న్యూఢిల్లీ: పిల్లలు ఆన్ లైన్ క్లాసులే కాదు మిగిలిన ఇంటర్నెట్ మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉన్నట్లు తేలింది. పిల్లలు ఆన్ లైన్ క్లాసులు తరువాత ఇంటర్నెట్ లో ఏ అంశం గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఏ యాప్స్ పై పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. అనే అంశంపై సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై సర్వే నిర్వహించింది.
ప్రథమ స్థానంలో యూట్యూబ్
క్యాస్పర్ స్కై సేఫ్ కిడ్స్ అని పిలిచే ఈ సర్వేలో పిల్లలు ఆన్ లైన్ క్లాసులే కాకుండా ‘సాఫ్ట్‌వేర్, ఆడియో, వీడియో’ (44.38%), ‘ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మీడియా’ (22.08%), ‘కంప్యూటర్ గేమ్స్’ (13.67%) పై మక్కువ చూపిస్తున్నట్లు తేలింది. దీంతో పాటు పిల్లలు ఎక్కువగా వీక్షించే వాటిల్లో యూట్యూబ్ ప్రథమస్థానంలో ఉండగా రెండవ స్థానంలో వాట్సాప్, మూడవ స్థానంలో టిక్‌టాక్ యాప్స్ ఉన్నాయి. ఇక పిల్లలు ఇష్టపడే టాప్ టెన్ గేమ్స్ లలో బ్రాల్ స్టార్స్, రాబ్లాక్స్, అమాంగ్ యుఎస్, మరియు మిన్‌క్రాఫ్ట్ గేమ్ లు ఉన్నాయి. చదవండి : ఇంటర్నెట్ సౌకర్యం.. సముద్ర భూగర్బంలో కేబుల్స్!
మన పిల్లలు మహాముదుర్లు
సాఫ్ట్‌వేర్, ఆడియో, వీడియో, వెబ్‌సైట్‌లను అత్యధికంగా వీక్షించేవారిలో 54.91% శాతంతో దక్షిణాసియాలో మనమే టాప్‌లో ఉన్నాం. మొబైల్ లో యూట్యూబ్ వీడియోల్ని చూస్తూ ఎక్కువగా సమయం గడిపే దేశాల్లో భారత్ 37.34 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. జూమ్ యూజర్లలో 8.4 శాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 5.96 శాతంతో భారత్ ఉన్నాయి. ఇక ఫేస్‌బుక్‌ను సోషల్ మీడియాగా వినియోగించడంలో పిల్లలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇందులో ఈజిప్ట్ (10.08%), మెక్సికో (5.9%) ఇండియా (2.87%)కి చెందిన పిల్లలు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు.
క్రియేటివిటీ పై మక్కువ
ఇక మ్యూజిక్ విషయానికొస్తే పిల్లలు K-POP, BTS,BLACKPINK బ్యాండ్స్ ని ఇష్టపడుతున్నారు. సింగర్స్ లలో అరియానా గ్రాండే, బిల్లీ ఎలిష్ మరియు ట్రావిస్ స్కాట్ లపై అభిమానం చాటుకుంటున్నారు. బీట్స్, శాంపిల్స్ మ్యూజిక్ ను వినేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. దీంతో పాటు క్రియేటివిటీగా వీడియోల్ని చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకోసం పిల్లలు టిక్‌టాక్ ను ఆశ్రయిస్తున్నారు.
కార్టూన్ వీడియోలే ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు చూసే వీడియో విభాగంలో సగం (50.21%) కార్టూన్ వీడియోలు ఉన్నాయి. లేడీ బగ్ మరియు సూపర్ క్యాట్, గ్రావిటీ ఫాల్స్ మరియు పెప్పా పిగ్ లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. రెండవ స్థానంలో వివిధ టీవీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఎక్కువగా ది వాయిస్ కిడ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సినిమాలు మరియు టీవీ సిరీస్‌లలో, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, జాచ్ స్నైడర్, ఇటీవలి జస్టిస్ లీగ్ మరియు డిస్నీ + మినీ-సిరీస్ వాండావిజన్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా ఎక్కువ మంది పిల్లల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది . ప్లాట్‌ఫాం ద్వారా చాలా తరచుగా కోబ్రా కై మరియు స్ట్రేంజర్ థింగ్స్ డ్రామా సిరీస్ లను చూస్తున్నారు.
కంప్యూటర్ గేమ్స్ ను లైట్ తీసుకుంటున్నారు
వీడియో గేమ్‌లలో మిన్‌క్రాఫ్ట్ (22.84%), ఫోర్ట్‌నైట్ (6.73%), అమాంగ్ అజ్ (3.80%), బ్రాల్ స్టార్స్ (6.34%) రోబ్లాక్స్ (3.82%) ఉన్నాయి. అదే సమయంలో, దాదాపు అన్ని దేశాల కోసం టాప్ 10 లో ఎక్కువగా ఆడే ఆట రాబ్లాక్స్. కజకిస్తాన్ దేశానికి పిల్లలు 26.01% తో కంప్యూటర్ గేమ్స్ ఆడడంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. 19.40శాతంతో రెండవ స్థానంలో యూకేకి చెందిన పిల్లలు ఉండగా.. విచిత్రంగా మనదేశానికి చెందిన పిల్లలు కంప్యూటర్ లలో వీడియోగేముల్ని కేవలం 5.08శాతం మాత్రమే వీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment