
సాక్షి, విజయవాడ: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండో రోజు సీఈసీ బృందం సమావేశం కొనసాగుతోంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష జరుపుతోంది. మొదటి రోజు ఎన్నికల సన్నద్దతపై 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
నేడు సీఈసీ బృందానికి ఎన్నికల సన్నద్దతపై నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, రీపోలింగ్ కేంద్రాల పరిస్ధితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష చేయనున్నారు.
చెక్ పోస్టులు.. తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక.. సున్నిత ప్రాంతాల్లో భద్రతాపై సమీక్ష చేపట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదులపైనా సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం.. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment