వారితో కూడా యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్‌ | CM YS Jagan‌ Video Conference With Collectors And SPs | Sakshi
Sakshi News home page

కరోనా కేసులు తగ్గడం మంచి పరిణామం

Published Tue, Sep 29 2020 2:04 PM | Last Updated on Tue, Sep 29 2020 7:53 PM

CM YS Jagan‌ Video Conference With Collectors And SPs - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3కి తగ్గిందని తెలిపారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని సీఎం పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.

కోవిడ్‌ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని, కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. జనవరికల్లా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. ‘‘104 నంబర్‌కు ఫోన్‌ కొడితే టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలి. ఈ నంబర్‌కు మాక్‌ కాల్స్‌ చేసి నెంబర్‌ పనిచేస్తుందా లేదా పీరియాడికల్‌గా చెక్‌ చేయండి. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలి. ప్రతీ రోజూ మానిటర్‌ చేయండి. ఈ నంబర్‌కు ఫోన్‌ చేయగానే అరగంటలోనే బెడ్‌ అందుబాటులో ఉందో లేదో చెప్పాలి. కాబట్టి ఈ నంబర్‌ పక్కాగా పనిచేయాలని’’ అధికారులకు సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రభుత్వ సేవలు.. హెల్ప్‌లైన్‌ నంబర్లు)

కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్‌ చేస్తున్న రాష్ట్రం మనదేనని, కోవిడ్‌ హాస్పిటల్స్‌ లిస్ట్‌ గ్రామ సచివాలయాల్లో ఉండాలన్నారు. ఎంప్యానల్‌ హస్పిటల్స్‌ లిస్ట్‌ కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. 104కు ఎవరు ఫోన్‌ చేసినా కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని చెప్పారు. రిక్రూట్‌ చేసిన వారంతా కూడా కరెక్ట్‌గా డ్యూటీకి వెళుతున్నారా లేదా తనిఖీ చేయాలని  సీఎం పేర్కొన్నారు. (చదవండి: ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు)

‘‘పీరియాడికల్లీ చెకప్‌ ఉండాలి. దాదాపు 30 వేల మందిని కొత్తగా తీసుకొస్తున్నాం. వీరందరినీ మానిటర్‌ చేయాలి. 37000 వేల బెడ్స్‌, 240 హాస్పిటల్స్‌లో ఫుడ్‌, శానిటేషన్, ఇన్‌ఫ్రా, స్టాఫ్‌ వీటిపై మానిటరింగ్‌ పక్కాగా ఉండాలి. ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు మానిటర్‌ చేయాలి. ఈ నాలుగు కరెక్ట్‌గా ఉంటే చికిత్స కరెక్ట్‌గా అందుతుంది. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా ఫుడ్, శానిటేషన్, మెడికేషన్‌ కచ్చితంగా జరగాలి. అక్కడ కూడా హెల్ప్‌ డెస్క్‌ ఉండాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు ఇస్తున్నామా లేదా ప్రతీ ఒక్కరూ దృష్టి పెట్టాలి. కిట్లు రాలేదంటే ఖచ్చితంగా కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి. ఏఎన్‌ఎంలు, లోకల్‌ డాక్లర్లు మ్యాపింగ్‌ చేయాలి. డాక్టర్‌ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, పిహెచ్‌సీ డాక్టర్‌ ముగ్గురూ కచ్చితంగా వారితో మాట్లాడాలి. 104 నంబర్‌ పబ్లిసిటీ కూడా బాగా జరగాలి. దానితో పాటు లోకల్‌ కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ కూడా పబ్లిసిటీ చేయాలని’’ సీఎం సూచించారు. కోవిడ్‌ బాధితులను త్వరగా గుర్తించడం వలనే మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు.  

‘‘మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా యుద్దం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం, నెగిటివ్‌ వార్తలు చదువుదాం. మనం కరెక్ట్‌ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం, వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది కాబట్టి, అక్టోబర్‌ 15 నుంచి ధ్యాస పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలని, ఈ క్రాపింగ్‌ ప్రతీ పంటకు కంప్లీట్‌ కావాలన్నారు. ఈ క్రాపింగ్‌ ఎక్కడా కూడా పెండింగ్‌ ఉండకూడదని, దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
ఈ క్రాపింగ్‌ తర్వాత రైతుల రిజిస్ట్రేషన్‌ జరగాలి, తర్వాత లిస్ట్‌ ఆర్‌బీకేలలో పెట్టాలి
ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి. సోషల్‌ ఆడిట్‌ చేయాలి. మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలి
ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలి
కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ చేస్తామని చెప్పాలి
ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ సర్టిఫికెట్‌ ఉండకూడదు, ఈ క్రాపింగ్‌ తప్పనిసరిగా జరగాలి
సీఎం యాప్‌ ద్వారా మానిటరింగ్‌ జరగాలి
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వెంటనే అలర్ట్‌ చేయాలి
జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్‌ సౌకర్యం చూపాలి
ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్‌ 1 న రిలీజ్‌ చేస్తాం.. అక్టోబర్‌ 5 కల్లా అన్ని ఆర్‌బికేలలో డిస్‌ప్లే చేయాలి
కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్‌కు మనం అమ్మించగలగాలి
రైతుకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, జేసీలు పూర్తిగా ధ్యాస పెట్టండి
స్టేట్‌లెవల్‌ అడ్వైజరీ కమిటీ, జిల్లా, మండల, ఆర్‌బీకేల స్ధాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేయాలి
ఏ పంట గ్రామంలో వేయాలి, ఏ పంట వేయద్దు అనే అంశాలు కూడా కమిటీలు చర్చించాలి
కలెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారు. ఫార్మర్స్‌ ఈజ్‌  హయ్యెస్ట్‌ ప్రయారిటీ.

వరద పరిస్థితిపై సమీక్ష..
భారీ వర్షాలు, పంట, ఆస్తినష్టం అంచనాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్థితిని సీఎం సమీక్షించారు. పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఆర్‌బీకే లెవల్‌లో ఎన్యూమరేషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ డిస్‌ప్లే చేయాలన్నారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement