Spider Man Cyber Security Alert: మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరోస్ సిరీస్‌లో తాజాగా విడుదలైన సినిమా స్పైడర్‌మ్యాన్: నో వే హోం. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక ఫిషింగ్ సైట్లు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది.
ప్రీమియర్‌తో ఎర
స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో లెటెస్ట్ మూవీ నో వే హోం సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతకు ముందు ఈ సినిమా ప్రీమియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్‌లో వల వేశారని క్యాస్పర్‌స్కై పేర్కొంది. స్పైడర్‌మ్యాన్ నో వే హోం ప్రీమియర్ అందిస్తున్నట్టుగా ఫిషింగ్ సైట్లను రూపొందించాయని.. వీటిని క్లిక్ చేసిన వారికి ప్రీమియర్ లింక్ పంపిస్తామని అంతకు ముందు గేట్‌వే ఫీజు చెల్లించాలంటూ క్రెడిట్ కార్డు, బ్యాంకు డిటెయిల్స్ అడిగినట్టు ఆ సంస్థ పేర్కొంది. బ్యాంకు వివరాలు అందించిన వారి ఖాతాల్లో సొమ్ము మాయమైనట్టు తాము గుర్తించామంది.
క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా
మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలుకు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ముగ్గురు స్పైడర్‌మ్యాన్లను ఒకేసారి తెరమీద చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిపస్తున్నారు. ఈ సూపర్‌హీరోస్ ఎడ్వెంచర్స్ చూసేందుకు టీనేజర్లు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో వీరిని టార్గెట్ చేసుకుని మూవీ లింకుల పేరుతో ఫిషింగ్ సైట్లు పుట్టగొడుగుల్లా నెట్‌లో ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. మరిన్ని మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది బాధితులు ఉన్నారనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment