సాక్షి, హైదరాబాద్: వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సాధ్యమైనంత వరకూ మెట్ల మీదుగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోవాలని, మెట్లు ఎక్కడం లో ఇబ్బందులుంటే తప్ప లిప్టు వినియోగించొద్దని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చే సింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీచేసింది. లిప్టులో ఒకేసారి నలుగురికం టే ఎక్కువమంది వెళ్లకూడదనీ, ఒకరికొకరు ఎదురెదురుగా కాకుండా, లిఫ్టు గోడల వైపు తమ ముఖం ఉండేలా నిలబడాల ని సూచించింది. అం దరూ ఒకేచోట చేరి మూకుమ్మడిగా భో జనాలు చేయకూడ దు. వేర్వేరు సమయాల్లో భోజనానికి వెళ్లేలా ఏర్పాట్లు చే యాలి. ఒకేచోట ఎ క్కువమంది గుమిగూడి మాట్లాడుకోవడాన్ని నిలిపివేయాలి. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాల ను నిర్వహించుకోవాలని సూచించింది. ఇతర ఉ ద్యోగుల సెల్‌ఫోన్లను, గదులను, డెస్కులను వాడకూడదని, వాడాల్సి వస్తే వాటిని క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రపరిచాకే తాకాల్సి ఉంటుంది.
సెంట్రలైజ్డ్ ఏసీ వాడొద్దు...
సాధ్యమైనంత వరకు కొంతకాలం వరకూ సెంట్రలైజ్డ్ ఏసీని వినియోగించకపోవడమే మంచిదని కేం ద్రం సూచించింది. ఉద్యోగులందరూ ఒకేసారి ఒకే గేటు ద్వారా ప్రవేశించకుండా, వేర్వేరు ద్వారాల నుంచి ఆఫీసులోకి ప్రవేశించాలని కోరింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో కలిసిమెలిసి తిరిగిన ఉద్యోగి ఎవరైనా ఉంటే, వారు స్వయంగా హోంక్వారంటైన్ లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటి వ్ వస్తేనే ఆఫీసుకు రావాలని తెలిపింది. డెస్కులు, కుర్చీలను దూరం దూరంగా జిగ్‌జాగ్ పద్ధతిలో వే యాలని కోరింది. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఒకవేళ దగ్గు, తుమ్ములు వస్తే కర్చీఫ్ లే దా టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. కం ప్యూటర్ కీబోర్డులు, ఫోన్లు, ఆఫీసుల్లో ఎక్కువమం ది పలుసార్లు తాకడానికి అవకాశమున్న ప్రాంతాలను, వస్తువుల పైభాగాన్ని శానిటైజ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment