సాక్షి, హైదరాబాద్: అమెరికాలో కేన్సర్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్‌ను డాక్టర్ రెడ్డీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బొర్టెజొమిబ్ 3.5 ఎంజీ ఇంజక్షన్‌ను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆమోదించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వయోజన రోగులలో వివిధ రకాల కేన్సర్ చికిత్స కోసం దీని ప్రవేశపెట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నార్త్ అమెరికా జనరిక్స్ సీఈఓ మార్క్ కికుచీ తెలిపారు. యుక్త వయసున్న కేన్సర్ పేషెంట్లకు ఇంట్రావీనియస్ వినియోగం కోసం మాత్రమే యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ కొత్త డ్రగ్ 505 (బీ)(2)కు అనుమతిచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment