జీవిత భాగస్వాములపై అపనమ్మకంతో కొంతమంది వ్యక్తులు స్టాకర్‌వేర్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. స్టాకర్‌వేర్ యాప్స్‌పై పరిశోధనలను జరిపిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం కాస్పర్‌స్కై సంచలన విషయాలను వెల్లడించింది.
10 మందిలో ముగ్గురు సై..!
క్సాస్పర్ స్కై చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మందిలో ముగ్గురు వ్యక్తులు తమ జీవిత భాగస్వాములపై నిఘా ఉంచేందుకు స్టాకర్‌వేర్ యాప్స్‌ను వాడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. 21 దేశాల్లో కాస్పర్‌స్కై నిర్వహించిన సర్వేలో సుమారు 21 వేల మంది పాల్గొన్నారు. .
ఈ ఏడాది భారీగానే వాడకం..!
స్టాకర్‌వేర్ యాప్స్‌ను ఈ ఏడాది మొదటి 10 నెలల్లో దాదాపు 28,000 మంది మొబైల్ వినియోగదారులు స్టాకర్‌వేర్ యాప్స్ బారిన పడ్డారు. యూరోపియన్ యూనియన్‌లో 3,100 కంటే ఎక్కువ కేసులు, ఉత్తర అమెరికాలో 2,300 కంటే ఎక్కువ మంది వినియోగదారులు స్టాకర్ వేర్ యాప్స్ ద్వారా ప్రభావితమయ్యారని కాస్పర్‌స్రై వెల్లడించింది. కాస్పర్‌స్కై గణాంకాల ప్రకారం... ఈ యాప్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రష్యా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాలు ఇప్పటివరకు అత్యధికంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ యాప్స్‌తో భారత్‌లో కూడా 4627 మంది ప్రభావితమైనట్లు కాస్పర్ స్కై వెల్లడించింది.
అసలు ఏంటి స్టాకర్‌వేర్ యాప్స్..!
స్టాకర్‌వేర్ యాప్స్ చిక్కవు..దొరకవు..! స్టాకర్‌వేర్ యాప్స్‌ను ఫలానా వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌లో చొప్పిస్తే...వారికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆయా వ్యక్తులను రహస్యంగా ట్రాక్ చేయవచ్చును. దీంతో ఆయా వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజేస్, లోకేషన్లను ఫోన్‌లోకి స్టాకర్‌వేర్ యాప్స్‌ను చొప్పించిన వ్యక్తి పొందుతారు.
చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...!
Comments
Please login to add a commentAdd a comment