మీరు వాట్సాప్‌ వాడుతున్నారా..అయితే జాగ్రత్త! | New Delivery Scam On Whatsapp Can Rob You Of Your Bank Savings | Sakshi
Sakshi News home page

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా..అయితే జాగ్రత్త!

Published Sat, Aug 14 2021 4:34 PM | Last Updated on Sat, Aug 14 2021 4:38 PM

New Delivery Scam On Whatsapp Can Rob You Of Your Bank Savings - Sakshi

కరోనావైరస్ రాకతో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ మోసాలు గణనీయంగా పెరిగాయి. కేవైసీ అప్‌డైట్‌ పేరిట బ్యాంకు ఖాతాదారులపై సైబర్‌ నేరస్తులు విరుచుకుపడుతున్నారు. ప్రజలు ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్న హాకర్లు కొంత పుంతలు తొక్కుతున్నారు. తాజాగా వాట్సాప్‌ యాప్‌ ద్వారా సైబర్‌నేరస్తులు తెరపైకి మరో కొత్త స్కామ్‌ను తెచ్చారు.  ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పేరిట వాట్సాప్‌ యూజర్లకు హానికరమైన లింక్‌లను హాకర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా లింకులను ఓపెన్‌చేయగానే  యూజర్లకు చెందిన బ్యాంకు బ్యాలెన్స్‌ను హకర్లు ఊడ్చేస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి.

తాజాగా రష్యాకు  చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ఆన్‌లైన్‌ డెలివరీ పేరిట వాట్సాప్‌ యాప్‌కు వస్తోన్న సందేశాలపై యూజర్లను హెచ్చరించింది. వాట్సాప్‌ మెసేజ్‌లను చేస్తున్న ఆయా హాకర్లు ఆన్‌లైన్‌ డెలివరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేసిన వారుగా ఉన్నారని కాస్పర్‌స్కై పరిశోధకులు వెల్లడించారు. ఆయా ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు అందించే వస్తువులను వాట్సాప్‌ ద్వారా యూజర్లకు పంపుతూ పేమెంట్‌ చేసే సమయంలో వారి బ్యాంకు వివరాలను పూర్తిగా తెలుసుకోని యూజర్ల బ్యాంకు బ్యాలెన్స్‌ను ఊడ్చేస్తున్నట్లు కాస్పర్‌స్కై పేర్కొంది.

వాట్సాప్‌కు వచ్చే ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థల లింక్స్‌ పట్ల జాగ్రత్త వహించాలని కాస్పర్‌స్కై యూజర్లకు హెచ్చరించింది. హాకర్లు నకిలీ వైబ్‌సైట్‌ లింక్‌లను పంపుతూ సైబర్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపింది.  సరైన వెబ్‌సైట్ చిరునామా  లేదా అనుమానాస్పదంగా అనిపించే ఏదైనా లింక్‌పై ఎప్పటికీ క్లిక్ చేయకూడదని వాట్సాస్‌ యూజర్లను కాస్పర్‌స్కై పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement