ.3,400 మొత్తాన్ని బకాయి కింద జమ చేశారు. కనీస విలువలు పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా బ్యాంకు అధికారులు ప్రవర్తించారు. -మానెం పైడిరాజు, చేనేత కార్మికుడు కార్మికులకు న్యాయం జరిగే వరకు... కార్మికులకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తాం. జరిగిన అన్యాయంపై జిల్లా పాలనా యంత్రాంగానికి నివేదించాను. అలాగే జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు గుత్తి రాజారావు దృష్టికి తేగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్‌తో మాట్లాడతా. -గంప వీరభద్రస్వామి, అధ్యక్షుడు, సాయిబాబా చేనేత సహకార సంఘం, పొందూరు ఎల్డీఎం ఏమన్నారంటే... ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంకు శాఖ మేనేజర్ (ఎల్డీఎం) పి.వెంకటేశ్వరరావు వద్ద సాక్షి మంగళవారం ప్రస్తావించగా పొందూరు ఎస్బీఐ నిర్వాకంపై విచారణ జరిపించాలని ఎస్బీఐ జోనల్ (శ్రీకాకుళం) ఉన్నతాధికారులకు లేఖను పంపిస్తున్నట్టు వివరించారు. కార్మికులకు న్యాయం జరిగేం దుకు కృషి చేస్తామని చెప్పారు. -
కొరడా
♦ రైసు మిల్లులపై దాడులు ♦ రేషన్ బియ్యం కొనుగోళ్లపై తనిఖీలు ♦ మూడు బృందాల విచారణ పెద్దశంకరంపేట: పీడీఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో జిల్లా అధికారులు పేటలోని మూడు రైసుమిల్లులపై గత రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు రేషన్ బియ్యం సరఫరాపై విచారణ చేపడుతున్నారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అనుమానం వచ్చిన మిల్లులపై జిల్లా స్థాయి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ రూ.కోట్లు గడిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న పేట మండలంలోని మూడు రైసుమిల్లులపై ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నుంచి మూడు రైసుమిల్లుల్లో బస్తాలను అధికారులు లెక్కించారు. ఇతర రాష్ట్రాలనుంచి బియ్యం ఎగుమతిదిగుమతులవుతున్నాయని పలువురు పిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో జేసీ ఆదేశాల మేరకు రైసుమిల్లుల్లో అధికారులు సోదా నిర్వహించారు. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్లకు చెందిన తహశీల్దార్లు, సిద్దిపేట, సంగారెడ్డికి చెందిన ఏఎస్ఓల బృందం తనిఖీలు చేపట్టింది. గత అరు నెలల విద్యుత్ వాడకంపై కూడా అధికారులు విద్యుత్ శాఖ ఏఈ ద్వారా సమాచారం సేకరించారు. మిల్లర్లు వాడిన విద్యుత్, మర పట్టిన ధాన్యానికి గల తేడాలను అధికారులు గుర్తించారు. అధికారులు దాడులు చేయవచ్చనే సమాచారంతో ముందుగానే పీడీఎస్ బియ్యం లేకుండా మిల్లర్లు జాగ్రత్త పడినట్లు సమాచారం. -
ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..
-
ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..
- దళితుడినైనందుకే లెక్కచేయడం లేదా? - కరీంనగర్ జిల్లా అదికారులపై యువ ఎంపీ మండిపాటు కరీంనగర్: 'నేను ఈ జిల్లా ఎంపీనే. పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలోనే ఉంది. అయినా జిల్లాలో జరిగే చాలా కార్యక్రమాల గురించి నాకు సమాచారం ఇవ్వడం లేదు. మొన్న జాబ్‌మేళా జరిగితే పిలవనేలేదు. జిల్లాస్థాయి సమీక్షలకు సరైన సమాచారం లేదు. మొన్న కేంద్ర మంత్రి ఒకరు వచ్చిపోతే చెప్పలేదు. ఈరోజు కూడా మధ్యాహ్నం 2గంటలకు రమ్మని చెప్పి ముందే సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక అభివృద్ధి పనులపై సమాచారమే లేదు. శిలాఫలకాలు పెడుతున్నచోట తాటికాయంత అక్షరాలతో ఇతరుల పేర్లు పెడుతూ, నా పేరును మాత్రం చివరన చేరుస్తున్నారు? అసలు ఎంపీ అనే పదానికి గౌరవం కూడా ఇవ్వరా? పేరు చివరన శర్మ, రావు, రెడ్డి అని తగిలించుకుంటనే పిలిచి గౌరవిస్తారా? నా పేరు పక్కన అవేమీ లేవని పిలవడం లేదా? అసలేట్లా కన్పిస్తున్నాం మీకు... పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీస్ ఇస్తే మీరంతా ఢిల్లీలో నిలబడాల్సి వస్తుంది... ఏమనుకుంటున్నారో... జాగ్రత్త' ఇదీ.. టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేశం. శుక్రవారం కరీంనగర్ కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ పథకాలపై జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. తనను పట్టించుకోవడంలేదంటూ జిల్లా అధికారులపై మండిపడ్డారు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న తాను ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధగా ఉందని, అధికారుల తీరుకు నిరసనగా వాకౌట్ చేసి వెళ్దామని వచ్చానని, కానీ మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌లను చూశాక ఆ పని చేయలేకపోతున్నానని దగ్ధస్వరంతో అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ డాక్టర్ నాగేంద్ర తదితరులు హాజరయ్యారు. -
ప్యానల్ జాబితాకే పట్టం !
సెక్టోరియల్ ఆఫీసర్లుగా తీసుకోవాలని ఎస్పీడీ నిర్ణయం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)లో ఖాళీ అయిన సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీలో నెలకొన్న సందిగ్ధతకు అతి త్వరలోనే తెర పడనుంది. బయటి నుంచి కాకుండా ప్యానల్ జాబితాలో ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయిం చారు. జీసీడీఓ విజయకుమారి, సీఎంఓ దివాకర్‌రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ గురుప్రసాద్, అలెస్కో శ్రీనివాసరావు ఇటీవల రిలీవ్ అయ్యారు. వీరి స్థానాలు భర్తీ చే యడం ఆసక్తిగా మారింది. కొందరు టీచర్లు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తూ వచ్చారు. ఒక సామాజిక వర్గం వారు ఈ సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టులు తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ కీలక ప్రజాప్రతినిధులతో జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తూ వచ్చారు. తమకు అనుకూలమైన వారి పేర ్లతో జాబితా కూడా తయారు చేసి వీరినే సెక్టోరియల్ ఆఫీసర్లుగా నియమించాలంటూ ముఖ్య ప్రజాప్రతినిధి ద్వా రా కలెక్టర్‌కు, ఎస్పీడీకి కూడా పంపారు. ఇదే సమయం లో ప్యానెల్ జాబితా మేరకు భర్తీ చేయాలని సూచిస్తూ రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. జిల్లా అధికారులు కూడా దీనిపై ఆచీతూచి అడుగులేస్తూ వచ్చారు. విద్యాశాఖ అధికారులు మరోసారి ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ అధికారి ద్వారా మౌఖిక ఆదేశాలతో ప్యానెల్ జాబితాలో ఉన్న వారి పేర్లను సూచిస్తూ కలెక్టర్‌కు ఫైలు పెట్టడంతో ఆమోద ముద్ర పడింది. ఎస్పీడీ కూడా ఈ ఫైలుపై ఆమోద ముద్ర వేశారు. ప్యానల్జాబితా సీనియార్టీ మేరకు రొద్దం మండలం పెద్దమంతూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బీ. రవినాయక్, పుట్టపర్తి మండలం బీడుపల్లి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఎస్. గోపాల్‌నాయక్, విడపనకల్లు మండలం హావలిగి జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వెంకటరమణనాయక్, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వాణీదేవి నియామకం దాదాపు పూర్తయినట్లే. మరో నాలుగైదు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెల్లడయ్యే అకవాశం ఉంది. -
మంత్రి చెప్పారని..నగదు డ్రా!
- కురుడు పంచాయతీ నుంచి రూ. 15లక్షలు విత్‌డ్రా - ఎంపీడీవో సొంత ఖాతాలోకి జమ - విచారణ చేసేందుకూ భయపడుతున్న జిల్లా అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అధికారం ఉందికదా... ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నారో... ఏమో మంత్రిగారు చెప్పారని ఓ పంచాయతీనుంచి మొత్తం రూ. 15లక్షలు డ్రా చేసుకుని తన సొంతఖాతాలో జమచేసుకున్నారు. ఇది సాక్షాత్తూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళంజిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి ఎంపీడీఓ ఘనకార్యం. మంత్రిగారు వెనకున్నారని తెలుసుకున్న జిల్లా అధికారులు దీనిపై విచారణ చేపట్టేందుకు కూడా సాహసించడంలేదు. టెక్కలి నియోజకవర్గంలో సుమారు 120గ్రామాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సర్పంచ్‌లున్నారు. అంతకుమించి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన సర్పంచ్‌లూ ఉన్నారు. రాజకీయ కక్షతో గత సెప్టెంబర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీకి చెందిన 18మంది సర్పంచ్‌లకు చెక్ పవర్ తప్పించేశారు. పంచాయతీల అభివృద్ధి కోసం తీర్మానాలు చేపట్టి, పనుల వివరాలను స్థానిక అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేసి నిధుల్ని పక్కాగా వినియోగించుకోవాల్సిన స్థానిక సిబ్బంది ఇదే అదనుగా సర్పంచ్‌లు లేని చోట, చెక్ పవర్ రద్దయిన చోట తమ సత్తా చూపించుకుంటున్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి ఎంపీడీఓ బి.రాజులు కురుడు పంచాయతీ నిధులు రూ.15లక్షల్ని తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు. అసలేమైందంటే... కురుడు సర్పంచ్‌గా వైఎస్సార్సీపీకి చెందిన రొక్కం సూర్యప్రకాశరావు(జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు)కు రాజకీయ కక్షతో గత ఏడాది సెప్టెంబర్‌లో చెక్‌పవర్ రద్దు చేయించారు. అనంతరం మంత్రి కనుసన్నల్లో మార్చిలో రూ. 3లక్షల 25వేల పంచాయితీ నిధులు తప్పించేశారు. తాజాగా జూన్ 11వ తేదీన మంత్రి అనుచరుడు బోర నాగభూషణరావు పేరిట స్థానిక ఎంపీడీవో రాజులు రూ.15లక్షలు డ్రా చేయడమే గాకుండా కోటబొమ్మాళిలోని ఇండియన్బ్యాంకులోని తన సొంత ఖాతాలో జమ చేయించుకున్నారు. ఈ విషయం ట్రె జరీలో సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది. 13వ ఆర్థిక సంఘం నిధుల్ని అక్కడి ఎంపీడీవో 004287/846నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004288/847నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004289/849నంబర్ చెక్కుద్వారా రూ.2లక్షల 90వేలు, 004290/849 నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 30వేలు, 004291/850 నంబర్ చెక్ ద్వారా రూ.2లక్షలతోపాటు జూన్ 11, 2015త తేదీనే చెక్కులతో పాటు ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా మరో రూ.2లక్షలు డ్రా అయినట్టు జిల్లా ట్రెజరీ అధికారులు సహకార హక్కుచట్టం ద్వారా చేసిన వినతికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనిపై ఎంపీడీవోను అడిగితే ‘మంత్రిగారు డ్రా చేసుకోమన్నారు..డ్రా చేసుకున్నా’అని చెప్పడం గమనార్హం. మంత్రి కుటుంబీకులకు ఈ మొత్తాన్ని చేరవేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని స్థానికులు కొందరు జూన్ 24న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జెడ్పీ సీఈవోకు పరిశీలించాల్సిందిగా పంపించారు. జెడ్పీ సీఈవో టెక్కలి డీఎల్పీవోకు విచారణ చేయాలని అప్పగించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతీ లేదు. అయితే చేయని పనులు చేయించినట్టు ఇప్పుడు రికార్డులు సృష్టించే పనిలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. పాత తేదీలతో అంచనాలు తయారు చేయించేసి, ఎంబుక్‌ల నిర్వహణ, పనులు చేపట్టినట్టు రికార్డులు తయారు చేయించడానికి అక్కడి ఇంజినీర్లపైనా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జెడ్పీ సీఈవో, టెక్కలి డీఎల్పీవో, ఎంపీడీవోలను వివరణ కోరేందుకు సాక్షి పలుమార్లు ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదు. చర్యలెందుకు తీసుకోవట్లేదు? పంచాయితీ చట్టానికి విరుద్ధంగా డబ్బులు డ్రా చేయడం, నిధులు మళ్లించే అధికారం ఎంపీడీవోకు ఎవరిచ్చారు. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఎంపీడీవో ఇక్కడెన్నో దారుణాలకు ఒడిగడుతున్నా అడిగే నాథుడే లేడు. మొత్తం రూ.15లక్షలు మాయమైతే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావట్లేదు. - రొక్కం సూర్యప్రకాశరావు, సర్పంచ్, కురుడు గ్రామ పంచాయితీ -
ఈ పాస్ ఫెయిల్..అయినా రేషన్
ఈ నెలకు పాతపద్ధతిలోనే సరకుల పంపిణీ వేలిముద్రలు తీసుకుని పంపిణీకి పౌరసరఫరాల అధికారులకు ఆదేశం సాక్షి, విశాఖపట్నం : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) మిషన్లు జిల్లా ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మిషన్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ కావడం, సెల్నెట్వర్క్ పనిచేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా వినియోగ దారులు నరకంచూస్తున్నారు. ఈపాస్ మిషన్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని జిల్లాఅధికారులు తేల్చి చెప్పడంతో డీలర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆది నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీలర్లు పనిచేయని మిషన్లను మూలన పెట్టేస్తున్నారు. కొత్త విధానంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం 30 శాతం మంది కార్డుదారులు రేషన్‌కు నోచుకోలేదు. యలమంచిలి, అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం పట్టణాల్లో 274 షాపులపరిధిలో మిషన్లు పని చేయకపోయినా, సర్వర్లు ఇబ్బంది పెడుతున్నా అతికష్టమ్మీద ఇప్పటి వరకు 60 శాతం కార్డు దారులకు రేషన్ సరఫరా చేయగలిగారు. వీటిలో ఈపాస్ మిషన్ల ద్వారా 20 శాతం కార్డుదారులకు సరకులివ్వగా, మిగిలిన 40 శాతం కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఇక విశాఖలోని 412 రేషన్ షాపుల్లో కొత్త విధానాన్ని ఒకేసారి అమలు చేశారు. ఈ షాపుల పరిధిలో 3,71,625 కార్డులుండగా, ఇప్పటి వరకు అతికష్టమ్మీద 75వేల కార్డుదారులకు పంపిణీ చేయగా,మరో 1.19లక్షల కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరఫరా చేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీపరిధిలో 54 శాతం మంది కార్డు దారులకు సరకులు పంపిణీ చేశారు. రోజూ రేషన్‌దుకాణాలకు వందలాదిమంది కార్డుదారులు రావడం...గంటలతరబడి నిరీక్షించడం..చివరకు మిషన్లు పనిచేయక, సర్వర్లు డౌన్‌కావడం వంటిసమస్యలతో వెనుదిరిగడం పరిపాటిగా మారుతోంది. ముఖ్యంగారోజువారీ కూలీ పనులు చేసుకునే నిరుపేదల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గత పదిహేను రోజుల్లో సుమారు పదిరోజుల పాటు రేషన్‌షాపుల చుట్టూనే తిరగడం వలన జీవనోపాధి కోల్పోయే కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. మారుమూల ప్రాంతాల్లో తెల్లవారుజామున నెట్వర్క్ పనిచేస్తోంది. దీంతో కార్డుదారులను ఉదయమే రమ్మని చెప్పి స్లిప్‌లు ఇస్తుండడంతో వేకువజాము నుంచే షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. తాను వారం రోజులుగా క్రమం తప్పకుండా ఎఫ్పీషాపు చుట్టూ తిరుగు తున్నానని, ఒక రోజు సర్వర్ డౌన్ అయిందని..మరో రోజు నెట్వర్క్ లేదని.. ఇంకో రోజు మిషన్ పనిచేయడం లేదని తిప్పుతున్నారని..చివరకు వేలిముద్రలు తీసుకున్నా ఒకే కాక తర్వాత రమ్మని చెప్పి పంపిస్తున్నారని విశాఖ సీతమ్మధారకు చెందిన సీహెచ్ అప్పలనాయుడు వాపోయారు. ఇతర మున్సిపాల్టీల్లోనూ ఇదే దుస్థితి. దీంతో పాత పద్ధతిలోనే సరకులిచ్చేందుకు అనుమతులివ్వాలని డీలర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రభుత్వ ఈవిధానాన్ని పక్కన పెట్టేందుకు ససేమిరా అంటోంది. దీంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు గుర్తించినప్పటికీ జిల్లా అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. చివరకు వేలిముద్రలు తీసుకుంటే చాలు..మిషన్ ఫెయిల్ అయినా కార్డుదారులను తిప్పించుకోకుండా ఈ నెల వరకు సరకులు ఇవ్వా ల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ ఆదేశాలు జారీచేశారు. నాలుగు రోజుల నుంచి ఇదే ప్రక్రియలో సరకుల పంపిణీ వేగం పుంజుకుంది.ఈ పాస్ మిషన్లను పక్కన పెట్టయినా 25వ తేదీలోగా సరకుల పంపిణీ పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. -
ప్రశ్నల వర్షం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలైనా మండల స్థాయిలో చేపడుతున్న వివిధ పథకాల ప్రగతి నివేదికలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు తెలుపకపోవడంపై మండిపడ్డారు. మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు ఆ స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది. జెడ్పీ చైర్ పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖాశ్యాంనాయక్,విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నా రు. సభలో చర్చించాల్సిన 45అంశాలకు గాను నాలుగు అంశాలు మాత్రమే చర్చించారు. ము ఖ్యంగా వ్యవసాయ, విద్యుత్, గ్రామీణ నీటి స రఫరా, డ్వామా శాఖలపై లోతుగా చర్చించిన వైద్య ఆరోగ్య, విద్యా శాఖ, సర్వశిక్షా అభియా న్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిపింది. సమీక్షలో భాగంగా మంత్రి రామన్న మాట్లాడుతూ.. సర్వసభ్య సమావేశానికి సంబంధించి ప్రగతి నివేదికలు ఎంపీడీవోలకు అందజేయకపోవడంపై ఎంపీడీవోల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందోనని ఫైర్ అయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని జెడ్పీ సీఈవోకు సూచించారు. జిల్లా అధికారుల వద్ద ఇప్పటివరకు ఎంపీపీ, జెడ్పీటీసీల ఫోన్ నంబర్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మండల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని, అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మిషన్ కాకతీయలో భాగంగా వ్యవసాయ శాఖ కు కూడా బాధ్యతలు ఉన్నాయని, గ్రామాల్లో దీనిపై అవగాహన కల్పించి చెరువుల్లో నుంచి తీస్తున్న మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల కలిగే లాభాలను వివరించాలని ఆదేశాలు ఉన్నట్లు ఆ శాఖాధికారి రమేష్ పేర్కొన్నారు. ఇన్చార్జి ఏవో ఉండడంతో రైతులకు ఇబ్బందు లు తలెత్తుతున్నాయని, రెగ్యులర్ ఏవోని నియమించాలని కోటపల్లి జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలంలో 1500 ఎకరాల్లో ఈ యేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోగా, ఆ రైతులకు పరిహారం ఇప్పించాలని జెడ్పీటీసీ ఏమాజీ కోరారు. ఆన్లైన్లో భూమి రికార్డులు ఉన్నా కొన్నిచోట్ల పహనీలు ఇవ్వడం లేదని తెలిపారు. ఆత్మపై అసంతృప్తి.. వ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే వ్యవసాయ సాంకేతిక అభివృద్ధి యాజమాన్య సంస్థ (ఆత్మ) పై చర్చించారు. మండలాల్లో సభ్యులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా కమిటీలు ఏర్పాటు చేశారని మంచిర్యాల జెడ్పీటీసీ పేర్కొన్నారు. ఆత్మ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల ప్రగతిపై ఎందుకు సమాచారం ఉండడం లేదని మంత్రి జోగురామన్న పీడీ మనోహర్‌ను ప్రశ్నించారు. ఇకపై మండలస్థాయిలో చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని సభ్యులకు తెలియజేయాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్‌పై గరం గరం.. విద్యుత్ శాఖపై సభ్యులు గరమయ్యారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదంటే ఎలా అని మంత్రి రామన్న ప్రశ్నించారు. దాని బాధ్యత ట్రాన్స్‌కో ఎస్ఈపై ఉందని కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడలో సబ్ స్టేషన్ కోసం స్థలం ఉన్నా నిర్మాణంలో ఆలస్యమవుతోందని ఆ మండల జెడ్పీటీసీ వివరించారు. బెల్లంపల్లిలోని గుర్జాలలో విద్యుత్ లైన్లు వేసినా విద్యుత్ సరఫరా కావడం లేదని తెలిపారు. బె ల్లంపల్లి పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బోర్లు వేసేందుకు పరిపాలన అనుమతి లభించినా.. ఇప్పటివరకు వచ్చిన నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు. జన్నారం మండలంలో బుడగజంగాలకు విద్యుత్ ఇవ్వడం లేదని, బేలలోని చప్రాలలో ఇప్పటివరకు సబ్‌స్టేషన్ పనులు ప్రారంభంకాలేదని ఆయా జెడ్పీటీసీలు తెలిపారు. వేమనపల్లి మండలంలో అక్రమ కనెక్షన్లు ఉన్నా వాటిని ఎందుకు తొలగించడం లేదని, అక్రమ కనెక్షన్లు ఉన్న వారితో డీడీలు కట్టించి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఎస్ఈకు సూచిం చారు. ఖానాపూర్ మండలంలోని చాలా గ్రామా లు విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చా రు. బెల్లంపల్లిలో ఇందిర జలప్రభ కింద బోర్లు వేసినా కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేం దుకు ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేస్తామని, ఇందుకు మంత్రి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇందిర జలప్రభ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతుల వ్యవసాయ భూముల్లో ఇప్పటివరకు మొత్తం 2,400 బోర్లు వేయగా, 700 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు డబ్బులు చెల్లించగా, కేవలం 621 బోర్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారని, మిగితా వాటికి ఇంకెంత సమయం పడుతుందని మంత్రి ప్రశ్నించారు. ఈయేడాదిలో పూర్తి చేస్తామని ఎస్ఈ వివరించారు. నార్నూర్‌లోని జక్కెపల్లిలో త్రీఫేజ్ కరెంటు సౌకర్యం లేదని, అక్కడ మొత్తం కర్ర స్తంభాలతో విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామీణ నీటి సరఫరా.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి జోగురామన్న ఆదేశించారు. ఇందుకు నియోజకవర్గా ల వారీగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, జెడ్పీటీసీలు, అధికారులు సమావేశాలు నిర్వహించాల ని పేర్కొన్నారు. చర్చలో భాగంగా మంచిర్యాల లోని నస్పూర్‌లో ట్యాంక్ నిర్మాణాలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ దక్కించుకుంటే వేరే వ్యక్తి ఆ పనులు చేస్తున్నాడని, ఇది అధికారులకు తె లియదా అని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకొచ్చారు. దిలావర్పూర్లో నాలుగు మంచినీటి ట్యాంకులు ఉన్నా నీరు లేదని, ఇంద్రవెల్లిలోని భీంనగర్, మిలిన్నగర్లలో ట్యాంకుల మరమ్మతు చేయించాలని ఆయా మండలాల జెడ్పీటీసీలు కోరారు. చెన్నూర్ ప్రజలకు గోదావరి తాగునీరు అందించేందుకు పైపులైన్ పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ఆ మండల జెడ్పీటీసీ పేర్కొన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, విద్యుత్ కనెక్షన్లు ఉన్నచోటా ట్యాంకులు పనిచేయడం లేదని, మంచినీటి ట్యాంకులు ఉన్నచోట విద్యుత్ కనెక్షన్లు లేవని, ఈ రెండు ఉన్న చోట పైపులైన్లు సరిగా లేక తాగునీరు రావడం లేదని ఎమ్మెల్యే రేఖానాయక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కుంటాలలో పైపులైన్ వేసేందుకు డబ్బులు చెల్లించారో లేదో వారికే స్పష్టత లేదని మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యారోగ్య, విద్య శాఖలపై ప్రశ్నల వర్షం వైద్య, ఆరోగ్య, విద్యా శాఖల అధికారులపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. బజార్హత్నూర్ మండలంలో ఉన్న 35 పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరు కాగా, ఏ పాఠశాలలో కూడా ప్రారంభం కాలేదన్నారు. రామకృష్ణపూర్‌లోని క్యాతన్‌పల్లి పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డు కూడా లేదని పేర్కొన్నారు. కోటపల్లిలోని ఎసర్వాయి గ్రామంలో చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారని ఆయా మండలాల జెడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. బేలలో మోడల్ స్కూల్ నిర్మాణానికి స్థలం ఉందని, అది కొంత దూరంలో ఉందని తెలిపారు. మంజూరైన వెంటనే నిర్మాణ పనులు చేపడతామని డీఈవో సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. రెబ్బెన పాఠశాలలో హెచ్ఎం సహకరించడం లేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ మండల జెడ్పీటీసీ కోరారు. లక్ష్మణచాందలో వైద్యాధికారి లేడని అక్కడి జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకురాగా.. వైద్యాధికారి ఉన్నారని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ తెలిపారు. సర్వశిక్షా అభియాన్, స్త్రీ, శిశు సంక్షేమంపై.. అనంతరం సర్వశిక్షా అభియాన్, వయోజన విద్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలపై అంతంత మాత్రంగానే సమీక్ష జరిగింది. లక్ష్మణచాంద మండలంలో 14 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తీసుకువచ్చారు. కైలాస్‌నగర్‌లో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా వాటితో ప్రయోజనం లేకుండాపోయిందని జెడ్పీటీసీలు తెలిపారు. కొన్ని మండలాల్లో వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని పలువురు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులను నియమించామని, విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జగన్మోహన్ వివరించారు. ఆటాడుకుందాం రా..! జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలను చర్చిస్తుండగా.. మరోపక్క కొందరు అధికారులు సెల్ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కనిపించారు.. ఇంకొందరు సమావేశ హాల్లో సెల్ఫోన్లను శుభ్రం చేస్తూ కనిపించారు. రాష్ట్ర మంత్రి, కలెక్టర్, జెడ్పీ సీఈవోలు పలుమార్లు అధికారులకు చెప్పినా వీరు మాత్రం ఇలా ఆటలపైనే దృష్టి పెట్టారు. -
ప్లీజ్..22 తర్వాత కలవండి!
ఇందూరు : ‘మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా ఇస్తాం.. కానీ ఏమనుకోకుండా ఈనెల 22 తర్వాత కలవండి. అప్పుడు ఏ పని కావాలంటే అది చేసిస్తాం..’ ప్రస్తుతం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అధికారులు, సిబ్బంది దాదాపు ఇదే సమాధానాలు చెబుతున్నారు. వారి దృష్టంతా ఇప్పుడు సీఎం కేసీఆర్ పర్యటనపైనే ఉంది. ఆయన ఈనెల 22న జిల్లాకు రానున్నారు. ఇంకా ఒకేరోజు సమయం ఉండటంతో జిల్లాస్థాయి అధికారులు కలెక్టర్ నిర్వహించే సమీక్షల్లో పాల్గొనడంతో పాటు నివేదికల తయారీలో తలమునకలై ఉన్నారు. క్షణం తీరిక లేకుండా తమ సిబ్బందితో సీఎం ఏ శాఖపై ఎప్పుడు వివరాలు అడిగినా చెప్పేలా.. నివేదికల రూపంలో చూపేలా సిద్ధమవుతున్నారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి అమలు తీరు, లబ్ధిదారుల వివరాలను మొత్తం సేకరించి తప్పులు లేకుండా సిద్ధం చేస్తున్నారు. రెండు రోజులుగా సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ శాఖల వారీగా సమాచారం పక్కాగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత సంవత్సరంతో పాటు ప్రస్తుత సంవత్సరానికి చెందిన పథకాల అమలు, నిధులు, పోస్టుల ఖాళీలు సమగ్ర నివేదికలను సెక్షన్ ఉద్యోగుల ద్వారా తయారు చేయిస్తున్నారు. బిజీగా ఉన్నాం.. ప్రభుత్వ శాఖలో ఎవరిని కదిలించిన సీఎం నోట్స్ తయారు చేస్తున్నాం... కొద్దిగా బిజీగా ఉన్నాం... అనే మాటనే వినిపిస్తోంది. సీఎం పర్యటన బాధ్యతలను చూస్తున్న జిల్లా రెవెన్యూ శాఖ అధికారులైతే ఫైళ్లతో కుస్తీ పడుతున్నారు. తమ శాఖకు సంబంధించిన భూ పంపిణీ తదితర వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. ప్రధాన సమస్యగా మారిన పింఛన్ల పంపిణీ విషయంలో ఐకేపీ, డీఆర్డీఏ అధికారులు సవాల్‌గా తీసుకుంటున్నారు. స్వయంగా కలెక్టరే ఈ విషయంలో ప్రాధాన్యతనిచ్చి.. జిల్లాలో ఇప్పటి వరకు మంజూరైన పెన్షన్లు, నిలిచినవి, దరఖాస్తుల సంఖ్య తదితర వివరాలను సేకరిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు, పూర్తి చేసిన లక్ష్యం లాంటి సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు వచ్చిన నిధులు, ఇంకా కావాల్సిన నిధుల వివరాలతో పాటు సంక్షేమ వసతిగృహాల వివరాలు, విద్యార్థుల సంఖ్య, కొత్త భవనాల నిర్మాణాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల పథకాల సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కార్పొరేషన్ శాఖలైతే ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు, మంజురైన నిధులు, ఇంకా కావాల్సిన రుణాల వివరాలు, సాధించిన ప్రగతిని కాగితాల్లోకి ఎక్కిస్తున్నారు. డ్వామా కార్యాలయంలో నుంచి ఉపాధి పనులు, నర్సరీల పెంపకం, జిల్లా పరిషత్ నుంచి బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులు, పనులు, పంచాయత్‌రాజ్ శాఖ నుంచి నిర్మిస్తున్న భవనాలు, గ్రామీణ రహదారుల వివరాలు, వచ్చిన నిధులు నివేదికల రూపంలో తయారు చేస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీల్లో అమలవుతున్న ఆరోగ్య లక్ష్మి పథకం, బంగారు తల్లి, బాలల సంరక్షణ విభాగం, ఇతర వివరాలు సిద్దం చేస్తున్నారు. ఇటు జిల్లా పంచాయతీ శాఖ అధికారులు ఈ- పంచాయతీ అమలుపై సమగ్ర నివేధికలు రూపొందిస్తున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మరుగుదొడ్లు, నీటి ట్యాంకుల నిర్మాణాలు, పైపు లైన్లు, వాటర్ గ్రీడ్ సర్వే వివరాలను సమగ్రంగా నివేధిలో పొందుపరుస్తున్నారు. వైద్య, ఆరోగ్య, ఆర్వీఎం, శాఖల అధికారులు పాఠశాలలు, ఆసుపత్రుల సౌకర్యాలు, వైద్యులు, టీచర్ల వివరాలను డివిజన్ల వారీగా తయారు చేశారు. వ్యవసాయ శాఖ, హర్టికల్చర్ అధికారులూ సీఎం పర్యటనకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డికి చక్కర్లు సీఎం కేసీఆర్ కామారెడ్డికి రానున్న నేపథ్యంలో అక్కడి మండల అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న అంగన్వాడీలు, పాఠశాలలు, ఆసుపత్రిలు, వసతిగృహాలు, పోలీసు స్టేషన్లు, ఇతర శాఖలకు సంబంధించిన వాటిలో లోటుపాట్లు లేకుండా చూసుకోవడానికి జిల్లా అధికారులు రెండు రోజులుగా కామారెడ్డికి చక్కర్లు కొడుతున్నారు. సీఎం పర్యటనలో లోటుపాట్లు తలెత్తకుండా క్షేత్ర స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. -
జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి
* ఓటర్ల నమోదుకు ఆధార్ తప్పనిసరి * జనవరి 16న కొత్త ఓటర్ల జాబితా ప్రకటన * జిల్లా ఓటర్ల జాబితా సవరణ పరిశీలకుడు డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి సాక్షి, విశాఖపట్నం: త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా ఓటర్ల జాబితా సవరణ పరిశీలకుడు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలతో ఓటర్ల జాబితా సవరణపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 16న ఓటర్ల జాబితా ప్రకటించనున్నందున నగర పరిధిలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలన్నారు. నకిలీ ఓటర్లు, డూప్లికేషన్ నివారించేందుకు ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ పలు పార్టీల ప్రతినిధులు సూచించగా, ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి నిర్ణయం మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ నవంబర్ 13 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు క్లైమ్లు, అభ్యంతరాలను తీసుకుంటున్నామన్నారు. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 13,14 తేదీల్లో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ప్రత్యేక క్యాంపైన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 28లోపు వీటిని పరిశీలించి జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులో ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్నామన్నారు. ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో తగినన్ని పోలింగ్ స్టేషన్లను ఉన్నాయని, అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 2.50 లక్షల నకిలీ కార్డులున్నట్టుగా ఆరోపణలున్నాయని, వాటి తొలగింపుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పక్కి దివాకర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎస్.సుధాకర్ సూచించారు. బీజేపీ, సీపీఐ, బీఎస్పీ నాయకులు బి.ఎస్.నాయుడు, డి.మార్కండేయులు, జార్జి బంగారి తదితరులు పలు సూచనలు చేశారు. ఏజేసీ డి.వి.రెడ్డి, డీఆర్వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
అధికారుల సరెం‘డర్’
ముకరంపుర : పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యహరించిన జిల్లా అధికారులపై వేటు పడుతోంది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. రెండురోజుల్లోనే జిల్లాలో కీలకమైన ఇద్దరు అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పరిపాలనా పరమైన అలసత్వం కారణంగా గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణశర్మను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆసరా పథకంలో భాగంగా పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంపై ఇప్పటికే హుస్నాబాద్ నగర పంచాయతీ కమిషనర్ ఎం.సుధాకర్‌గౌడ్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. పింఛన్ల పంపిణీ విషయంలో హుస్నాబాద్‌లో జరుగుతున్న ఆందోళన దృష్ట్యా అక్కడికి కలెక్టర్ వెళ్లిన రోజు కమిషనర్ సెలవు పెట్టి వెళ్లారు. పింఛన్ల మంజూరు విషయంలో స్పష్టమైన జవాబు ఇవ్వకపోవడం.. రావాలని ఆదేశించినా బేఖాతరు చేయడంతో ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో హుస్నాబాద్ నగరపంచాయతీ మేనేజర్ స్వరూపారాణిని ఇన్చార్జిగా నియమించారు. గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ శర్మపై వేటు వేశారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ వీరబ్రహ్మయ్య త్తర్వులు జారీ చేశారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ విషయంలో పరిపాలనాపరమైన అలసత్వం కారణంగా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు మేరకు ఆయనను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ శోభను ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఇన్చార్జి బాద్యతలు అప్పగించారు. ప్రభుత్వ పథకాలు అర్హుల దరికి చేరడం లేదంటూ ఓవైపు ప్రతిపక్షాలు, మరోవైపు ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుండడంతో ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరాతీస్తోంది. ఈ క్రమంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై హెచ్చరికలు లేకుండానే వేటువేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ జిల్లాలో పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారుల పనితీరుపై నిఘా పెంచారు. సరెండర్ చేసిన అధికారులపై ఆయా శాఖల కమిషనరేట్‌లోని ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనుంది. హుస్నాబాద్ నగరపంచాయతీ కమిషనర్ సుధాకర్‌పై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు సైతం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఆయనను సస్పెన్షన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలోని ఆయా శాఖల అధికారుల్లో సరెండర్ గుబులు రేపుతోంది. -
మళ్లీ నగదు బదిలీ
ఆదిలాబాద్ అర్బన్ : నగదు బదిలీ పథకం జిల్లాలో మళ్లీ అమల్లోకి రానుంది. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లకు ఈ నెల 15 నుంచి వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో మొదటగా సెప్టెంబర్ 2013 నుంచి నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. పథకం అమలులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్రమంత్రివర్గం గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ లింక్‌ను తొలగిస్తూ 2014 జనవరిలో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి తొమ్మిది నెలలపాటు ప్రభుత్వం వంటగ్యాస్‌కు ఎలాంటి లింక్ పెట్టలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నగదు బదిలీ పథకం ప్రయోగాత్మకంగా అమలు కానుంది. దేశంలో 54 జిల్లాలు ఎంపిక చేయగా.. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పులతో ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. 3.75 లక్షల గ్యాస్ కనెక్షన్లు.. జిల్లాలో 3.75 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 90 శాతం మంది లబ్ధిదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకున్నారు. 3,37,500 మంది గ్యాస్ కనెక్షన్లు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీరు గతంలో నగదు బదిలీ ద్వారా సిలిండర్లు పొందిన వారే. మిగితా 37,500 కనెక్షన్లకు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబర్లు లేవు. వీరు గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అనుసంధాన ప్రక్రియ ద్వారా గతంలో 75 వేలకుపైగా కనెక్షన్లను బోగస్‌గా గుర్తించారు. ప్రస్తుతం 14.2 కేజీలు ఉండే ఒక్కో సిలిండర్ ధర రూ.445.50గా ఉంది. నగదు బదిలీతో ఆ ధర రూ.975కు పెరగనుంది. మిగితా సబ్సిడీ సొమ్ము రూ.529.50 ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. ఇప్పుడున్న సిలిండర్ ధరనే పేదలకు భారమనుకుంటే ఇక నుంచి పూర్తి సిలిండర్ ధరను ఒకేసారి చెల్లించాలంటే పేదలకు తలకు మించిన భారం అవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ లేకున్నా గ్యాస్... సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు ఆధార్ లింక్ లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుని బ్యాంకు ఖాతా గ్యాస్‌కు అనుసంధానమై ఉండాలి. మరో మూడు నెలల వరకు ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్నే అమలు చేస్తారు. అనంతరం గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల తర్వాత అనుసంధానం కానట్లయితే ఆ కనెక్షన్‌కు గ్యాస్ సరఫరా నిలిపివేస్తారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నగదు బదిలీ విషయమై ఆయిల్ కంపెనీల యాజమానులు, సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలెక్టర్ ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నారు. మూడు నెలలు తీసుకోవచ్చు - వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎస్వో ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం లేకున్నా ఇప్పుడు తీసుకుంటున్న విధంగానే మరో మూడు నెలలు గ్యాస్ తీసుకోవచ్చు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధార్ లేకున్నా ఫర్వాలేదు. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. ఈ మూడు నెలల్లో గ్యాస్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం చేయించుకోవాలి. అనంతరం నగదు బదిలీ వర్తిస్తుంది. నగదు బదిలీకి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. -
అనంత టు విజయవాడ
జిల్లా సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చెక్‌పోస్టు పరిధిలోని కోడూరు నుంచి పుట్టపర్తి, ధర్మవరం, బత్తలపల్లి, నాయనపల్లి క్రాస్, తాడిపత్రి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, నంద్యాల, ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, తోకపల్లి మీదుగా గుంటూరు, విజయవాడకు 570 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేయనున్నారు. సాక్షి, అనంతపురం : రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో సీమ జిల్లాల నుంచి అక్కడికి వెళ్లేందుకు ప్రధాన రహదారి మార్గాన్ని సూచిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం పేషీ నుంచి జిల్లా జాతీయ రహదారులు అధికారులకు అందిన ఆదేశాల మేరకు వారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రస్తుతం ఆ ఫైలు కేంద్ర ట్రాన్స్‌పోర్టు కమిషనర్ నితిన్ గడ్కారి పరిశీలనకు వెళ్లింది. వివరాల్లోకెళ్తే.. ఏప్రాంతమైనా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గంతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అవసరం. ఈ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఎక్కడికక్కడ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను రోడ్డు మార్గంతో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేస్తూ.. క్రిష్ణా జిల్లాలోని క్రిష్ణపట్నం, బందరు పోర్టులను అనుసంధానించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్అండ్బి రోడ్లను జాతీయ రహదారులుగా మార్పు చేయడానికి అనుమతి కోరుతూ.. కేంద్ర ట్రాన్స్‌పోర్టు మంత్రి నితిన్ గడ్కారికి ఫైలును పంపించారు. ప్రస్తుతం ఆ ఫైలు ఆయన వద్ద పెండింగ్‌లో ఉంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే భూసేకరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అయితే అధికారులు తయారు చేసిన రూట్ మ్యాప్‌లో ఐదు జిల్లాలు కవర్ కానున్నాయి. అనంతపురం జిల్లాలో కవర్ అవుతున్న కోడూరు, పుట్టపర్తి, ధర్మవరం, బత్తలపల్లి, నాయనపల్లిక్రాస్,తాడిపత్రి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా మారనుంది. మంగళూరు పోర్టుకు మరో మార్గం రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అని తేలిపోవడంతో కర్ణాటకలోని మంగళూరు పోర్టు నుంచి నిజాం పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా మార్గాన్ని సర్వే చేయించాలన్న ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం జాతీయ రహదారుల అధికారులను సర్వేకు ఆదేశించింది. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు జిల్లా సరిహద్దులోని కోడూరు నుంచి లేపాక్షి, హిందూపురం, మడకశిర మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని శిర నుంచి మంగళూరు పోర్టు, అక్కడి నుంచి నిజాంపోర్టుకు రహదారులను అనుసంధానం చేస్తూ అధికారులు మారో రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ ఫైలు కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రి అనుమతి కోసం వేచి ఉంది. ప్రతిపాదనలు పంపాము.. రాజధానిగా విజయవాడను ప్రకటించాక.. అనంతపురం జిల్లా నుంచి విజయవాడకు దగ్గర మార్గం చూపిస్తూ ప్రతిపాదనలు పంపించాలని సీఎం పేషీ నుంచి మాకు అదేశాలు వచ్చాయి. ఆ మేరకు సర్వే చేసి 570 కిలోమీటర్ల మేర రహదారిని సూచిస్తూ ప్రతిపాదనలు పంపా ము. ఈ రహదారి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి గడ్కారీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. - వైఆర్ సుబ్రమణ్యం, ఎన్‌హెచ్ అనంతపురం సర్కిల్ ఎస్ఈ -
విజృంభిస్తున్న విష జ్వరాలు
కర్నూలు (హాస్పిటల్)/ బనగానపల్లె టౌన్: జిల్లాలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ జబ్బున పడుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వర బాధితులు ఎక్కువవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 320 డెంగీ కేసులు నమోదయ్యాయి. మొన్న మంత్రాలయం మండలంలో డెంగీ లక్షణాలతో ఇద్దరు చిన్నారులు, నిన్న సి. బెళగల్ మండలంలో తొమ్మిది నెలల పాప, బుధవారం బనగానపల్లె మండలంలో ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డారు. అభం, శుభం తెలియని పిల్లలు అకాల మరణం చెందుతున్నా జిల్లా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయని బాధితులు వాపోతున్నారు. బనగానపల్లె మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రెండు వారాలుగా విష జ్వరాలు అదుపులోకి రావడం లేదు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండాపోయింది. డెంగీ వ్యాధి లక్షణాలతో షఫియా ఉరఫ్ చాంద్‌బీ (5) బుధవారం మృతి చెందింది. గామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన గౌండ కార్మికుడు మహమ్మద్‌గౌస్, మెహ్రున్బీ దంపతులకు కొడుకు హుస్సేన్‌బాష, కూతురు చాంద్‌బీ సంతానం. చిన్నారికి నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో బనగానపల్లెలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో వైద్యుల సూచన మేరకు ఈ నెల 2న కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చాంద్‌బీకి రక్త పరీక్షలు నిర్వహించి, ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మందులు రాసి ఇంటికి పంపించారు. అదే రోజు గ్రామానికి వచ్చిన తరువాత రాత్రి జ్వరం ఎక్కువ కావడంతో వెంటనే నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. అక్కడి వైద్యులు చిన్నారికి రక్త పరీక్షలు నిర్వహించి, రక్త కణాల శాతం తక్కువగా ఉందని, వెంటనే కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. కర్నూలు రెయిన్బో హ స్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ చేర్చుకోకపోవడంతో నగరంలోని జీవీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం ఉదయం చాంద్‌బీ మృతి చెందింది. డెంగీ లక్షణాలతోనే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్యసేవలందించి ఉంటే తమ బిడ్డ బతికేదని మృతురాలి బంధువులు వాపోయారు. ఇటీవలే కృష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల గ్రామానికి చెందిన బోయ సూరి(6) అనే బాలుడు జ్వరం వచ్చి మృతి చెందాడు. జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మలేరియా కూడా విజృంభిస్తోంది. భయం..భయం.. ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రెండు వారాలుగా జ్వరాలు అదుపుకాకపోవడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. గత నెల 16వ తేదీ నుంచి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినా జ్వరాలు తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాదాపు 70 మంది వరకు విష జ్వరాల బారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 30న డీఎంహెచ్ఓ నరసింహులు గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. గ్రామంలో సాధారణ జ్వరాలే ప్రబలుతున్నాయని, గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవరసరం లేదని చెప్పారు. అయితే రోజు రోజుకు బాధితుల సంఖ్య అధికం కావడం, డెంగీ వ్యాధి లక్షణాలతో ఓ చిన్నారి మృతి చెందడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి విష జ్వరాలను అదుపులోకి తేవాలని, గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరుచాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్యలోపమే ప్రధాన సమస్య.. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటమే విషజ్వరాలు ప్రబలేందుకు కారణమవుతోంది. కృష్ణగిరి మండలం బోయ బొంతిరాళ్ల గ్రామంలో 250 గృహాలు ఉన్నాయి. గ్రామంలో 1200 మంది నివశిస్తున్నారు. మురుగు కాల్వ వ్యవస్థ లేదు. దీంతో ఇళ్ల ముందే మురుగు నీరు నిలిచి అస్తవ్యస్తంగా ఉంది. ఒక బాలుడు మృతి చెందిన తర్వాత పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పారిశుధ్యం పనులు చేపడుతున్నారు. అలాగే ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ గ్రామంలో 3,800 మంది నివాసం ఉంటున్నారు. రోడ్డు పక్కన పాడు పడిన బావి దోమలకు అవాసంగా మారింది. అనేక చోట్ల నీళ్లు నిలిచి దోమల స్వైర విహారం చేస్తున్నాయి. ఐ.కొత్తపేట, అల్లినగరం, నేమకల్లు, కందనకుర్తి, అలువాలు ఇలా అనేక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. తీవ్రమైన జ్వరాలతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ మూడో దశ ప్రమాదకరం - అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజా సుబ్బారావు : జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. మలేరియా విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. డెంగీ(వైరల్ ఫీవర్) విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మొదటి, రెండు దశల్లో వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది. మూడో దశలో రోగి సొమ్మసిల్లిపోతాడు. ఇది ప్రమాదకరమైన దశ. అయితే డెంగీని నిర్ధారించే పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. పెద్దాసుపత్రిలో అన్ని అసౌకర్యాలు ఉన్నాయి - డాక్టర్ ఉమామహేశ్వర్, సూపరింటెండెంట్, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పెద్దాసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కర్నూలు వైద్యశాల ఆధ్వర్యంలో మైక్రోబయాలజీ(ప్రయోగశాల) విభాగం ఉంది. డెంగీ బాధితుని రక్తనమూనా తీసుకుని ఇక్కడ పరీక్ష చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ అవకాశం లేదు. వివిధ రకాల జ్వరాలతో బాధ పడుతున్న రోగులకు వైద్యపరీక్షలు, సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో మెడికల్ ఓపీలో జ్వరం బారిన పడినవారు వస్తున్నారు. ఇక్కడ మందుల సమస్య లేదు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి... అనాఫిలస్కులిసిఫెసిస్ అన్న దోమ వల్ల మలేరియా జ్వరం వస్తుంది. రాత్రి వేళల్లో ఇది కుడుతుంది. ఎడిస్ ఇజప్టస్ అన్న దోమ వల్ల డెంగీ జ్వరం వస్తుంది. పగలు మాత్రమే ఇది కుడుతుంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.మురికినీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలి.ఉదయం పూట నిద్రించే గర్భవతులు, బాలింతలు, రోగులు, పిల్లలు, వృద్ధులు మస్కిటో కాయిల్స్ తప్పనిసరిగా వాడాలి.పిల్లలు.. శరీరం అంతా కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలి. -
సుజల స్రవంతికి సన్నాహాలు
226 గ్రామాల్లో ఏర్పాటుకు చర్యలు రూ.2కే 20 లీటర్లు తాగునీరు యూనిట్ ధర రూ.4.5 నుంచి రూ.10 లక్షలు విశాఖ రూరల్ : ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రక్షిత తాగునీటి సరఫరాకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలి దశలో 226 గ్రామాల్లో దీని అమలుకు చర్యలు చేపట్టారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అంతకు ముందే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో రూ.2కే 20 లీటర్లు తాగునీటిని సరఫరా చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అందరికీ రక్షిత తాగునీటిని సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి నిధులు ఇవ్వలేదు. ఈ బాధ్యతలను కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో ఎక్కువగా నీటి ఎద్దడిని ఎదుర్కొనే గ్రామాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 226 గ్రామాల్లో పథకం అమలు జిల్లాలో 376 గ్రామాల్లో తాగునీటి సరఫరా యూనిట్లు ఏర్పాటుకు అధికారులు నిర్ణయిం చారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో ప్రత్యే క సమావేశం నిర్వహించారు. ఈ పథకం తీరుతెన్నులను వివరించి సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేయాలని సూచించారు. 156 పరిశ్రమలు, సంస్థలు ఇందుకు ముందుకు వచ్చాయి. జిల్లాలో తొలి దశలో 226 గ్రామా ల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏజెన్సీలో 50 గ్రామాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేసి రూ.2కే 20 లీటర్ల తాగునీటి సరఫరా చేయనున్నారు. యూనిట్లకు రాయితీలు సరఫరా సామర్థ్యం మేరకు యూనిట్ ధర రూ.4.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చుతో పాటు నిర్వహణ బాధ్యత ఆయా కంపెనీలదే. అయితే కొన్ని చోట్ల నిర్వహణను పంచాయతీలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ యూనిట్ల నిర్వహణకు ప్రధాన ఖర్చు విద్యుత్. ఈ విద్యుత్ వినియోగ ఖర్చులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. అలాగే ఈ యూనిట్లను ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా పాఠశాలల్లోను, వసతి గృహాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఆయా పాఠశాలకు మంచి నీటి సరఫరా ఇబ్బందులు ఉండవని కలెక్టర్ భావిస్తున్నారు. త్వరలోనే గ్రామాల్లో యూనిట్ల ఏర్పాటుకు స్థలాలను ఖరారు చేసి అక్టోబర్ రెండో తేదీ లోగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. -
పాలమూరు రైతునోట్లో మట్టి
ఉప్పునుంతల: డిండి ప్రాజెక్టు నీటి వినియోగంలో పొరుగు జిల్లా అధికారులు పాలమూరు రైతుల నోట్లో మరోసారి మట్టికొట్టారు. డిండి కుడికాలువ ద్వారా నీరు అధికంగా వెళ్తుందని షట్టర్ వద్ద తిరిగి మట్టిని పోయించడంతో కాలువ ద్వారా చుక్కనీరు రావడంలేదు. దీంతో ఖరీఫ్ వరిపంటపై ఆయకట్టు రైతుల ఆశలు అవిరయ్యే పరిస్థితులు దాపురించాయి. గత నెల 26న డిండి ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు పొలాలకు నీరు వదిలారు. ఆ సమయంలో పాలమూరు జిల్లా పరిధిలోని లత్తీపూర్, గువ్వలోనిపలి శివారులలో కుడి కాలువ ద్వారా 330ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేసే షెట్టర్ (తూము) మట్టిలో కూరుకుపోవడంతో నీటి విడుదల కష్టంగా మారింది. దీంతో పదిరోజుల పాటు ఆయకట్టు రైతులు షెట్టర్‌ను కదిలించడానికి అష్టకష్టాలు పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులుతో మాట్లాడి ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రైతులు, ఇరిగేషన్ అధికారుల చివరి ప్రయత్నంగా బోరుబండి కంప్రెషర్ పైపును నీటిలోకి వదిలి షెట్టర్ వద్ద మట్టిని కదిలించడంతో షెట్టర్ కొంతమేర పైకి లేచింది. ఆ ప్రాంతంలో మట్టి, రాళ్లు ఉండడంతో షెట్టర్ కిందకు పోలేదు. దీంతో నీరు అధికంగా వచ్చి వృథా అయ్యాయి. దీంతో నల్లగొండ జిల్లా రైతులు పాలమూరు జిల్లా పరిధిలో డిండి ప్రాజెక్టు నీళ్లు వృథాగా పోతున్నాయని ఆ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్ అధికారులు కుడికాలువ షెట్టర్ వద్ద తిరిగి మట్టిని, రాళ్లను వేయించడంతో కాలువ వెంట నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వారం రోజుల పాటు నీళ్లు రావడంతో వరి నారుమళ్లు పోసుకుందామని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు నీటి సరఫరా రాకుండా చేయడంతో అన్నదాతలు ఆశలు అడియాశలయ్యాయి. డిండి ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు నల్లగొండ జిల్లాకు చెందిన వారు కావడం... పాలమూరు జిల్లా అధికారులు రైతుల ఇబ్బందులను పట్టించుకోక పోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఆయకట్టు రైతులున్నారు. ఇంతకుముందు కూడా ఇరిగేషన్ అధికారులు షెట్టర్ వద్ద జాలునీరు పోతుందని మట్టిని పోయించడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు. షెట్టర్‌ను కిందకు దించే ప్రయత్నం చేయకుండానే అధికారులు మరోసారి మట్టిని, బండరాళ్లను పోయించి ఈ స్థితికి తెచ్చారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
ప్రజావాణిలో సమస్యల నివేదన..
పాతగుంటూరు: జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ నేతృత్వలో జిల్లా అధికారులు పాల్గొని ఆయా అర్జీలను పరిశీలించారు. ఇళ్ల స్థలాలు ఆక్రమించారని.. పట్టాదారు పుస్తకాల కోసం వెళితే అధికారులు దుర్భాషలాడారని.. నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలను తొలగించాలని ఇలా వివిధ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయా సమస్యలపై బాధితుల మాటల్లోనే... ఇళ్లు తొలగించివేశారు.. పీడబ్ల్యూ స్థలంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాం. అయితే ఆదివారం రాత్రి అధికారులు పొక్లయిన్లతో ఇళ్లను తొలగించివేశారు. ఆ ప్రాంతంలో ఆరు కుటుంబాలు నివా సం ఉంటున్నాయి. ఇళ్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డాం. మాకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాలని వేడుకుంటున్నా. - పులి రూతమ్మ, వడ్డేశ్వరం, తాడేపల్లి మండలం మద్యం షాపులు తొలగించాలి.. నివాసాలకు అతిసమీపంలో, దేవాలయాలకు దగ్గర్లో మద్యం షాపు ఏర్పాటుచేశారు. వాటిని వెంటనే తొలగిం చాలి. మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచడంతో ఈ ప్రాంత మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. నిబంధనలు తుంగలో తుక్కి అనుమతించిన మద్యం షాపును తొలగించాలని కోరుతున్నాం. - కంచర్ల సామ్రాజ్యం, సుజాత, నెహ్రూనగర్ ఒకటో లైను, గుంటూరు ఇళ్ల మధ్యన పెద్ద కాలువ తవ్వారు.. ఇళ్ల మధ్యలో రోడ్డుపై పెద్ద కాలువ తవ్వారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ 47వ డివి జన్‌లో ఒక ఇంటికి నీటి వసతి కోసం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పెద్ద కాలు వ తవ్వడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాము. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం. - జాకోబు, చరణ్, కిరణ్, రాజీవ్‌గాంధీనగర్, గుంటూరు అడంగల్ కోసం వెళితే దుర్భాషలాడారు పెదకూరపాడు మండలం పరస గ్రామంలో 217 సర్వే నంబరులో 7.68 ఎకరాలు, 48-1బీ సర్వే నంబరులో 5.28 ఎకరాల పొలం ఉంది. అడంగల్ కోసం తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నా. వేరేవారిపై పాసుపుస్తకాలు పుట్టించడాన్ని గమనించి అడగ్గా.. అడంగల్ ఇచ్చేందుకు దుర్భాషలాడారు. తహశీల్దార్‌పై చర్య తీసుకుని మాకు న్యాయం చేయండి. - జ్ఞానప్రకాశం, లాం గ్రామం, తాడికొం మండలం పాఠశాల దగ్గర్లోని వైన్‌షాపు తొలగించాలి.. పెదకాకాని రోడ్డులో పాఠశాలలు, దేవాలయాలకు దగ్గరగా ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని కోరుతున్నాం. వైన్‌షాపుల వద్ద మద్యంప్రియుల అల్లర్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం. - ధనలక్ష్మి, మల్లేశ్వరి, పుల్లారావు, పెదకాకాని -
నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
కడప రూరల్ : జిల్లా పరిషత్ పాలక వర్గ ఎన్నిక శనివారం కడపజిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలోని సమావేశ మందిరంలో జరగనుంది. జెడ్పీ చైర్మన్‌గా కోడూరు రవి (ఎర్రగుంట్ల జెడ్పీటీసీ), వైస్ చైర్మన్‌గా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (ఒంటిమిట్ట జెడ్పీటీసీ)లను బలపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు విప్ జారీ చేశారు. కాగా జిల్లా పరిషత్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, అర్హత పొందిన నామినేషన్ల జాబితా విడుదల ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కొత్తగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణ స్వీకారం, కో అప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక పూర్తయిన వెంటనే అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం 3 గంటలకు జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను నిర్వహిస్తారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. -
‘ఉపాధి’ స్కాం...ఢాం..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: పల్లెల్లో వలసలు నివారించి,గ్రామాల్లో ఉన్న చోటనే పేద ప్రజలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని అవినీతి తిమింగలాలు అమాంతం మింగేస్తున్నాయి. జిల్లాలో 2007 నుండి ఇప్పటి వరకు అయిదు విడతల్లో జరిగిన సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్)లలో 20.40 కోట్ల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. జిల్లా ఉపాధి విజిలెన్స్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు వాటిపై విచారించి అందులో రూ.10.16 కోట్లు కచ్చితంగా కట్టాల్సిందేనని తేల్చేశారు. దాంట్లో అవినీతికి పాల్పడిన సిబ్బంది నుండి అధికారులు ఇప్పటి వరకు వసూళ్లు చేసింది మాత్రం రూ. 3.48 కోట్లు మాత్రమే. మిగతా 6.68 కోట్ల రికవరీ పెండింగ్‌లోనే ఉంది. మరో 10.23 కోట్ల అవినీతి గుట్టు విప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఇది మాత్రమే కాకుండా రూ.2కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్లు వచ్చిన ఆరోపణలపై డ్వామా అధికారులు విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చేశారు. వామ్మో..ఇంత మింగుడా జిల్లాలో రోజురోజుకు ఉపాధి పనుల్లో అవినీతి చిట్టా పెరిగి పోతుండడంతో జిల్లా అధికారులు కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 10.16 కోట్లను రికవరీ చేయాలని విజిలెన్స్ అధికారులు తేల్చగా గత అయిదేళ్లుగా కేవలం రూ.3.48 కోట్లనే చేయగలిగారు. అక్రమాలు గుర్తించినా ఇతర ఉపాధి సిబ్బందికి పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేసినా వాటిని పట్టించుకోలేదు. ఇక రూ. 6.68 కోట్లను రికవరీ చేయడం డ్వామా అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కొందరు వీటిపై కోర్టులను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరూ తమ రాజకీయ ప్రాబల్యంతో గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నారు.రూ. 10.23 కోట్ల అవినీతిపై విచారించాల్సి ఉంది. అది జరిగే లోపే మరిన్ని సోషల్ ఆడిట్ల ద్వారా వచ్చి చేరుతున్నాయి. ఇలా ఈ చిట్టా పెరిగిపోతుండడం అందర్నీ బెంబేలెత్తిస్తోంది. ఒక మండలంలోనే రూ.2.50 కోట్ల పనుల్లో అవకతవకలు లింగాల మండలంలో గతేడాది 13 గ్రామాలలో జరిగిన పనులపై గత నెల 12వ తేదీన జరిగిన అయిదో విడత సామాజిక తనిఖీలో రూ.4.37 కోట్ల పనులకు ఆడిట్ చేయగా ఏకంగా రూ.2.50 కోట్ల మేర అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది.సామాజిక తనఖీల రాష్ట్ర డెరైక్టర్ సౌమ్య నేతృత్వంలో జరిగిన ప్రజావేదికలో ఈ అక్రమాల చిట్టా బయట పడ్డాయి. వీరిలో వలసలు వెళ్లినవారు, పెళ్లిళ్లు జరిగి ఇతర గ్రామాలకు వెళ్లిపోయిన వారు, ఆఖరికి చనిపోయిన వారి పేర్లు కూడా ఉన్నాయి. వారి పేర్లను మస్టరుల్లో రాసి బినామి బిల్లులతో స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది. పలువురిపై వేటు వేసినా... వివిధ సామాజిక తనిఖీల్లో గుర్తించిన అవినీతి ఆధారంగా పలువురిపై రికార్డు స్థాయిలో వేటు వేసినా అవినీతి పరులు చలించడం లేదు. ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉపాధికి సంబంధించి కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఉపాధి పనుల్లో ఏకంగా రూ. 2.50 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించిన జిల్లా అధికారులు లింగాల మండల స్థాయి సిబ్బందిపై క ఠిన చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు.సామాజిక తనిఖీలో జరిగిన అక్రమాలు వెలువడిన వెంటనే ఆ మండల ఏపిఓ లక్ష్మినారాయణతోపాటు నలుగురు టి.ఏలు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఎనిమిది మంది క్షేత్ర సహాయకులను విధుల నుంచి ఇటీవల తాత్కలికంగా తొలగించారు.వారిపై ఉన్న అభియోగాలపై విచరణ చేపట్టే పనిలో అధికారులు ఉన్నారు.అంతేకాకుండా అదే మండలానికి చెందిన 150 మంది మేట్లను శాశ్వతంగా విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. ఇలా ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఉపాధి సిబ్బంది రూ. 20 కోట్లకు పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విధులకు కొందరు తాత్కాలికంగా దూరమవ్వగా, మరికొంత మంది సిబ్బందిని శాశ్వతంగా విధుల నుండి తొలగించారు. ఇందులో ఎక్కువగా గ్రామాల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు 1086మంది ఉన్నారు. వీరే దాదాపు 10 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్టు సామాజిక తనిఖి నివేదికల ద్వారా అధికారులు గుర్తించారు. వారి తరువాతి స్థానంలో సాంకేతిక సహాయకుల(టి.ఏ) రెండో స్థానంలో నిలిచారు.జిల్లాలోని 725 మంది టి.ఏలపై రూ. 5.41 కోట్ల మేర అవినీతికి పాల్పపడ్డట్టు అధికారులు గుర్తించారు.ఇలా ఆయా మండలాల్లో 1999 మంది మేట్లు 1.10కోట్లు,31 మంది ఏఈఈలు రూ.కోటి, 57మంది ఏపిఓలు 32లక్షలు ,159మంది సి.ఓలు 14లక్షలు, సర్పంచ్‌లు రూ.23లక్షల, 71 మంది ఈసీలు అవినీతికి పాల్పపడ్డట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. -
‘ఓటు’కు చేటు
=తూతూ మంత్రంగా ఓటరు నమోదు ప్రచారం =వేళకు రాని అధికారులు న్యూస్‌లైన్ నెట్వర్క్: గ్రేటర్లో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం మొక్కుబడి తంతుగా ముగిసింది. సిబ్బంది ఉంటే దరఖాస్తులు లేని కేంద్రాలు కొన్ని.. సంబంధిత ఫారాలు ఉన్నప్పటికీ.. ఎలా భర్తీ చేయాలో వివరించే సిబ్బంది లేని కేంద్రాలు ఇంకొన్ని.. మూతపడిన పోలింగ్ కేంద్రాలు మరికొన్ని.. అవగాహన లేని అంగన్వాడీ టీచర్లతో ఫారాల భర్తీలో ప్రజలు అవస్థలు.. పలుచోట్ల ప్రచారం లేక వెలవెలబోయిన కేంద్రాలు.. వెరసి ఓట్ల నమోదుకు పక్కా ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారు. దీంతో ఓటు ప్రచారం కాస్త ప్రహసనంగా మారింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరినీ ఓటర్ల జాబితాలో చే ర్చేందుకు ఏడాది పొడవునా పేర్ల నమోదుకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ఈ నెల 24, వచ్చేనెల 1, 8 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రజల సౌకర్యార్థం వరుసగా మూడు ఆదివారాలు ఈ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తొలి ఆదివారంనాటి ప్రచార కార్యక్రమం ప్లాఫ్ అయింది. తగినంత ప్రచారం లేనందున చాలా తక్కువమంది మాత్రమే ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లినవారికి సైతం తగిన ప్రయోజనం కలగలేదు. కేంద్రాలను ఉదయం 10.30 గంటలకే తెరవాల్సి ఉన్నప్పటికీ చాలా కేంద్రాలు మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచుకోలేదు. అంతేకాదు సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిన కేంద్రాలు చాలా చోట్ల మధ్యాహ్నం 3 గంటలకే మూతపడ్డాయి. మొత్తానికి మమ అనిపించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ‘న్యూస్‌లైన్ విజిట్’ సందర్భంగా కనిపించిన దృశ్యాల్లో మచ్చుకు కొన్ని... ఛత్రినాకలోని శాంతినికేతన్ పాఠశాలలో ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ.. చిరునామా మార్పిడికి అవసరమైన ఫారం-8, ఫారం-8ఏలు లేవు. దీంతో ప్రజలు ఉసూరంటూ వెనుదిరిగారు. సత్యానగర్ కమ్యూనిటీ హాల్లోని పోలింగ్ కేంద్రానికి ఆశీర్వాదం అనే అంగన్వాడి టీచర్ 11.50 గంటల వరకు రాలేదు. కేంద్రం అడ్రస్ తెలియనందున ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కేంద్రం తాళాలే తెరుచుకోలేదు. వి చారిస్తే నందిని అనే అంగన్వాడి టీచర్‌ను ఆ కేంద్రంలో నియమించగా, ఆమె జ్యోతిబాలమందిర్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రం లో ఎవరూ లేకపోవడంతో ప్రజలు వెనుదిరిగారు. రాంనగర్ డివిజన్ జెమినీకాలనీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నిర్మల అనే అంగన్వాడీ టీచర్ కేంద్రాన్ని వదిలి పెట్టి కార్పొరేటర్‌ను కలవడానికి వెళ్లారు. దాంతో స్వచ్ఛందసంస్థలకు చెందినవారే అక్కడకు వచ్చిన వారికి దరఖాస్తులు, సూచనలు ఇవ్వడం కనిపించింది. గోల్కొండ చౌరస్తాలోని ఎంబీ హైస్కూల్లో నాలుగు పోలింగ్ బూత్‌ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఒక్కటి కూడా తెరుచుకోలేదు. ఖిల్వత్ కమ్యూనిటీ హాల్లోని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాలనుకున్నవారికి నిరాశే ఎదురైంది. కమ్యూనిటీ హాల్ తాళాలు తీసేవారే కరువవడంతో అక్కడకు చేరుకున్న బీఎల్ఓలు.. తాము వెంట తెచ్చుకున్న ఫారాలతో బయటే ఉండిపోయారు. కందికల్‌గేట్ ద గ్గరి పాఠశాలలో ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు బీఎల్ఓలెవరూ కనిపించలేదు. ఓటరు నమోదు ఫారాలను మాత్రం పాఠశాలలో ఉంచి వెళ్లిపోయారు. ఓటరు నమోదు ఫారాల భర్తీ.. చిరునామా మార్పులు తదితర అవసరాల కోసం వచ్చిన వారు నిస్సహాయంగా వెనుదిరిగారు. కాచిగూడ డివిజన్ పరిధిలో ఫ్యూనీపాల్ స్కూల్ తాళం వేసి ఉండటంతో గేటు ముందర సిబ్బంది రెండు కుర్చీలు వేసుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. లాల్ బహదూర్ హైస్కూల్లో సెంటర్ తెరచుకోలేదు. బర్కత్‌పుర డివిజన్లో స త్యానగర్ కమ్యూనిటీహాల్ సెంటర్దీ అదే పరిస్థితి. మోండా ఇస్లామియా ప్రభుత్వ పాఠశాల నల్లగుట్ట ఓల్డ్ ప్రాథమిక పాఠశాలలో సాయంత్రం 4 గంటలకే అధికారులు కేంద్రాలను వదలి వెళ్లిపోయారు. మార్కెట్ స్కూల్, కళాసీగూడ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. టోలీచౌకీ, నానల్‌నగర్ డివిజన్లకు సంబంధించిన సుమారు 70 పోలింగ్ స్టేషన్లలో కేవలం 12 కేంద్రాలలో మాత్రమే సిబ్బంది విధులు నిర్వహించారు. వీరిలో చాలామంది మధ్యాహ్నం 2 నుంచి కేంద్రాలను మూసేసి వెళ్లిపోయారు. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో ఓటింగ్ నమోదు కార్యక్రమం తూతూ మంత్రంగా నడిచింది. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మన్సూరాబాద్, రామక్రిష్ణాపురం, కొత్తపేట, సరూర్‌నగర్ డివిజన్ల లో ఓటింగ్ నమోదు కేంద్రాలలో బూత్‌లెవల్ అధికారులు లేక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ప్రచార కార్యక్రమం తీరిదీ... రాంనగర్ డివిజన్ బాకారం గ్రంథాలయంలోని 133, 134 పోలింగ్ బూత్‌లకు సూర్యకుమారి, సీహెచ్ హరితలు బీఎల్ఓలుగా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే కేంద్రాలు తెరవాల్సి ఉన్నా.. 11 గంటల వరకు తెరవలేదు. దీంతో ముషీరాబాద్ ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి అధికారులిచ్చిన సమాచారం ఆధారంగా వారి నంబర్లకు ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసుకున్న ఓ వ్యక్తి మేం నాగోల్‌లో ఉంటామని, హరిత ఓ సెల్‌ఫోన్ స్టోర్‌లో పని చేస్తుందని చెప్పారు. బాకారంలో ఎన్నికల డ్యూటీ ఏంటని, మీరు చెప్పేది వింతగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే సూర్యకుమారి నంబర్‌కు ఫోన్ చేయగా 9 నెలలుగా ఆమె నగరంలో లేరని, పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదీ ఓటర్ల నమోదు కోసం ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం తీరు. సమయపాలనేదీ? అడిక్‌మెట్ డివిజన్లో 181 నుంచి 212 వరకు 32 బూత్‌లకు గాను 32 మంది ఇన్‌చార్జ్‌లను నియమించారు. అందులో ఒక్కరూ సమయానికి రాలేదు. ఏడెనిమిది మందికి ఫోన్ చేస్తే అందరూ తమకు సమాచారం లేదని సెలవిచ్చారు. అధికారులకు ఫోన్‌చేస్తే వస్తున్నామని చెప్పారు. వచ్చినవారికి సైతం సరైన అవగాహన లేదు. - ఎంసీ మోహన్, బీజేపీ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు దరఖాస్తు చేసుకున్నా ఓటు రాలేదు 2010 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా. అయినా ఇంతవరకు ఓటుహక్కు రాలేదు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళితే సరైన సమాధానం చెప్పేవారే లేరు. ఇక్కడేమైనా సమస్య పరిష్కారం అవుతుందేమోనని వచ్చాను. ఇక్కడ కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. - టి. చంద్రప్రకాశ్, దయానంద్‌నగర్