phishing sites
-
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్‌కాల్స్‌ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్‌కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్‌కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్‌లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్‌చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్‌చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సరికొత్త ముప్పు సైబర్ టెర్రరిజం
సైబర్ నేరగాళ్లు.. లక్షలు, కోట్లలో డబ్బులు వ్యక్తిగత ఖాతాల్లోంచి కొల్లగొట్టడమే కాదు..సైబర్ టెర్రరిజానికి తెరతీస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాద ముప్పు క్రమంగా కొత్తరూపు సంతరించుకుంటోంది.. ఇది భవిష్యత్తులో జడలువిప్పుకుని సైబర్టెర్రరిజంగా మారి మానవాళికి ముప్పుగా మారబోతోందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? దీంతో ప్రపంచ దేశాలకు వచ్చే ముప్పు ఏంటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలపై ‘సాక్షి ’ప్రత్యేక కథనం. మచ్చుకు కొన్ని ఘటనలను చూస్తే.. సైబర్ టెర్రరిజం వేళ్లూనుకుంటుందనడానికి ఇటీవలి కొన్ని పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. హ్యాకర్లు సోనీ అంతర్జాతీయ సంస్థపై సైబర్ దాడి చేసి గోప్యమైన సమాచారాన్ని హ్యాక్ చేసి సంస్థ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి డేటాపై ర్యామ్సన్వేర్ఎటాక్ జరగడం, హైదరాబాద్లోఏపీ మహేశ్కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు హ్యాకింగ్ ఘటన, తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం కూడా ఇలాంటి కోవలోనివే. సాక్షి, హైదరాబాద్ : రోజువారీ జీవితంలో సాంకేతికతపై ఆధారపడటం విపరీతంగా పెరిగింది. అదే సమయంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన తీవ్రవాదులు వారి ప్రయోజనాల కోసం ఇందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొనే అవకాశం కూడా పెరుగుతోంది. జనజీవనాన్ని స్తంభింపజేసి, వ్యవస్థలను గందరగోళపర్చి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు డిజిటల్ సాధనాలు, సాంకేతికతను ఉపయోగించడాన్ని సైబర్ టెర్రరిజంగా చెబుతున్నారు సైబర్ భద్రత నిపు ణులు. తరచుగా హింసపై ఆధారపడే సంప్రదాయక ఉగ్రవాద రూపాల్లా కాకుండా సైబర్ ఉగ్రవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇంటర్నెట్ను ఉపయోగించుకుని వర్చువల్‌గా పనిచేస్తారు. సైబర్ దాడులతో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలను హ్యాక్ చేయడం, మౌలిక సదుపాయాలకు అంతరాయాన్ని కలిగించడం, సోషల్ మీడియా ద్వారా దు్రష్పచారం చేయడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సైబర్ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాలు. నాలుగు రకాలుగా హానిసైద్ధాంతిక ఉగ్రవాదం: సైబర్ ఉగ్రవాదులు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, అనుచరులను నియమించుకోవడానికి, ప్రత్యర్థులపై హింసను ప్రేరేపించడానికి సైబర్‌స్పేస్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు: ప్రత్యర్థి ప్రభుత్వాలను అణగదొక్కడం, రహస్యమైన సమాచారాన్ని దొంగిలించడం, శత్రు భూభాగంలో కీలకమైన అవసరాలకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తారు. ఆర్థిక లాభం: సైబర్ టెర్రరిజం లక్ష్యం సైతం ఆర్థిక వ్యవస్థల్ని దోచుకోవడమే. ఉగ్ర సంస్థలు లేదా హ్యాకర్లు ర్యామ్సన్వేర్ దాడులు, ఆర్థిక మోసాలతో డబ్బులు కొల్లగొడుతారు. అవసరమైన డేటాను ఎన్‌క్రిప్‌్ట, డిక్రీప్ట్ చేయడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తారు. సైకలాజికల్ వార్ఫేర్: భయం, అనిశ్చితి, అపనమ్మకాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపేలా ప్రభుత్వరంగ సంస్థలను హ్యాక్ చేస్తుంటారు. ఎలా చేస్తారు?మాల్వేర్: వైరస్లు, ట్రోజన్లు, ర్యాన్సమ్వేర్ వంటి హానికర సాఫ్ట్వేర్లను సైబర్ ఉగ్రవాదులు ఎక్కువగా వాడుతున్నారు. ఫిషింగ్: వీటిని సోషల్ ఇంజనీరింగ్ ఎటాక్‌గా చెప్పొచ్చు. లక్ష్యంగా ఎంచుకున్న సంస్థల నెట్‌వర్క్‌లు, సంస్థలు, వ్యక్తులకు మోసపూరిత ఈ– మెయిల్లు, ఎస్ఎంఎస్లలో లింకులు పెట్టి పంపుతారు. దీని ద్వారా హాక్ చేస్తే కలిగే నష్టం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్: వీటినే డీడీఓఎస్ దాడులు అంటారు. టార్గెట్ చేసిన నెట్‌వర్క్‌కు విపరీతమైన ట్రాఫిక్ ఉండేలా చేసి వాటిని వినియోగదారులకు అందుబాటులో లేకుండా చేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ఉపయోగిస్తారు. ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో గందరగోళం సృష్టించడం ఈ దాడి లక్ష్యం. సాఫ్ట్వేర్ వల్నరబిలిటీ ఎటాక్: సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ప్రోటోకాల్‌లోని చిన్నపాటి లోపాలను ఆసరాగా తీసుకుని దాడులు చేస్తారు. సప్లై చైన్ అటాక్స్: కస్టమర్లు లేదా క్లయింట్ల నెట్‌వర్క్‌లలోకి చొరబడేందుకు థర్డ్ పార్టీ విక్రేతలుగా చేరి నెట్‌వర్క్‌కు హానికల్గిస్తారు.సైబర్ టెర్రరిజానికి గురవుతున్న ప్రధాన రంగాలు.. సైబర్ఉగ్రవాదులు ప్రభుత్వరంగసంస్థలు, పవర్ గ్రిడ్లు, రవాణానెట్వర్క్లు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలకు అంతరాయంసృష్టించి ప్రజా భద్రత, సంక్షేమానికి ఆటంకాలుకలిగిస్తారు. ప్రతికూల పరిస్థితులను సృష్టించిసామాజిక జీవనాన్ని బలహీనపర్చడం వీరిలక్ష్యం. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫోరమ్‌ల ద్వారా తీవ్రవాద భావజాల వ్యాప్తికి, హింసనుప్రేరేపించేందుకు సైబర్ టెర్రరిజాన్ని వాడుతున్నారు. సైబర్ టెర్రరిజాన్ని ఇలా ఎదుర్కోవచ్చు సైబర్ సెక్యూరిటీ చర్యలుసైబర్ టెర్రరిస్ట్‌ల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు సైబర్ సెక్యూరిటీ సాంకేతికతను, సైబర్ దాడులను అడ్డుకోవడానికి బలమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటుచేసుకోవాలి. చొరబాట్లను గుర్తించే వ్యవస్థలు, ఎన్క్రిప్షన్ మెకానిజమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. వీటి కోసం ప్రభుత్వం అదనంగా పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పరస్పర సహకారంతో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేలా ఉమ్మడి ప్రణాళికలు అమలు చేయాలి. అంతర్జాతీయసహకారంసైబర్ ఉగ్రవాదం ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, సైబర్నేరగాళ్లను పట్టుకోవడానికి ఆయా దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి. గుర్తించకపోతే అనర్థాలుసాంకేతికత వినియోగం పెరిగేకొద్దీ సైబర్ టెర్రరిజం ముప్పు కూడా పెరుగుతోంది. ఇది అనేక రంగాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు అన్ని స్థాయిల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు చర్యలు ప్రారంభించాలి. భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే సైబర్ టెర్రరిజం ముప్పును గుర్తించకపోతే అనర్థాలు తప్పవు. –అద్వైత్ కంభం, సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ ప్రజల్లో అవగాహన పెంచాలి ఫిషింగ్ స్కామ్‌లు, మాల్వేర్ బెదిరింపులు ఇతర సైబర్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు శిక్షణ, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలి. -
సైబర్ నేరగాళ్ల హైటెక్ దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. కొత్త దారుల్లో బ్యాంక్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. బడా కంపెనీల ఈ–మెయిళ్ల, వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి సమాచారాన్ని కొట్టేస్తున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత విషయాల కూపీ లాగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ఫోన్ నంబర్ల సేకరించి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, అడ్రస్ డేటా చౌరంతో స్విమ్ స్వాప్ చేసి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సిమ్ పని చేయకపోవడంతో వేరే నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే అతడి పేరిట అదే నంబర్‌తో వేరే వ్యక్తులు కొత్త సిమ్ తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. అదే సమయంలో అతని అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు అకౌంట్ చూసుకుంటే గానీ అతనికి అసలు విషయం తెలియలేదు. సిమ్ పనిచేయకపోవడంతో ఎస్ఎంఎస్ కూడా రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజమండ్రికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫోన్ ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి.. ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. సమీపంలోని కస్టమర్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. సిమ్‌కార్డు పాడైందని.. కొత్తది తీసుకోవాలన్నారు. అడ్రస్ ప్రూఫ్ తీసుకుని ఆన్లైన్లో చెక్ చేసిన సిబ్బంది అంతకు ముందే అదే నంబర్‌తో కొత్త సిమ్ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ అకౌంట్లో రూ.20 వేలు డ్రా అయ్యాయి. ఈ రెండు ఘటనల్లో జరిగింది సిమ్ స్వాప్. సైబర్ నేరగాళ్లు నకిలీ సిమ్ తీసుకుని.. బ్యాంకు అకౌంట్లను గుల్ల చేసే కొత్త ఎత్తుగడ ఇది. ఇటీవల కాలంలో పల్లెలు, పట్టణాల్లోనూ సిమ్ స్వాప్ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు ♦ సిమ్ స్వాప్ నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌తో అతనికి తెలియకుండానే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ♦ నేరగాళ్లు ముందుగానే బాధిత వ్యక్తి అడ్రస్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వివరాలను సంపాదిస్తున్నారు. ♦ వాటి ఆధారంగా సిమ్‌కార్డు పోయిందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు. ♦ఆ విషయం అసలు వ్యక్తికి తెలిసేలోపే ఆ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును అదే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ♦ ఇందుకోసం ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత వివరాలను కూపీ లాగుతున్నారు. ♦ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. వీటిని తరచూ గమనించాలి ♦ మీ సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ వేరేచోట యాక్టివేట్ అయిందంటే అది సిమ్ స్వాప్గా గుర్తించాలి. ♦ ఏ కారణం లేకుండా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఉన్నట్టుండి నిలిచిపోతే దోపిడీకి ఆస్కారం ఏర్పడినట్టు గ్రహించాలి. ♦ తరచూ భద్రతా నోటిఫికేషన్లు, పాస్వర్డ్లు, భద్రతా ప్రశ్నలు వంటివి, మీ ప్రొఫైల్ డేటా మార్పుల గురించి హెచ్చరికలు వస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లోకి లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని అర్థం. ♦ సైబర్ నేరస్తులు మీ సిమ్‌ను నకిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మీరు సందర్శించే వెబ్సైట్ల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ♦ భద్రత ప్రమాణాలు కలిగిన వెబ్సైట్ యూఆర్ఎల్లో https:// అని ఉంటుంది. యూఆర్ఎల్లో ‘ S ’ లేకుంటే అది కచ్చితంగా నకిలీ వెబ్సైట్ అని భావించాలి. వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్త సిమ్ స్వాపింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిగత డేటా ఎప్పుడూ బహిరంగ పరచకూడదు. భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్సైట్లనే వినియోగించాలి. సామాజిక మాధ్యమాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు వంటి వాటిని పిన్లుగా పెట్టకపోవడం మంచిది. తరచూ మీ సిమ్ మీ పేరుపైనే ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మెసేజ్‌లు ఆగిపోవడం, సిగ్నల్ నిలిచిపోవడం, మీ అకౌంట్‌కు అవాంఛనీయ మెయిల్స్ రావడం సిమ్ స్వాప్‌కు సూచనలు. రెండంచెల ధ్రువీకరణ కోరే యాప్స్‌ను మాత్రమే వాడటం మంచింది. సిమ్ స్వామ్ జరిగినట్టు తెలిసివెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 112, 181, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 11100, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. – అమిత్ బర్దర్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఈ ఫోన్ నెంబర్స్‌తో జాగ్రత్త..లేకపోతే..!
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆన్లైన్లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫిషింగ్ వెబ్సైట్లతో కేటుగాళ్లు ఆయా ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు. ఈ నంబర్ల పట్ల జాగ్రత్త..! తాజాగా ఎస్బీఐ కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే పలు ఫోన్ నంబర్లను ట్విటర్లో పేర్కొంది. కేవైసీ అప్డేట్ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్, మెసేజ్స్ వస్తున్నాయని ఎస్బీఐ గుర్తించంది. ఈ ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్స్ను ఒపెన్ చేయకూడదని విన్నవించింది. ఈ మెసేజ్స్తో ఖాతాదారులు అకౌంట్ల నుంచి డబ్బులను కొట్టేస్తారని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ హ్యండిల్లో పేర్కొంది. అంతేకాకుండా ఖాతాదారులు తమ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డుకు సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవద్దని తెలియజేసింది. Do not engage with these numbers, & don't click on #phishing links for KYC updates as they aren't associated with SBI. #BeAlert & #SafeWithSBI https://t.co/47tG8l03aH — State Bank of India (@TheOfficialSBI) April 20, 2022 చదవండి: ఐపీఎల్ రేటింగ్స్ ఎందుకు తగ్గాయ్! విశ్లేషించిన బిజినెస్ మ్యాగ్నెట్ -
Spider Man Cyber Security Alert: సూపర్ హీరోస్ క్రేజ్.. పొంచి ఉన్న సైబర్ దాడులు..
Spider Man Cyber Security Alert: మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరోస్ సిరీస్‌లో తాజాగా విడుదలైన సినిమా స్పైడర్‌మ్యాన్: నో వే హోం. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక ఫిషింగ్ సైట్లు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది. ప్రీమియర్‌తో ఎర స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో లెటెస్ట్ మూవీ నో వే హోం సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతకు ముందు ఈ సినిమా ప్రీమియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్లో వల వేశారని క్యాస్పర్‌స్కై పేర్కొంది. స్పైడర్‌మ్యాన్ నో వే హోం ప్రీమియర్ అందిస్తున్నట్టుగా ఫిషింగ్ సైట్లను రూపొందించాయని.. వీటిని క్లిక్ చేసిన వారికి ప్రీమియర్ లింక్ పంపిస్తామని అంతకు ముందు గేట్‌వే ఫీజు చెల్లించాలంటూ క్రెడిట్ కార్డు, బ్యాంకు డిటెయిల్స్ అడిగినట్టు ఆ సంస్థ పేర్కొంది. బ్యాంకు వివరాలు అందించిన వారి ఖాతాల్లో సొమ్ము మాయమైనట్టు తాము గుర్తించామంది. క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలుకు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ముగ్గురు స్పైడర్మ్యాన్లను ఒకేసారి తెరమీద చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిపస్తున్నారు. ఈ సూపర్‌హీరోస్ ఎడ్వెంచర్స్ చూసేందుకు టీనేజర్లు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో వీరిని టార్గెట్ చేసుకుని మూవీ లింకుల పేరుతో ఫిషింగ్ సైట్లు పుట్టగొడుగుల్లా నెట్లో ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. మరిన్ని మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది బాధితులు ఉన్నారనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు. చదవండి: -
హ్యాకర్ల ఆట కట్టించండి, ఇలా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్
కోవిడ్ -19 కారణంగా ఆన్లైన్ వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్‌లో లాగినై కుటుంబసభ్యులకు, స్నేహితులకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే వినియోగదారుల్ని టార్గెట్ చేస్తున్నారు. మోడస్ ఒపేరంది(modus operandi) లేదంటే ఫిషింగ్ అటాక్స్ చేసి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ కొన్ని వేల మంది సైబర్ దాడులకు గురవుతున్నారు. సైబర్ నేరస్తులు దాడులు చేసే విధానం అయితే ఇలాంటి సైబర్ దాడుల భారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ముందుగా సైబర్ దాడులు ఎలా జరుగుతాయని విషయాల్ని తెలుసుకుందాం. ►ముందస్తుగా సైబర్ నేరస్తులు బాధితుల బ్యాంక్ అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఓటీపీలను దొంగిలిస్తారు. ► వాటి సాయంతో సేమ్ అఫిషియల్ బ్యాంక్ ఈమెల్ తరహాలో బ్యాంక్ హోల్డర్లకు జీమెయిల్ నుంచి ఈమెయిల్ సెండ్ చేస్తారు. ► బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఎలా స్పామ్ ఫోల్డర్లోకి వెళతాయో.. వీళ్లు పంపిన మెయిల్స్ సైతం అలాగే స్పామ్‌లోకి వెళతాయి. ► ఆ మెయిల్స్‌లో ఓ లింక్ క్లిక్ చేయాలని సూచిస్తారు. ► ఆ లింక్ క్లిక్ చేసి అందులో యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు. ► ఇలా చేయడానికి రివార్డ్ పాయింట్లను ఎరగా వేస్తారు. సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ► ముందుగా మీ ఈ మెయిల్ లోని వెబ్సైట్ లింక్ (URL)ని తనిఖీ చేయండి. ఇది మీ బ్యాంక్ మాదిరిగానే ఉంటుంది, కానీ అది ఒకేలా ఉండదు. ► https: // లో 's' ఉందో లేదో తనిఖీ చేయడం ద్వారా మీరు URL ని కూడా ధృవీకరించాలి. ఇది సురక్షితంగా ఉంటుంది. ► నకిలీ బ్యాంకులు లేదా కంపెనీలకు ఇది ఉండదు. నేరస్తులు (http: //) యూజ్ చేసే మెయిల్స్ ఇలా ఉంటాయి. ► మీకు అలాంటి ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తే, లింక్‌లపై క్లిక్ చేయవద్దు ► ఏవైనా అనుమానాస్పద వెబ్సైట్లలో మీ యూజర్ నేమ్/పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ అందించవద్దు. ► ఏ చట్టబద్ధమైన బ్యాంక్ లేదా కంపెనీ మీ పేరు/పాస్‌వర్డ్‌లను అడగదు. ఒకవేళ అడిగితే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. చివరిగా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్‌లు,పాస్వర్డ్లు మీ రహస్యం.మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎంట్రీ చేసి ఓటీపీ అడిగితే మోసం చేస్తున్నారని గుర్తించాలి. పై టిప్స్‌ను, సూచనల్ని పాటించి స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండండి. -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక..!
ముంబై: చైనాకు చెందిన హాకర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని వారిపై సైబర్‌దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖాతాదారులకు కెవైసీని అప్డేట్ చేయాలని హ్యకర్లు ఒక వెబ్సైట్ లింక్ పంపుతున్నారని తెలిసింది. అంతేకాకుంగా రూ. 50 లక్షల విలువైన ఉచిత బహుమతులను సొంతం చేసుకోండి అంటూ వాట్సాప్‌లో ఖాతాదారులకు సందేశాలను పంపుతున్నారు. హ్యకర్లు పంపిన సందేశాలకు రిప్లై ఇస్తే అంతే సంగతులు..! ఖాతాదారుల విలువైన సమాచారాన్ని దోచుకోవడమే కాకుండా డబ్బులను ఖాతాల నుంచి ఊడ్చేస్తారని సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు. న్యూఢిల్లీకి చెందిన థింక్‌ట్యాంక్ సైబర్‌పీస్ పౌండేషన్ పరిశోధనా విభాగం, ఆటోబోట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు కొంతమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫిషింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారని వారి అధ్యయనంలో వెల్లడించారు. ఎస్బీఐ ఖాతాదారులకు కెవైసీ ధృవీకరణ చేయాలని చెప్పి, ఫోన్లకు మెసేజ్‌లను పంపుతున్నారని గుర్తించారు. ఈ మెసేజ్‌ను ఓపెన్ చేస్తే అధికారిక ఎస్బీఐ ఆన్లైన్ సైట్ పేజీని పోలి ఉన్న వెబ్సైట్ ఓపెన్ అవుతోంది. ఇది యూజర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని పంపి, ఎంటర్ చేయగానే ఖాతాదారులు వ్యక్తిగత వివరాలను హాకర్లు సేకరిస్తున్నారని ఈ బృందం గుర్తించింది. నకిలీ ఎస్బీఐ వెబ్‌సైట్‌తో ఖాతాదారులను దారిమళ్లించి వారి సమాచారాన్ని హాకర్లు పొందుతున్నారు. మరో సందర్భంలో..ఖాతాదారులకు ఆకర్షణీయమైన ఉచిత బహుమతులు అందిస్తామంటూ వాట్సాప్‌లో సందేశాలను హాకర్లు పంపిస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొంటే రూ. 50 లక్షల విలువైన బహుమతులు మీ సొంతం అంటూ హాకర్లు ఖాతాదారులను దారి మళ్లించి వారి విలువైన సమాచారాన్ని లాగేసుకుంటున్నారని తెలిసింది. కాగా ఎస్బీఐ యూజర్లకే కాకుండా ఐడీఎఫ్సీ, పీఎన్బీ, ఇండస్ఇండ్, కోటక్ బ్యాంక్ ఖాతాదారులపై ఫిషింగ్ స్కామ్ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఎస్మీఐ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఫిషింగ్ కుంభకోణానికి పాల్పడినట్లుగా పరిశోధన బృందం నిర్ధారించింది. -
బ్యాంకు సైట్లలో నకిలీలు!
పేమెంట్ గేట్‌వే రూపంలో మాయ • రెండు నెలల తేడాతో రెండు సైట్ల నమోదు • ఏకంగా 26 బ్యాంకులకు నకిలీ లాగిన్ సైట్లు • ఫిషింగ్ సైట్లు, మాల్వేర్తో సైబర్ నేరగాళ్ల ఎత్తులు • బయటపెట్టిన సెక్యూరిటీ సంస్థ ‘ఫైర్ ఐ’ • ఆన్లైన్ బ్యాంకింగ్‌లో కాస్త తేడా వచ్చినా గల్లంతే బెంగళూరు: పెద్ద నోట్లను రద్దు చేశాక సహజంగానే ఆన్లైన్ లావాదేవీలు పెరిగారుు. బ్యాంకుల వద్ద కూడా కొత్త నోట్లు తగినంతగా లేకపోవటంతో... ఆయా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు లైన్లో నిల్చోలేక చాలావరకూ ఆన్లైన్ బాట పడుతున్నారు. మరోవంక ప్రభుత్వం కూడా ‘నగదు లావాదేవీలొద్దు... డిజిటలే ముద్దు’ అంటూ ఎలక్ట్రానిక్ నగదు లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు సైతం తమ సత్తా చూపిస్తున్నారు. కొత్త వారు, ఆన్లైన్ అలవాటు లేనివారు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఆశ్రరుుస్తారు కనుక వారిని తేలిగ్గా దోచుకోవచ్చని జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. మాల్వేర్లు, ఫిషింగ్ వెబ్సైట్లతో తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. యాంటీవైరస్లకు చిక్కకుండా ఫైర్‌వాల్స్ అడ్డుగోడలకు వెరవకుండా అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే ‘ఫైర్ఐ’ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఇలాంటి మోసపూరిత వెబ్సైట్లు చాలా బయటపడ్డారుు. దీనిప్రకారం సిసెక్యూర్పేడాట్కామ్(ఛిట్ఛఛిఠట్ఛఞ్చడ. ఛిౌఝ) అనే మరో డొమైన్‌ను ఫైర్ఐ కనుగొంది. ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే మాదిరిగా కనిపించే ఈ వెబ్సైట్ వాస్తవానికి ఒక ఫిషింగ్ వెబ్సైట్లోకి ఖాతాదారును మళ్లిస్తున్నట్లు ఫైర్ ఐ గుర్తించింది. ఈ నకిలీ వెబ్సైట్ ఏం చేస్తుందంటే... ఆన్లైన్ లావాదేవీ నిర్వహిస్తున్న ఖాతాదారు నుంచి తన ఖాతా నంబరు, మొబైల్ నంబరు, ఈమెరుుల్ అడ్రస్, వన్ టైమ్ పాస్వర్డ్, ఇతరత్రా వివరాలు మోసపూరితంగా సేకరిస్తుంది. ఖాతాదారు సదరు సమాచారమంతా ఎంటర్ చేశాక లాగిన్ విఫలమైందంటూ వెబ్సైట్లో ఓ నకిలీ మెసేజి ప్రత్యక్షమవుతుంది. అసలు సంగతి అర్థమయ్యే లోగా ఖాతాదారు అకౌంటు వివరాలన్నీ హ్యాకర్ చేతికి చేరిపోతారుు. ఈ ఏడాది అక్టోబర్ 23న రిజిస్టరరుున ఈ ఫిషింగ్ వెబ్సైట్... ఇలా ఏకంగా 26 బ్యాంకులకు సంబంధించి నకిలీ లాగిన్ సైట్లు రూపొందించింది. ఇందులో దిగ్గజ బ్యాంకులు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితరాలన్నీ ఉన్నారుు. డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం చోరీకి మరో ఫిషింగ్ సైటు.. :ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా ఫైర్ఐ సెక్యూరిటీ బృందం మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఎన్సెక్యూర్పేడాట్కామ్(ట్ఛఛిఠట్ఛఞ్చడ.ఛిౌఝ) అనే మరో నకిలీ డొమైన్ బైటపడింది. సీసెక్యూర్పేడాట్కామ్ని రూపొందించిన వాళ్లే దీన్ని కూడా 2016 ఆగస్టులో రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడరుుంది. ఇది సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు, వీసా.. మాస్టర్‌కార్డ్, ఎస్బీఐ డెబిట్ కార్డుల వివరాలను తస్కరించే లక్ష్యంతో రూపొందినట్లుగా స్పష్టమవుతోంది. ఖాతాదారు వివరాలన్నీ నమోదు చేసిన తరువాత ఇది కూడా ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. ఇలాంటి ముప్పుల గురించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స టీమ్ (సీఈఆర్టీ ఐఎన్) దృష్టికి తీసుకెళ్లింది ఫైర్ఐ. కాస్తో కూస్తో టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా ఏది సిసలైనది.. ఏది నకిలీది అని తెలుసుకునే అవకాశం ఉండటం లేదు. ఇలాంటి సందర్భంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో, వారి నగదు ఎంత సురక్షితంగా ఉంటుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చన్నది టెక్నాలజీ నిపుణుల మాట. గూగుల్ అకౌంట్లకు గూలిగన్ మాల్వేర్ ముప్పు పది లక్షల ఖాతాల వివరాలుచోరీ? న్యూఢిల్లీ: సైబర్ దాడుల సమస్య తీవ్రతకు అద్దం పడుతూ తాజాగా మరో మాల్వేర్ తెరపైకొచ్చింది. దాదాపు పదిలక్షల పైగా గూగుల్ ఖాతాలు ’గూలిగన్’ అనే ఆండ్రారుుడ్ మాల్వేర్ కొత్త వేరియంట్ బారిన పడినట్లు చెక్ పారుుంట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పేర్కొంది. ఇది ఆండ్రారుుడ్ డివైజ్‌లలోకి చొరబడి, ఈమెరుుల్ అడ్రస్‌లు, తత్సంబంధిత సమాచారాన్ని తస్కరిస్తుంది. జీమెరుుల్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డాక్స్, గూగుల్ ప్లే, గూగుల్ డ్రైవ్, జీ సూట్ మొదలైన వాటన్నింటిలో యూజర్లు భద్రపర్చుకున్న డేటాను హ్యాకర్స్‌కి చేరవేస్తుంది. చెక్ పారుుంట్ నివేదిక ప్రకారం రోజూ దాదాపు 13,000 పైచిలుకు డివైజ్‌లు గూలిగన్ బారిన పడుతున్నారుు. ఎక్కువగా ఆండ్రారుుడ్ 4 (జెల్లీ బీన్, కిట్‌క్యాట్), 5 (లాలీపాప్) డివైజ్‌లు టార్గెట్‌గా ఇది విజృంభిస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆండ్రారుుడ్ పరికరాల్లో దాదాపు 74 శాతం డివైజ్‌లు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లతోనే పనిచేస్తున్నారుు. వీటిల్లో దాదాపు 40 శాతం డివైజ్‌లు ఆసియాలో, 12 శాతం యూరప్‌లో వినియోగంలో ఉన్నారుు. హ్యాక్ అరుున డివైజ్‌లలో ప్రతి రోజూ గూలిగన్ కనీసం 30,000 యాప్స్‌ను ఇన్స్టాల్ చేస్తోందని అంచనా. మరోవైపు మాల్వేర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది. ఆన్లైన్ చెల్లింపులు జరిపేటప్పుడు ఈ నకిలీ థర్ట్‌పార్టీ సైట్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత బ్యాంక్ నకిలీ సైట్లో వివరాలు, ఓటీపీ వివరాలను కాజేస్తారు చివరకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దొంగిలించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్, ఓటీపీ సమాచారంతో హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్ నుంచి సొమ్మును మాయం చేస్తారు