SBI Customer Alert: SBI Warns Customers Against Engaging With These Numbers - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఈ ఫోన్‌ నెంబర్స్‌తో జాగ్రత్త..లేకపోతే..!

Published Thu, Apr 21 2022 1:06 PM | Last Updated on Thu, Apr 21 2022 1:21 PM

Sbi Warns Customers Against Engaging With These Numbers - Sakshi

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌లో పెరిగిపోతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని త‌న ఖాతాదారుల‌ను ఎప్పటికప్పుడు హెచ్చ‌రిస్తూనే ఉంటుంది. నో యువర్ క‌స్ట‌మ‌ర్‌ (కేవైసీ) వెరిఫికేష‌న్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ సూచించింది. కొందరు మోస‌గాళ్లు ఎస్‌బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్‌బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లతో కేటుగాళ్లు ఆయా ఖాతాదారుల అకౌంట్‌ నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు.

ఈ నంబర్ల పట్ల జాగ్రత్త..!
 తాజాగా ఎస్‌బీఐ కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో మోసాలకు పాల్పడే పలు ఫోన్‌ నంబర్లను ట్విటర్‌లో పేర్కొంది. కేవైసీ అప్‌డేట్‌ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్‌, మెసేజ్స్‌ వస్తున్నాయని ఎస్‌బీఐ గుర్తించంది. ఈ ఫోన్‌ నంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్స్‌ పట్ల జాగ్రత్త వహించాలని ఎస్‌బీఐ ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్స్‌ను ఒపెన్‌ చేయకూడదని విన్నవించింది. ఈ మెసేజ్స్‌తో ఖాతాదారులు అకౌంట్ల నుంచి డబ్బులను కొట్టేస్తారని  ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ హ్యండిల్‌లో పేర్కొంది.  అంతేకాకుండా ఖాతాదారులు తమ అకౌంట్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుకు సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవద్దని తెలియజేసింది. 

చదవండి: ఐపీఎల్‌ రేటింగ్స్‌ ఎందుకు తగ్గాయ్‌! విశ్లేషించిన బిజినెస్‌ మ్యాగ్నెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement