సైబర్ మోసం.. ఒక్కో యూజర్ నష్టం రూ.32,400
క్యాస్పర్‌స్కీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారులు సైబర్ దాడుల కారణంగా సగటున రూ.32,400 నష్టపోయారని సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పరెస్కి తెలిపింది. సైబర్ దాడుల్లో సొమ్ములు పోగొట్టుకున్నవాళ్లలో 52 శాతం మంది మాత్రమే తమ సొమ్ముల్లో కొంచెమైనా వెనక్కి పొందగలిగారని ఈ సంస్థ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని, తమ సొమ్ములను తమను సైబర్ మోసాల నుంచి కాపాడుకోవడానికి ఇంటర్నెట్ యూజర్లు ఇంటర్నెట్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..
⇔ ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ తదితరాలు ఏడాదికి వంద కోట్లకు పైగా జరుగుతున్నాయి.
⇔ మోసాలకు గురైన వాళ్లలో అధిక భాగం ఫిర్యాదు చేయకుండానే మిన్నకుండిపోతున్నారు.
⇔ సగటున ఒక్కో ఇంటర్నెట్ వినియోగదారుడి నష్టం రూ.32,400 గా ఉంది.
⇔ సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో కనీసం ఒకరు 5,000 డాలర్లు నష్టపోయారు.
⇔ ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని చెప్పిన వారి సంఖ్య 81 శాతంగా ఉంది.
⇔ ఆర్థిక సంబంధిత డేటాను అనుసంధానించే డివైస్‌ల్లో స్టోర్ చేసుకుంటామని చెప్పిన వారి సంఖ్య 44 శాతంగా ఉంది.
⇔ ఈ డివైస్‌లను తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకుం టామని చెప్పిన వారి సంఖ్య 60%గా ఉంది.