
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా అమెరికా మార్కెట్లో రెగాడెనొసోన్ ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టింది. రక్త ప్రవాహాన్ని పరీక్షించే క్రమంలో గుండె ఇమేజ్‌లను తీయడంలో ఏజంటుగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది లెక్సిస్కాన్ ఇంజెక్షన్‌కు జనరిక్ వెర్షన్.
మరోవైపు, తెలంగాణలోని తమ బొల్లారం ప్లాంటులో మే 1 నుంచి 5 వరకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఫారం 483ని జారీ చేసినట్లు వివరించింది. నిర్దేశిత గడువులోగా దాన్ని పరిష్కరిస్తామని తెలిపింది. తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధ పరిస్థితులేమైనా కనిపిస్తే యూఎస్‌ఎఫ్‌డీఏ ఫారం 483ని జారీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment