సాక్షి, విజయవాడ: విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలు సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతిని పోలీసులు నిరాకరించారు.
చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు అనుమతి లేదని.. కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. భువనేశ్వరి, లోకేశ్‌లకు అనుమతిస్తామని తెలిపారు. ఉద్రిక్తతలు కోసం పవన్ వస్తున్నారంటూ తమకు సమాచారం ఉందన్న పోలీసులు.. ఆ మేరకు పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్‌పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం పంపించారు.
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విధ్వంసం సృష్టించడానికి టీడీపీ కుట్రకు తెరలేపింది. చంద్రబాబుని తీసుకొచ్చే మార్గంలో అల్లర్లకు పథక రచన చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం.
పలు చోట్ల పోలీసులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టి.. శాంతి భద్రతల సమస్య సృష్టించాలంటూ టీడీపీ నేతలకు కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.
చదవండి: CBN: కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి..
Comments
Please login to add a commentAdd a comment