
ప్రజావాణిలో సమస్యల నివేదన..
జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యలపై అర్జీలు అందజేశారు.
పాతగుంటూరు: జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ నేతృత్వలో జిల్లా అధికారులు పాల్గొని ఆయా అర్జీలను పరిశీలించారు. ఇళ్ల స్థలాలు ఆక్రమించారని.. పట్టాదారు పుస్తకాల కోసం వెళితే అధికారులు దుర్భాషలాడారని.. నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలను తొలగించాలని ఇలా వివిధ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయా సమస్యలపై బాధితుల మాటల్లోనే...
ఇళ్లు తొలగించివేశారు..
పీడబ్ల్యూ స్థలంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాం. అయితే ఆదివారం రాత్రి అధికారులు పొక్లయిన్‌లతో ఇళ్లను తొలగించివేశారు. ఆ ప్రాంతంలో ఆరు కుటుంబాలు నివా సం ఉంటున్నాయి. ఇళ్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డాం. మాకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాలని వేడుకుంటున్నా.
- పులి రూతమ్మ, వడ్డేశ్వరం, తాడేపల్లి మండలం
మద్యం షాపులు తొలగించాలి..
నివాసాలకు అతిసమీపంలో, దేవాలయాలకు దగ్గర్లో మద్యం షాపు ఏర్పాటుచేశారు. వాటిని వెంటనే తొలగిం చాలి. మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచడంతో ఈ ప్రాంత మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. నిబంధనలు తుంగలో తుక్కి అనుమతించిన మద్యం షాపును తొలగించాలని కోరుతున్నాం.
- కంచర్ల సామ్రాజ్యం, సుజాత, నెహ్రూనగర్ ఒకటో లైను, గుంటూరు
ఇళ్ల మధ్యన పెద్ద కాలువ తవ్వారు..
ఇళ్ల మధ్యలో రోడ్డుపై పెద్ద కాలువ తవ్వారు. శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ 47వ డివి జన్‌లో ఒక ఇంటికి నీటి వసతి కోసం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పెద్ద కాలు వ తవ్వడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాము. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం.
- జాకోబు, చరణ్, కిరణ్, రాజీవ్‌గాంధీనగర్, గుంటూరు
అడంగల్ కోసం వెళితే దుర్భాషలాడారు
పెదకూరపాడు మండలం పరస గ్రామంలో 217 సర్వే నంబరులో 7.68 ఎకరాలు, 48-1బీ సర్వే నంబరులో 5.28 ఎకరాల పొలం ఉంది. అడంగల్ కోసం తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నా. వేరేవారిపై పాసుపుస్తకాలు పుట్టించడాన్ని గమనించి అడగ్గా.. అడంగల్ ఇచ్చేందుకు దుర్భాషలాడారు. తహశీల్దార్‌పై చర్య తీసుకుని మాకు న్యాయం చేయండి.
- జ్ఞానప్రకాశం, లాం గ్రామం, తాడికొం మండలం
పాఠశాల దగ్గర్లోని వైన్‌షాపు తొలగించాలి..
పెదకాకాని రోడ్డులో పాఠశాలలు, దేవాలయాలకు దగ్గరగా ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని కోరుతున్నాం. వైన్‌షాపుల వద్ద మద్యంప్రియుల అల్లర్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం.
- ధనలక్ష్మి, మల్లేశ్వరి, పుల్లారావు, పెదకాకాని