రష్యాకు చెందిన ప్రముఖ యాంటి వైరస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 'కాస్పర్‌స్కై' (Kaspesky) తన కార్యకలాపాలను నిలిపివేయడానికి సిద్ధమైంది. జో బైడెన్ కార్యవర్గం కంపెనీ ఉత్పత్తులను, పంపిణీని నిషేధించడంతో యూఎస్ నుంచి బయటకు వెళ్లాలని యోచిస్తోంది. దేశంలో వ్యాపారవకాశాలు మునుపటిలా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
ఈ కంపెనీపై మాస్కో ప్రభావం, అమెరికా మౌలిక సదుపాయాకు, సేవలకు ప్రమాదాన్ని కలిగిస్తాయని యూఎస్ వాణిజ్య కార్యదర్శి 'గినా రైమోండో' గత నెలలోనే వెల్లడించారు. అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ సేకరిస్తుందని, ఈ కారణంగానే కాస్పర్‌స్కై కంపెనీపై చర్యలు తీసుకోవడం జరిగిందని రైమోండో పేర్కొన్నారు.
గినా రైమోండో వ్యాఖ్యలను కాస్పర్‌స్కై కొట్టిపారేసింది. అంతే కాకుండా దేశంలో కంపెనీ తన కార్య కలాపాలనను జులై 20 నుంచి క్రమంగా తగ్గించడం ప్రారంభిస్తుంది. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ అమెరికా మార్కెట్లో యాంటీవైరస్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ విక్రయాన్ని కూడా నిలిపివేసింది. విక్రేతలు ఎవరైన తమకు తెలియకుండా తమ ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ హెచ్చరించింది.
కాస్పర్‌స్కై కంపెనీ మాస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. అయితే ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో ఆఫీసులున్నాయి. కాస్పర్‌స్కైలో 40 కోట్ల కంటే ఎక్కువమంది పనిచేస్తున్నారు. మొత్తం 200 కంటే ఎక్కువ దేశాల్లో 2,70,000 కంపెనీలు ఈ సాఫ్ట్‌వేర్ వాడుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment