Kaspersky
-
అమెరికాను వీడనున్న దిగ్గజ కంపెనీ.. ఉద్యోగులపై తీవ్ర ప్రభావం!
రష్యాకు చెందిన ప్రముఖ యాంటి వైరస్ సాఫ్ట్వేర్ కంపెనీ 'కాస్పర్‌స్కై' (Kaspesky) తన కార్యకలాపాలను నిలిపివేయడానికి సిద్ధమైంది. జో బైడెన్ కార్యవర్గం కంపెనీ ఉత్పత్తులను, పంపిణీని నిషేధించడంతో యూఎస్ నుంచి బయటకు వెళ్లాలని యోచిస్తోంది. దేశంలో వ్యాపారవకాశాలు మునుపటిలా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.ఈ కంపెనీపై మాస్కో ప్రభావం, అమెరికా మౌలిక సదుపాయాకు, సేవలకు ప్రమాదాన్ని కలిగిస్తాయని యూఎస్ వాణిజ్య కార్యదర్శి 'గినా రైమోండో' గత నెలలోనే వెల్లడించారు. అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ సేకరిస్తుందని, ఈ కారణంగానే కాస్పర్‌స్కై కంపెనీపై చర్యలు తీసుకోవడం జరిగిందని రైమోండో పేర్కొన్నారు.గినా రైమోండో వ్యాఖ్యలను కాస్పర్‌స్కై కొట్టిపారేసింది. అంతే కాకుండా దేశంలో కంపెనీ తన కార్య కలాపాలనను జులై 20 నుంచి క్రమంగా తగ్గించడం ప్రారంభిస్తుంది. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ అమెరికా మార్కెట్లో యాంటీవైరస్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ విక్రయాన్ని కూడా నిలిపివేసింది. విక్రేతలు ఎవరైన తమకు తెలియకుండా తమ ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ హెచ్చరించింది.కాస్పర్‌స్కై కంపెనీ మాస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. అయితే ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో ఆఫీసులున్నాయి. కాస్పర్స్కైలో 40 కోట్ల కంటే ఎక్కువమంది పనిచేస్తున్నారు. మొత్తం 200 కంటే ఎక్కువ దేశాల్లో 2,70,000 కంపెనీలు ఈ సాఫ్ట్వేర్ వాడుతున్నట్లు సమాచారం. -
రష్యా యాంటీవైరస్పై అమెరికా సంచలన నిర్ణయం
రష్యాకు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై తన పాపులర్ యాంటీవైరస్ ఉత్పత్తులను తమ దేశంలో అందించకుండా అమెరికా వాణిజ్య శాఖ నిషేధం విధించింది."కాస్పర్ స్కై సాధారణంగా ఇతర కార్యకలాపాలతో పాటు, యునైటెడ్ స్టేట్స్ లోపల తన సాఫ్ట్ వేర్ ను విక్రయించడానికి లేదా ఇప్పటికే ఉపయోగంలో ఉన్న సాఫ్ట్ వేర్ కు నవీకరణలను అందించడానికి వీలుండదు" అని అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సున్నితమైన అమెరికా సమాచారాన్ని సేకరించి ఆయుధాలుగా మార్చడానికి కాస్పర్ స్కై ల్యాబ్ వంటి రష్యన్ కంపెనీలను ఉపయోగించుకునే సామర్థ్యం, ఉద్దేశం తమకు ఉన్నాయని రష్యా పదేపదే నిరూపించిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ఒక ప్రకటనలో తెలిపారు. వారి సాంకేతిక పరిజ్ఞానం అమెరికాకు, తమ పౌరులకు ముప్పుగా పరిణమించినప్పుడు చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని వాణిజ్య శాఖ చర్యలు అమెరికా ప్రత్యర్థులకు తెలియజేస్తున్నాయన్నారు.కాస్పర్‌స్కై యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ అమ్మకాలను నిషేధించడంతో పాటు, ఈ సంస్థతో సంబంధం ఉన్న మూడు సంస్థలను జాతీయ భద్రతా ఆందోళనగా భావించే కంపెనీల జాబితాలో అమెరికా వాణిజ్య శాఖ చేర్చింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 29 వరకు అమెరికాలో యాంటీవైరస్ అప్డేట్లను అందించడం సహా కొన్ని కార్యకలాపాలను కొనసాగించడానికి మాత్రం కాస్పర్స్కైని అనుమతించారు.మాస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న కాస్పర్‌స్కై సంస్థ ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలలో కార్యాలయాలను కలిగి ఉంది. 200కి పైగా దేశాలలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు, 270,000 కార్పొరేట్ క్లయింట్లకు సేవలు అందిస్తోందని వాణిజ్య శాఖ తెలిపింది. -
స్ట్రిప్డ్ ఫ్లై మాల్వేర్తో జాగ్రత్త
ఫుకెట్ (థాయిల్యాండ్): సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ.. స్ట్రిప్డ్ ఫ్లై అనే మాల్వేర్ విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడినట్టు తెలిపింది. ఆరంభంలో ఇది క్రిప్టోకరెన్సీ మాదిరిగా నటించి, ఆ తర్వాత మొండి మాల్వేర్గా మారిపోయినట్టు పేర్కొంది. ఈ మాల్వేర్ బహుళ మాడ్యూల్‌ను కలిగి ఉండడం, క్రిప్టో మైనర్‌గా, రామ్సమ్వేర్ సమూహంగా వ్యవహరించి.. ఆర్థిక లాభం నుంచి గూఢచర్యం వరకు కార్యకలాపాలు విస్తరించగలదని కాస్పర్స్కీ హెచ్చరించింది. బాధితులపై విస్తృతంగా నిఘా పెట్టే సామర్థ్యాలను ఈ మాల్వేర్ వెనుకనున్న వ్యక్తులు సంపాదించినట్టుగా తెలిపింది. యూజర్‌కు తెలియకుండానే, వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ షాట్లు ఈ మాల్వేర్ తీసుకోగలదని, స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన నియంత్రణ పొందగలదని వివరించింది. స్టిప్డ్ ఫ్లై మాల్వేర్ బారిన పడకుండా కొన్ని చర్యలు సాయపడతాయని తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవడం, అప్లికేషన్లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అనుమానిత లింక్‌లపై క్లిక్ చేసే ముందు, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే ముందు పంపించిన వారి ఐడెంటిటీని పరిశీలించాలని పేర్కొంది. -
Spider Man Cyber Security Alert: సూపర్ హీరోస్ క్రేజ్.. పొంచి ఉన్న సైబర్ దాడులు..
Spider Man Cyber Security Alert: మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరోస్ సిరీస్‌లో తాజాగా విడుదలైన సినిమా స్పైడర్‌మ్యాన్: నో వే హోం. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక ఫిషింగ్ సైట్లు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది. ప్రీమియర్‌తో ఎర స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో లెటెస్ట్ మూవీ నో వే హోం సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతకు ముందు ఈ సినిమా ప్రీమియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్లో వల వేశారని క్యాస్పర్‌స్కై పేర్కొంది. స్పైడర్‌మ్యాన్ నో వే హోం ప్రీమియర్ అందిస్తున్నట్టుగా ఫిషింగ్ సైట్లను రూపొందించాయని.. వీటిని క్లిక్ చేసిన వారికి ప్రీమియర్ లింక్ పంపిస్తామని అంతకు ముందు గేట్‌వే ఫీజు చెల్లించాలంటూ క్రెడిట్ కార్డు, బ్యాంకు డిటెయిల్స్ అడిగినట్టు ఆ సంస్థ పేర్కొంది. బ్యాంకు వివరాలు అందించిన వారి ఖాతాల్లో సొమ్ము మాయమైనట్టు తాము గుర్తించామంది. క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలుకు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ముగ్గురు స్పైడర్మ్యాన్లను ఒకేసారి తెరమీద చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిపస్తున్నారు. ఈ సూపర్‌హీరోస్ ఎడ్వెంచర్స్ చూసేందుకు టీనేజర్లు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో వీరిని టార్గెట్ చేసుకుని మూవీ లింకుల పేరుతో ఫిషింగ్ సైట్లు పుట్టగొడుగుల్లా నెట్లో ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. మరిన్ని మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది బాధితులు ఉన్నారనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు. చదవండి: -
జీవిత భాగస్వాములపై నిఘా..! సంచలన విషయాలు వెల్లడి..!
జీవిత భాగస్వాములపై అపనమ్మకంతో కొంతమంది వ్యక్తులు స్టాకర్వేర్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. స్టాకర్వేర్ యాప్స్‌పై పరిశోధనలను జరిపిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం కాస్పర్‌స్కై సంచలన విషయాలను వెల్లడించింది. 10 మందిలో ముగ్గురు సై..! క్సాస్పర్ స్కై చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మందిలో ముగ్గురు వ్యక్తులు తమ జీవిత భాగస్వాములపై నిఘా ఉంచేందుకు స్టాకర్వేర్ యాప్స్‌ను వాడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. 21 దేశాల్లో కాస్పర్‌స్కై నిర్వహించిన సర్వేలో సుమారు 21 వేల మంది పాల్గొన్నారు. . ఈ ఏడాది భారీగానే వాడకం..! స్టాకర్వేర్ యాప్స్‌ను ఈ ఏడాది మొదటి 10 నెలల్లో దాదాపు 28,000 మంది మొబైల్ వినియోగదారులు స్టాకర్వేర్ యాప్స్ బారిన పడ్డారు. యూరోపియన్ యూనియన్‌లో 3,100 కంటే ఎక్కువ కేసులు, ఉత్తర అమెరికాలో 2,300 కంటే ఎక్కువ మంది వినియోగదారులు స్టాకర్ వేర్ యాప్స్ ద్వారా ప్రభావితమయ్యారని కాస్పర్స్రై వెల్లడించింది. కాస్పర్‌స్కై గణాంకాల ప్రకారం... ఈ యాప్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రష్యా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాలు ఇప్పటివరకు అత్యధికంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ యాప్స్‌తో భారత్‌లో కూడా 4627 మంది ప్రభావితమైనట్లు కాస్పర్ స్కై వెల్లడించింది. అసలు ఏంటి స్టాకర్వేర్ యాప్స్..! స్టాకర్వేర్ యాప్స్ చిక్కవు..దొరకవు..! స్టాకర్వేర్ యాప్స్‌ను ఫలానా వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌లో చొప్పిస్తే...వారికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆయా వ్యక్తులను రహస్యంగా ట్రాక్ చేయవచ్చును. దీంతో ఆయా వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజేస్, లోకేషన్లను ఫోన్లోకి స్టాకర్వేర్ యాప్స్‌ను చొప్పించిన వ్యక్తి పొందుతారు. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...! -
అలా చేస్తే పెను ముప్పే..! తీవ్రంగా హెచ్చరించిన ఆపిల్..!
అమెరికా, ఇతర దేశాల్లో గూగుల్, ఆపిల్ వంటి టెక్ కంపెనీలు గూత్తాధిపత్యాన్ని తగ్గించేలా ఆయా దేశాలు పలు కఠిన చట్టాలను తెస్తున్నాయి. యూరోపియన్ దేశాలు(ఈయూ) దిగ్గజ టెక్ కంపెనీలపై తీవ్రంగా వ్యవహరిస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రించేందుకు ఇప్పటికే పలు చట్టాలను తీసుకువచ్చాయి. కాగా ఈ చట్టాలను ఆపిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చదవండి: ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...! అలా చేస్తే పెనుముప్పే...! టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రణలో భాగంగా ఈయూ దేశాలు ఆపిల్ ప్లే స్టోర్‌పై భారీ షరతులను పెట్టాయి.ప్లే స్టోర్ యాప్స్‌లో ఇతర సైడ్ లోడింగ్ యాప్స్(థర్డ్‌పార్టీ యాప్స్)కు వీలు కల్పిస్తూ ఈయూ చట్టం చేసింది. దీనిపై ఆపిల్ ఈయూ దేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ప్లే స్టోర్‌లోకి ఆలో చేస్తే యూజర్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరించింది. సైడ్ లోడింగ్ యాప్స్‌తో జరిగే నష్టాల నివేదికను బుధవారం రోజున ఆపిల్ విడుదల చేసింది. మాల్వేర్ దాడులతో యూజర్ల ప్రైవసీ, భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆపిల్ వెల్లడించింది. ప్లే స్టోర్‌పై ఈయూ విధించిన రూల్స్‌ను కాస్త సులభతరం చేయాలని ఆపిల్ విన్నవించింది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌పార్టీ యాప్స్‌తో సుమారు 60 లక్షల యూజర్ల స్మార్ట్‌ఫోన్స్ సైబర్ దాడులకు ప్రభావితమయ్యాయని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై పేర్కొంది. ముందే హెచ్చరించిన టిమ్ కుక్..! గతంలో ఈయూ తెచ్చిన చట్టాలపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పూర్తిగా వ్యతిరేకించాడు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్‌ఫుల్‌గా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోఏస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్‌లో ఉంచుతామని వివరించాడు. చదవండి: తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..! -
ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!
Thousands Of Gamers Targeted In A New Cyberattack: మన నిత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్స్, ఇంటర్నెట్ ఓక భాగమైపోయింది. చౌక ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ రాకతో తరుచూ ఆన్లైన్లో ఉంటూ..ఎప్పుడు ఎదో ఒక అంశంపై బ్రౌజ్ చేస్తు కాలక్షేపం చేస్తున్నాం. దీంతో ఇంటర్నెట్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. అదేస్థాయిలో సైబర్ నేరస్తులు యూజర్లపై దాడిచేస్తున్నారు. హ్యకర్లు కూడా కొత్త పుంతలను తొక్కుతూ...రకరకాలుగా దాడులకు పాల్పడుతున్నారు. సైబర్ నేరస్తులు రూట్ మార్చి గేమ్స్ ఆడే వారిపై విరుచుకుపడుతున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై పరిశోధకులు తన నివేదికలో వెల్లడించారు. చదవండి: Xiaomi: బెల్ట్‌తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..! ఆన్లైన్ గేమ్స్ ఆడే వారేలక్ష్యంగా దాడులు..! సైబర్ నేరగాళ్లు బ్లడీస్టీలర్ అని పిలువబడే కొత్త మాల్వేర్తో ఎక్కువగా గేమర్స్‌ను, వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని కాస్పర్ స్కై పేర్కొంది. బ్లడీస్టీలర్ మాల్వేర్తో సెషన్ డేటా , పాస్వర్డ్స్, కుకీ ఎక్స్‌ఫిల్ట్రేషన్‌ను హ్యకర్లు పొందుతున్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. ఆన్లైన్ గేమ్స్ ఆడే యూజర్ల బ్యాంక్ కార్డ్ వివరాలను, బ్రౌజర్ ఆటోఫిల్‌డేటా, స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్ల నుంచి స్క్రీన్ షాట్లను హ్యాకర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. కాస్పర్ స్కై నివేదిక ప్రకారం... ఎపిక్ గేమ్స్, స్టీమ్, ఆరిజిన్, గాగ్. కామ్(GOG.com), బెథెస్డా, టెలిగ్రామ్, వైమ్ వరల్డ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్ యూజర్ల సెషన్ వివరాలను హ్యకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన జీటీఏ ఫైవ్, ఫార్ట్‌నైట్, బ్యాటిల్ ఫీల్డ్,ఫిఫా 2022 గేమ్స్ ఉన్నాయి. రష్యన్ ఫోరమ్‌లో బ్లడీస్టీలర్ అనే మాల్వేర్ తొలిసారిగా మార్చి 2021లో కాస్పర్‌స్కై గుర్తించింది. ఈ మాల్వేర్ సహాయంతో గేమర్స్ నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజర్ల నుంచి డబ్బులను వసూలు చేస్తోన్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
మీరు వాట్సాప్ వాడుతున్నారా..అయితే జాగ్రత్త!
కరోనావైరస్ రాకతో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలు గణనీయంగా పెరిగాయి. కేవైసీ అప్డైట్ పేరిట బ్యాంకు ఖాతాదారులపై సైబర్ నేరస్తులు విరుచుకుపడుతున్నారు. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న హాకర్లు కొంత పుంతలు తొక్కుతున్నారు. తాజాగా వాట్సాప్ యాప్ ద్వారా సైబర్‌నేరస్తులు తెరపైకి మరో కొత్త స్కామ్‌ను తెచ్చారు. ఆన్లైన్ ఆర్డర్స్ పేరిట వాట్సాప్ యూజర్లకు హానికరమైన లింక్‌లను హాకర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా లింకులను ఓపెన్‌చేయగానే యూజర్లకు చెందిన బ్యాంకు బ్యాలెన్స్‌ను హకర్లు ఊడ్చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి. తాజాగా రష్యాకు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ఆన్లైన్ డెలివరీ పేరిట వాట్సాప్ యాప్‌కు వస్తోన్న సందేశాలపై యూజర్లను హెచ్చరించింది. వాట్సాప్ మెసేజ్‌లను చేస్తున్న ఆయా హాకర్లు ఆన్లైన్ డెలివరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేసిన వారుగా ఉన్నారని కాస్పర్‌స్కై పరిశోధకులు వెల్లడించారు. ఆయా ఆన్లైన్ డెలివరీ సంస్థలు అందించే వస్తువులను వాట్సాప్ ద్వారా యూజర్లకు పంపుతూ పేమెంట్ చేసే సమయంలో వారి బ్యాంకు వివరాలను పూర్తిగా తెలుసుకోని యూజర్ల బ్యాంకు బ్యాలెన్స్‌ను ఊడ్చేస్తున్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది. వాట్సాప్‌కు వచ్చే ఆన్లైన్ డెలివరీ సంస్థల లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని కాస్పర్‌స్కై యూజర్లకు హెచ్చరించింది. హాకర్లు నకిలీ వైబ్‌సైట్ లింక్‌లను పంపుతూ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపింది. సరైన వెబ్సైట్ చిరునామా లేదా అనుమానాస్పదంగా అనిపించే ఏదైనా లింక్‌పై ఎప్పటికీ క్లిక్ చేయకూడదని వాట్సాస్ యూజర్లను కాస్పర్‌స్కై పేర్కొంది. -
పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారంటే..
న్యూఢిల్లీ: పిల్లలు ఆన్ లైన్ క్లాసులే కాదు మిగిలిన ఇంటర్నెట్ మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉన్నట్లు తేలింది. పిల్లలు ఆన్ లైన్ క్లాసులు తరువాత ఇంటర్నెట్ లో ఏ అంశం గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఏ యాప్స్ పై పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. అనే అంశంపై సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై సర్వే నిర్వహించింది. ప్రథమ స్థానంలో యూట్యూబ్ క్యాస్పర్ స్కై సేఫ్ కిడ్స్ అని పిలిచే ఈ సర్వేలో పిల్లలు ఆన్ లైన్ క్లాసులే కాకుండా ‘సాఫ్ట్వేర్, ఆడియో, వీడియో’ (44.38%), ‘ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మీడియా’ (22.08%), ‘కంప్యూటర్ గేమ్స్’ (13.67%) పై మక్కువ చూపిస్తున్నట్లు తేలింది. దీంతో పాటు పిల్లలు ఎక్కువగా వీక్షించే వాటిల్లో యూట్యూబ్ ప్రథమస్థానంలో ఉండగా రెండవ స్థానంలో వాట్సాప్, మూడవ స్థానంలో టిక్‌టాక్ యాప్స్ ఉన్నాయి. ఇక పిల్లలు ఇష్టపడే టాప్ టెన్ గేమ్స్ లలో బ్రాల్ స్టార్స్, రాబ్లాక్స్, అమాంగ్ యుఎస్, మరియు మిన్‌క్రాఫ్ట్ గేమ్ లు ఉన్నాయి. చదవండి : ఇంటర్నెట్ సౌకర్యం.. సముద్ర భూగర్బంలో కేబుల్స్! మన పిల్లలు మహాముదుర్లు సాఫ్ట్వేర్, ఆడియో, వీడియో, వెబ్సైట్లను అత్యధికంగా వీక్షించేవారిలో 54.91% శాతంతో దక్షిణాసియాలో మనమే టాప్‌లో ఉన్నాం. మొబైల్ లో యూట్యూబ్ వీడియోల్ని చూస్తూ ఎక్కువగా సమయం గడిపే దేశాల్లో భారత్ 37.34 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. జూమ్ యూజర్లలో 8.4 శాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 5.96 శాతంతో భారత్ ఉన్నాయి. ఇక ఫేస్‌బుక్‌ను సోషల్ మీడియాగా వినియోగించడంలో పిల్లలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇందులో ఈజిప్ట్ (10.08%), మెక్సికో (5.9%) ఇండియా (2.87%)కి చెందిన పిల్లలు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. క్రియేటివిటీ పై మక్కువ ఇక మ్యూజిక్ విషయానికొస్తే పిల్లలు K-POP, BTS,BLACKPINK బ్యాండ్స్ ని ఇష్టపడుతున్నారు. సింగర్స్ లలో అరియానా గ్రాండే, బిల్లీ ఎలిష్ మరియు ట్రావిస్ స్కాట్ లపై అభిమానం చాటుకుంటున్నారు. బీట్స్, శాంపిల్స్ మ్యూజిక్ ను వినేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. దీంతో పాటు క్రియేటివిటీగా వీడియోల్ని చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకోసం పిల్లలు టిక్‌టాక్ ను ఆశ్రయిస్తున్నారు. కార్టూన్ వీడియోలే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా పిల్లలు చూసే వీడియో విభాగంలో సగం (50.21%) కార్టూన్ వీడియోలు ఉన్నాయి. లేడీ బగ్ మరియు సూపర్ క్యాట్, గ్రావిటీ ఫాల్స్ మరియు పెప్పా పిగ్ లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. రెండవ స్థానంలో వివిధ టీవీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఎక్కువగా ది వాయిస్ కిడ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సినిమాలు మరియు టీవీ సిరీస్‌లలో, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, జాచ్ స్నైడర్, ఇటీవలి జస్టిస్ లీగ్ మరియు డిస్నీ + మినీ-సిరీస్ వాండావిజన్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా ఎక్కువ మంది పిల్లల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది . ప్లాట్‌ఫాం ద్వారా చాలా తరచుగా కోబ్రా కై మరియు స్ట్రేంజర్ థింగ్స్ డ్రామా సిరీస్ లను చూస్తున్నారు. కంప్యూటర్ గేమ్స్ ను లైట్ తీసుకుంటున్నారు వీడియో గేమ్‌లలో మిన్‌క్రాఫ్ట్ (22.84%), ఫోర్ట్‌నైట్ (6.73%), అమాంగ్ అజ్ (3.80%), బ్రాల్ స్టార్స్ (6.34%) రోబ్లాక్స్ (3.82%) ఉన్నాయి. అదే సమయంలో, దాదాపు అన్ని దేశాల కోసం టాప్ 10 లో ఎక్కువగా ఆడే ఆట రాబ్లాక్స్. కజకిస్తాన్ దేశానికి పిల్లలు 26.01% తో కంప్యూటర్ గేమ్స్ ఆడడంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. 19.40శాతంతో రెండవ స్థానంలో యూకేకి చెందిన పిల్లలు ఉండగా.. విచిత్రంగా మనదేశానికి చెందిన పిల్లలు కంప్యూటర్ లలో వీడియోగేముల్ని కేవలం 5.08శాతం మాత్రమే వీక్షిస్తున్నారు. -
సైబర్ మోసం.. ఒక్కో యూజర్ నష్టం రూ.32,400
క్యాస్పర్‌స్కీ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారులు సైబర్ దాడుల కారణంగా సగటున రూ.32,400 నష్టపోయారని సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పరెస్కి తెలిపింది. సైబర్ దాడుల్లో సొమ్ములు పోగొట్టుకున్నవాళ్లలో 52 శాతం మంది మాత్రమే తమ సొమ్ముల్లో కొంచెమైనా వెనక్కి పొందగలిగారని ఈ సంస్థ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని, తమ సొమ్ములను తమను సైబర్ మోసాల నుంచి కాపాడుకోవడానికి ఇంటర్నెట్ యూజర్లు ఇంటర్నెట్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.. ⇔ ఆన్లైన్ ఆర్థిక మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్ తదితరాలు ఏడాదికి వంద కోట్లకు పైగా జరుగుతున్నాయి. ⇔ మోసాలకు గురైన వాళ్లలో అధిక భాగం ఫిర్యాదు చేయకుండానే మిన్నకుండిపోతున్నారు. ⇔ సగటున ఒక్కో ఇంటర్నెట్ వినియోగదారుడి నష్టం రూ.32,400 గా ఉంది. ⇔ సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో కనీసం ఒకరు 5,000 డాలర్లు నష్టపోయారు. ⇔ ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పిన వారి సంఖ్య 81 శాతంగా ఉంది. ⇔ ఆర్థిక సంబంధిత డేటాను అనుసంధానించే డివైస్‌ల్లో స్టోర్ చేసుకుంటామని చెప్పిన వారి సంఖ్య 44 శాతంగా ఉంది. ⇔ ఈ డివైస్‌లను తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకుం టామని చెప్పిన వారి సంఖ్య 60%గా ఉంది.