సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సిక్కోలును కరోనా బారి నుంచి కాపాడడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి మధ్యనే గడు పుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నా రు. లాక్‌డౌన్‌లో జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. లాక్‌డౌన్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం అంతా చక్క గా పనిచేసినా వారిని సమన్వయపరచుకుని ముందుకెళ్లడంలో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విజయవంతమయ్యారు. ఈ ము గ్గురు అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.
కలెక్టర్ చొరవ ప్రశంసనీయం
కరోనా ప్రభావం దేశంలో మొదలైన దగ్గరి నుంచే కలెక్టర్ జె.నివాస్ అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్నేసి ఉంచారు. అధికారుల దగ్గరి నుంచి వలంటీర్లు, ఆశ కార్యకర్తల వరకు అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక, వైరస్ వ్యాప్తి జోరుగా జరుగుతున్న వేళ స్వయంగా జనంలోకి వచ్చి అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ని త్యావసర సరుకులు, మందులు, కూరగాయలు అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత ధరలకు ప్రజల దరి చేర్చా రు. లాక్‌డౌన్‌కు ముందు ఒక్కసారిగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రావడంతో వారిని ఊళ్లలోకి పంపించకుండా ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు పెట్టారు.
జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి రాగా వారిలో 562 మందిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లలో పెట్టి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి బాగోగులు కూడా చూసుకున్నారు. 819 మందికి ఉచితంగా సరుకులు డోర్ డెలివరీ చేయించారు. వలస కూలీల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి రోజుకో రకం భోజనం పెడుతున్నారు. అనాథలు, నిరాశ్రయులకు కూడా రెడ్‌క్రాస్ సాయంతో రోజూ భోజనం పెడుతున్నారు. ప్రభు త్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. సొంత వ్యూహంతో ముందుకువెళ్లారు. ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి ముస్లిం పెద్దలతో సమావేశమై సమస్త వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు లాక్‌డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు అండగా ఓ బృందాన్నే అక్కడకు పంపారు.
ఎస్పీ అవిశ్రాంత యోధుడు
జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక మరింత వేగం పెంచి, రోడ్లపైనే ఎక్కువగా ఉంటున్నారు. కరోనాపై స్వయంగా అవగాహన కలి్ప స్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
విధుల్లో ఉన్న పోలీసులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. ప్రతి రోజూ పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలకు ముఖ్యమైన ఆదేశాలిస్తూ వస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ముందుగా గుర్తించి క్వారంటైన్‌లో ఉంచడమే కాకుండా వారు బయటికి రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో ప్రతి చోట పోలీసుల తీరుపై కొన్ని విమర్శలు వచ్చినా ఇక్కడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
దూసుకుపోతున్న జేసీ
లాక్‌డౌన్ అమల్లోకి రాగానే తిండికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. వైరస్ వస్తే ఎలా ఉంటుందో తెలీదు గాని తినడానికి తిండి దొరకకపోతే ఇలాగే చనిపోతేమోనన్న ఆందోళన మొదట్లో ఉండేది. కానీ వాటిన్నింటినీ జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పటాపంచలు చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు దొరకలేదన్న విమర్శలు రాకుండా చూసుకోగలిగారు.
సామాజిక దూరాన్ని పాటించేలా షాపుల వద్ద చర్య లు తీసుకుంటూనే కూరగాయలు, మొబైల్ రైతు బజా ర్లు, కూరగాయలు డోర్ డెలివరీ, నిత్యావసర సరుకు లు, మందులు డోర్ డెలివరీ ఇలా ప్రతీది ప్రజల వద్దకే తీసుకొచ్చారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ధరలు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రేడర్స్, పౌల్ట్రీ యజమానుల సమావేశమై ధరలపై దిశా నిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేశారు. వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా చూడగలిగారు.
జిల్లా యంత్రాంగం పనితీరు భేష్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం మన అదృష్టమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వ్యాధి నియంత్రణలో ఉందని అన్నారు.
శ్రీకాకుళంలో రోడ్డుపై వాహనచోదకులను ఆపి జాగ్రత్తలు చెబుతున్న దాసన్న
కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు స మన్వయంతో చక్కగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అహరి్నశలు ప్రజా సంక్షేమం తపిస్తోందన్నారు. కరోనా కట్టడిలో ఇది కీలక సమయమని, ఇక ముందు కూడా పూర్తి నిబద్ధత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రతినిధులకు బియ్యంతో పాటు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు.
అలాగే సోమవారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై తిరుగుతున్న వారిని మంత్రి ఆపి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో ఒక్క పాటిజివ్ కేసు కూడా నమోదు కాలేదని ఇకపై కూడా రాకుండా మనమంతా కలిసికట్టుగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment