US market
-
అమెరికాకు ఎగుమతులు పెరిగే చాన్స్
న్యూఢిల్లీ: అమెరికా (US) అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనా (China) వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందివచ్చే అవకాశాలను భారత్ సద్వినియోగం చేసుకునే వీలుందని అత్యున్నత స్థాయి ఎగుమతిదారుల సంస్థ– ఎఫ్ఐఈఓ పేర్కొంది. ఈ దిశలో అమెరికాకు భారత్ ఎగుమతులను పెంచడానికి వ్యూహాన్ని రూపొందించినట్లు కూడా ఎఫ్ఐఈఓ తెలిపింది.ఈ ప్రణాళికలో భాగంగా దేశ ఎగుమతిదారులు (Exporters) అమెరికా అంతటా జరిగే వాణిజ్య, వ్యాపార ప్రదర్శనలలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించాలని ఎఫ్ఐఈఓ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టింది వెంటనే మెక్సికో, కెనడా, చైనాలపై కొత్త టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇస్రార్ అహ్మద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైనవి...అమెరికా మార్కెట్‌కు భారత్ ఎగుమతుల్లో వృద్ధిని పెంచడానికి రూపొందించిన వ్యూహంలో మేము ఐదు కీలక రంగాలను గుర్తించాము. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, పాదరక్షలు, ఆర్గానిక్ కెమికల్స్ రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించి అమెరికా వాణిజ్య సంఘాలతో చేతులు కలపాలని ఎఫ్ఐఈఓ భావిస్తోంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చి తి కారణంగా చాలా దుస్తులు కంపెనీలు భారత్‌కు స్థావరాలను మార్చుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లో భారత్ ఎగుమతులు విస్తరించాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో భారత్ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ఎగుమతిదారులకు తగిన ఆర్థిక మద్దతు అవసరం. అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవడంలో ఇది కీలకం. దేశంలో పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నందున సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారత్ ఉనికి మరింత పెంచుకోవాలి. అవకాశాలను చేజిక్కించుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ (ఎంఏఐ) పథకం కింద మరిన్ని నిధులు అడుగుతున్నాము. అమెరికాకు ఎగుమతులు లక్ష్యంగా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కనీసం మూడు సంవత్సరాలు దీనిని అమలు చేయాలి. ప్రస్తుతం భారత్ ఎగుమతిదారులు ‘ద్రవ్య లభ్యత’ (లిక్విడిటీ) సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఫైనాన్స్ అవసరాలు తీవ్ర సవాళుగా ఉన్నాయి.వస్తువులు, సేవలను కొనుగోలు చేసిన 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈ (లఘు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు)లకు చెల్లింపులు జరపాలన్న నిబంధనను సడలించాలి. రుణ వ్య యాలను తగ్గించుకోవడానికి సంబంధించిన – ఇంట్రస్ట్ ఈక్విలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను ఐదు సంవత్సరాల పొడిగించాలి. దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం అమలుచేస్తున్న ఆర్ఓడీటీఈపీ (ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల రిఫండ్) పథకం ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ, ఆయా ఉత్పత్తుల దిగుమతిదేశాలు విధిస్తున్న కౌంటర్వ్యాలింగ్ సుంకాలు (రాయితీలు పొందిన ఉత్పత్తులపై సుంకాలు– యాంటీ సబ్సిడీ సుంకాలు) ఎగుమతిదారులకు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యపై ఈఐఎఫ్ఓ వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చిస్తోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా.. మార్చితో ముగిసిన గత 2023–24లో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. కొత్త అమెరికా ప్రభుత్వం ’అమెరికా ఫస్ట్’ అజెండాను అనుసరించాలని నిర్ణయించుకుంటే ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి వస్తువులపై భారతీయ ఎగుమతిదారులు అధిక కస్టమ్స్ సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు. -
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్‌ఫ్లై గంధిమతి, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్‌వేస్‌లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్‌పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్‌లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
‘రానా’ లోకాలోకా టెకీలా...
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, హర్షా వడ్లమూడి ఆధ్వర్యంలోని ఇరాన్ హిల్ ఇండియా సంస్థ.. రూపొందించిన టెకీలాబ్రాండ్ ‘లోకాలోకా’ పానీయం అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచి్చంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూర్తిగా మెక్సికోలోనే తయారయ్యే ఈ లోకాలోకా, తొలుత అమెరికా మార్కెట్లో విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా రానా దగ్గుబాటి తెలిపారు. -
ద్రవ్యోల్బణం మార్కెట్‌కా, మందికా?
ఒకప్పుడు ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రామిక సరుకు ఉత్పత్తి, సేవారంగాలు ఆర్థిక వ్యవస్థలో పైచేయిలో ఉండేవి. కానీ 1980ల అనంతరం, ఈ రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్ రంగానిది పైచేయి అయింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. దీంతో ఎటువంటి ఉత్పత్తి లేకుండా డబ్బును మరింత డబ్బుగా మార్చే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల హవా పెరిగింది. ఈ నేపథ్యంలో, షేర్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అయింది. పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది. కొద్ది రోజుల క్రితం, అమెరికాలో నెలవారీ ఉపాధి కల్పన గణాంకాలు ఊహించిన దాని కంటే మెరుగైనవిగా వెలువడ్డాయి. కానీ ఈ వార్త అమెరికా షేర్ మార్కెట్ సూచీలలో పతనానికి కారణమైంది. నిజానికి, మార్కెట్ విశ్లేషకులు చెప్పే ఫండమెంటల్స్ బాగుంటే, అది షేర్ మార్కెట్ సూచీలలో పెరుగుదలకు కారణం కావాలి. పైన జరిగింది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. ఇక్కడ ఉపాధి కల్పన గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంటే, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, ప్రజల కొనుగోలు శక్తి బాగున్నాయన్నమాట. ఇదే, వాస్తవంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలిక అంశాలు లేదా ఫండమెంటల్స్ బాగుండటం అంటే. ఇది, స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. ఈ స్థూల ఆర్థిక వ్యవస్థ బాగున్నదంటే దానిలో అంతర్భాగమైన వివిధ రంగాలకు చెందిన సంస్థలూ, పరిశ్రమలూ, ఇతరత్రా వ్యాపారాల ఫండమెంటల్స్ కూడా బాగున్నట్లే. మరి అటువంటప్పుడు అమెరికా షేర్మార్కెట్లు ఎందుకు పతనం అయినట్లు? ఇక్కడ గమనించవలసింది 1980ల అనంతరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మౌలికంగా జరిగిన మార్పులను. ఈ మార్పులు, మనం పైన చెçప్పుకున్న ఫండమెంటల్స్‌కు భిన్నమైన వాతావరణాన్ని తెచ్చి పెట్టాయి. ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రా మిక సరుకు ఉత్పత్తి, సేవారంగాల (నిజ ఆర్థిక వ్యవస్థగా పిలవ బడేవి) కంటే... అటువంటి రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్ రంగానిది పైచేయి అయింది. నిజ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ విధంగా సమతూకం మారింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. ఈ క్రమంలోనే, ఎటువంటి ఉత్పత్తి లేకుండానే కేవలం డబ్బును మరింత డబ్బుగా మార్చివేసే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటి సట్టా వ్యాపార రంగాలది పైచేయి అయ్యింది. ఇటువంటి పరిస్థితిలో, షేర్ మార్కెట్‌కు సంబంధించి కూడా ఫండమెంటల్స్ ఏవి అన్నది పూర్తిగా మారిపోయింది. ఈ కారణం చేతనే అమెరికాలో అంచనా కంటే మెరుగ్గా ఉన్న ఉపాధి గణాంకాలు మార్కెట్ల పతనానికి కారణం అయ్యాయి. అయితే, ఈ సరికొత్త ఫైనాన్స్ రంగ ఫండమెంటల్స్ తాలూకు ఏ పనితీరు ఈ మార్కెట్ల పతనానికి దారితీసింది అన్నది ఇక్కడి ప్రశ్న. షేర్ మార్కెట్ల వంటి ఈ ఫైనాన్స్ రంగాలలో, మదుపుదారులు పెట్టిన పెట్టుబడి విలువను కాపాడుకోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ షేర్ మార్కెట్లలో కొంత మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టినప్పుడు, అది దాని నుంచి లాభాలను ఆశిస్తుంది. లాభాల సంగతి కాసేపు పక్కన పెట్టినా, కనీసం తను పెట్టిన పెట్టుబడి తాలూకు విలువను కాపాడుకోవాలని కోరుకుంటుంది. దీనికోసం మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలి. అది తీవ్ర ఒడుదుడుకులకు లోనవ్వడం లేదా క్షీణించడం జరగకూడదు. ఇది, షేర్మార్కెట్ల పెట్టుబడుల తాలూకు ప్రధాన అవసరం. మరి ఇక్కడ కరెన్సీల విలువల పతనానికి కారణంగా లేదా దాని వ్యక్తీకరణగా ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. ఒక కరెన్సీ విలువ తగ్గినప్పుడే, దాని కొనుగోలు శక్తి తగ్గుతుంది. కరెన్సీ తాలూకు ఈ కొనుగోలు శక్తి తగ్గుదలనే ద్రవ్యోల్బణం అంటాం. ఈ నేపథ్యంలోనే, షేర్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు గానూ ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అవసరంగా మారింది. ఫలితంగానే, ఫైనాన్స్ పెట్టుబడుల ఆధిపత్యం పెరిగిన 1980ల అనంతరం, అంటే సుమారుగా 1990ల నుంచీ ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులూ ద్రవ్యోల్బణం అదుపును తమ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. ఉదాహరణకు మన రిజర్వ్ బ్యాంకుకు ఈ ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యం, రెండు శాతం అటూ ఇటుగా నాలుగు శాతంగా నిర్ణయించబడింది. అంటే, మన దేశీయ రిజర్వ్ బ్యాంక్, దేశంలో ద్రవ్యోల్బణాన్ని 26 శాతం నడుమన నియంత్రించి ఉంచాలి. అలా అయితేనే భారత షేర్ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడుల విలువకు కాస్త భరోసా ఉంటుంది. ఇక్కడ మరో ఉదాహరణగా అమెరికా నుంచి భారతదేశ షేర్ మార్కెట్లలోకి ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థ డాలర్లను పెట్టుబడిగా తెచ్చింది అనుకుందాం. ఆ సంస్థ డాలర్లను నేరుగా పెట్టుబడిగా పెట్టలేదు. దానికోసం కరెన్సీని రూపాయలలోకి మార్చుకుంటుంది. ఇక, ఆ సంస్థకు కీలక ప్రాధాన్యత గల అంశంగా రూపాయి విలువ కాపాడబడటం అనేది ఉంటుంది. ఆ విదేశీ మదుపు సంస్థ, తన షేర్ మార్కెట్ పెట్టుబడులను అమ్ముకుని దేశం నుంచి మరోచోటకి వెళ్ళిపోయే నాటికి రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోయి ఉంటే అది పెట్టుబడి + లాభాల విలువ తగ్గుదలకు కారణం అవుతుంది. మార్కెట్లో తన పెట్టుబడులను అమ్మివేసినప్పుడు ఆ మదుపు దారుడికి రూపాయల్లో డబ్బు వస్తుంది. తిరిగివెళ్ళిపోయే క్రమంలో రూపాయలను వేరే దేశంలోకి తీసుకుని వెళ్ళలేడు గనుక తిరిగి ఆ మదుపుదారుడు తనకు లభించిన రూపాయలను డాలర్లుగా మార్చుకుంటాడు. ఇక్కడ అతను పెట్టుబడి పెట్టేనాటికీ, వాటిని అమ్ముకుని వెనక్కు వెళ్ళేనాటికీ మధ్యన రూపాయి విలువ తగ్గితే, అతనికి ఈ రూపాయలను తిరిగి డాలర్లుగా మార్చుకుంటే, లభించే డాలర్ల మొత్తం కూడా తక్కువగానే వుంటుంది. ఈ మొత్తం పరిస్థితిని మదింపు చేసుకోవడం కోసమే మన దేశంలోకి లేదా ఇతరేతర దేశాలలోకి కూడా పెట్టుబడులను తీసుకువెళ్ళే మదుపుదారులు వాటిపై లభించే లాభాలను అటు, ఆ దేశం తాలూకు కరెన్సీలతో పాటుగా, మరొక కొలబద్ద అయిన డాలెక్స్ (డాలర్లలో లభించిన లాభం ) రూపంలో కూడా లెక్కించుకుంటారు. అదీ కథ! కాబట్టి, నేటి ఫైనాన్స్ యుగంలో ఫండమెంటల్స్ అనేవాటి అర్థం మారిపోయింది. నేడు ఫండమెంటల్స్‌గా పరిగణించబడుతున్నవి ప్రధానంగా ఫైనాన్స్ పెట్టుబడుల కొలబద్ద అయిన ద్రవ్యోల్బణం సూచీలు. ఈ కారణం చేతనే, అమెరికాలో ఉపాధి కల్పన బాగా జరిగిన క్రమంలో షేర్ మార్కెట్లు దిగజారాయి. ఇక్కడ, మరో చిన్న విషయం... ఈ మార్కెట్లు ఆ రోజు మధ్యాహ్నానికి తిరిగి కాస్త కోలు కున్నాయి. దీనికి కారణం, ఈ మెరుగైన ఉపాధి గణాంకం అనేది, వేతనాల పెరుగుదల రూపంలో పెద్దగా ప్రభావం చూపలేదు. అంటే, ఉపాధి మెరుగ్గానే కనబడిందిగానీ... దాని వలన వేతనాల మొత్తం పెరిగిపోయి అది మార్కెట్లో పెరిగిన ప్రజల కొనుగోలు శక్తీ లేదా డిమాండ్ రూపంలో ప్రభావం చూపగలిగిందిగా లేదన్నమాట. ఈ వాస్తవాన్ని మధ్యాహ్నానికి గ్రహించిన అమెరికా మార్కెట్ సూచీలు తిరిగి మళ్ళీ పుంజుకున్నాయి. ప్రజల కొనుగోలుశక్తీ, లేదా డిమాండ్ పెరగకుంటే మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగదనే సూక్ష్మమే దీనికి కారణం. 1980ల ముందరినాటి కాలం ఫండమెంటల్స్ వేరుగా ఉన్నాయి. అవి, ఒక కంపెనీ తాలూకు బ్యాలెన్స్ షీట్, అలాగే స్థూలంగా నిజ ఆర్థిక వ్యవస్థ తాలూకు బలంపై ఆధారపడి వున్నాయి. కానీ నేడు అది పూర్తిగా నిజంకాదు. ద్రవ్యోల్బణం, దాని కట్టడి అనేవి నేడు మార్కెట్లో ప్రధాన అంశంగా మారింది. కాబట్టి నేడు వివిధ దేశాలలో పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది. వినాశ కాలే విపరీత బుద్ధి... ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
అరబిందో ఫార్మా లాభం రూ. 571 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ రెగాడెనొసోన్ ఇంజెక్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా అమెరికా మార్కెట్లో రెగాడెనొసోన్ ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టింది. రక్త ప్రవాహాన్ని పరీక్షించే క్రమంలో గుండె ఇమేజ్‌లను తీయడంలో ఏజంటుగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది లెక్సిస్కాన్ ఇంజెక్షన్‌కు జనరిక్ వెర్షన్. మరోవైపు, తెలంగాణలోని తమ బొల్లారం ప్లాంటులో మే 1 నుంచి 5 వరకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఫారం 483ని జారీ చేసినట్లు వివరించింది. నిర్దేశిత గడువులోగా దాన్ని పరిష్కరిస్తామని తెలిపింది. తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధ పరిస్థితులేమైనా కనిపిస్తే యూఎస్ఎఫ్డీఏ ఫారం 483ని జారీ చేస్తుంది. -
ఫెడ్ నిర్ణయాలు, క్యూ4 ఫలితాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదానీ గ్రూప్ – హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా పరిణామాలు, దేశీయ అతిపెద్ద ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సమావేశ వివరాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. యూఎస్ ఫెడ్ రిజర్వ్, ఈసీబీ పాలసీ సమావేశ నిర్ణయాలు రానున్న రోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను నడిపిస్తాయి. ఇక దేశీయ మార్కెట్ మూమెంటమ్ స్వల్పకాలం పాటు సానుకూలంగా కొనసాగొచ్చు. అయితే కీలక స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్న తరుణంలో పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. సాంకేతికంగా ఎగువ స్థాయిలో నిఫ్టీ 18,100–18,200 పరిమిత శ్రేణి నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,850 వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొనడంతో గతవారంలో సెన్సెక్స్ 1,457 పాయింట్లు, నిఫ్టీ 441 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ మినహా ఇతర రంగాల కార్పొరేట్ కంపెనీ ప్రోత్సాహకరమైన ఆర్థిక గణాంకాలను వెల్లడించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరల క్షీణత, వొలటాలిటీ ఇండెక్స్ చారిత్రాత్మక కనిష్టాలకు దిగిరావడం, అమెరికా ఐటీ దిగ్గజం మెటా మెరుగైన ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత ఐటీ షేర్ల ర్యాలీ తదితర అంశాలు దలాల్ స్ట్రీట్‌లో సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫెడ్ సమావేశ నిర్ణయాలపై దృష్టి ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(మే 2న) మొదలై.., బుధవారం ముగియను న్నాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ‘‘ఒక వేళ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించినట్లయితే.., ఆర్థిక వృద్ధి మందగన ఆందోళనల దృష్ట్యా ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వడ్డీరేట్లను తగ్గించే వీలుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వె స్టర్ల పెట్టుబడులు ఊపందుకోవచ్చు’’అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణుడు ప్రవేష్ గౌర్ తెలిపారు. అదానీ హిండెన్‌బర్గ్ తాజా పరిణామాలు అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు కావాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) శనివారం సుప్రీంకోర్టును కోరింది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు తాజా వివరాలను, ప్రాథమికంగా గుర్తించిన అంశాలను నిపుణుల కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసి రెండు నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఈ మార్చి 2న సెబీ ఆదేశాలు జారీ చేసిన తెలిసిందే. కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు కార్పొరేట్ల క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్ కీలక దశకు చేరింది. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, హీరోమోటోకార్ప్, కోల్ ఇండియా, అంజుజా సిమెంట్స్, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్‌తో సహా సుమారు 200కి పైగా కంపెనీలు తమ నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాల కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి దేశీయ ఆటో కంపెనీలు నేడు (సోమవారం) ఏప్రిల్ హోల్‌సేల్ అమ్మకాల వివరాలను వెల్లడిస్తాయి. ఇదే రోజున ఏప్రిల్ దేశీయ తయా రీ రంగ పీఎంఐ డేటా, మూడో తేదీ(బుధవారం)న సేవారంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఆర్బీఐ ఏప్రిల్ 28 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు.., ఏప్రిల్ 21వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు (సోమవారం) అమెరికా ఏప్రిల్ తయారీ రంగ, నిర్మాణ వ్యయ వివరాలు వెల్లడి కానున్నాయి. అమెరికా ఫెడ్ సమావేశ నిర్ణయాలు, యూరో జోన్ నిరుద్యోగ రేటు గణాంకాలు బుధవారం విడుదల అవుతాయి. ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, అమెరికా మార్చి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గురువారం వెల్లడి కానున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈ ఏడాదిలో అత్యధిక కొనుగోళ్లు దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏప్రిల్‌లో బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నెల మొత్తంగా ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.11,631 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.4,268 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ఈక్వి టీ, డెట్ విభాగాల్లో ఏప్రిల్ పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత ఈక్విటీలు అధిక వ్యాల్యూయేషన్ల నుంచి సాధారణ స్థితికి దిగివచ్చాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ కరిగిపోయింది. దీంతో ఎఫ్ఐఐలు వరుసగా రెండోనెలా నికర కొనుగోలుదారులుగా నిలిచారు. డ్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం రానున్న రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల తీరును నిర్ణయిస్తుంది’’ అని రైట్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ తెలిపారు. -
నోకియా ఫ్లిప్ ఫోన్, అతి తక్కువ ధరలో
సాక్షి,ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా క్లామ్‌షెల్ డిజైన్‌తో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 2780 ఫ్లిప్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. క్వాల్కం పప్రాసెసర్, ఎఫ్ఎం రేడియో, వాట్సాప్,వైఫై సపోర్ట్‌తో, ఎరుపు, నీలం రెండు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లలో అందుబాటులో ఉన్న నోకియా 2780 ఫ్లిప్ ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంటుందా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక ధర విషయానికి వస్తే అమెరికాలో దీని ధర డాలర్లు. 89.99. ఇండియాలో సుమారు రూ. 7,400గా ఉండొచ్చని అంచనా. కాగా ఎంట్రీ-లెవల్ వినియోగదారులే లక్ష్యంగా బడ్జెట్‌ధరల్లో ఈ సిరీస్‌లో నోకియా 2660 ఫ్లిప్, నోకియా 2760లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నోకియా 2780 ప్లిప్ స్పెసిఫికేషన్స్ 1.77 అంగుళాల TFT స్క్రీన్ 2.7అంగుళాల TFT స్క్రీన్ క్వాల్కం 215 చిప్ సెట్ క్వాడ్ కోర్ సీపీయూ T9 కీబోర్డ్ డిజైన్ 5 ఎంపీ రియర్ కెమెరా విత్ ఫిక్స్డ్ ఫోకస్, LED ఫ్లాష్ 4జీబీ ర్యామ్, 512 ఎంబీ స్టోరేజ్ 1450 ఎంఏహెచ్ రిమూవల్ బ్యాటరీ -
ఎలక్ట్రిక్ వాహనాల్లోకి సోనీ
టోక్యో: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్‌లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యసుహిదె మిజూనో వెల్లడించారు. పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్‌లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్ వెగాస్‌లో జరిగిన సీఈఎస్ గ్యాడ్జెట్ షోలో సోనీ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. -
అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్
న్యూఢిల్లీ: పలు కారణాలతో అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్ ఇంజెక్షన్‌కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్‌ను అరబిందో ఫార్మా రీకాల్ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్ప్రెడ్నిసొలోన్ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్‌ను రీకాల్ చేస్తోంది. -
యూఎస్ మార్కెట్ల సరికొత్త రికార్డ్
న్యూయార్క్, సాక్షి: యూఎస్ కాంగ్రెస్‌లో డెమక్రాట్ల ఆధిపత్యం కారణంగా కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై అంచనాలు పెరిగాయి. దీంతో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే బాటలో ప్రభుత్వం ఇకపై భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయవచ్చన్న అంచనాలు పెరిగాయి. మరోపక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్‌ను గడువుకంటే ముందే అధికారం నుంచి తప్పించేందుకు చర్యలు మొదలైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. డోజోన్స్ 212 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 31,041 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 56 పాయింట్ల(1.5 శాతం) వృద్ధితో 3,804 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 327 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 13,067 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్) బాండ్ల ఈల్డ్స్ అప్ 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 10 నెలల గరిష్టం 1.081 శాతానికి ఎగశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం బలపడి 89.78ను తాకింది. మరోపక్క పసిడి ధరలు ఔన్స్ 0.3 శాతం నీరసించి 1914 డాలర్లకు చేరాయి. కాగా.. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలకంటే తగ్గడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) టెస్లా జోరు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 8 శాతం జంప్‌చేసి 816 డాలర్లను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 773 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఫలితంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సంపద 188 బిలియన్ డాలర్లను తాకింది. టెస్లా ఇంక్‌లో మస్క్‌కు 20 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్ ఆవిర్భవించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 3.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో ఎస్అండ్పీ, నాస్డాక్ భారీగా బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. డీఎక్స్‌సీ టెక్నాలజీ కొనుగోలుకి ఫ్రాన్స్ ఐటీ కన్సల్టింగ్ గ్రూప్ అటోస్ ఎస్ఈ 10 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ప్రకటించడంతో డిక్సన్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. -
10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు
వాషింగ్టన్: ప్రపంచంలోనే కోవిడ్-19 కారణంగా అత్యధిక సంఖ్యలో బాధితులున్న అమెరికాలో వ్యాక్సినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. వెరసి ప్రభుత్వం గత 10 రోజుల్లోనే 10 లక్షల మందికిపైగా వ్యాక్సిన్లను అందించింది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ సహకారంతో యూఎస్ దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఈ నెల 14న యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కరోనా కట్టడికి 10 రోజుల క్రితం ప్రారంభించిన వ్యాక్సిన్ల పంపిణీలో భాగంగా బుధవారానికల్లా 10 లక్షల మందికిపైగా తొలి డోసేజీని ఇచ్చినట్లు వ్యాధుల నియంత్రణ, నిరోధక కేంద్రం(సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ పేర్కొన్నారు. (వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) తొలి క్వార్టర్‌కల్లా వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటికీ ఈ నెలాఖరుకల్లా 2 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించాలన్న లక్ష్యం నెరవేరే అవకాశంలేదని వ్యాక్సిన్ ఆపరేషన్ విభాగ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మోన్సెఫ్ స్లావ్ పేర్కొన్నారు. అయితే 2021 మార్చికల్లా 10 కోట్ల మందికి వ్యాక్సిన్లను అందించే లక్ష్యంవైపు సాగుతున్నట్లు చెప్పారు. ఈ బాటలో రెండో త్రైమాసికానికల్లా(ఏప్రిల్-జూన్) మరో 10 కోట్ల మందికి వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా గత వారం 30 లక్షల డోసేజీలను సరఫరా చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఈ వారం ఫార్మా దిగ్గజం మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్ 60 లక్షల డోసేజీలను సరఫరా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఫైజన్ తయారీ వ్యాక్సిన్లను మరో 20 లక్షలు అందించే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. -
భారత్ బయోటెక్‌తో యూఎస్ కంపెనీ జత
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి దేశీ కంపెనీ భారత్ బయోటెక్‌తో తాజాగా యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ చేతులు కలిపింది. తద్వారా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ తదుపరి అభివృద్ధి దశలను యూఎస్‌లో ఆక్యుజెన్ చేపట్టనుంది. ఇందుకు కట్టుబడేందుకు వీలుగా రెండు కంపెనీలు ఒప్పందం(ఎల్వోఐ)పై సంతకాలు చేశాయి. ఎల్‌వోఐలో భాగంగా ఆక్యుజెన్ యూఎస్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ హక్కులను పొందనుంది. భారత్ బయోటెక్ సహకారంతో యూఎస్‌లో వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ డెవలప్మెంట్, రిజిస్ట్రేషన్, వాణిజ్య వ్యవహారాలను ఆక్యుజెన్ చేపట్టనుంది. ప్రస్తుతం రెండు కంపెనీలూ పరస్పరం సహకరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. పూర్తిస్థాయి ఒప్పంద వివరాలను కొద్ది వారాలలో వెల్లడించనున్నట్లు తెలియజేశాయి. ఒప్పందం ప్రకారం యూఎస్‌లో వ్యాక్సిన్ సైంటిఫిక్ అడ్వయిజరీ బోర్డ్‌ను ఆక్యుజెన్ ఏర్పాటు చేయనుంది. తద్వారా అక్కడ క్లినికల్ పరీక్షల డేటా, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర వ్యవహారాలను చేపట్టనుంది. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) కోవాగ్జిన్ ప్రత్యేకం చరిత్రలో నిరూపితమైన విధానాల బాటలోనే కోవిడ్-19 కట్టడికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఒప్పందం సందర్భంగా హార్వే రూబిన్ పేర్కొన్నారు. వెరసి యూఎస్‌లో అందుబాటులోకి వస్తున్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కోవాగ్జిన్ ప్రత్యేకమైనదని తెలియజేశారు. వైరస్‌పై మరింత సమర్ధవంతంగా పనిచేయగలదని అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ పీహెచ్డీ ఎండీ అయిన రూబిన్.. ఆక్యుజెన్ సైంటిఫిక్ సలహాదారుల బోర్డు సభ్యులుకావడం గమనార్హం! దేశీయంగా మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్(ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్.. కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించవలసిందిగా ఇటీవలే డీసీజీఐకు భారత్ బయోటెక్ దరఖాస్తు చేసింది. 26,000 మందిపై చేపట్టనున్న మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం ఇప్పటికే 13,000 మంది వాలంటీర్లను సమకూర్చుకుంది. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!) మైలురాయి.. దేశీయంగా వ్యాక్సినాలజీలో కోవాగ్జిన్ అభివృద్ధి, క్లినికల్ డేటా ఒక మైలురాయి వంటిదని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. వైరస్ కట్టడికి రూపొందిస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై పలు దేశాల నుంచి సరఫరాలు తదితరాల కోసం ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. ఆక్యుజెన్‌తో భాగస్వామ్యం ద్వారా యూఎస్ మార్కెట్లలోనూ వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టే వీలు చిక్కిందని తెలియజేశారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలలో ఫలితాలతో తాము సంతృప్తి చెందినట్లు ఆక్యుజెన్ సహవ్యవస్థాపకుడు, చైర్మన్ శంకర్ ముసునూరి చెప్పారు. దేశీయంగా మూడో దశ పరీక్షలు సైతం ప్రోత్సాహకరంగా సాగుతున్నట్లు తెలియజేశారు. సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌కు భారీ అవకాశాలున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనకారిగా నిలిచే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. -
కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు
న్యూయార్క్: ఈ కేలండర్ ఏడాది(2020)లో తలెత్తిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థిక వ్యవస్థలనూ కుదేల్ చేసింది. అయినప్పటికీ కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ప్రకటించిన చర్యలూ సహాయక ప్యాకేజీలతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పడుతున్నాయి. కాగా.. కోవిడ్-19 కారణంగా ఆన్లైన్, ఈకామర్స్, రిటైల్, ఐటీ రంగాలలో మరిన్ని కొత్త అవకాశాలకు మార్గమేర్పడినట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2020 జనవరి -జూన్ మధ్య కాలంలో పలు యూఎస్ దిగ్గజ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన పలు బ్లూచిప్ కంపెనీల షేర్లు ర్యాలీ బాటలో్ సాగుతూ వచ్చాయి. వెరసి పలు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) భారీగా బలపడుతూ వచ్చింది. జాబితాలో ఈకామర్స్, టెక్నాలజీ, ఆటోమోటివ్, ఫైనాన్స్, టెలికం, మీడియా, రిటైల్, ఫార్మా తదితర రంగాలుండటం గమనార్హం! (4 నెలల్లో 4 బిలియన్ డాలర్ల దానం) టాప్4లో.. ఈ ఏడాది జనవరి1 నుంచి జూన్ 17వరకూ చూస్తే.. మార్కెట్ విలువలో అత్యధికంగా లాభపడిన కంపెనీగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 401 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. ఇదేవిధంగా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దాదాపు 270 బిలియన్ డాలర్ల విలువను పెంచుకోవడం ద్వారా రెండో ర్యాంకులో నిలిచింది. ఈ బాటలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ మార్కెట్ విలువ 219 బిలియన్ డాలర్లు జంప్‌చేయగా.. ఎలక్ట్రిక్ కార్ల బ్లూచిప్ కంపెనీ టెస్లా ఇంక్ 108 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. తద్వారా జాబితాలో మూడు, నాలుగు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. ఈ జాబితాలో టెక్నాలజీ కంపెనీ టెన్సెంట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, చిప్ కంపెనీ ఎన్విడియా, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, టెలికం దిగ్గజం టీమొబైల్, మీడియా దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తదితరాలు సైతం చోటు చేసుకున్నాయి. ఇదేవిధంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించే జూమ్ యాప్ ప్రస్తావించదగ్గ స్థాయిలో పుంజుకోవడం విశేషం! జాబితాలో టెక్ దిగ్గజం టెన్సెంట్, ఈకామర్స్ దిగ్గజం అలీబాబా వంటి చైనీస్ కంపెనీలు సైతం స్థానం సంపాదించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు టేబుల్ ద్వారా చూద్దాం.. 2020 జనవరి- జూన్ 17 మధ్య వివిధ యూఎస్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిన తీరిలా.. -
ప్యాకేజీ ఆశలు- యూఎస్ మార్కెట్ల రికార్డ్స్
న్యూయార్క్: కొత్త ప్రెసిడెంట్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీకి తెరతీయనుందన్నఅంచనాలు వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఎయిర్‌లైన్స్, క్రూయిజర్, ఇంధన రంగ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో శుక్రవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. డోజోన్స్ 249 పాయింట్లు(0.85 శాతం) ఎగసి 30,218 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 32 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 3,699 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 87 పాయింట్లు(0.7 శాతం) బలపడి 12,464 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించినట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఉపాధి వీక్ నవంబర్‌లో వ్యవసాయేతర రంగంలో 2.45 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో ఇది కనిష్టంకాగా.. 4.69 లక్షల మందికి ఉపాధి లభించగలదని విశ్లేషకులు వేసిన అంచనాలకు దెబ్బ తగిలింది. అక్టోబర్‌లో 6.1 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం గమనార్హం! గత నెలలో ఉపాధి క్షీణించడానికితోడు.. సెకండ్‌వేవ్‌లో కేసులు పెరగడం, శీతల సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించనున్నట్లు కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దీంతో జీడీపీకి దన్నుగా కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా సహాయక ప్యాకేజీని ఆమోదించవలసి ఉన్నట్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ గణాంకాలు నిరాశపరచినప్పటికీ బైడెన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. 5.4 శాతం అప్ ఇటీవల చమురు ధరలు బలపడుతుండటంతో ఎనర్జీ రంగం 5.4 శాతం ఎగసింది. డైమండ్‌బ్యాక్ ఎనర్జీ, ఆక్సిడెంటల్ పెట్రోలియం 13 శాతం చొప్పున దూసుకెళ్లాయి. షెవ్రాన్ కార్పొరేషన్ 4 శాతం పుంజుకోగా.. 787 డ్రీమ్‌లైనర్ విమానాల తయారీని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో బోయింగ్ ఇంక్ 2 శాతం క్షీణించింది. ఇతర కౌంటర్లలో నార్వేజియన్ క్రూయిజ్ 3.3 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. -
క్యూ3లో యూఎస్ జీడీపీ 33 శాతం అప్
వాషింగ్టన్: కోవిడ్-19 వేధిస్తున్నప్పటికీ యూఎస్ ఆర్థిక వ్యవస్థ క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఏకంగా 33.1 శాతం పురోగమించింది. వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది(2020) మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ 33.1 శాతం వృద్ధిని సాధించింది. వెరసి తొలుత వేసిన వృద్ధి అంచనాలను ఆర్థిక వ్యవస్థ ఎలాంటి మార్పులు లేకుండా సాధించినట్లయ్యింది. కాగా.. దేశ చరిత్రలోనే ఇది అత్యధికమని ఆర్థికవేత్తలు ఈ సందర్భంగా తెలియజేశారు. 1947 నుంచి గణాంకాలు నమోదు చేయడం ప్రారంభించాక 1950లో మాత్రమే దేశ జీడీపీ ఒక త్రైమాసికంలో అత్యధికంగా 16.7 శాతం పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులు, హౌసింగ్, ఎగుమతులు భారీగా పుంజుకున్నప్పటికీ.. స్థానిక ప్రభుత్వాల వినిమయంతోపాటు, వినియోగ వ్యయాలు తగ్గడం, నిల్వలు పెరగడం వంటివి బలహీనపడినట్లు గణాంకాలు వివరించాయి. మాంద్య పరిస్థితులు ఈ ఏడాది క్యూ4(అక్టోబర్- డిసెంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి మైనస్‌లోకి జారుకునే వీలున్నట్లు యూఎస్ విశ్లేషకులు భావిస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో భాగంగా తిరిగి కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు వ్యవస్థలకు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా క్యూ4లో ప్రతికూల వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది విశ్లేషకులైతే మహామాంద్యం ముప్పు పొంచిఉన్నట్లు అంచనా వేస్తుండటం గమనార్హం. కాగా.. వార్షిక ప్రాతిపదికన యూఎస్ జీడీపీ తొలి క్వార్టర్లో 5 శాతం క్షీణించగా.. క్యూ2లో మరింత అధికంగా 31.4 శాతం క్షీణించిన విషయం విదితమే. క్యూ2లో లాక్డవున్లు, ఉద్యోగాల కోత తదితర అంశాలు ప్రభావం చూపాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టపోయిన ఉత్పాదకతను తిరిగి సాధించడం అంత సులభంకాదని, కోవిడ్-19 మరోసారి కల్లోలం సృష్టిస్తుండటంతో వచ్చే ఏడాది(2021) తొలి త్రైమాసికం(జనవరి- మార్చి)లోనూ దేశ జీడీపీ మైనస్‌లోకి జారుకునే అవకాశమున్నదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. -
డోజోన్స్ కొత్త రికార్డ్- ఎందుకీ స్పీడ్?
న్యూయార్క్, సాక్షి: మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త రికార్డ్ నమోదైంది. డోజోన్స్ 455 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 30,046 వద్ద ముగిసింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ బాటలో ఎస్అండ్పీ 58 పాయింట్లు(1.6 శాతం) పురోగమించి 3,635 వద్ద నిలవగా.. నాస్డాక్ 156 పాయింట్లు(1.3 శాతం) బలపడి 12,037 వద్ద స్థిరపడింది. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 13 శాతం దూసుకెళ్లింది. ఇంతక్రితం 1987 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయి లాభాలు ఆర్జించగా.. ఎస్అండ్పీ 11 శాతం, నాస్డాక్ 10.3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్ తదుపరి గరిష్టంగా లాభపడ్డాయి. బ్లూచిప్స్ అండ మంగళవారం డోజోన్స్‌కు బలాన్నిచ్చిన కౌంటర్లలో షెవ్రాన్ 5 శాతం, జేపీ మోర్గాన్ చేజ్ 4.6 శాతం, గోల్డ్‌మన్ శాక్స్ 3.8 శాతం చొప్పున జంప్ చేశాయి. మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇతర కౌంటర్లలో టెస్లా ఇంక్ 6.5 శాతం దూసుకెళ్లగా.. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ 3-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 2.5 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున క్షీణించాయి. జోరు ఎందుకంటే? ఇటీవల ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లు 95 శాతం ఫలితాలనిచ్చినట్లు వెల్లడించడంతో సెంటిమెంటు బలపడింది. ఈ బాటలో బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టేందుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. రాజకీయ అనిశ్చితులకు చెక్ పడటం ఇందుకు సహకరించింది. గతంలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌కు చైర్‌పర్సన్‌గా పనిచేసిన జానెట్ యెలెన్‌ను ఆర్థిక మంత్రిగా బైడెన్ ఎంపిక చేసుకునే వీలున్నట్లు వెలువడిన వార్తలు ఈ సానుకూల అంశాలకు జత కలసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ల ఫ్రెండ్లీగా వ్యవహరించే యెలెన్ వడ్డీ రేట్లను నేలకు దించడం ద్వారా ఆర్థిక రికవరీకి పాటుపడినట్లు తెలియజేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవకాశమున్నట్లు అంచనాలు బలపడ్డాయి. వెరసి మార్కెట్లు సరికొత్త రికార్డుల బాటలో పరుగు తీస్తున్నట్లు నిపుణులు వివరించారు. -
వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్
న్యూయార్క్: కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో వణుకుతున్న ప్రపంచ దేశాలకు తాజాగా మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ ద్వారా అభయం ఇవ్వడంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో డోజోన్స్ 479 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 29,959 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.2 శాతం) ఎగసి 3,627 వద్ద నిలవగా.. నాస్డాక్ 95 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 11,924 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు లైఫ్‌టైమ్ గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే ప్రధాన ఇండెక్సులు మూడూ ఒకేరోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్-2000 సైతం ఆల్‌టైమ్ హైను తాకడం విశేషం! ఇప్పటికే తమ వ్యాక్సిన్ 90 శాతంపైగా సురక్షితమంటూ ఫార్మా దిగ్గజంఫైజర్ డేటాను విశ్లేషించిన విషయం విదితమే. దీంతో సెంటిమెంటు మరింత బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్?!) ఫైజర్ డీలా కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 94.5 శాతం సురక్షితమంటూ ప్రకటించిన మోడర్నా ఇంక్ షేరు 10 శాతం దూసుకెళ్లింది. అయితే ఇతర ఫార్మా కౌంటర్లలో ఫైజర్ ఇంక్ 3.3 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. వ్యాక్సిన్ అంచనాలతో ఎయిర్‌లైన్, క్రూయిజర్ స్టాక్స్‌కు సైతం డిమాండ్ పెరిగింది. కార్నివాల్ గ్రూప్ 10 శాతం జంప్‌చేయగా. నార్వేజియన్ క్రూయిజ్లైన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 6-4 శాతం మధ్య పురోగమించాయి. ఈ బాటలో ప్రత్యర్థి సంస్థ టాబ్మెన్ సెంటర్స్ కొనుగోలు ధరను 80 శాతం తగ్గించిన వార్తలతో సైమన్ ప్రాపర్టీ గ్రూప్ షేరు దాదాపు 6 శాతం ఎగసింది. ఈ వారం రిటైల్ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్ ఇంక్, హోమ్ డిపో, టార్గెట్ కార్ప్, లోవ్స్ క్యూ3(జులై- సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) -
వ్యాక్సిన్ బూస్ట్- టెక్ దిగ్గజాల షాక్
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సఫలమైనట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ ప్రకటించింది. జర్మన్ కంపెనీ బయోఎన్ టెక్ తో సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ కు నవంబర్ చివరిలోగా యూఎస్ఎఫ్డీఏ నుంచి ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగానికి అనుమతి లభించే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు వ్యాక్సిన్ బూస్ట్ లభించింది. డోజోన్స్ 835 పాయింట్లు(3 శాతం) జంప్ చేసి 29,158కు చేరగా.. ఎస్అండ్పీ 41 పాయంట్లు(1.2 శాతం) ఎగసి 3,551 వద్ద ముగిసింది. అయితే టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు అమ్మకాలు చేపట్టడంతో నాస్డాక్ 181 పాయింట్లు(1.5 శాతం) పతనమై 11,714 వద్ద స్థిరపడింది. కార్నివాల్ జోరు వ్యాక్సిన్ ఆశలతో ఫైజర్, మోడర్నా ఇంక్ 7.5 శాతం చొప్పున జంప్ చేయగా.. ఆస్ట్రాజెనెకా 2.5 శాతం క్షీణించింది. అయితే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ రానుందన్న అంచనాలతో సోమవారం ఎంటర్ టైన్మెంట్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఏఎంసీ 50 శాతం, కార్నివాల్ కార్పొరేషన్ 39 శాతం, సిక్స్ ఫ్లాగ్స్ 18 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో జెట్ బ్లూ ఎయిర్వేస్, స్పిరిట్ ఎయిర్ లైన్స్ 21 శాతం చొప్పున జంప్ చేశాయి. అయితే జూమ్ వీడియా కమ్యూనికేషన్స్ షేరు 17 శాతం పతనమైంది. కాగా.. అల్జీమర్స్ చికిత్సకు వినియోగించగల ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ.. నో చెప్పడంతో బయోజెన్ 30 శాతం కుప్పకూలింది. ఫాంగ్ స్టాక్స్ డీలా ఫాంగ్ స్టాక్స్ గా పిలిచే దిగ్గజాలలో నెట్ ఫ్లిక్స్ 8.6 శాతం పతనంకాగా.. ఫేస్ బుక్ 5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.4 శాతం, యాపిల్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం డీలాపడింది. ఈ ఏడాది భారీ లాభాలతో ర్యాలీ చేస్తున్న టెక్ దిగ్గజాలలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీయడంతో నాస్డాక్ పతనమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. -
యూఎస్ మార్కెట్లు అక్కడక్కడే
న్యూయార్క్: అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కు అవకాశాలు పెరిగిన నేపథ్యంలో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ముగిశాయి. శుక్రవారం డోజోన్స్ 61 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,329కు చేరగా.. ఎస్అండ్పీ నామమాత్ర లాభంతో 3,512 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ 16 పాయింట్లు(0.15 శాతం) పుంజుకుని 11,907 వద్ద స్థిరపడింది. వెరసి ఈ వారం నాస్ డాక్ 9 శాతం జంప్ చేయగా.. డోజోన్స్, ఎస్అండ్పీ 7 శాతం చొప్పున ఎగశాయి. తద్వారా ఏప్రిల్ తదుపరి ఒకే వారంలో అత్యధిక లాభాలు ఆర్జించాయి. పెన్సిల్వేనియా, జార్జియాలలో నమోదైన స్వల్ప ఆధిక్యాలను బైడెన్ పెంచుకోవడం ద్వారా విజయానికి మరింత చేరువైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ చేసిన మార్కెట్లలో వారాంతాన ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు తెలియజేశారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అస్పష్టత నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించినట్లు వివరించారు. రికవరీ బాటలో కోవిడ్-19 కారణంగా మాంద్య పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి రికవరీ బాట పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో నిరుద్యోగిత 6.9 శాతానికి పరిమితంకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెప్టెంబర్‌లో 7.7 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో 6.38 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే సెకండ్ వేవ్ లో భాగంగా మళ్లీ అమెరికాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీలను ప్రకటించవలసి ఉంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. తాజా పాలసీ సమీక్షలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కాగా.. కోవిడ్-19కు ముందు నమోదైన 3.5 శాతం గణాంకాలతో పోలిస్తే నిరుద్యోగిత అధికంగానే నమోదైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం స్టిములస్ కు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని తెలియజేశారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అమలు చేస్తున్న ప్యాకేజీని 190 బిలియన్ డాలర్లమేర పెంచిన విషయం విదితమే. షేర్ల తీరిలా నిపుణుల అంచనాలను మించి త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో కాస్మెటిక్స్ కంపెనీ కొటీ ఇంక్ దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. మూడో క్వార్టర్(జులై- సెప్టెంబర్)లో అంచనాలకు మించి వినియోగదారులు జత కావడంతో టీ మొబైల్ దాదాపు 6 శాతం జంప్ చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో మోడర్నా ఇంక్ 1.4 శాతం, ఆస్ట్రాజెనెకా 0.65 శాతం, బోయింగ్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే క్యూ3 పనితీరులో విశ్లేషకులను నిరాశపరచడంతో వీడియో గేమ్ తయారీ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ షేరు 6.5 శాతం పతనమైంది. అమెజాన్ 0.3 శాతం, ఫేస్బుక్ 0.4 శాతం మధ్య డీలాపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది. -
ప్యాకేజీపై ఆశలు- వాల్ స్ట్రీట్ ప్లస్
న్యూయార్క్: ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ, జో బైడెన్‌కు ఆధిక్యంపై అంచనాల నేపథ్యంలో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్ 543 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 28,390కు చేరగా.. ఎస్అండ్పీ 67 పాయింట్లు(2 శాతం) ఎగసి 3,510 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 300 పాయింట్లు(2.6 శాతం) దూసుకెళ్లి 11,891 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా నాలుగో రోజు మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఈ వారం ఇప్పటివరకూ ఎస్అండ్పీ 7 శాతం లాభపడింది. ఫెడ్ పాలసీ తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0-0.25 శాతం మధ్య కొనసాగనున్నాయి. అయితే కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కదులుతున్నట్లు ఫెడ్ పేర్కొంది. ఆర్థిక పురోగతికి దన్నుగా మరింత స్టిములస్(సహాయక ప్యాకేజీలు) అందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. ఇందుకు వీలుగా సరళతర విధానాలతో మద్దతు ఇవ్వవలసి ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ప్రస్తుత సమీక్షలో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ప్యాకేజీ అంచనాలు ప్రెసిడెంట్ పదవి రేసులో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలు బలపడుతున్నాయి. మరోపక్క సెనేట్ లో రిపబ్లికన్లకు తిరిగి ఆధిక్యం లభించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి కొత్త ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు, డాలరు బలపడుతున్నట్లు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ జూమ్ వచ్చే ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరగనున్న అంచనాలతో చిప్ తయారీ కంపెనీ క్వాల్ కామ్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. ఇక ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 3.5 శాతం, నెట్‌ఫ్లిక్స్ 3.4 శాతం, మైక్రోసాఫ్ట్ 3.2 శాతం, అమెజాన్, ఫేస్బుక్ 2.5 శాతం మధ్య ఎగశాయి. అల్ఫాబెట్ 1 శాతం పుంజుకుంది. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం 4 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్ 3.6 శాతం, మోడర్నా ఇంక్, ఫైజర్ 2.4 శాతం చొప్పున లాభపడ్డాయి. -
యూఎస్ మార్కెట్ల దూకుడు
వరుసగా రెండో రోజు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. డోజోన్స్ 371 పాయింట్లు(1.4 శాతం) ఎగసి 27,851కు చేరగా.. ఎస్అండ్పీ 74 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 3,443 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 427 పాయింట్లు(4 శాతం) దూసుకెళ్లి 11,588 వద్ద స్థిరపడింది. వెరసి ఏప్రిల్ తదుపరి ఒకే రోజు 4 శాతం లాభపడింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో స్పష్టత లోపించడం.. అటు ట్రంప్, ఇటు బైడెన్లకు విజయావకాశాలు సమానంగా కనిపిస్తుండటం వంటి అంశాల నేపథ్యంలో పలు రంగాల కౌంటర్లు జోరందుకున్నాయి. రెండు వైపులా ఆధిక్యత కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా ప్రధాన విధాన నిర్ణయాలలో మార్పులు కష్టతరం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ గెలుపొందడంతో సెనేట్‌లో డెమొక్రాట్లకు మెజారిటీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని పేర్కొన్నారు. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు ముగియనుండటంతో నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ మళ్లీ బలపడింది. అయితే 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ భారీగా పతనమయ్యాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో ఫేస్బుక్ 8.3 శాతం, అమెజాన్, అల్ఫాబెట్ 6 శాతం చొప్పున దూసుకెళ్లగా.. మైక్రోసాఫ్ట్ 5 శాతం, యాపిల్ 4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు రూపొందించిన ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందించడంతో బయోజెన్ షేరు 44 శాతం దూసుకెళ్లింది. ఫార్మా బ్లూచిప్స్‌లో మెర్క్ అండ్ కో 5 శాతం, ఆస్ట్రాజెనెకా 6.5 శాతం, ఫైజర్ 3 శాతం చొప్పున పెరిగాయి. ఇతర కౌంటర్లలో ఉబర్ టెక్నాలజీస్ 14.5 శాతం, లిఫ్ట్ ఇంక్ 11 శాతం చొప్పున పురోగమించాయి. డిఫెన్స్ కౌంటర్లలో నార్త్రోప్ గ్రమ్మన్ 3.6 శాతం, లాక్ హీడ్ మార్టిన్ 2.4 శాతం చొప్పున బలపడ్డాయి. -
యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్
డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్ 555 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 27,480కు చేరగా.. ఎస్అండ్పీ 59 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 3,369 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 203 పాయింట్ల(1.9 శాతం) వృద్ధిచూపి 11,161 వద్ద స్థిరపడింది. బైడెన్ గెలిస్తే ఎన్నికలకు ముందు డెమొక్రాట్లు పట్టుపట్టిన 2.2 ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి ఆమోదముద్ర పడగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు ఆరోగ్య సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైనట్లు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.4 శాతం ఎగసింది. మళ్లీ 94 దిగువన 93.49కు చేరింది. ఇక పసిడి ఔన్స్ 1900 డాలర్లను అధిగమించింది. బీఎన్పీ పరిబాస్‌సహా బ్యాంకింగ్ దిగ్గజాల సానుకూల ఫలితాల కారణంగా మంగళవారం యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం జంప్‌చేశాయి. చమురు అప్ గత వారం పతన బాట పట్టిన ముడిచమురు ధరలు రెండు రోజులుగా బౌన్స్‌బ్యాక్ సాధిస్తున్నాయి. రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను మరికొంతకాలం కొనసాగించనున్న అంచనాలు ఇందుకు సహకరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3 శాతం జంప్‌చేయగా.. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు 2.7 శాతం లాభపడింది. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 1.4 శాతం ఎగసి 38.18 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 1.2 శాతం బలపడి 40.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యాంట్‌కు చెక్ భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనీస్ ప్రభుత్వం చెక్ పెట్టడంతో మంగళవారం అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం కుప్పకూలింది. యాంట్ గ్రూప్‌లో అలీబాబాకు మూడో వంతు వాటా ఉండటం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, అల్ఫాబెట్, నెట్‌ఫ్లిక్స్ 1.5-0.6 శాతం మధ్య ఎగశాయి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం దాదాపు 6 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్ 3.5 శాతం, మోడర్నా ఇంక్ 3 శాతం చొప్పున లాభపడ్డాయి. -
యూఎస్ మార్కెట్స్- టెక్ దిగ్గజాల దెబ్బ
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు విజృంభిస్తుండటంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానంగా టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నాస్డాక్ 2.5 శాతం పతనమైంది. డోజోన్స్ 158 పాయింట్లు(0.6 శాతం) క్షీణించి 26,502కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్లు(1.2 శాతం) నష్టంతో 3,270 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 274 పాయింట్లు(2.5 శాతం) కోల్పోయి 10,912 వద్ద స్థిరపడింది. వెరసి గత వారం డోజోన్స్ 6.5 శాతం పతనంకాగా.. ఎస్అండ్పీ 5.6 శాతం, నాస్డాక్ 5.5 శాతం చొప్పున నీరసించాయి. ఫలితంగా ఈ సెప్టెంబర్ మొదట్లో నమోదైన సరికొత్త గరిష్టం నుంచి ఎస్అండ్పీ-500 ఇండెక్స్ 9 శాతం వెనకడుగు వేసినట్లయ్యింది. ఇక అక్టోబర్ నెలలో చూస్తే.. డోజోన్స్ 4.6 శాతం, ఎస్అండ్పీ 2.8 శాతం చొప్పున క్షీణించగా.. నాస్డాక్ 2.3 శాతం నష్టపోయింది. కోవిడ్-19 షాక్ కొద్ది రోజులుగా యూఎస్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో కోవిడ్-19 బాధితుల సంఖ్య 90 లక్షలను మించింది. దీనికితోడు సెకండ్‌వేవ్‌లో భాగంగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 బాధితులు పెరుగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్‌లలో పూర్తిస్థాయి లాక్‌డవున్‌లకు తెరతీయగా.. పలు దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ ఆర్థిక వృద్ధి కుదేలయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో వారాంతాన యూరోపియన్, యూఎస్ మార్కెట్లు నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మరోపక్క యూఎస్ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. పతన బాటలో.. వారాంతాన మైక్రో బ్లాగింగ్ కంపెనీ ట్విటర్ ఇంక్ క్యూ3(జులై- సెప్టెంబర్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది, అంచనాలకంటే తక్కువగా యూజర్లు నమోదుకావడంతోపాటు.. యూఎస్ అధ్యక్ష ఎన్నికల కారణంగా ఆదాయం క్షీణించే వీలున్నట్లు అంచనా వేసింది. దీంతో ట్విటర్ షేరు 21 శాతంపైగా పడిపోయింది. ఈ బాటలో ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలోనూ అమ్మకాలు పెరిగాయి. 2021లో కఠిన పరిస్థితులు ఎదురుకానున్నట్లు పేర్కొనడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 6.3 శాతం పతనమైంది. కోవిడ్-19 కారణంగా వ్యయాలు పెరగనున్న అంచనాలతో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 5.5 శాతం నీరసించింది. క్యూ3లో గత రెండేళ్లలోలేని విధంగా ఐఫోన్ల అమ్మకాలు క్షీణించడంతో యాపిల్ ఇంక్ 5.6 శాతం నష్టపోయింది. 5జీ ఫోన్ల విడుదలలో జాప్యం ఐఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. గూగుల్ అప్ త్రైమాసిక అమ్మకాలు పుంజుకోనున్నట్లు అంచనాలు ప్రకటించడంతో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ ఇంక్ షేరు 3.5 శాతం ఎగసింది. ప్రకటనల ఆదాయం తిరిగి ఊపందుకోనుండటం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో టెక్ కౌంటర్లలో నెలకొన్న ట్రెండుకు ఎదురీదినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇతర కౌంటర్లలో మీడియా దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం 5.5 శాతం చొప్పున పడిపోయాయి. -
వాల్ స్ట్రీట్‌కు వైరస్ షాక్
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు విజృంభిస్తుండటంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 943 పాయింట్లు(3.4 శాతం) పడిపోయి 26,520కు చేరగా.. ఎస్అండ్పీ 120 పాయింట్లు(3.5 శాతం) నష్టంతో 3,271 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 426 పాయింట్లు(3.75 శాతం) కోల్పోయి 11,005 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు నాలుగు నెలల కనిష్టాలకు అంటే జులై స్థాయికి చేరాయి. అమెరికా, రష్యాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా భారీ అమ్మకాలకు తెరతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటన్ బాటలో జర్మనీ, ఫ్రాన్స్‌లో లాక్డవున్లు విధించడంతో అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు సైతం 2.6-4 శాతం మధ్య కుప్పకూలినట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు వివరించారు. వచ్చే నెల మొదట్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర పడుతుందని ఇన్వెస్టర్లు భావించినట్లు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ వీక్ ఫాంగ్ స్టాక్స్‌గా పేర్కొనే యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్ నేడు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. బుధవారం అల్ఫాబెట్, ఫేస్బుక్ 5.5 శాతం, మైక్రోసాఫ్ట్, యాపిల్ 5 శాతం, అమెజాన్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 4.5 శాతం క్షీణించగా..ఎయిర్‌లైన్స్ కంపెనీలలో యునైటెడ్, సౌత్‌వెస్ట్, డెల్టా, అమెరికన్ 4.6 -2.5 శాతం మధ్య నష్టపోయాయి. క్రూయిజర్ కౌంటర్లలో కార్నివాల్ 11 శాతం, రాయల్ కరిబియన్ 7.5 శాతం చొప్పున కుప్పకూలాయి. ఫార్మా డౌన్ కోవిడ్-19కు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న ఫార్మా దిగ్గజాలలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో నోవావాక్స్ 9 శాతం, మోడర్నా ఇంక్ 7 శాతం, ఫైజర్ 5.3 శాతం, జీఎస్కే 4 శాతం, మెక్‌డొనాల్డ్స్ 3.7 శాతం, నోవర్తిస్, ఇంటెల్ కార్ప్ 3 శాతం, సనోఫీ 2.7 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే ఈ ఏడాది క్యూ3లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ షేరు పతన మార్కెట్లోనూ 5 శాతం దూసుకెళ్లింది. -
యూఎస్ మార్కెట్లకు కోవిడ్-19 ఫీవర్
కొద్ది రోజులుగా కోవిడ్-19 కేసులు తిరిగి రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీనికితోడు కరోనా వైరస్ కారణంగా నీరసించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీ(స్టిములస్)పై కాంగ్రెస్‌లో అనిశ్చితి కొనసాగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచింది. వెరసి సోమవారం యూఎస్ మార్కెట్లు గత నాలుగు వారాలలోనే అత్యధికంగా 2.3-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. డోజోన్స్ 650 పాయింట్లు(2.3 శాతం) క్షీణించి 27,685కు చేరగా.. ఎస్అండ్పీ 64 పాయింట్లు(1.9 శాతం) నష్టంతో 3,401 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 189 పాయింట్లు(1.65 శాతం) కోల్పోయి 11,359 వద్ద స్థిరపడింది. ఎన్నికల్లోగా.. వచ్చే నెల మొదట్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్యాకేజీకంటే ఇది అధికంకాగా.. కొన్ని రాష్ట్రాలు, వర్గాలకు పెలోసీ అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు ట్రంప్ గతంలో ఆరోపించారు. ఈ ప్యాకేజీపై రిపబ్లికన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ భారీ స్టిములస్కు తాను సిద్ధమేనంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి స్టీల్ ముచిన్‌తో పెలోసీ నిర్వహిస్తున్న చర్చలు కొనసాగుతూనే ఉండటంతో సెంటిమెంటుకు దెబ్బతగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర లభించగలదని పెలోసీ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవల రోజువారీ కోవిడ్-19 కేసులు దాదాపు లక్షకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు వివరించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీలలో తిరిగి కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో సోమవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 2-3 శాతం మధ్య నష్టపోయాయి. నేలచూపులో.. ఈ వారంలో టెక్ దిగ్గజాలు, యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ తదితరాలు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు వెల్లడించనున్న సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం ప్రధానంగా ట్రావెల్ సంబంధ రంగాలు నీరసించాయి. ఎయిర్‌లైన్ కౌంటర్లలో యునైటెడ్, అమెరికన్, డెల్టా, సౌత్‌వెస్ట్ 7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. క్రూయిజర్ కంపెనీలలో రాయల్ కరిబియన్ 10 శాతం, కార్నికాల్ కార్ప్ 9 శాతం చొప్పున కుప్పకూలాయి. కోవిడ్-19 ప్రభావం అంచనాల కంటే అధికకాలం కొనసాగవచ్చని ప్రత్యర్థి కంపెనీ ఎస్ఏపీ తాజాగా పేర్కొనడంతో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్ప్ 4 శాతం బోర్లా పడింది. రికవరీ ఆలస్యం కారణంగా మధ్యకాలానికి లాభాల అంచనాలను తొలగిస్తున్నట్లు ఎస్ఏపీ పేర్కొంది. ఇదేవిధంగా త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హాస్బ్రో ఇంక్ 9.5 శాతం పడిపోయింది. అయితే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, వీడియో కమ్యూనికేషన్ సేవల కంపెనీ జూమ్, వీడియో గేమ్స్ సంస్థ యాక్టివిజన్ బిజార్డ్ స్వల్ప లాభాలతో నిలదొక్కుకోవడం గమనార్హం! -
ప్యాకేజీపై ఆశలు- యూఎస్ మార్కెట్లు ఓకే
వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్అండ్పీ-500 ఇండెక్స్ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3.465 వద్ద నిలవగా.. నాస్డాక్ 42 పాయింట్లు(0.4 శాతం) పెరిగి 11,548 వద్ద స్థిరపడింది. అయితే డోజోన్స్ నామమాత్రంగా 28 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 28,336 వద్ద ముగిసింది. కొద్ది వారాలుగా మార్కెట్లు ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో కదులుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ఇటీవల మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు తెలియజేశారు. శుక్రవారం(23)తో ముగిసిన గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ 0.5 శాతం చొప్పున బలహీనపడగా.. నాస్డాక్ సైతం 1.1 శాతం క్షీణించింది. అనిశ్చితిలోనే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ట్రంప్ ప్రతిపాదించిన ప్యాకేజీపై డెమొక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీకి కొన్ని సవరణలు సూచిండంతోపాటు. 2.2 ట్రిలియన్ డాలర్లకు పెంచమంటూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే ఎన్నికలలోగా ప్యాకేజీపై ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు పెలోసీ పేర్కొన్నారు. ఇక మరోవైపు అధ్యక్ష ఎన్నికలలో భాగంగా ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్ధి జోబిడెన్ మధ్య వాడిగా, వేడిగా డిబేట్ నడిచింది. డిబేట్ తదుపరి ఎన్నికలను ప్రభావితం చేసే పలు రాష్ట్రాలలో పరిస్థితులను అంచనా వేయవలసి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెక్స్ డౌన్ ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో మార్జిన్లు బలహీనపడటంతో చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్ షేరు 10 శాతం కుప్పకూలింది. కోవిడ్-19 కారణంగా డిమాండ్ పడిపోవడంతో చిన్న సంస్థలు, వినియోగదారులు చౌక ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకి మళ్లినట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు డేటా సెంటర్లపై ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపినట్లు వివరించారు. ఫలితంగా ఇంటెల్ లాభదాయకత నీరసించినట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. క్యూ3లో ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేరు 3.6 శాతం నష్టపోయింది. కోవిడ్-19 కారణంగా వినియోగం మందగించడంతోపాటు, చెల్లింపుల వైఫల్యాలను ఎదుర్కొనేందుకు కేటాయింపులు చేపట్టడం అమెక్స్ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. గిలియడ్ ప్లస్ కోవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు యూఎస్ఎఫ్డీఏ ఆమోదముద్ర వేయడంతో గిలియడ్ సైన్సెస్ షేరు 0.2 శాతం బలపడింది. అత్యవసర చికిత్సలో భాగంగా ఇప్పటికే ఈ ఔషధాన్ని వినియోగిస్తున్న విషయం విదితమే. కాగా.. వచ్చే వారం ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే యాపిల్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్), ఫేస్బుక్.. క్యూ3 ఫలితాలు విడుదల చేయనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీల పనితీరుపై దృష్టిపెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
సోషల్ మీడియా జోరు- యూఎస్ వీక్
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదిస్తున్న 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. డోజోన్స్ 98 పాయింట్లు(0.35 శాతం) నీరసించి 28,211 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 8 పాయింట్లు(0.2 శాతం) బలహీనపడి 3,436 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ సైతం 32 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 11,485 వద్ద స్థిరపడింది. నెట్‌ఫ్లిక్స్ పతనం ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య అంచనాలను చేరకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ షేరు 7 శాతం పతనమైంది. ప్రత్యర్థి సంస్థల నుంచి పెరిగిన పోటీ, క్రీడా ప్రసారాలు ప్రారంభంకావడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ మార్కెట్లు ముగిశాక క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. దీంతో ఫ్యూచర్స్‌లో టెస్లా ఇంక్ షేరు 4 శాతం జంప్‌చేసింది. హైజంప్.. కోవిడ్-19 లాక్డవున్లలో వినియోగదారుల సంఖ్య పెరగడం, పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడం వంటి అంశాలు స్నాప్‌చాట్ కౌంటర్‌కు డిమాండ్ పెంచాయి. దీంతో స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్ ఇంక్ షేరు 28 శాతం దూసుకెళ్లింది. ఈ ప్రభావంతో ఇతర సోషల్ మీడియా కౌంటర్లు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ట్విటర్ 8 శాతం జంప్‌చేయగా.. ఫేస్బుక్ 4 శాతం ఎగసింది. ఇదేవిధంగా పింట్రెస్ట్ ఇంక్ 9 శాతం దూసుకెళ్లింది! మోడార్నా డౌన్ కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 4.2 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ 1.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్ 2.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 2 శాతం నష్టపోయింది. -
యూఎస్ మార్కెట్లకు ప్యాకేజీ పుష్
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై చర్చలు పురోగతి సాధించడంతో మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. లాభాలతో ముగిశాయి. డోజోన్స్ 113 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 28,309 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 16 పాయింట్ల(0.5 శాతం) బలపడి 3,443 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ సైతం 38 పాయింట్లు(0.35 శాతం) లాభపడి 11,516 వద్ద స్థిరపడింది. వారాంతంలోగా ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలను బుధవారం సైతం కొనసాగించనున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా వారాంతంలోగా ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు సహచర రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. భారీ ప్యాకేజీకి సిద్ధమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వెరసి మరోసారి వైట్‌హౌస్ నుంచి భారీ ప్యాకేజీకి ఆమోదముద్ర పడవచ్చని అంచనా వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ పతనం ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో పెయిడ్ సబ్స్క్యయిబర్ల సంఖ్య అంచనాలను చేరకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ షేరు 1 శాతం డీలాపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడటంతో ఫ్యూచర్స్‌లో 4 శాతం నష్టపోయింది. కాగా.. మార్కెట్లో గల ఆధిపత్యంతో ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తున్నట్లు గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్పై కేసులు దాఖలయ్యాయి. అయినప్పటికీ అల్ఫాబెట్ షేరు 1.4 శాతం పుంజుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, ఇంజినీరింగ్ తదితర పలు విభాగాలలో ఇప్పటికే గూగుల్ బిలియన్లకొద్దీ డాలర్లను వెచ్చించినట్లు టీఎంటీ రీసెర్చ్ పేర్కొంది. దశాబ్ద కాలంలో కంపెనీ సాధించిన వృద్ధిని కాదనలేమని ఈ సందర్భంగా టీఎంటీ రీసెర్చ్ హెడ్ నీల్ క్యాంప్లింగ్ పేర్కొన్నారు. ఇతర టెక్ కౌంటర్లలో ఫేస్బుక్ 2.4 శాతం లాభపడగా.. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ 1.3-0.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 2 శాతం క్షీణించింది. పీఅండ్‌జీ ప్లస్ క్యూ3(జులై-సెప్టెంబర్)లో అంచనాలు మించిన ఫలితాలతో బీమా రంగ సంస్థ ట్రావెలర్స్ కంపెనీస్ షేరు 5.6 శాతం జంప్‌చేసింది. పూర్తి ఏడాది(2020)కి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం పీఅండ్‌జీ 0.4 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 0.5 శాతం లాభపడగా.. ఫైజర్ 0.8 శాతం, ఆస్ట్రాజెనెకా 0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
యూఎస్ మార్కెట్లకు ప్యాకేజీ దెబ్బ
కోవిడ్-19 ప్రభావాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదించిన 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సందిగ్ధత కొనసాగుతుండటంతో సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 411 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 28,195 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 57 పాయింట్ల(1.6 శాతం) నష్టంతో 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 193 పాయింట్లు(1.7 శాతం) కోల్పోయి 11,665 వద్ద స్థిరపడింది. ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలపై మంగళవారంలోగా స్పష్టత వచ్చే వీలున్నట్లు నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలలోగా ప్యాకేజీ అమలుకు వీలు కలగనున్నట్లు తెలియజేశారు. దీంతో నేడు మార్కెట్లు కోలుకునే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధ్యక్ష ఎన్నికలలో భాగంగా గురువారం ప్రెసిడెంట్ ట్రంప్, ప్రత్యర్థి జో బిడెన్ మధ్య చివరి దశ డిబేట్ జరగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. 4 లక్షలు గత వారం కోవిడ్-19 కేసులు 13 శాతం పెరిగి 3.93 లక్షలుగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.అయితే మార్చి తదుపరి ఈ ఆదివారం తొలిసారి 10 లక్షల మందికిపైగా విమాన ప్రయాణికులకు స్క్రీనింగ్ చేసినట్లు భద్రతాధికారులు వెల్లడించడం గమనార్హం! ఈ నేపథ్యంలోనూ ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో రవాణా సంబంధ కౌంటర్లు డీలాపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫాంగ్ స్టాక్స్ బోర్లా కొద్ది నెలలుగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో సోమవారం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో యాపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ 2.6-2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది. కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 4 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా 1.2 శాతం, ఫైజర్ ఇంక్ 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కొనాకోఫిలిప్స్ 3.2 శాతం, షెవ్రాన్ కార్పొరేషన్ 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. -
యూఎస్ మార్కెట్లకు ట్రంప్ జోష్
డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న ప్యాకేజీకంటే మరింత అధికంగా స్టిములస్ చర్యలకు సిద్ధమంటూ తాజాగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో వారాంతాన స్టాక్ మార్కెట్లకు జోష్ వచ్చింది. వారం మొదట్లో అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్161 పాయింట్లు(0.6%) బలపడి 28,587 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 30 పాయింట్లు(0.9%) పుంజుకుని 3,477 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 159 పాయింట్లు(1.4%) జంప్‌చేసి 11,580 వద్ద స్థిరపడింది. ఆగస్ట్ తదుపరి గత వారం యూఎస్ మార్కెట్లు అత్యధికంగా లాభపడ్డాయి. డోజోన్స్ 3.3 శాతం, ఎస్అండ్పీ 3.8 శాతం, నాస్డాక్ 4.6 శాతం చొప్పున ఎగశాయి. ఫాంగ్ స్టాక్స్ జోరు ఫాంగ్ స్టాక్స్‌లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, , నెట్‌ఫ్లిక్స్, గూగుల్ 3-1.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇతర కౌంటర్లలో ఫార్మా దిగ్గజం ఆస్ట్రా జెనెకా 1.2 శాతం పుంజుకోగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్, సేల్స్‌ఫోర్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. నార్వేజియన్ క్రూయిజర్ 3 శాతం జంప్‌చేయగా.. షెవ్రాన్ కార్పొరేషన్ 1.6 శాతం క్షీణించింది. ఫైజర్, బోయింగ్ 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
యూఎస్ మార్కెట్లకు ట్రంప్ షాక్
అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ ట్రంప్ తాజాగా స్పష్టం చేయడంతో మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. డోజోన్స్ 376 పాయింట్లు(1.3%) క్షీణించి 27,773 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 48 పాయింట్లు(1.4%) బలహీనపడి 3,361 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 178 పాయింట్లు(1.6%) పతనమై 11,155 వద్ద స్థిరపడింది. కోవిడ్19 నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ కోలుకోవడంతో ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలతో సోమవారం మార్కెట్లు జంప్‌చేసిన సంగతి తెలిసిందే. ఏం జరిగిందంటే? హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కొన్ని రాష్ట్రాల కోసం ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల బెయిలవుట్ కోవిడ్-19కు వినియోగం కోసంకాదని ట్రంప్ విమర్శించారు. అయినాగానీ తాము ఎంతో ఉదారంగా 1.6 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించామని పేర్కొన్నారు. ఇందుకు డెమక్రాట్లు అంగీకరించకపోవడంతో ఎన్నికలు ముగిసేవరకూ చర్చలు నిలిపివేయాల్సిందిగా తమ ప్రతినిధులను ఆదేశించినట్లు ట్రంప్ తెలియజేశారు. ఎన్నికల్లో గెలిచాక కష్టపడి పనిచేస్తున్న అమెరికన్లతోపాటు.. చిన్న వ్యాపారాలకు మేలు చేసేలా బెయిలవుట్ బిల్లును పాస్ చేస్తామని పేర్కొన్నారు. కాగా.. ఆర్థిక రికవరీకి మరో భారీ ప్యాకేజీ అవసరమున్నట్లు తాజాగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక దన్ను లభించకుంటే.. జీడీపీ రికవరీ నెమ్మదించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంటు బలహీనపడి ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ వీక్ మంగళవారం ట్రేడింగ్ లో బ్లూచిప్ స్టాక్ బోయింగ్ 7 శాతం పతనంకాగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 3 శాతం క్షీణించింది. ఫాంగ్ స్టాక్స్‌లో యాపిల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, 3-1.5 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర కౌంటర్లలో ఫార్మా దిగ్గజాలు మోడర్నా ఇంక్, ఫైజర్ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
ట్రంప్ ఓకే- యూఎస్ మార్కెట్లు అప్
అధ్యక్షుడు ట్రంప్ సైతం కోవిడ్-19 బారిన పడటంతో వారాంతాన నమోదైన నష్టాలకు చెక్ పెడుతూ సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 466 పాయింట్లు(1.7%) ఎగసి 28,149 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 60 పాయింట్లు(1.8%) బలపడి 3,409 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 257 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 11,332 వద్ద స్థిరపడింది. ప్రెసిడెంట్ ట్రంప్ కోలుకోవడంతో తిరిగి ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్ పట్టుబడుతున్న ప్యాకేజీపై ఒప్పందం కుదిరేవీలున్నట్లు వైట్‌హౌస్ చీఫ్ మార్క్ మెడోస్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. బ్రిస్టల్ మైయర్స్ అప్ యాంటీబాడీలు వృద్ధిచెందేలా అభివృద్ధి చేస్తున్న ఔషధంపై అంచనాలతో హెల్త్‌కేర్ దిగ్గజం రీజనరాన్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. యూరోపియన్ దేశాలలో పనిచేస్తున్న సిబ్బందిలో 11 శాతంవరకూ కోత పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇంధన రంగ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ తొలుత 3 శాతం క్షీణించింది. చివరికి 2.3 శాతం లాభంతో ముగిసింది. కాగా.. హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలో ప్రత్యేకత కలిగిన మోకార్డియాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం బ్రిస్టల్ మైయర్స్ 1 శాతం బలపడింది. అయితే మోకార్డియా ఏకంగా 58 శాతం దూసుకెళ్లింది. మోడర్నా జోరు కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధిలో దూకుడు చూపుతున్న మోడర్నా ఇంక్ 4.6 శాతం జంప్‌చేయగా.. ఫైజర్ 1 శాతం, ఆస్ట్రాజెనెకా 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఫాంగ్ స్టాక్స్‌లో యాపిల్ 3 శాతం, మైక్రోసాఫ్ట్, గూగుల్ 2 శాతం చొప్పున ఎగశాయి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 2.6 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో షెవ్రాన్, బోయింగ్ 2 శాతం చొప్పున బలపడ్డాయి. -
ట్రంప్‌నకు కరోనా : కుప్పకూలిన మార్కెట్లు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా సోకిందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. తనతోపాటు, భార్య మెలానియా ట్రంప్ కూడా కరోనా నిర్ధారణ అయిందని ట్రంప్ ట్వీట్ చేసిన మరుక్షణం మార్కెట్లో సెంటిమెంటు దెబ్బతింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. రానున్న అధ్యక్ష ఎన్నికల ప్రచార హోరు మొదలైన తరుణంలో ట్రంప్ వ్యాధి పరినపడటంతో రిపబ్లిక్ పార్టీ ఆందోళనలో పడిపోయింది. (కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు) డౌ ఫ్యూచర్స్ 500 పాయింట్లు, నాస్ డాక్ ఫ్యూచర్స్1.7 శాతం పడిపోయాయి. బంగారం కూడా 0.55 శాతం క్షీణించి,ఔన్సు దర 1,894.60 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ కరోనా బారిన పడటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడిన ప్రపంచ నాయకుల జాబితాలోతాజాగా ట్రంప్ చేరారు. ఇంతకుముందు బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారోకు కూడా ఈ వైరస్ సోకింది. తనకు వైద్యం చేసిన డాక్టరకు వైరస్ పాజిటివ్ రావడంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అలాగే భార్యకు కరోనా సోకడంతో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇంటినుంచే విధులను నిర్వర్తించిన సంగతి తెలిసిందే. కాగా రెండవసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ ఈసారి కాస్త వెనుకంజలో ఉన్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతుండగా ట్రంప్‌నకు ఎదురులేదని రిపబ్లిక్ పార్టీ ధీమాగా ఉంది. అటు బైడెన్ కు తిరుగే లేదని, ముఖ్యంగా మహిళల ఆదరణ లభిస్తోందని, దీంతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తు ప్రెసిడెన్షియల్ డిబేట్లలో విజయవంతంగా మొదటి డిబేట్‌ను గెలిచారని డెమొక్రాటిక్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. -
రెండో రోజూ యూఎస్ మార్కెట్ల జోరు
వరుస నష్టాలకు చెక్ పెడుతూ వారాంతాన జోరందుకున్న యూఎస్ స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం లాభపడ్డాయి. డోజోన్స్ 410 పాయింట్లు(1.5%) ఎగసి 27,584 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 53 పాయింట్ల(1.6%) బలపడి 3,352 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 204 పాయింట్లు(1.8%) జంప్‌చేసి 11,118 వద్ద స్థిరపడింది. శుక్రవారం సైతం ఇండెక్సులు ఇదే స్థాయిలో పురోగమించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19తో సవాళ్లు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, కంపెనీలకు అండగా వాషింగ్టన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్యాకేజీపై నేడు తిరిగి చర్చలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 2.5-0.7 శాతం మధ్య లాభపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 3.4 శాతం జంప్‌చేసింది. ఇతర కౌంటర్లలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 4 శాతం ఎగసింది. ప్రభుత్వం నుంచి 5.5 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందడంతో ఈ కౌంటర్‌కు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా నిలిచిపోయిన 737 మ్యాక్స్ విమానాలపై అంచనాలతో బోయింగ్ కంపెనీ 6.4 శాతం దూసుకెళ్లింది. కాగా.. ప్రత్యర్థి కంపెనీ డబ్ల్యూ పీఎక్స్ ఎనర్జీని 2.56 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు డెవాన్ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ 16-11 శాతం చొప్పున జంప్‌చేశాయి. లండన్‌లో కార్యకలాపాలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వార్తలతో ఉబర్ టెక్నాలజీస్ 3.2 శాతం పుంజుకుంది. -
యూఎస్ మార్కెట్లు అప్- క్రూయిజర్ షేర్ల స్పీడ్
దాదాపు మూడు వారాల తరువాత శుక్రవారం యూఎస్ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగశాయి. డోజోన్స్ 359 పాయింట్లు(1.35%) పెరిగి 27,174 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 52 పాయింట్ల(1.6%) లాభంతో 3,298 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 241 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 10,914 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఈ వారం నికరంగా డోజోన్స్ 1.8 శాతం నష్టపోగా.. ఎస్అండ్పీ 0.6 శాతం నీరసించింది. అయితే 4 వారాల నష్టాలకు చెక్ పెడుతూ నాస్డాక్ మాత్రం 1.1 శాతం పుంజుకుంది. ఇటీవల కరెక్షన్ బాటలో సాగుతున్న మార్కెట్లు వరుసగా నాలుగో వారం నష్టాలతో ముగిశాయి. తద్వారా 2019 ఆగస్ట్ తదుపరి అత్యధిక కాలం మార్కెట్లు వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఆశావహ అంచనాలు వచ్చే వారం హౌస్ డెమక్రాట్లు ప్రతిపాదిస్తున్న 2.4 ట్రిలియన్ డాలర్ల ఉపశమన ప్యాకేజీపై వోటింగ్ చేపట్టనున్నారు. నిరుద్యోగులకు లబ్దిని పెంచడంతోపాటు.. నష్టాలకు లోనవుతున్న ఎయిర్‌లైన్స్‌కు ఆర్థిక మద్దతు అందించేందుకు ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు రిపబ్లికన్లు ప్రతిపాదించిన ప్యాకేజీకంటే అధికంకావడం విశేషం! దీంతో సెంటిమెంటు బలపడగా.. టెక్నాలజీ దిగ్గజాలలో షార్ట్ కవరింగ్ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. క్రూయిజర్ దూకుడు వారాంతాన ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 3.8 శాతం లాభపడగా.. అమెజాన్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2.3 శాతం, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్ 2.1 శాతం చొప్పున ఎగశాయి. ఇతర కౌంటర్లలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 5 శాతం జంప్‌చేసింది. క్రూయిజర్ నిర్వాహక కంపెనీలు కార్నివాల్ 9.7 శాతం, నార్వేజియన్ క్రూయిజ్ లైన్ 13.7 శాతం, రాయల్ కరిబియన్ 7.7 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ నెలలో వీక్ మార్కెట్లకు దన్నునిస్తున్న ఫాంగ్ స్టాక్స్ సెప్టెంబర్‌లో వెనకడుగు వేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ యాపిల్ 13 శాతం పతనంకాగా.. మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్(గూగుల్), నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఫేస్బుక్ సుమారు 8 శాతం చొప్పున క్షీణించాయి. దీంతో ఈ నెలలో మార్కెట్లు కరెక్షన్ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 4.4 శాతం, ఎస్అండ్పీ 5.8 శాతం చొప్పున పతనంకాగా.. నాస్డాక్ మరింత అధికంగా 7.3 శాతం తిరోగమించడం గమనార్హం! -
కరెక్షన్ బాటలో యూఎస్ మార్కెట్లు
ఓవైపు కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, మరోపక్క సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన బుధవారం మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్ 525 పాయింట్లు(1.9%) క్షీణించి 26,763 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 79 పాయింట్ల(2.4%) నష్టంతో 3,237 వద్ద నిలిచింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 331 పాయింట్లు(3%) పతనమై 10,633 వద్ద స్థిరపడింది. దీంతో ఈ నెలలో నమోదైన చరిత్రాత్మక గరిష్టాల నుంచి ఎస్అండ్పీ 10 శాతం, నాస్డాక్ 12 శాతం చొప్పున వెనకడుగు వేసినట్లయ్యింది. డోజోన్స్ ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టంకంటే 9.4 శాతం దిగువన నిలిచింది. ఇది కరెక్షన్కు సంకేతమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం మార్కెట్లు బలపడినప్పటికీ తిరిగి అమ్మకాలు ఊపందుకున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల మార్కెట్ల ర్యాలీకి కారణమైన టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. డౌన్ డౌన్.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 4.2 శాతం పతనమైంది. ఈ బాటలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ 4-2.3 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో కంప్యూటర్ చిప్ తయారీ కంపెనీలు ఎన్విడియా, ఏఎండీ సైతం 4 శాతం వెనకడుగు వేశాయి. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీ అంశంలో ఎదురవుతున్న సవాళ్లపై సీఈవో ఎలెన్ మస్క్ వ్యాఖ్యలతో టెస్లా ఇంక్ 10.3 శాతం కుప్పకూలింది. అయితే స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల కంపెనీ నైక్ ఇంక్ 9 శాతం దూసుకెళ్లింది. -
టెక్ షేర్లు వీక్- యూఎస్ వెనకడుగు
టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగుతుండటంతో వరుసగా మూడో రోజు యూఎస్ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం డోజోన్స్ 245 పాయింట్లు(0.9%) నీరసించి 27,657 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 38 పాయింట్లు(1.1%) క్షీణించి 3,319 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 117 పాయింట్ల(1.1%) నష్టంతో 10,793 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో వారం ఎస్అండ్పీ, నాస్డాక్ వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో వెనకడుగు వేశాయి. కోవిడ్-19 నేపథ్యంలో గతంలో ప్రకటించిన అతిభారీ ప్యాకేజీ 2 ట్రిలియన్ డాలర్లకు కొనసాగింపుగా ప్రజలకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ప్రతిపాదనపై రిపబ్లికన్లు, డెమక్రాట్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ కొత్త ప్యాకేజీపై స్పందించకపోవడం దీనికి జత కలిసినట్లు అభిప్రాయపడ్డారు. బేర్ ట్రెండ్? గత కొంత కాలంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల మొదటి నుంచీ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మార్కెట్లకు బలాన్నిస్తున్న FAAMNG స్టాక్స్‌లో ఈ వారం అమెజాన్, ఫేస్బుక్ 5 శాతంకంటే అధికంగా బలహీనపడ్డాయి. ఈ నెలలో చూస్తే ఫేస్బుక్, అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ 10 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. యాపిల్ మరింత అధికంగా 17 శాతం క్షీణించింది. ఇటీవల సాధించిన గరిష్టం నుంచి చూస్తే యాపిల్ 23 శాతం పతనమైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువలో 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. మళ్లీ డౌన్.. ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ టెక్ కౌంటర్లలో వారాంతాన యాపిల్ 3.2 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్ 2.4 శాతం, అమెజాన్ 1.8 శాతం, మైక్రోసాఫ్ట్ 1.2 శాతం, ఫేస్బుక్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. మోడర్నా ఇంక్ 3 శాతం, ఆస్ట్రాజెనెకా 1 శాతం చొప్పున బలపడగా.. ఫైజర్ 0.5 శాతం నీరసించింది. జాన్సన్ అండ్ జాన్సన్ 1.4 శాతం పుంజుకోగా.. షెవ్రాన్ 0.75 శాతం బలహీనపడింది. -
మళ్లీ యూఎస్ వీక్- ఐపీవోకు టిక్‌టాక్
టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు రెండో రోజూ యూఎస్ మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో గురువారం డోజోన్స్ 130 పాయింట్లు(0.5%) నీరసించి 27,902 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 28 పాయింట్లు(0.8%) క్షీణించి 3,357 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 140 పాయింట్లు(1.3%) నష్టంతో 10,910 వద్ద స్థిరపడింది. ధరలు పుంజుకునేటంతవరకూ నామమాత్ర వడ్డీ రేట్ల కొనసాగింపునకే కట్టుబడనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ తాజా పాలసీలో స్పష్టం చేసింది. నిరుద్యోగిత తగ్గడం, కొన్నిరంగాలలో కనిపిస్తున్న డిమాండ్.. ఆర్థిక రికవరీ సంకేతాలను ఇస్తున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఫెడ్.. సహాయక ప్యాకేజీల విషయాన్ని విస్మరించినట్లు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూనే ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సైతం ఎస్అండ్పీ, నాస్డాక్ వెనకడుగు వేయడం గమనార్హం! టిక్‌టాక్ ఐపీవో చైనీస్ వీడియో మేకింగ్ యాప్.. టిక్‌టాక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకు వీలుగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇది సాకారమైతే 50 బిలియన్ డాలర్ల విలువతో టెక్నాలజీ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. భద్రతా కారణాలరీత్యా ప్రెసిడెంట్ ట్రంప్.. టిక్‌టాక్ కార్యకాలపాలపై నిషేధాన్ని విధించిన విషయం విదితమే. టిక్‌టాక్‌కు అమెరికాలో 10 కోట్లమంది యూజర్లుండటం విశేషం! దీంతో టిక్‌టాక్ యూఎస్ విభాగంపై ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ కార్పొరేషన్ కన్నేశాయి. ఇందుకు అనుగుణంగా టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు సాఫ్ట్వేర్ భాగస్వామిగా ఒరాకిల్ ఒప్పందాన్ని కుదుర్చుకుందికూడా. కాగా.. టిక్‌టాక్ యూఎస్ బిజినెస్ కొనుగోలుకి అటు మైక్రోసాఫ్ట్, ఇటు ఒరాకిల్ కార్పొరేషన్ రేసులో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. టెక్ డీలా.. ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ టెక్ కౌంటర్లలో ఫేస్బుక్ 3.3 శాతం, నెట్‌ఫ్లిక్స్ 3 శాతం, అమెజాన్ 2.3 శాతం, యాపిల్ ఇంక్, అల్ఫాబెట్ 1.6 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున క్షీణించాయి. టెస్లా ఇంక్ 4.2 శాతం పతనమైంది. ద్వితీయార్థం నుంచీ టర్న్అరౌండ్ ఫలితాలను సాధించనున్నట్లు సీఈవో లారీ కల్ప్ పేర్కొనడంతో ఇంజినీరింగ్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ 4.4 శాతం జంప్‌చేసింది. మిచిగాన్ ప్లాంటు నుంచి కొత్త తరం పికప్ ట్రక్ F-150 తయారీని ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ 3.7 శాతం ఎగసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు తిరిగి ప్రారంభించిన ఆస్ట్రాజెనెకా 1.5 శాతం లాభపడింది. -
టెక్ డీల్స్- యూఎస్ మార్కెట్ల జోరు
టెక్నాలజీ రంగంలో డీల్స్, కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌పై అంచనాలు సోమవారం యూఎస్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్ 328 పాయింట్లు(1.2%) ఎగసి 27,993 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 43 పాయింట్లు(1.3%) లాభపడి 3,384 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 203 పాయింట్లు(2%) జంప్‌చేసి 11,057 వద్ద స్థిరపడింది. కారణాలేవింటే? కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై మళ్లీ అంచనాలు పెరిగాయి. సైడ్‌ఎఫెక్ట్స్‌పై సందేహాలతో తాత్కాలికంగా నిలిపివేసిన మూడో దశ క్లినికల్ పరీక్షలను ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రారంభించింది. అంతేకాకుండా అక్టోబర్‌కల్లా పరీక్షల డేటా విశ్లేషణను అందించగలమని పేర్కొంది. ఫార్మా దిగ్గజం పైజర్ సీఈవో ఆల్బర్ట్ సైతం డిసెంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని తాజాగా ప్రకటించారు. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. 21 బిలియన్ డాలర్లతో ఇమ్యునోమెడిక్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ పేర్కొంది. తద్వారా క్యాన్సర్ చికిత్సను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఒరాకిల్ చేతికి టిక్‌టాక్ చైనీస్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ రేసులోకి వచ్చింది. ప్రతిపాదిత డీల్ ప్రకారం టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్ సాఫ్ట్వేర్ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్ యూఎస్ విభాగంలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. మరోవైపు 40 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ నుంచి ఆర్మ్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా తాజాగా వెల్లడించింది. జోరు తీరు.. మార్కెట్లకు సోమవారం పలు బ్లూచిప్ కౌంటర్లు దన్నుగా నిలిచాయి. ఆర్మ్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకోనున్న ఎన్విడియా 6 శాతం జంప్‌చేయగా.. టిక్‌టాక్‌పై కన్నేసిన ఒరాకిల్ 4.3 శాతం ఎగసింది. ఈ ప్రభావంతో చిప్ కంపెనీలు ఏఎండీ, మైక్రాన్, స్కైవర్క్స్ సైతం 2-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక కొద్ది రోజులుగా దిద్దుబాటుకులోనైన ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 3 శాతం పుంజుకోగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 13 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్ 0.7 శాతం లాభపడగా.. ఫార్మా బ్లూచిప్స్ ఫైజర్ 2.6 శాతం, ఆస్ట్రాజెనెకా 0.6 శాతం చొప్పున ఎగశాయి. -
ఆటుపోట్లు- యూఎస్ మార్కెట్ల పతనం
తీవ్ర ఆటుపోట్ల మధ్య గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మూడు రోజుల భారీ నష్టాల నుంచి బుధవారం కోలుకున్పప్పటికీ తిరిగి ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌లో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 406 పాయింట్లు(1.5%) క్షీణించి 27,535 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 60 పాయింట్లు(1.8%) నష్టపోయి 3,339 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 222 పాయింట్లు(2%) పతనమై 10,920 వద్ద స్థిరపడింది. బుధవారం స్పీడును కొనసాగిస్తూ తొలుత డోజోన్స్ 300 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో చివరికి డీలాపడింది. ఎందుకంటే? గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలను మించుతూ 8.84 లక్షలను తాకడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో 8.5 లక్షల క్లెయిములను ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దీనికితోడు టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా నెలకొన్న ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు వెలువడిన వార్తలతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనైనట్లు తెలియజేశారు. నేలచూపులే.. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్(అల్ఫాబెట్) 2-4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్.. తొలుత 8 శాతం పతనమైనప్పటికీ చివర్లో కోలుకుని 1.4 శాతం లాభంతో ముగిసింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 3.6 శాతం క్షీణించింది. కోవిడ్-19 చికిత్సకు బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫైజర్ ఇంక్ 1.5 శాతం నష్టపోగా.. క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన ఆస్ట్రాజెనెకా 1.1 శాతం నీరసించింది. వ్యాక్సిన్ రేసులో ఉన్న మరో ఫార్మా కంపెనీ మోడార్నా ఇంక్ 1.2 శాతం పుంజుకుంది. ఫార్మా దిగ్గజం సనోఫీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన మైఖేల్ మలెట్ను కెనడియన్ బిజినెస్ ఎండీగా ఎంపిక చేసుకున్నట్లు మోడర్నా పేర్కొంది. -
పతనానికి చెక్ -యూఎస్ బౌన్స్‌బ్యాక్
మూడు రోజుల భారీ నష్టాలకు బుధవారం తెరపడింది. ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో యూఎస్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వెరసి డోజోన్స్ జులై 14 తదుపరి అత్యధికంగా లాభపడింది. 440 పాయింట్లు(1.6%) పుంజుకుని 27,940 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ జూన్ 5 తరువాత 67 పాయింట్లు(2%) ఎగసి 3,399 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 294 పాయింట్లు(2.7%) జంప్‌చేసి 11,142 వద్ద స్థిరపడింది. తద్వారా ఏప్రిల్ 29 తరువాత సింగిల్ డేలో అధిక లాభాలు ఆర్జించింది. షార్ట్ కవరింగ్.. ఇటీవల వెల్లువెత్తిన అమ్మకాలతో మూడు ట్రేడింగ్ సెషన్లలోనే నాస్డాక్ ఇండెక్స్ 10 శాతం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా మార్కెట్లు రీబౌండ్ అయినట్లు తెలియజేశారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్) అంచనాల నేపథ్యంలో గత మూడు రోజులుగా మార్కెట్లు పతన బాటలో సాగుతూ వచ్చిన విషయం విదితమే. వీటికి జతగా టెక్నాలజీ దిగ్గజాల కౌంటర్లలో సాఫ్ట్‌బ్యాంక్ భారీ స్థాయిలో డెరివేటివ్ పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన వార్తలు కూడా ఒక్కసారిగా అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. జోరు తీరు ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ 4 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఈ బాటలో గూగుల్ 1.6 శాతం, ఫేస్బుక్ 1 శాతం చొప్పున ఎగశాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్.. 11 శాతం దూసుకెళ్లింది. కంప్యూటర్ చిప్స్ తయారీ దిగ్గజం ఏఎండీ 4 శాతం పెరిగింది. క్లినికల్ పరీక్షలను తిరిగి వచ్చేవారం ప్రారంభించగలదన్న అంచనాలున్నప్పటికీ ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం క్షీణించింది. 16 బిలియన్ డాలర్లతో చేపట్టదలచిన టేకోవర్‌ను విరమించుకోనున్నట్లు లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ వెల్లడించడంతో జ్యువెలరీ కంపెనీ టిఫనీ అండ్ కో 6.5 శాతం పతనమైంది. -
మూడో రోజూ యూఎస్ మార్కెట్లు.. బేర్ బేర్
వరుసగా మూడో రోజు మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్ 633 పాయింట్లు(2.25%) పతనమై 27,500 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 95 పాయింట్లు(2.78%) దిగజారి 3,332 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 465 పాయింట్లు(4.11%) పడిపోయి 10,848 వద్ద స్థిరపడింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే నాస్డాక్ ఇండెక్స్ 10 శాతం కోల్పోయింది. ఇది దిద్దుబాటు(కరెక్షన్)కు సంకేతమని సాంకేతిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్) అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలరు ఇండెక్స్ నాలుగు వారాల గరిష్టానికి చేరగా.. ముడిచమురు ధరలు 8 శాతం పడిపోయాయి. పతన బాటలో ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో యాపిల్ 7 శాతం పతనమైంది. దీంతో ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ విలువలో 140 బిలియన్ డాలర్లు ఆవిరైంది. 2008 అక్టోబర్ తదుపరి యాపిల్ షేరు 3 రోజుల్లోనే 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్.. తొలిసారి ఒక్క రోజులోనే 21 శాతం కుప్పకూలింది. జనరల్ మోటార్స్ 2 బిలియన్ డాలర్లతో 11 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో టెస్లా ప్రత్యర్థి సంస్థ నికోలా కార్పొరేషన్ షేరు 41 శాతం దూసుకెళ్లింది. ఫాంగ్ స్టాక్స్ వీక్ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఈకామర్స్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ 5.4 శాతం, ఫేస్బుక్ 4 శాతం, అమెజాన్ 4.4 శాతం, గూగుల్ 3.7 శాతం, నెట్‌ఫ్లిక్స్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ కౌంటర్లలో బిలియన్ల డాలర్లతో పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన అంచనాల కారణంగా సాఫ్ట్‌బ్యాంక్ షేరు సైతం 7 శాతం పడిపోయింది. -
రెండో రోజూ యూఎస్ మార్కెట్లు బోర్లా
టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా వరుసగా రెండో రోజు యూఎస్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీంతో తొలి సెషన్లో డోజోన్స్ 628 పాయింట్లు పతనమైంది. అయితే ఆగస్ట్‌లో ఉపాధి పుంజుకున్నట్లు వెల్లడికావడంతో రికవరీ బాట పట్టాయి. అయినప్పటికీ ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. వెరసి శుక్రవారం డోజోన్స్ 159 పాయింట్ల(0.6%) నష్టంతో 28,133 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 28 పాయింట్లు(0.8%) క్షీణించి 3,427 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 145 పాయింట్లు(1.3%) వెనకడుగుతో 11,313 వద్ద స్థిరపడింది. కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెక్ దిగ్గజాలలో భారీ అమ్మకాలతో గురువారం డోజోన్స్ 800 పాయింట్లు పడిపోగా.. నాస్డాక్ 5 శాతం కుప్పకూలిన విషయం విదితమే. సాఫ్ట్‌బ్యాంక్ దెబ్బ! ఇటీవల జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరించడం ద్వారా టెక్నాలజీ స్టాక్స్‌లో భారీ పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజులుగా అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. కాగా.. ఆగస్ట్‌లో కొత్తగా 1.37 మిలియన్ ఉద్యోగాలు లభించినట్లు తాజా గణాంకాలు వెలడించాయి. అంతేకాకుండా అంచనాల(14.7 శాతం) కంటే తక్కువగా నిరుద్యోగిత 8.4 శాతంగా నమోదైంది. దీంతో మిడ్‌సెషన్ నుంచీ మార్కెట్లు కోలుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. నష్టాల బాట.. వారాంతాన ఫాంగ్(FAAMNG) స్టాక్స్ గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ 3-1.4 శాతం మధ్య క్షీణించాయి. ఈ బాటలో జూమ్ 3 శాతం పతనంకాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ యథాతథంగా ముగిసింది. ఇతర కౌంటర్లలో తొలుత 6 శాతం పతనమైన ఆటో దిగ్గజం టెస్లా దాదాపు 3 శాతం లాభంతో నిలిచింది. బ్లూచిప్స్ బోయింగ్, హెచ్‌పీఈ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. కాగా.. చైనీస్ టెక్ దిగ్గజం టెన్సెంట్ షేరు రెండు రోజుల్లో 5 శాతం నీరసించడంతో 34 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. పబ్జీ గేమ్‌ను ఇండియాలో నిషేధించడం ఈ కౌంటర్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
టెక్ షాక్- యూఎస్ మార్కెట్లు బోర్లా
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో డోజోన్స్ 808 పాయింట్లు(2.8%) పతనమై 28,293 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 126 పాయింట్లు(3.5%) పడిపోయి 3,455 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 598 పాయింట్లు(5%) దిగజారి 11,458 వద్ద స్థిరపడింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్ తదితర దిగ్గజాల వెనకడుగుతో తొలుత డోజోన్స్ 1,000 పాయింట్లకుపైగా పడిపోవడం గమనార్హం! పతన బాటలో కొద్ది నెలలుగా దూకుడు చూపుతూ అటు ఎస్అండ్పీ, ఇటు నాస్డాక్ కొత్త రికార్డులను చేరుకునేందుకు దోహదపడుతున్న టెక్ దిగ్గజాల కౌంటర్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జూన్ తదుపరి ఒక్క రోజులోనే ఫాంగ్ స్టాక్స్ అన్నీ భారీగా పతనమయ్యాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 8 శాతం, విండోస్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 6.2 శాతం చొప్పున కుప్పకూలగా.. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో జూమ్ 10 శాతం, టెస్లా 9 శాతం, ఎన్విడియా 9.3 శాతం చొప్పున బోర్లా పడ్డాయి. ఇక బ్లూచిప్స్ హెచ్‌పీ, బోయింగ్, డీరె 3 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే పటిష్ట త్రైమాసిక ఫలితాల కారణంగా కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కంపెనీ పీవీహెచ్ కార్ప్ 3.3 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ ఉన్నట్టుండి గురువారం వెల్లువెత్తిన అమ్మకాలకు ప్రధాన కారణం ట్రేడర్ల లాభాల స్వీకరణే అని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లు నిరవధికంగా దూసుకెళుతున్నట్లు తెలియజేశారు. దీంతో సాంకేతికంగానూ మార్కెట్లు ఓవర్‌బాట్ స్థాయికి చేరుకున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నట్లు వివరించారు. ఉదాహరణకు గురువారంనాటి పతనం తదుపరి కూడా యాపిల్ ఇంక్ షేరు 2020లో ఇప్పటివరకూ 65 శాతం ర్యాలీ చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బుధవారం రికార్డ్స్ పలు సానుకూల అంశాల నేపథ్యంలో బుధవారం ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. -
వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం మరోసారి దూకుడు చూపాయి. వ్యాక్సిన్ల అందుబాటు కారణంగా డిసెంబర్‌కల్లా కోవిడ్-19కు చెక్పెట్టగలమంటూ వెలువడిన అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వగా.. మరో సహాయక ప్యాకేజీపై స్పీకర్ నాన్సీ పెలోసీతో ఆర్థిక మంత్రి స్టీవెన్ ముచిన్ చర్చలు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఇప్పటివరకూ ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బ్లూచిప్స్ దన్ను ప్రధానంగా దిగ్గజ కంపెనీలు బలపడటంతో మార్కెట్లు జోరందుకున్నాయి. కోక కోలా, జనరల్ మోటార్స్, హెచ్‌పీ 4 శాతం, ఇంటెల్ కార్ప్, ఫేస్బుక్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఏడీపీ 3 శాతం, ఫోర్డ్ మోటార్, బోయింగ్ 1.75 శాతం, అమెజాన్ 1 శాతం చొప్పున ఎగశాయి. బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌ను సలహాదారుగా నియమించుకోవడంతో డ్రాఫ్ట్‌కింగ్స్ 8 శాతం దూసుకెళ్లింది. కంపెనీలో అతిపెద్ద ఇన్వెస్టర్ ఒకరు షేర్లను విక్రయించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6 శాతం పతనమైంది. ఇక బుధవారం భారీగా ఎగసిన జూమ్ వీడియో 7.5 శాతం దిగజారగా.. యాపిల్ ఇంక్ 2 శాతం క్షీణించింది. -
యాపిల్, వాల్‌మార్ట్ ప్లస్- యూఎస్ రికార్డ్స్
ఆరు రోజుల రికార్డ్ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడినప్పటికీ మంగళవారం తిరిగి అమెరికా స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ జంప్‌చేయడంతో ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఎస్అండ్పీ 26 పాయింట్లు(0.75%) బలపడి 3,527కు చేరగా.. నాస్డాక్ 164 పాయింట్లు(1.4%) జంప్‌చేసి 11,940 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 216 పాయింట్లు(0.8%) ఎగసి 28,646 వద్ద స్థిరపడింది. ఆగస్ట్‌లో తయారీ రంగ పీఎంఐ గణాంకాలు 19ఏళ్ల గరిష్టాన్ని తాకడంతో సెంటిమెంటుకు బూస్ట్ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దిగ్గజాల అండ ఈ నెలాఖరు నుంచి మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొనడంతో వాల్‌మార్ట్ 6 శాతం జంప్‌చేసింది. రీసెర్చ్ సంస్థలు బయ్ రేటింగ్ ద్వారా టార్గెట్ ధరను పెంచడంతో యాపిల్ ఇంక్ 4 శాతం ఎగసింది. 5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 4 శాతం పతనమైంది. ఇక జూమ్ షేరు ఏకంగా 41 శాతం దూసుకెళ్లింది. క్యూ2లో పటిష్ట ఫలితాలకుతోడు.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడం జూమ్ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆగస్ట్‌లో స్పీడ్ గత నెలలో యూఎస్ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. డోజోన్స్ 7.6 శాతం, ఎస్అండ్పీ 7 శాతం చొప్పున పుంజుకోగా.. నాస్డాక్ మరింత అధికంగా 9.6 శాతం దూసుకెళ్లింది. వెరసి 2020 జనవరి నుంచి ఎస్అండ్పీ 8.3 శాతం, నాస్డాక్ 31.2 శాతం ర్యాలీ చేయగా.. డోజోన్స్ 0.4 శాతం వెనకడుగులో ఉంది. ఇందుకు ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు దోహదం చేశాయి. ఆగస్ట్లోమైక్రోసాఫ్ట్ 10 శాతం లాభపడగా.. 2020లో ఇప్పటివరకూ 43 శాతం జంప్‌చేసింది. ఇదే విధంగా గత నెలలో యాపిల్ ఇంక్ 21.4 శాతం పుంజుకోగా.. ఈ ఏడాదిలో 76 శాతం దూసుకెళ్లింది. టెస్లా జోరు ఆగస్ట్‌లో యాపిల్ ఇంక్ 4:1 నిష్పత్తిలోనూ, టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలోనూ షేర్ల విభజనను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో టెస్లా ఇంక్ షేరు 74 శాతం జంప్‌చేసింది. ఈ షేరు 2020లో ఇప్పటివరకూ 496 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. డోజోన్స్‌లో ఎగ్జాన్ మొబిల్, ఫైజర్ ఇంక్, రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోగా.. వీటి స్థానే సేల్స్‌ఫోర్స్.కామ్, యామ్జెన్ ఇంక్, హనీవెల్ ఇంటర్నేషనల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. -
యూఎస్- ఆరో రోజూ అదే జోరు
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 23 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 3,508 వద్ద నిలవడం ద్వారా వరుసగా ఆరో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఈ బాటలో నాస్డాక్ 70 పాయింట్లు(0.6 శాతం) బలపడి 11,696 వద్ద ముగిసింది. వెరసి 2020లో 40వ సారి సరికొత్త గరిష్ట రికార్డును అందుకుంది. ఇక వీటితో పోలిస్తే కొంత వెనకడుగులో ఉన్న డోజోన్స్ శుక్రవారం 162 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 28,654 వద్ద స్థిరపడింది. తద్వారా 2020లో ఏర్పడిన నష్టాల నుంచి బయటపడింది. అంటే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 57 శాతం ర్యాలీ చేసింది. వెరసి ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టాన్ని బ్రేక్ చేసేందుకు కేవలం 1,000 పాయింట్ల దూరంలోనిలిచింది. కాగా.. వరుసగా ఐదు వారాలపాటు లాభాల్లో నిలవడం ద్వారా ఎస్అండ్పీ మరో రికార్డును సాధించడం విశేషం! 1984 తదుపరి ఆగస్ట్‌లో ఎస్అండ్పీ, డోజోన్స్ 8 శాత స్థాయిలో లాభపడ్డాయి. కారణాలున్నాయ్ కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ 1.3 ట్రిలియన్ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధపడుతుండటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఆర్థిక రికవరీని సూచిస్తూ జులైలో వ్యక్తిగత వినియోగ సూచీ దాదాపు 2 శాతం జంప్‌చేయడం కూడా ఇందుకు దోహదపడినట్లు తెలియజేశారు. మరోపక్క జాక్సన్హోల్ వద్ద ప్రసంగంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు స్పష్టం చేయడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. కోక కోలా అప్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పానీయాల దిగ్గజం కోక కోలా, విమానయాన బ్లూచిప్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 3 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో నికర లాభం అంచనాలు మించడంతో డెల్ టెక్నాలజీస్ 6 శాతం జంప్‌చేసింది. క్యూ3పై అంచనాలతో హెచ్‌పీ 6 శాతం పురోగమించింది. వార్షిక సబ్స్క్రిప్షన్లు జోరందుకోనున్నట్లు అంచనాలు ప్రకటించిన వర్క్‌డే ఇంక్ 13 శాతం దూసుకెళ్లింది. టిక్‌టాక్ యూఎస్ యూనిట్ కొనుగోలుకి చేతులు కలిపిన వాల్‌మార్ట్ 2.7 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో న్యుటానిక్స్ ఇంక్ 29 శాతం ర్యాలీ చేసింది. నార్వేజియన్ క్రూయిజ్, రాయల్ కరిబియన్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. -
యూఎస్ మార్కెట్ల రికార్డ్.. రికార్డ్స్
వరుసగా నాలుగో రోజు బువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 35 పాయింట్లు(1 శాతం) ఎగసి 3,479 వద్ద నిలవగా.. నాస్డాక్ 199 పాయింట్లు(1.75 శాతం) జంప్‌చేసి 11,665 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 83 పాయింట్లు(0.3 శాతం) బలపడి 28,332 వద్ద స్థిరపడింది. వెరసి డోజోన్స్ సరికొత్త గరిష్టానికి 4 శాతం చేరువలో నిలిచింది. జులైలో తయారీ రంగ జోరుకు నిదర్శనంగా డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇండెక్సుల జోరు ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ లాభపడటంతో నాస్డాక్ 2020లో 39వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఎస్అండ్పీ సైతం 2020లో ఇప్పటివరకూ 18వ సారి రికార్డ్ గరిష్టాలను అందుకోవడం విశేషం! కాగా.. కోవిడ్-19 ప్రభావతో మార్చి 23న నమోదైన కనిష్టం 2,192 పాయింట్ల నుంచి ఎస్అండ్పీ 59 శాతం దూసుకెళ్లింది. ఇక జనవరి నుంచి చూస్తే కోవిడ్-19 నేపథ్యంలోనూ నాస్డాక్ 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! నెట్‌ఫ్లిక్స్ దూకుడు బుధవారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ గత మూడేళ్లలోలేని విధంగా 12 శాతం దూసుకెళ్లి 547 డాలర్లను అధిగమించింది. ఇతర ఫాంగ్ స్టాక్స్‌లో మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, ఫేస్బుక్ సరికొత్త గరిష్టాలను తాకాయి. ఈ బాటలో డోజోన్స్ ఇండెక్స్‌లో చోటు సాధించనున్న సేల్స్‌ఫోర్స్.కామ్ సైతం రికార్డ్ గరిష్టానికి చేరింది. పటిష్ట ఫలితాలు, గైడెన్స్ ఇందుకు దోహదం చేయగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6.4 శాతం జంప్‌చేసి 2153 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర దిగ్గజాలలో యాపిల్ 1.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 1.6 శాతం క్షీణించింది. ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడంతో హెచ్‌పీ ఎంటర్ప్రైజ్ 3.6 శాతం లాభపడగా.. ఫలితాలు నిరాశపరచడంతో రిటైలర్ నార్డ్‌స్ట్రామ్ 5.5 శాతం పతనమైంది. హరికేన్ లారా కారణంగా ఇంధన రంగ షేర్లు డీలాపడ్డాయి. -
ఫాంగ్ స్టాక్స్ దన్ను- మూడో రోజూ రికార్డ్స్
వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 13 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,444 వద్ద నిలవగా.. నాస్డాక్ 87 పాయింట్లు(0.76 శాతం) ఎగసి 11,466 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ మాత్రం 60 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,249 వద్ద స్థిరపడింది. ఫాంగ్ స్టాక్స్ మరోసారి లాభపడటంతో నాస్డాక్ 2020లో 38వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు ప్రారంభంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గురువారం జాక్సన్హోల్ వద్ద ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. యాపిల్ డీలా షేర్ల విభజన తదుపరి డోజోన్స్‌లో యాపిల్ ఇంక్ వెయిటేజీ నీరసించగా.. ఇండెక్స్‌లో చేపట్టిన ఇతర మార్పులు ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. డోజోన్స్‌లో ఎక్సాన్ మొబిల్ స్థానే సేల్స్‌ఫోర్స్.కామ్‌కు చోటు లభిస్తుండగా.. హనీవెల్ ఇంటర్నేషనల్ రాకతో రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోనుంది. ఈ బాటలో ఫైజర్ ఇంక్‌ను తోసిరాజని యామ్జెన్ ఇంక్ డోజోన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. బోయింగ్ ఇంక్ 2 శాతం, యాపిల్ 1 శాతం చొప్పున క్షీణించడంతో డోజోన్స్ వెనకడుగు వేసింది. అయితే ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ 3-1 శాతం మధ్య లాభపడటంతో ఎస్అండ్పీ, నాస్డాక్ రికార్డులు కొనసాగినట్లు నిపుణులు పేర్కొన్నారు. బెస్ట్ బయ్ వీక్ ప్రభుత్వం పేరోల్ ప్యాకేజీని పొడిగించకుంటే అక్టోబర్‌లో 19,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్ 2.2 శాతం డీలా పడింది. ఎలక్ట్రానిక్స్ చైన్ బెస్ట్ బయ్ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా క్యూ3లో అమ్మకాలు క్షీణించవచ్చని అంచనా వేసింది. దీంతో ఈ షేరు 4 శాతం పతనమైంది. ఇక క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో మెడ్‌ట్రానిక్స్ షేరు 2.5 శాతం ఎగసింది. -
యాపిల్ వండర్- యూఎస్ భళా
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులతో బలపడ్డాయి. ఎస్అండ్పీ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3,397 వద్ద నిలవగా.. నాస్డాక్ 47 పాయింట్లు(0.45 శాతం) ఎగసి 11,312 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 191 పాయింట్లు(0.7 శాతం) పెరిగి వద్ద స్థిరపడింది. తయారీ, సర్వీసుల రంగాల దన్నుతో జులైలో బిజినెస్ యాక్టివిటీ 2019 ఆగస్ట్ స్థాయిలో పుంజుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క వరుసగా రెండో నెలలోనూ గృహ విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఇళ్ల ధరలు రికార్డ్ స్థాయికి చేరినట్లు రియల్టీ సంస్థలు తెలియజేశాయి. దీంతో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనిపించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించిందని తద్వారా సెంటిమెంటు బలపడిందని నిపుణులు పేర్కొన్నారు. 497 డాలర్లకు యాపిల్ శుక్రవారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు 5 శాతం జంప్‌చేసి 497 డాలర్లకు ఎగువన ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 2.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డుకాగా.. ఇతర టెక్ దిగ్గజాలు మైక్రొసాఫ్ట్, గూగుల్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ డీలా పడ్డాయి. ఇతర కౌంటర్లలో వ్యవసాయ పరికరాల కంపెనీ డీరె అండ్ కంపెనీ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. 200 డాలర్ల సమీపంలో నిలిచింది. 2020 ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు కంపెనీ వేసిన అంచనాలు ఇందుకు సహకరించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2.4 శాతం బలపడింది. 2050 డాలర్ల సమీపంలో ముగిసింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 382 బిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆసియా లాభాల్లో యూఎస్ మార్కెట్ల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. హాంకాంగ్, కొరియా, జపాన్, తైవాన్, సింగపూర్, థాయ్‌లాండ్ 1.5-0.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర మార్కెట్లలో చైనా, ఇండోనేసియా స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. -
ఫాంగ్ స్టాక్స్ జోరు- నాస్డాక్ 35వ రికార్డ్
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే దిగ్గజాలు జోరందుకోవడంతో గురువారం నాస్డాక్ సరికొత్త ఫీట్ సాధించింది. 118 పాయింట్లు (1.1 శాతం) ఎగసి 11,265 వద్ద ముగిసింది. తద్వారా 2020లో 35వ సారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఎస్అండ్పీ 11 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 3,385 వద్ద నిలిచింది. ఇక డోజోన్స్ 47 పాయింట్లు(0.2 శాతం) బలపడి 27,740 వద్ద స్థిరపడింది. కాగా. 2020లో నాస్డాక్ 25.5 శాతం జంప్‌చేయగా.. ఎస్అండ్పీ 5 శాతం ఎగసింది. డోజోన్స్ మాత్రం 3 శాతం క్షీణించింది. టెక్ దిగ్గజాల అండతో 2019లో నాస్డాక్ 31సార్లు రికార్డ్ గరిష్టాలను అందుకోగా.. 2018లోనూ 29సార్లు ఈ ఫీట్‌ను సాధించడం విశేషం! తొలి అమెరికన్ కంపెనీ గురువారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు 2.2 శాతం లాభపడి 473 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్ల డాలర్లను అధిగమించి నిలిచింది. బుధవారం ఇంట్రాడేలో ఈ ఫీట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. వెరసి అమెరికన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో యాపిల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాగా.. ఇతర దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సైతం గురువారం 2.5 శాతం స్థాయిలో ఎగశాయి. దీంతో నాస్‌డాక్‌కు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 6.6 శాతం దూసుకెళ్లింది. 2002 డాలర్ల సమీపంలో నిలిచింది. వెరసి తొలిసారి 2,000 డాలర్ల మార్క్‌ను చేరింది. ఇతర కౌంటర్లలో ట్యాక్సీ సేవల కంపెనీలు ఉబర్ 7 శాతం, లిఫ్ట్ 6 శాతం చొప్పున జంప్‌చేశాయి. -
ఎస్అండ్పీ- నాస్డాక్.. రికార్డ్ రికార్డ్స్
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో అమెరికన్ స్టాక్ ఇండెక్సులు మంగళవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే ఓవైపు డోజోన్స్ నీరసించినప్పటికీ ఎస్అండ్పీ-500, నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తాజాగా ఎస్అండ్పీ 8 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 3,390వద్ద ముగిసింది. తద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 19న 3,386 వద్ద నిలవడం ద్వారా సాధించిన సరికొత్త గరిష్టాన్ని తిరగరాసింది. అంతేకాకుండా మార్చి 23న నమోదైన కనిష్టం నుంచీ ఏకంగా 55 శాతం ర్యాలీ చేసింది! దీంతో గత 87ఏళ్లలో అత్యధిక లాభాలను ఆర్జించిన రికార్డును సైతం ఎస్అండ్పీ సొంతం చేసుకుంది. ఫలితంగా ఫిబ్రవరి- మార్చి మధ్య నెల రోజుల కాలంలోనే బేర్ ట్రెండ్ అంతమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతితక్కువ కాలం నిలిచిన బేర్ మార్కెట్‌గా నమోదైనట్లు తెలియజేశారు. నాస్డాక్ జోరు ఈ ఏడాది జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్డాక్ మంగళవారం 81 పాయింట్లు(0.75 శాతం) ఎగసి 11,211 వద్ద నిలిచింది. వెరసి జూన్ నుంచీ ఇప్పటివరకూ నాస్డాక్ 18సార్లు సరికొత్త గరిష్టాలను నెలకొల్పడం విశేషం! అంతేకాకుండా 2020లో ఇప్పటివరకూ 34సార్లు ఈ ఫీట్ సాధించింది. కాగా.. రిటైల్ దిగ్గజాలు హోమ్ డిపో, వాల్‌మార్ట్ ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ షేర్లు 1 శాతం చొప్పున డీలాపడటంతో డోజోన్స్ 67 పాయింట్లు(0.25 శాతం) నీరసించి 27,778 వద్ద స్థిరపడింది. టెస్లా దూకుడు మంగళవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. అమెజాన్ 4 శాతం జంప్‌చేయగా, గూగుల్ 2.7 శాతం ఎగసింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ 2 శాతం, యాపిల్ 0.8 శాతం, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 2.8 శాతం పెరిగింది. ఆసియా అటూఇటుగా ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌కు సెలవుకాగా.. జపాన్, కొరియా 0.5 శాతం చొప్పున ఎగశాయి. సింగపూర్ నామమాత్ర లాభంతో కదులుతోంది. అయితే తైవాన్, చైనా, థాయ్‌లాండ్, ఇండొనేసియా 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
ఎస్అండ్పీ- నాస్డాక్.. పోటాపోటీ
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో ఎస్అండ్పీ-500 ఇండెక్స్ సైతం చరిత్రాత్మక గరిష్టానికి చేరువైంది. బుధవారం ఇంట్రాడేలో ఈ స్థాయిని అందుకున్నప్పటికీ చివరికి 6 పాయింట్ల దూరంలో నిలిచింది. వెరసి బుధవారం ఎస్అండ్పీ ఇండెక్స్ 45 పాయింట్లు(1.4 శాతం) పెరిగి 3,380 వద్ద ముగిసింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్అండ్పీ 3,386 వద్ద నిలవడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసుకుంది. కాగా.. జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్డాక్ ఇటీవల వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం 229 పాయింట్లు(2.1 శాతం) జంప్‌చేసి 11,012 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంతక్రితం సాధించిన కొత్త రికార్డు 11,108కు చేరువలో ముగిసింది. ఈ బాటలో డోజోన్స్ సైతం 290 పాయింట్లు(1.1 శాతం) లాభపడి 27,977 వద్ద స్థిరపడింది. జోరు తీరిలా బుధవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. దీంతో మార్కెట్లకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనకు ప్రతిపాదించింది. దీంతో ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో టీమొబైల్, షెవ్రాన్ కార్పొరేషన్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే రాయల్ కరిబియన్ 2.5 శాతం, ఉబర్ టెక్నాలజీస్ 1.2 శాతం చొప్పున క్షీణించాయి. ఆసియా ప్లస్‌లో బుధవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 1-2 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. జపాన్, సింగపూర్, కొరియా, థాయ్‌లాండ్, తైవాన్ 2-0.6 శాతం మధ్య ఎగశాయి. హాంకాంగ్ 0.4 శాతం క్షీణించగా.. ఇండొనేసియా స్వల్పంగా బలపడింది. చైనా యథాతథంగా కదులుతోంది. -
ఫాంగ్ స్టాక్స్ వీక్- నాస్డాక్ డౌన్
ఊగిసలాట మధ్య వారాంతాన యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 47 పాయింట్లు(0.2 శాతం) లాభపడి 27,433కు చేరగా.. ఎస్అండ్పీ 2 పాయింట్ల నామమాత్ర వృద్ధితో 3,351 వద్ద ముగిసింది. అయితే నాస్డాక్ 97 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 11,011 వద్ద స్థిరపడింది. వెరసి గురువారం నమోదైన ఆల్‌టైమ్ హై 11,108 నుంచి వెనకడుగు వేసింది. ప్రెసిడెంట్ ట్రంప్.. చైనీస్ యాప్‌లు వియ్‌చాట్, టిక్‌టాక్‌లను నిషేధించే సన్నాహాల నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య వివాదాలు పెరగవచ్చన్న ఆందోళనలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. జులైలో వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు 1.76 మిలియన్లకు చేరినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్‌లో నమోదైన 4.8 మిలియన్లతో పోలిస్తే ఇవి అత్యంత తక్కువే అయినప్పటికీ అంచనాల(1.6 మిలియన్లుకంటే అధికమేనని విశ్లేషకులు తెలియజేశారు. ఫేస్బుక్ అప్ శుక్రవారం ఫాంగ్ స్టాక్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మినహా మిగిలిన కౌంటర్లు బలహీనపడ్డాయి. ఫేస్బుక్ 1.2 శాతం బలపడగా.. ఎంటర్టైన్మెంట్ బ్లూచిప్ నెట్‌ఫ్లిక్స్ 2.8 శాతం క్షీణించింది. ఈ బాటలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 2.3 శాతం, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఈకామర్స్ బ్లూచిప్ అమెజాన్ 1.8 శాతం చొప్పున క్షీణించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న టెస్లా ఇంక్ సైతం 2.5 శాతం వెనకడుగు వేసింది. కాగా.. జులైలో సబ్స్క్రైబర్లు భారీగా పెరిగినట్లు వెల్లడించిన టీమొబైల్ 6.5 శాతం జంప్‌చేసింది. టెన్సెంట్ నేలచూపు వియ్‌చాట్ నుంచి విడివడిన టెన్సెంట్ మ్యూజిక్ 3.3 శాతం నష్టపోగా.. ఇతర చైనీస్ కంపెనీలలో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ 1.9 శాతం, జేడీ.కామ్ 4.1 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
ఫేస్బుక్, యాపిల్ పుష్- 11,000కు నాస్డాక్
ప్రధానంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఐఫోన్ల దిగ్గజం యాపిల్, టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ జోరు చూపడంతో గరువారం నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఎక్స్ఛేంజీల చరిత్రలో తొలిసారి 11,000 పాయింట్ల మార్క్ ఎగువన ముగిసింది. డోజోన్స్ 185 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 27,387కు చేరగా.. ఎస్అండ్పీ 21 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 3,349 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 110 పాయింట్లు(1 శాతం) ఎగసి 11,108 వద్ద స్థిరపడింది. తద్వారా ఆల్‌టైమ్ హై వద్ద నిలిచింది. కాగా.. ఫిబ్రవరిలో నమోదైన రికార్డ్ గరిష్టాలను చేరేందుకు ఎస్అండ్పీ 1 శాతం, డోజోన్స్ 7 శాతం చొప్పున లాభపడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. అంచనాలకంటే తక్కువ ఆగస్ట్ 1తో ముగిసిన వారంలో నిరుద్యోగ క్లెయిములు 1.2 మిలియన్లుగా నమోదైనట్లు యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ తాజాగా పేర్కొంది. కోవిడ్-19 సంక్షోభం తలెత్తాక ఈ గణాంకాలు కనిష్టంకాగా.. విశ్లేషకులు 1.4 మిలియన్ దరఖాస్తులను అంచనా వేశారు. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా తొలుత ఏర్పడిన నష్టాల నుంచి మార్కెట్లు బయటపడి లాభాలతో ముగిసినట్లు తెలియజేశారు. టెక్ అండ గురువారం ఫేస్బుక్ కౌంటర్‌కు డిమాండ్ పెరగడంతో 6.5 శాతం జంప్‌చేసింది. 265 డాలర్లకు ఎగువన నిలిచింది. ఈ బాటలో యాపిల్ ఇంక్ 3.5 శాతం ఎగసి 456 డాలర్ల సమీపంలో స్థిరపడింది. ఇక గూగుల్ 2 శాతం పుంజుకుని 1500 డాలర్లను తాకగా.. మైక్రోసాఫ్ట్ 1.6 శాతం లాభంతో 216 డాలర్లకు చేరింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ సైతం 1.4 శాతం బలపడి 509 డాలర్ల వద్ద ముగిసింది. అమెజాన్ 0.6 శాతం వృద్ధితో 3225 డాలర్ల వద్ద నిలిచింది. ఆసియా డీలా గురువారం యూరోపియన్ మార్కెట్లు 0.6-1.5 శాతం మధ్య డీలా పడ్డాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. హాంకాంగ్, చైనా, ఇండొనేసియా, సింగపూర్, జపాన్, తైవాన్, థాయ్‌లాండ్ 2.25-0.6 శాతం మధ్య క్షీణించాయి. కొరియా 0.15 శాతం నష్టంతో కదులుతోంది. -
ఊరిస్తున్న యూఎస్ స్టాక్స్- ఇన్వెస్ట్ చేస్తారా?
కోవిడ్-19 భయాలతో ఈ ఏడాది మార్చిలో కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల దౌడు తీస్తున్నాయి. దేశీయంగా సెన్సెక్స్ 38,000 పాయింట్ల మైలురాయి అందుకుంది. ఇందుకు ప్రధానంగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) దోహదం చేసింది. అయితే యూఎస్ మార్కెట్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఏప్రిల్ నుంచి నాస్డాక్ పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తోంది. ఈ బాటలో ప్రధాన ఇండెక్సులు డోజోన్స్, ఎస్అండ్పీ సైతం రికార్డ్ గరిష్టాలకు చేరువయ్యాయి. ఇందుకు FANMAG స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లు సహకరిస్తున్న విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం.. యమ స్పీడ్ FANMAG స్టాక్స్‌గా పిలిచే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు ఫేస్బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్.. కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. మార్చి కనిష్టాల నుంచి చూస్తే 128 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే వీటిలో గూగుల్, మైక్రోసాఫ్ట్ 60 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ అయితే 750 శాతం దూసుకెళ్లింది. దీంతో అమెరికా మార్కెట్లు బలపడగా.. ఇదే సమయంలో దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 140 శాతం జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌లను దాటాయి. భారీ విలువ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన FANMAG.. గ్లోబల్ కంపెనీలు కావడంతో వీటి సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.2 ట్రిలియన్ డాలర్లను తాకాయి. ఇక బీఎస్ఈ మొత్తం మార్కెట్ విలువ 2.4 ట్రిలియన్ డాలర్లస్థాయికి చేరింది. అంటే బీఎస్ఈ మార్కెట్ క్యాప్‌తో చూస్తే FANMAG మార్కెట్ విలువ మూడు రెట్లు అధికం. కాగా.. ఇటీవల ఈ స్టాక్స్‌లో వస్తున్న ర్యాలీ కారణంగా పలువురు ఇన్వెస్టర్లు వీటిలో ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇందుకు వీలుగా బ్రోకింగ్ సంస్థలు సైతం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అవకాశాలు ఇలా ప్రస్తుతం సంపన్నులు, మధ్యస్థాయి వర్గాలు అధికంగా యూఎస్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. దీంతో విదేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియ దేశీయంగా ఊపందుకోలేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ పేర్కొన్నారు. చిన్న ఇన్వెస్టర్లు యూఎస్ ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయడం అంత సులభంకాదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ మార్గంలో అంతర్జాతీయ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇందుకు వీలున్నట్లు తెలియజేశారు. పీపీఎఫ్ఏఎస్ దీర్ఘకాలిక ఈక్విటీ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఎస్అండ్పీ-500 ఫండ్ వంటి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. విదేశీ ఈక్విటీలలో అయితే పలు రంగాలు, కంపెనీల ద్వారా భారీ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలున్నప్పటికీ అత్యధిక రిస్కులను ఎదుర్కోవలసి ఉంటుందని విశ్లేషకులు వివరించారు. డాలరు- రూపాయి మారకం విలువ, సామాజిక, రాజకీయ అంశాలు వంటివి ప్రభావం చూపుతుంటాయని తెలియజేశారు. తగినంత రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం భారీ నష్టాలకు దారితీయవచ్చని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లలో కనిపిస్తున్న బుల్‌ట్రెండ్ కారణంగా భారీ ఆటుపోట్లకు వీలున్నట్లు చెబుతున్నారు. -
గూగుల్ పిక్సెల్ 4a @26000!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్ 4a మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ తయారీ ఐఫోన్ SE, చైనీస్ వన్‌ప్లస్ నార్డ్ తదితర మోడళ్లకు పోటీగా గూగుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. నేడు యూఎస్ మార్కెట్లో పిక్సెల్ 4a మోడల్ 4జీ, 5జీ స్మార్ట్ఫోన్లను గూగుల్ ప్రవేశపెట్టనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ధరలు ఇలా పిక్సెల్ 4aను రెండు వేరియంట్లలో గూగుల్ రిలీజ్ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 6జీబీ + 128 జీబీ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరను @349 డాలర్లు(సుమారు రూ. 26,000)గా నిర్ణయించవచ్చని అంచనా. ఇదే విధంగా 6 జీబీ+ 64 జీబీ వెరైటీ ధర 300 డాలర్లు(రూ. 22,400) ఉండవచ్చని ఊహిస్తున్నారు. 5జీ మోడల్‌కు సంబంధించి 499 డాలర్ల ధర(రూ. 37,300)ను అంచనా వేస్తున్నారు. సాంకేతిక వివరాలు 5.8 అంగుళాల తెరను కలిగి ఉండే పిక్సెల్ 4a క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730జీ చిప్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. 3140 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ మోడల్లో 5జీ వేరియంట్‌ను సైతం గూగుల్ విడుదల చేసే అవకాశముంది. ఈ ఫోన్ పంచ్‌హోల్ డిస్ప్లేతో 12.2 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా X52 మోడెమ్ కలిగిన పిక్సెల్ 5నూ గూగుల్ ప్రవేశపెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
ఫాంగ్ స్టాక్స్ పుష్- యూఎస్ మార్కెట్లు ప్లస్
ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు జోరందుకోవడంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. అయితే కోవిడ్-19 విసురుతున్న సవాళ్లనుంచి నిరుద్యోగులకు దన్నునిచ్చేందుకు ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై డెమక్రాట్లు, రిపబ్లికన్లమధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో శుక్రవారం డోజోన్స్ 115 పాయింట్లు(0.5 శాతం) లాభపడి 26,428కు చేరగా.. ఎస్అండ్పీ 25 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,271 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 157 పాయింట్లు(1.5 శాతం) పురోగమించి 10,745 వద్ద స్థిరపడింది. జులైలో జూమ్ జులైలో డోజోన్స్ 2.4 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ 5.5 శాతం ఎగసింది. ఇక నాస్డాక్ మరింత స్పీడుతో దాదాపు 7 శాతం జంప్‌చేసింది. గత వారంలోనే నాస్డాక్ 3.7 శాతం బలపడటం విశేషం! ఫాంగ్ స్టాక్స్ జోరు ఏప్రిల్- జూన్‌లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేరు 10.5 శాతం దూసుకెళ్లింది. 425 డాలర్లను అధిగమించింది. దీంతో కంపనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఒక్క రోజులోనే 172 బిలియన్ డాలర్లు జంప్‌చేసింది. 1.81 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా చమురు దిగ్గజం సౌదీ అరామ్కో(1.76 ట్రిలియన్ డాలర్లు)ను వెనక్కినెట్టింది. ఈ బాటలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 8.2 శాతం జంప్‌చేసి 254 డాలర్ల సమీపంలో నిలిచింది. ఇదే విధంగా అమెజాన్ 3.7 శాతం ఎగసి 3165 డాలర్లకు చేరింది. అయితే ప్రకటనలు పుంజుకున్నప్పటికీ 16 ఏళ్లలో తొలిసారి.. ఒక త్రైమాసికంలో మొత్తం ఆదాయం క్షీణించడంతో అల్ఫాబెట్ షేరు 3.2 శాతం నష్టపోయింది. 1483 డాలర్ల వద్ద ముగిసింది. కాగా.. కేటర్పిల్లర్ 2.8 శాతం క్షీణించి 133 డాలర్లకు చేరగా.. షెవ్రాన్ 2.7 శాతం నష్టంతో 84 డాలర్ల వద్ద నిలిచింది. ఆసియా అటూఇటూ ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో జపాన్ 2 శాతం, చైనా 1 శాతం చొప్పున ఎగశాయి. ఇండొనేసియా దాదాపు 3 శాతం పతనమైంది. ఇతర మార్కెట్లలో సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ 1.4-1 శాతం మధ్య క్షీణించగా.. కొరియా నామమాత్ర నష్టంతో కదులుతోంది. -
అమెజాన్, యాపిల్, ఫేస్బుక్- భల్లేభల్లే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయి. ఫాంగ్(FAANG) కంపెనీలుగా ప్రసిద్ధమైన ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ గురువారం క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించాయి. మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదలకావడంతో ఫ్యూచర్స్‌లో ఈ కౌంటర్లు భారీగా లాభపడ్డాయి. ఫలితాల తీరు, షేర్ల జోరు చూద్దాం.. అమెజాన్ క్యూ2లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 26ఏళ్ల చరిత్రలో అత్యధిక లాభాలు ఆర్జించింది. 5.2 బిలియన్ డాలర్ల నికర లాభం సాధించింది. ఆన్లైన్ అమ్మకాలు, థర్డ్‌పార్టీ మర్చంట్స్ తదితరాలు ఇందుకు సహకరించాయి. దీంతో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 89 బిలియన్ డాలర్లకు చేరింది. లాక్‌డవున్ కారణంగా ఆన్లైన్ విక్రయాలు పెరగడంతో ఇటీవల 1.75 లక్షల మంది సిబ్బందిని నియమించుకున్న కంపెనీ సర్వీసులను మరింత విస్తరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ అమెజాన్ షేరు 60 శాతంపైగా ర్యాలీ చేయడంతో కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. కాగా.. క్యూ3లోనూ అమెజాన్ 87-93 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తుండటం గమనార్హం! యాపిల్ ఇంక్ లాక్‌డవున్‌లోనూ ఐఫోన్ల దిగ్గజం యాపిల్ క్యూ3(ఏప్రిల్-జూన్)లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఐప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్ల విక్రయాలు సైతం పెరగడంతో యాపిల్ షేరు ఫ్యూచర్స్‌లో 6 శాతం జంప్‌చేసింది. ప్రధానంగా ఐఫోన్ల అమ్మకాల ద్వారా 26.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఇది అంచనాలకంటే 4 బిలియన్ డాలర్లు అధికంకావడం గమనార్హం! 399 డాలర్ల విలువగల ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలు ఇందుకు సహకరించింది. వాచీల అమ్మకాలు 17 శాతం జంప్‌చేసి 6.5 బిలియన్ డాలర్లకు చేరాయి. క్యూ2లో మొత్తం ఆదాయం దాదాపు 60 బిలియన్ డాలర్లకు చేరింది. 2.58 డాలర్ల ఈపీఎస్ సాధించింది. యాపిల్ షేరు 400 డాలర్లను అధిగమించడంతో 4:1 నిష్పత్తిలో షేర్ల విభజనను ప్రతిపాదించింది. ఫేస్బుక్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇంక్ క్యూ2లో అంచనాలు మించుతూ 11 శాతం అధికంగా 18.3 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. నికర లాభం 5.2 బిలియన్ డాలర్లుకాగా.. ఈపీఎస్ 1.8 డాలర్లకు ఎగసింది. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2.7 బిలియన్లను తాకింది. దీంతో ఫ్యూచర్స్‌లో ఫేస్బుక్ షేరు 7 శాతం దూసుకెళ్లింది. జులైలో ప్రకటనల ఆదాయం 10 శాతం పుంజుకోవడంతో క్యూ3లోనూ ఇదే విధమైన పనితీరు చూపగలమని కంపెనీ అంచనా వేస్తోంది. -
జీడీపీ 33% డౌన్- యూఎస్ మార్కెట్లు వీక్
మహామాంద్యం(1921) తదుపరి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది రెండో క్వార్టర్లో దాదాపు 33 శాతం క్షీణించింది. ఏప్రిల్-జూన్‌లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డవులతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం ప్రభావం చూపింది. దీంతో గురువారం డోజోన్స్ 226 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 26,314కు చేరగా.. ఎస్అండ్పీ 12 పాయింట్ల(0.4 శాతం) నష్టంతో 3,246 వద్ద ముగిసింది. నాస్డాక్ మాత్రం 45 పాయింట్లు(0.45 శాతం) బలపడి 10,588 వద్ద నిలిచింది. ఫాంగ్ స్టాక్స్ జూమ్ క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో యునైటెడ్ పార్సిల్స్ 14.5 శాతం జంప్‌చేసింది. 2020 పూర్తి ఏడాదికి ఆశావహ అంచనాలు ప్రకటించడంతో తాజాగా చిప్ తయారీ కంపెనీ క్వాల్కామ్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. దీంతో ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్, అమెజాన్ 0.5-1.2 శాతం మధ్య బలపడ్డాయి. దీంతో నాస్డాక్ లాభాలతో ముగిసింది. కాగా.. మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించడంతో ఫ్యూచర్స్‌లో ఫేస్బుక్ 8 శాతం, అమెజాన్ 6 శాతం చొప్పున జంప్‌చేశాయి. అల్ఫాబెట్ సైతం 2 శాతం ఎగసింది. దీంతో నేడు ఈ కౌంటర్లు నాస్‌డాక్‌కు మరోసారి బలాన్ని చేకూర్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆసియా అటూఇటూ జులైలో తయారీ రంగం బలపడటంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా 1.2 శాతం ఎగసింది. జపాన్ దాదాపు 2 శాతం పతనంకాగా.. హాంకాంగ్ నామమాత్ర లాభంతో కదులుతోంది. ఇతర మార్కెట్లలో తైవాన్, కొరియా 0.25 శాతం స్థాయిలో నీరసించాయి. సింగపూర్, థాయ్‌లాండ్, ఇండొనేసియా ప్రారంభంకాలేదు. గురువారం యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 2.3-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. -
ఫెడ్ పుష్- యూఎస్ మార్కెట్లు ప్లస్
అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసిన విధంగానే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0-0.25 శాతం స్థాయిలో కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఫెడ్ పరపతి సమావేశాలు బుధవారం ముగిశాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక రికవరీ కనిపిస్తున్నప్పటికీ కోవిడ్-19కు ముందు పరిస్థితులతో పోలిస్తే బాగా వెనకబడి ఉన్నట్లు ఫెడ్ పేర్కొంది. ఇటీవల తిరిగి కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో నిరుద్యోగిత పెరగడం వంటి పలు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేసింది. అయితే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అన్నిరకాలుగా చేయూతను అందించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ తాజాగా తెలియజేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు రెండేళ్ల కనిష్టానికి చేరింది. 2018 జూన్ తదుపరి 93.17ను తాకింది. లాభాల్లో ఫెడ్ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 160 పాయింట్లు(0.6 శాతం) బలపడి 26,540కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్ల(1.25 శాతం) పుంజుకుని 3,258 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 141 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 10,543 వద్ద నిలిచింది. ప్రధానంగా నేడు క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్, అమెజాన్ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో టెస్లా సైతం 1.5 శాతం లాభపడింది. స్టార్‌బక్స్ ప్లస్ 2020 పూర్తి ఏడాదికి ఆశావహ అంచనాలు ప్రకటించడంతో తాజాగా అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఏఎండీ) కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. వెరసి చిప్ తయారీ దిగ్గజం ఏఎండీ షేరు 12.5 శాతం దూసుకెళ్లింది. కొద్ది రోజులుగా బిజినెస్ పుంజుకుంటున్నట్లు ప్రకటించడంతో కాఫీ చైన్ దిగ్గజం స్టార్‌బక్స్ కార్ప్ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసింది. అయితే రెండు ఇంజిన్ల జెట్ విమానాల ఉత్పత్తిని తగ్గించినట్లు వెల్లడించడంతో బ్లూచిప్ కంపెనీ బోయింగ్ ఇంక్ షేరు 3 శాతం క్షీణించింది. ఆసియా అటూఇటూ ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సింగపూర్ 1.8 శాతం నష్టపోగా.. తైవాన్, హాంకాంగ్ 1.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇతర మార్కెట్లలో కొరియా, ఇండొనేసియా 0.2 శాతం చొప్పున బలపడగా.. థాయ్‌లాండ్ 0.4 శాతం నీరసించింది. జపాన్ స్వల్ప నష్టంతోనూ చైనా నామమాత్ర లాభంతోనూ కదులుతున్నాయి. -
బ్లూచిప్స్ వీక్- యూఎస్ మార్కెట్లు డౌన్
ప్రధానంగా బ్లూచిప్ స్టాక్స్ నష్టపోవడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు నీరసించాయి. డోజోన్స్ 205 పాయింట్లు(0.8 శాతం) బలహీనపడి 26,379కు చేరగా.. ఎస్అండ్పీ 21 పాయింట్ల(0.7 శాతం) వెనకడుగుతో 3,218 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 134 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 10,402 వద్ద నిలిచింది. రెండు రోజులపాటు నిర్వహించిన పాలసీ సమీక్షా నిర్ణయాలను నేడు కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ప్రకటించనుంది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడ్ సరికొత్త ప్యాకేజీపై స్పందించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జూన్‌లో నిరుద్యోగిత పెరగడం, జులైలో వినియోగ విశ్వాస సూచీ డీలాపడటం వంటి అంశాల నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్యాకేజీ ఇలా కోవిడ్-19 ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు దన్నుగా రిపబ్లికన్స్ ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నారు. దీనిలో భాగంగా నిరుద్యోగులకు 1200 డాలర్ల చొప్పున ప్రత్యక్ష చెల్లింపులకు ప్రతిపాదించారు. ఇదే విధంగా చిన్నతరహా బిజినెస్‌లకు రుణాలకింద 60 బిలియన్ డాలర్లు విడుదల చేయాలని సూచించారు. ఈ బాటలో స్కూళ్లకు 100 బిలియన్ డాలర్లు కేటాయించారు. అయితే ప్యాకేజీ అంశంపై రిపబ్లికన్స్, డెమక్రాట్ల మధ్య చర్చలు అంత త్వరగా కొలిక్కివచ్చే అవకాశంలేదని విశ్లేషకులు పెదవి విరుస్తుండటం గమనార్హం! ఫలితాల ఎఫెక్ట్ ఈ బుధ, గురువారాలలో టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్, అల్ఫాబెట్, అమెజాన్, ఫేస్బుక్ క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 4 శాతం పతనంకాగా.. యాపిల్, నెట్‌ఫ్లిక్స్ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. దీంతో నాస్డాక్ నీరసించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. క్యూ2లో ఫలితాలు నిరాశపరచడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం 3ఎం కంపెనీ 5 శాతం పతనంకాగా.. సేమ్ స్టోర్ అమ్మకాలు నీరసించడంతో ఫాస్ట్‌ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కార్ప్ 2.5 శాతం క్షీణించింది. అయితే ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ షేరు 4 శాతం జంప్‌చేసింది. కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో పూర్తిఏడాదికి పటిష్ట గైడెన్స్‌ను ప్రకటించడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
2 రోజుల నష్టాలకు చెక్- మోడర్నా జోరు
ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు జోరందుకోవడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 115 పాయింట్లు(0.4 శాతం) బలపడి 26,585కు చేరగా.. ఎస్అండ్పీ 24 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 3239 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 173 పాయింట్లు(1.7 శాతం) ఎగసి 10,536 వద్ద నిలిచింది. వెరసి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. 600 బిలియన్ డాలర్లు కోవిడ్-19 కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి అండగా రిపబ్లికన్ సెనేట్స్ 600 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి నుంచి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజులపాటు పరపతి సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్యాకేజీలపై దృష్టి సారించినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. హ్యూస్టన్, చెంగ్డూలలో కాన్సులేట్ల మూసివేత ఆదేశాలతో యూఎస్, చైనా మధ్య చెలరేగిన వివాదాలు రెండు రోజులుగా మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. ఫాంగ్ స్టాక్స్ ఈ బుధ, గురువారాలలో టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్, అల్ఫాబెట్, అమెజాన్, ఫేస్బుక్ క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఫాంగ్ స్టాక్స్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా నాస్డాక్ జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న మోడర్నా ఇంక్ తాజాగా ప్రభుత్వం నుంచి 47.2 కోట్ల డాలర్ల ఎయిడ్‌ను అందుకుంది. దీంతో ఈ షేరు 9.2 శాతం దూసుకెళ్లింది. డిసెంబర్‌కల్లా వ్యాక్సిన్ వెలువడవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ బాటలో బయోజెన్ 5 శాతం ఎగసింది. క్యూ2 నిరాశపరచడంతో బొమ్మల తయారీ కంపెనీ హాస్బ్రో 7.4 శాతం, గ్రాసరీస్ కంపెనీ ఆల్బర్ట్సన్స్ 5.4 శాతం చొప్పున పతనమయ్యాయి. అల్భాబెట్ 1.4 శాతం పుంజుకోగా.. తైవాన్ కంపెనీ టీఎస్ఎం షేరు దాదాపు 13 శాతం జంప్‌చేసింది. 7నానోమీటర్ చిప్స్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించడం ఇందుకు దోహదపడింది. ఇతర కౌంటర్లలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా క్రూయిజర్ కంపెనీలు కార్నివాల్, నార్వేజియన్, రాయల్ కరిబియన్ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. -
వారాంతాన యూఎస్ మార్కెట్లు డౌన్
చైనాతో వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీనికితోడు క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో సెంటిమెంటు బలహీనపడింది. దీంతో శుక్రవారం డోజోన్స్ 182 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 26.,470కు చేరగా.. ఎస్అండ్పీ 20 పాయింట్ల(0.6 శాతం)వెనకడుగుతో 3,216 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ సైతం 98 పాయింట్ల(1 శాతం) నష్టంతో 10,363 వద్ద స్థిరపడింది.క్యూ2(ఏప్రిల్-జూన్)లో క్రెడిట్ కార్డ్స్ దిగ్గజం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఆదాయం 29 శాతం క్షీణించింది. మరోపక్క కోవిడ్-19 నేపథ్యంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న 7నానోమీటర్ చిప్స్ ఏడాది ఆలస్యంగా అందుబాటులోకి రానున్నట్లు చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్వెల్లడించింది. వెరసి 2022 చివర్లో లేదా 2023లో మాత్రమే ఈ ఆధునిక చిప్స్‌ను విడుదల చేయగలమని పేర్కొంది. అమెక్స్ డీలా బ్లూచిప్ దిగ్గజాలలో ఇంటెల్ కార్ప్ షేరు 16 శాతంపైగా కుప్పకూలి 50.6 డాలర్ల వద్ద ముగిసింది. ఆధునిక 7నానోమీటర్ చిప్ తయారీని ఆలస్యం చేయనున్నట్లు పేర్కొనడం ప్రభావం చూపింది. దీంతో ప్రత్యర్ధి సంస్థ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఏఎండీ)షేరుకి జోష్ వచ్చింది. 16.5 శాతం దూసుకెళ్లి 69 డాలర్లను తాకింది. మరోపక్క వైర్లెస్ సేవల దిగ్గజం వెరిజాన్ 2 శాతం పుంజుకుని 57 డాలర్లకు చేరింది. ఇక బ్యాంకింగ్ దిగ్గజం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేరు 1.4 శాతం నష్టంతో 95.3 డాలర్ల వద్ద ముగిసింది. ఫాంగ్ స్టాక్స్‌లో ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ 0.5 శాతం చొప్పున నీరసించగా.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. -
టెక్ దిగ్గజాల షాక్- నాస్డాక్ పతనం
టెక్ దిగ్గజాల కౌంటర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో గురువారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రధానంగా ఫాంగ్ స్టాక్స్‌లో అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు.. మైక్రోసాఫ్ట్, టెస్లా పతనంకావడంతో నాస్డాక్ అత్యధికంగా 245 పాయింట్లు(2.3 శాతం) తిరోగమించింది.10,461 వద్ద ముగిసింది. ఈ బాటలో డోజోన్స్ 354 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 26,652కు చేరగా.. ఎస్అండ్పీ 40 పాయింట్ల(1.25 శాతం) వెనకడుగుతో 3,236 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. కారణాలివీ గత వారం నిరుద్యోగ భృతికి దరఖాస్తులు గత నాలుగు నెలల్లోలేని విధంగా 1.416 మిలియన్లకు పెరిగినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. మరోవైపు ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌పై వివిధ రాష్ట్రాలలో వినియోగదారుల పరిరక్షణ అంశాలపై దర్యాప్తు జరగనుందన్న వార్తలు టెక్ కౌంటర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అజ్యూర్ ఒక త్రైమాసికంలో తొలిసారి 50 శాతంకంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక వరుసగా నాలుగో త్రైమాసికంలో లాభాలు ప్రకటించినప్పటికీ షేరు ఇటీవల అనూహ్య ర్యాలీ చేయడంతో టెస్లా ఇంక్ కౌంటర్లో లాభాల స్వీకరణ తలెత్తినట్లు తెలియజేశారు. నేలచూపులో ఎలక్ట్రిక్ కార్ల బ్లూచిప్ కంపెనీ టెస్లా ఇంక్ షేరు 5 శాతం పతనమై 1513 డాలర్లకు చేరగా.. టెక్ దిగ్గజాలలో యాపిల్ 4.6 శాతం వెనకడుగుతో 371 డాలర్లను తాకింది. మైక్రోసాఫ్ట్ 4.6 శాతం పతనమై 203 డాలర్ల దిగువకు చేరగా.. అమెజాన్ 3.7 శాతం నష్టంతో 2987 డాలర్ల దిగువన స్థిరపడింది. ఇతర కౌంటర్లలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ 3.4 శాతం, ఫేస్బుక్ 3 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2.5 శాతం చొప్పున క్షీణించాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో మరిన్ని సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలియజేయడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 3.7 శాతం ఎగసింది. రోజువారీ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడించడంతో ట్విటర్ 4.1 శాతం జంప్‌చేసింది. -
నేడు నష్టాల ఓపెనింగ్! ఆపై కన్సాలిడేషన్?
నేడు (24న) దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 62 పాయింట్లు బలహీనపడి 11,155 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 11,217 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాలు ఊపందుకోవడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 1.3-2.3 శాతం మధ్య క్షీణించాయి. యూరోపియన్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు నిలవగా.. ప్రస్తుతం ఆసియాలో అత్యధిక శాతం మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. ఇండొనేసియా, హాంకాంగ్, సింగపూర్, చైనా 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభంకావచ్చని, తదుపరి కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 38,000కు సెన్సెక్స్ ఒక్క రోజు కన్సాలిడేషన్ తదుపరి గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. సమయం గడిచేకొద్దీ బలాన్ని పుంజుకున్నాయి. సెన్సెక్స్ 269 పాయింట్లు జంప్‌చేసి 38,140 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ సైతం 83 పాయింట్ల లాభంతో 11,215 వద్ద నిలిచింది. అయితే వరుసగా రెండో రోజు మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యాయి. దీంతో ఇంట్రాడేలో నిఫ్టీ 11240 వద్ద గరిష్టాన్నీ, 11103 వద్ద కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,133 పాయింట్ల వద్ద, తదుపరి 11,050 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,269 పాయింట్ల వద్ద, ఆపై 11,323 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,838 పాయింట్ల వద్ద, తదుపరి 22,593వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,226 పాయింట్ల వద్ద, తదుపరి 23,368 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1740 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
2020లో వారెన్ బఫెట్ సంపదకు చిల్లు
కోవిడ్-19 ప్రపంచ దేశాలను.. ప్రధానంగా అమెరికాను సునామీలా చుట్టుమడుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు రోజురోజుకీ బలపడుతున్నాయి. యూఎస్ ఇండెక్సులలో నాస్డాక్ ఈ ఏడాది(2020) పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంది. ఇందుకు ప్రధానంగా ఫాంగ్(FAANG) స్టాక్స్ సహకరించాయి. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజం ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మాత్రం వెనకడుగులో ఉంది. ఈ ఏడాది బెర్క్‌షైర్ షేరు 16 శాతం తిరోగమించింది. ఫలితంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ బెర్క్‌షైర్ హాథవే మార్కెట్ క్యాపిటలైజేషన్లో 90 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ 460 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇదే సమయంలో ఫాంగ్ స్టాక్స్‌గా ప్రసిద్ధమైన అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌తోపాటు ఇటీవల ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. కారణాలేవిటంటే? 2020లో ఇప్పటివరకూ అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, గూగుల్.. విడిగా 560-100 బిలియన్ డాలర్ల మధ్య మార్కెట్ క్యాపిటలైజేషన్ను జమ చేసుకున్నాయి. ఇదే కాలంలో బెర్క్‌షైర్ హాథవే 90 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఇందుకు ప్రధానంగా బెర్క్‌షైర్ హాథవే పోర్ట్‌ఫోలియోలోని నాలుగు దిగ్గజ కంపెనీల వెనకడుగు కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బెర్క్‌షైర్ పోర్ట్‌ఫోలియోలో బ్యాంకింగ్ దిగ్గజాలు జేపీ మోర్గాన్, వెల్స్‌ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికాతోపాటు.. ఇంధన రంగ దిగ్గజం ఎగ్జాన్ మొబిల్కు ప్రాధాన్యత ఉంది. ఈ నాలుగు కంపెనీల షేర్లు సైతం ఇటీవల నీరసించడంతో వీటి మార్కెట్ విలువలోనూ 110-140 బిలియన్ డాలర్ల మధ్య ఆవిరైంది. ఇది బెర్క్‌షైర్ హాథవే మార్కెట్ క్యాప్‌ను దెబ్బతీసినట్లు నిపుణులు విశ్లేషించారు. -
వ్యాక్సిన్లపై ఆశలు- నాస్డాక్ రికార్డ్
ఓవైపు దేశంలోని 50 రాష్ట్రాలకుగాను 42 రాష్ట్రాలకు కరోనా వైరస్ విస్తరించినప్పటికీ మరోపక్క వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఫార్మా దిగ్గజాల ముందడుగు సెంటిమెంటుకు బలాన్నిస్తోంది. దీంతో సోమవారం ఆటుపోట్ల మధ్య యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డోజోన్స్ నామమాత్రంగా 9 పాయింట్లు బలపడి 26,681 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 27 పాయింట్లు(0.9 శాతం) ఎగసి 3,252 వద్ద స్థిరపడింది. నాస్డాక్ మరింత అధికంగా 264 పాయింట్లు(2.5 శాతం) జంప్‌చేసి 10,767 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇందుకు ప్రధానంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహకరించాయి. అయితే వారాంతానికి కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1.4 లక్షలను దాటడం ఆందోళనలను పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఆస్ట్రాజెనెకా, కాన్సినో బయోలాజిక్స్, ఫైజర్- బయోఎన్‌టెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు విజయవంతమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రయోగాలలో వ్యాక్సిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు డేటా పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే ఇటీవల జోరు చూపుతున్న ఫార్మా షేరు మోడర్నా ఇంక్ కౌంటర్లో లాభాల స్వీకరణ తలెత్తినట్లు తెలియజేశారు. దీంతో సోమవారం ఈ షేరు 13 శాతం కుప్పకూలింది. 83 డాలర్ల దిగువకు చేరింది. ఇందుకు వ్యాక్సిన్ల అభివృద్ధిలో ప్రత్యర్థి సంస్థలు ముందడుగు వేయడం కూడా ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా ఆస్ట్రాజెనెకా- ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్(AZD1222) క్లినికల్ పరీక్షలలో ఇమ్యూనిటీని పెంచుతున్నట్లు తాజాగా వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్రిటిష్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ వినియోగంలో ఇతర సమస్యలు పెద్దగా తలెత్తకపోవడం గమనార్హం! ఐబీఎం అప్ బ్లూచిప్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం అమెజాన్ 8 శాతం దూసుకెళ్లి 3197 డాలర్లను తాకగా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 4.3 శాతం జంప్‌చేసి 212 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఫలితాలు ఆకట్టుకోవడంతో ఐబీఎం 5 శాతం పుంజుకోగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 9.5 శాతం ఎగసింది. 1643 డాలర్ల వద్ద ముగిసింది. వెరసి మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇతర కౌంటర్లలో చమురు దిగ్గజం షెవ్రాన్ 5 బిలియన్ డాలర్లకు కంపెనీని కొనుగోలు చేయనున్న వార్తలతో నోబుల్ ఎనర్జీ 5.4 శాతం జంప్‌చేసింది. అయితే షెవ్రాన్ 2.2 శాతం క్షీణించింది. సానుకూల క్యూ2 ఫలితాలతో హాలిబర్టన్ 2.5 శాతం బలపడింది. ఆసియా ఇలా కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈసీబీ 650 బిలియన్ యూరోల ప్యాకేజీపై అంచనాలతో సోమవారం జర్మనీ 1 శాతం పుంజుకోగా.. ఫ్రాన్స్ 0.5 శాతం లాభపడింది. అయితే యూకే 0.5 శాతం నీరసించింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు జోష్‌తో కదులుతున్నాయి. తైవాన్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, ఇండొనేసియా, జపాన్ 2-1 శాతం మధ్య ఎగశాయి. సింగపూర్ 0.3 శాతం బలపడగా.. చైనా యథాతథంగా కదులుతోంది. -
మోడర్నా వహ్వా.. నెట్‌ఫ్లిక్స్ బేర్
వారాంతాన యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 63 పాయింట్లు(0.25 శాతం) క్షీణించి 26,672 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 9 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 3,225 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 29 పాయింట్లు(0.3 శాతం) బలపడి 10,503 వద్ద స్థిరపడింది. దీంతో గత వారం డోజోన్స్ నికరంగా 2.3 శాతం ఎగసింది. ఇందుకు ప్రధానంగా ఫైజర్, మోడర్నా ఇంక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు చూపడం దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో ఎస్అండ్పీ 1.3 శాతం లాభపడగా.. నాస్డాక్ 1.1 శాతం నీరసించింది. కాగా.. టెక్నాలజీ దిగ్గజాల అండతో ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్డాక్ 17 శాతం ర్యాలీ చేయగా.. ఎస్అండ్పీ దాదాపు యథాతథంగా నిలిచింది. డోజోన్స్ మాత్రం 6 శాతం క్షీణించింది. శుక్రవారం యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాన్స్ 0.3 శాతం డీలాపడగా.. యూకే, జర్మనీ అదే స్థాయిలో బలపడ్డాయి. బ్లూచిప్స్ తీరిలా ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో కొత్త పెయిడ్ కస్టమర్లు భారీగా తగ్గనున్న అంచనాలతో ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు 6.5 శాతం పతనమైంది. 493 డాలర్ల వద్ద ముగిసింది. మరోపక్క కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ షేరు 16 శాతం దూసుకెళ్లింది. వెరసి 95 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మోడర్నా షేరు 370 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇతర దేశాల దన్ను కోవిడ్-19 కట్టడికి ఫైజర్‌తో జత కట్టి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై చైనీస్ ఫోజన్ ఫార్మా పరీక్షలు చేపట్టేందుకు లైసెన్సింగ్‌ను పొందిన వార్తలతో బయోఎన్‌టెక్ షేరుకి హుషారొచ్చింది. మరోవైపు యూనియన్ యూనియన్‌లో వ్యాక్సిన్ సరఫరా కోసం ఆస్ట్రాజెనెకాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బయోఎన్‌టెక్ షేరు శుక్రవారం 12 శాతం జంప్‌చేసింది. 85 డాలర్లను అధిగమించింది. ఇక ఇండెక్స్ దిగ్గజాలలో కోకకోలా, ఇంటెల్, ఫైజర్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్, షెవ్రాన్, ఎక్సాన్ మొబిల్, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై అంచనాలతో గత వారం ఫైజర్ ఇంక్ నికరంగా 7 శాతం లాభపడింది. -
యూఎస్ మార్కెట్లకు బ్యాంకింగ్ దన్ను
బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ సాధించిన పటిష్ట ఫలితాలకుతోడు.. మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడంలో సఫలమవుతున్నట్లు వెలువడిన వార్తలు వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో బుధవారం డోజోన్స్ 228 పాయింట్లు(0.,9 శాతం) పుంజుకుని 26,870 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 29 పాయింట్లు(0.9 శాతం) బలపడి 3,227 వద్ద నిలవగా.. నాస్డాక్ 62 పాయింట్లు(0.6 శాతం) లాభపడి 10,550 వద్ద స్థిరపడింది.వెరసి మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో నిలిచాయి. అంతకుముందు 750 బిలియన్ యూరోల కోవిడ్ రికవరీ ఫండ్‌పై ఆశలతో యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 2 శాతం స్థాయిలో ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, కొరియా, తైవాన్ 1.4-0.5 శాతం మధ్య క్షీణించగా.. థాయ్‌లాండ్, ఇండొనేసియా 0.3 స్థాయిలో బలపడ్డాయి. బ్యాంకింగ్ జోరు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు వెల్లడించడంతో మోడర్నా ఇంక్ షేరు తాజాగా 7 శాతం జంప్‌చేసింది. మంగళవారం సైతం ఈ షేరు 18 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే.క్యూ2లో మొత్తం ఆదాయం రెట్టింపునకు పెరగడంతో బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ 1.5 శాతం బలపడింది. ఈ ప్రభావంతో నేడు ఫలితాలు ప్రకటించనున్న మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా 2 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా.. ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ వెనకడుగు వేయడంతో నాస్డాక్ లాభాలు పరిమితమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రావెల్ జోరు వ్యాక్సిన్ ఆశలకుతోడు లాక్‌డవుల ఎత్తివేత నేపథ్యంలో ఈ నెల నుంచి బిజినెస్ యాక్టివిటీ పుంజుకుంటున్నట్లు ఫెడరల్ రిజర్వ్ బీజ్బుక్ సర్వే అభిప్రాయపడటంతో టూరిజం, ట్రావెల్ సంబంధ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. కార్నివాల్ కార్ప్, రాయల్ కరిబియన్ క్రూయిజెస్, మారియట్ ఇంటర్నేషనల్, విన్ రిసార్ట్స్ 7-21 శాతం మధ్య దూసుకెళ్లాయి. -
యూఎస్‌కు మోడర్నా వ్యాక్సిన్ బూస్ట్
ప్రధానంగా ఇంధన, మెటీరియల్స్ రంగాలు బలపడటంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు జంప్‌చేశాయి. మరోపక్క.. అనారోగ్య సమస్యలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి హెల్త్‌కేర్ దిగ్గజం మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడంలో సఫలమవుతున్నట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో డోజోన్స్ 557 పాయింట్లు(2.15 శాతం) జంప్‌చేసి 26,643 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 42 పాయింట్లు(1.35 శాతం) పుంజుకుని 3,198 వద్ద నిలవగా.. నాస్డాక్ 58 పాయింట్లు(1 శాతం) ఎగసి 10,489 వద్ద స్థిరపడింది. అయితే అలబామా, ఫ్లోరిడా, నార్త్‌కరోలినా తదితర రాష్ట్రాలలో కొత్త కేసులు భారీగా పెరిగినట్లు వెలువడిన వార్తల కారణంగా మార్కెట్లు పలుమార్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఫార్మా ప్లస్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో ఇమ్యూనిటీని పెంచుతున్నట్లు వెల్లడించడంతో మోడర్నా ఇంక్ షేరు 18 శాతం దూసుకెళ్లింది. ఈ ప్రభావంతో రీజనరాన్ 4 శాతం, జాన్సన్ అండ్ జాన్సన్ 2 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ రికార్డ్ స్థాయిలో దాదాపు 34 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించినప్పటికీ నికర లాభం సగానికి తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. దీంతో షేరు యథాతథంగా నిలిచింది. అయితే 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి ఒక త్రైమాసికంలో 2.4 బిలియన్ డాలర్ల నష్టం ప్రకటించడంతోపాటు.. డివిడెండ్‌లో 80 శాతం కోతపెట్టడంతో వెల్స్‌ఫార్గో 5 శాతం పతనమైంది. ఇక పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ సిటీగ్రూప్ 4 శాతం తిరోగమించింది. బ్లూచిప్స్ అండ గత 8ఏళ్లలోలేని విధంగా జూన్‌లో రిటైల్ ధరలు పుంజుకున్న వార్తలతో వాల్‌మార్ట్ 2 శాతం, కాస్ట్కో 1.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో కేటర్పిల్లర్ 5 శాతం జంప్‌చేయగా.. ఎగ్జాన్ మొబిల్ 3 శాతం, బోయింగ్ 2.5 శాతం చొప్పున ఎగశాయి. మాస్టర్‌కార్డ్ 3 శాతం పుంజుకుంది. దీంతో డోజోన్స్ జోరందుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 0.6 శాతం లాభపడగా.. అమెజాన్ ఇదే స్థాయిలో డీలా పడింది. ఆసియా ఓకే ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో జపాన్, సింగపూర్, కొరియా, థాయ్‌లాండ్, తైవాన్, ఇండొనేసియా 1.3-0.3 శాతం మధ్య లాభపడగా.. చైనా 1.4 శాతం, హాంకాంగ్ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. -
నాస్‌డాక్‌కు ఫాంగ్ స్టాక్స్ దెబ్బ
జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ మరింత ముందంజ వేసిన వార్తలతో తొలుత జోరందుకున్న డోజోన్స్ చివర్లో అమ్మకాలు పెరిగి నీరసించింది. నేడు బ్యాంకింగ్ దిగ్గజాలు క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో తొలుత 500 పాయింట్లు జంప్‌చేసిన డోజోన్స్ లాభాల స్వీకరణ కారణంగా చివరికి 10 పాయింట్ల నామమాత్ర లాభంతో 26,086 వద్ద నిలిచింది. మరోవైపు టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్, ఎస్‌అండ్‌పీకి దెబ్బతగిలింది. వెరసి సోమవారం నాస్డాక్ 227 పాయింట్లు(2.15 శాతం) పతనమై 10,391 వద్ద స్థిరపడగా.. ఎస్అండ్పీ 30 పాయింట్లు(1 శాతం) నీరసించి 3,155 వద్ద ముగిసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతండటంతో కాలిఫోర్నియా గవర్నర్ తిరిగి లాక్‌డవున్ నిబంధనలను కఠినతరం చేసిన వార్తలతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫార్మా దన్ను కరోనా వైరస్ కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ఫాస్ట్‌ట్రాక్ హోదాను ప్రకటించడంతో ఈ నెలాఖరున తదుపరి దశ పరీక్షలను చేపట్టనున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్ పేర్కొన్నాయి. దీంతో బయోఎన్‌టెక్ షేరు 10 శాతం దూసుకెళ్గగా.. ఫైజర్ 4 శాతం జంప్‌చేసింది. చిప్ తయారీ కంపెనీ అనలాగ్ డివైసెస్ మాగ్జిమ్ ఇంటిగ్రేటెడ్ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అనలాగ్ 6 శాతం పతనంకాగా.. మాగ్జిమ్ 8 శాతం ఎగసింది. సాల్టీ స్నాక్స్ ఫ్రిటోస్, చీటోస్ అమ్మకాలు పెరుగుతున్నట్లు పేర్కొనడంతో పెప్సీకో 0.3 శాతం బలపడింది. నేలచూపులో ఫాంగ్ స్టాక్స్‌లో నెట్‌ఫ్లిక్స్ 4.25 శాతం పతనంకాగా.. ఫేస్బుక్ 2.5 శాతం క్షీణించింది. అల్ఫాబెట్ దాదాపు 2 శాతం బలహీనపడింది. ఇక మైక్రోసాఫ్ట్ 3 శాతం తిరోగమించింది. కాగా.. తొలుత 16 శాతం దూసుకెళ్లిన ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు చివరికి 3 శాతం నష్టంతో ముగిసింది. -
వైరస్‌కు చెక్!- బ్యాంకింగ్ భేష్
ప్రధానంగా బ్యాంకింగ్ రంగ కౌంటర్లు లాభాల దుమ్ము రేపడంతో శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్లకు బలమొచ్చింది. మరోపక్క ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ రూపొందిస్తున్న ఔషధం మరింత ప్రభావం చూపుతున్నట్లు వెలువడిన వార్తలు కరోనా వైరస్ కట్టడికి సహకరించగలవన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా వారాంతాన డోజోన్స్ 369 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 26,075 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 33 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3,185 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 70 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 10,617 వద్ద స్థిరపడింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో నాస్డాక్ ఆరుసార్లు సరికొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం! వెరసి గత వారం డోజోన్స్ 1 శాతం, ఎస్అండ్పీ దాదాపు 2 చొప్పున బలపడగా.. నాస్డాక్ మరింత అధికంగా 4 శాతం జంప్‌చేసింది. 1500 డాలర్లకు గత నెలలో కార్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ జోరు కొనసాగుతోంది. వారాంతాన 7 శాతం జంప్‌చేసి 1503 డాలర్ల వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి 1500 డాలర్ల మార్క్‌ను తాకింది. ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ టెస్లా షేరు 259 శాతం ర్యాలీ చేయగా.. ఈ నెలలోనే 39 శాతం లాభపడటం విశేషం! ఇక వచ్చే వారం క్యూ2 ఫలితాలు విడుదల చేయనున్న బ్యాంకింగ్ దిగ్గజాలు సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్ 6.5-5.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో గోల్డ్‌మన్ శాక్స్ టార్గెట్ ధరను పెంచడంతో నెట్‌ఫ్లిక్స్ 8 శాతం దూసుకెళ్లింది. దశలవారీగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించడంతో క్రూయిజ్‌ల కంపెనీ కార్నివాల్ కార్ప్ దాదాపు 11 శాతం పురోగమించింది. ఈ బాటలో యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్లు సైతం 5.5 శాతం చొప్పున ఎగశాయి. ఫార్మా ప్లస్ కోవిడ్-19 రోగులపై క్లినికల్ పరీక్షలలో రెమ్‌డెసివిర్ మరింత ప్రభావం చూపుతున్న వార్తలతో గిలియడ్ సైన్సెస్ షేరు 2.2 శాతం లాభపడింది. డిసెంబర్‌కల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ సిద్ధంకావచ్చని వెల్లడించిన నేపథ్యంలో బయోఎన్‌టెక్ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసింది. -
యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారా?
గత కొద్ది నెలలుగా అమెరికా స్టాక్ ఇండెక్సులు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. ప్రధానంగా ఎస్అండ్పీ, నాస్డాక్ జోరు చూపుతున్నాయి. నాస్డాక్ అయితే ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ 20 సార్లకుపైగా చరిత్రాత్మక గరిష్టాలను తాకింది. కోవిడ్-19 సవాళ్లలోనూ అమెరికన్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో కదులుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ఇన్వెస్టర్ల ఫేవరెట్ స్టాక్స్ FAANG కారణమని తెలియజేశారు. FAANG అంటే ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, అల్ఫాబెట్(గూగుల్(G) మాతృ సంస్థ). ఈ కంపెనీల తొలి అక్షరాలతో కలిపి ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వీటికి M అంటే టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జత కలిసింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్, వీడియో యాప్ జూమ్ సైతం ఈ జాబితాలో చేరడంతో మార్కెట్లు రికార్డుల దౌడు తీస్తున్నట్లు వివరించారు. వెరసి ఇటీవల దేశీ ఇన్వెస్టర్లు FAAMNG స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆసక్తి చూపుతున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా తెలియజేసింది. రూ. 6000 కోట్లు యూఎస్ స్టాక్ మార్కెట్లలో దేశీ ఇన్వెస్టర్లు రూ. 6,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా వెల్లడించింది. అయితే ఈ పెట్టుబడుల్లో FAAMNG స్టాక్స్‌దే హవా అని తెలియజేసింది. దేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్కుతోడు మైక్రోసాఫ్ట్, టెస్లా ఇంక్, జూమ్ చోటు చేసుకుంటున్నట్లు పేర్కొంది. కొంతకాలంగా టెక్నాలజీ రంగానికి పెట్టుబడులు భారీగా మళ్లుతున్నాయని, అయితే దేశీయంగా ఇందుకు అవకాశాలు తక్కువేనని వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరామ్ షా వివరించారు. ఇటీవల యూఎస్‌లో ఇన్వెస్ట్‌చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు ఫేస్బుక్, స్టార్‌బక్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లు వారికి సుపరిచితంకావడం కారణమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విద్య, ప్రయాణాలు తదితర అంశాలకు పలువురు భారతీయులు యూఎస్‌పై భారీగా సొమ్ము వెచ్చిస్తున్నట్లు అలంకిత్ లిమిటెడ్ ఎండీ అంకిత్ అగర్వాల్ వివరించారు. గత 10 నెలల్లోనే 10,000 మంది కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించినట్లు తెలియజేశారు. వీటి విలువ 3 కోట్ల డాలర్లు(రూ. 225 కోట్లు)గా వెల్లడించారు. పెట్టుబడులిలా.. అమెరికన్ స్టాక్ మార్కెట్లలో దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టాలంటే రెండు మార్గాలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో ఒకటి అతిసులువైన మ్యూచువల్ ఫండ్స్ రూట్. విదేశాలలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఎంచుకోవడం. మరొకటి స్వేచ్చా రెమిటెన్స్ పథకం(ఎల్ఆర్ఎస్) ద్వారా ఇన్వెస్ట్ చేయడం. అయితే పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్ లేదా ఈటీఎఫ్ ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. -
అమెజాన్ ప్రైమ్‌కు వాల్‌మార్ట్ చెక్!
కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో తలెత్తిన ఆందోళనలకుతోడు.. ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. డోజోన్స్ 397 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,890 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 34 పాయింట్లు(1 శాతం) నీరసించి 3,145 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 90 పాయింట్లు(0.9 శాతం) నష్టంతో 10,344 వద్ద స్థిరపడింది. వెరసి చరిత్రాత్మక గరిష్టం నుంచి నాస్డాక్ వెనకడుగు వేయగా.. ఎస్అండ్పీ ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. యూరోప్ వీక్ మే నెలలో పారిశ్రామికోత్పత్తి 7.8 శాతమే పుంజుకున్నట్లు జర్మన్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విశ్లేషకులు 10 శాతం పురోగతిని అంచనా వేయడంతో మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. ఫలితంగా మంగళవారం యూకే, ఫ్రాన్స్, జర్మనీ 0.6-1.5 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. ప్రస్తుతం ఆసియాలో ఇండొనేసియా, చైనా, తైవాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ 1.4-0.3 శాతం మధ్య బలపడి ట్రేడవుతున్నాయి. ఇతర మార్కెట్లలో జపాన్, కొరియా 0.5-0.25 శాతం చొప్పున డీలాపడగా.. సింగపూర్ యథాతథంగా కదులుతోంది. వాల్‌మార్ట్ జోరు యూఎస్ ప్రభుత్వం కరోనా వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 160 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,000 కోట్లు) కేటాయించడంతో ఫార్మా కంపెనీ నోవావాక్స్ ఇంక్ షేరు దాదాపు 32 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో 4.5 కోట్ల డాలర్లు పొందడంతో రీజనరాన్ ఫార్మా 2.2 శాతం పుంజుకుంది. అమెజాన్ ప్రైమ్ సర్వీస్‌కు పోటీగా మెంబర్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడంతో రిటైల్ రంగ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంక్ 7 శాతం జంప్‌చేసింది. దీంతో అమెజాన్ షేరు 2 శాతం నీరసించింది. ఇండియాలోనూ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ప్రధాన వాటా కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇటీవల రికార్డ్ గరిష్టాలను తాకుతున్న ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు మరో 1.3 శాతం బలపడి 1390 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో 1425 డాలర్లను అధిగమించింది. నేలచూపులో ఇతర బ్లూచిప్స్‌లో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1.2 శాతం నీరసించగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 7 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో కరిబియన్, నార్వేజియన్ క్రూయిజర్ షేర్లు 5 శాతం చొప్పున నష్టపోయాయి. యూఎస్‌లోని ఆరిజోనా, టెక్సాస్ తదితర రాష్ట్రాలతోపాటు ఆస్ట్రేలియా, బ్రిటన్‌లోని మరికొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
ఆరో రోజూ లాభాల ప్రారంభం!
నేడు (8న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,804 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,756 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సరికొత్త గరిష్టాలను తాకుతున్న యూఎస్ మార్కెట్లలో ట్రేడర్లు మంగళవారం లాభాల స్వీకరణకు తెర తీశారు. దీనికితోడు కోవిడ్-19 కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో యూరోప్, యూఎస్ మార్కెట్లు 1.5-1 శాతం మధ్య క్షీణించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఆటుపోట్లను చవిచచూడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలున్నట్లు భావిస్తున్నారు. 5వ రోజూ.. స్వల్ప ఒడిదొడుకుల మధ్య మంగళవారం వరుసగా ఐదో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో చివరికి సెన్సెక్స్ 187 పాయింట్లు జమ చేసుకుని 36,675 వద్ద ముగిసింది. గత 4 రోజుల్లో సెన్సెక్స్ 1572 పాయింట్లు జంప్‌చేసిన విషయం విదితమే. ఇకనిఫ్టీ 36 పాయింట్లు బలపడి 10,800 వద్ద నిలిచింది. కాగా.. సెన్సెక్స్ ఒక దశలో 36,271 వద్ద కనిష్టానికి చేరగా.. 36,723 వద్ద గరిష్టాన్నీ తాకింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,722 పాయింట్ల వద్ద, తదుపరి 10,644 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,846 పాయింట్ల వద్ద, ఆపై 10,892 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,221 పాయింట్ల వద్ద, తదుపరి 21,813 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,855 పాయింట్ల వద్ద, తదుపరి 22,485 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 348 కోట్లు, డీఐఐలు రూ. 263 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
అమెజాన్- టెస్లా- నాస్డాక్ రికార్డ్స్
కరోనా వైరస్ ఉధృతి ఆగనప్పటికీ చైనాసహా అమెరికావరకూ ఆర్థిక వ్యవస్థలు తిరిగి పురోగతి బాట పట్టనున్న అంచనాలు సోమవారం యూరోపియన్, యూఎస్ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 1.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇక యూఎస్ ఇండెక్సులలో డోజోన్స్ 460 పాయింట్లు(1.8 శాతం) ఎగసి 26,287 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 50 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 3,180 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 226 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 10,434 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎస్అండ్పీ వరుసగా ఐదో రోజు లాభపడింది. ఇంతక్రితం గతేడాది డిసెంబర్ 17న మాత్రమే ఎస్అండ్పీ ఈ ఫీట్ సాధించింది. ఇండిపెండెన్స్ డే(4న) సందర్భంగా శుక్రవారం(3న) యూఎస్ మార్కెట్లు పనిచేయని సంగతి తెలిసిందే. కాగా.. గత వారం డోజోన్స్ నికరంగా 3.3 శాతం పుంజుకోగా.. ఎస్అండ్పీ 4 శాతం ఎగసింది. నాస్డాక్ అయితే 4.6 శాతం జంప్‌చేసింది. ఈ ర్యాలీ సోమవారం సైతం కొనసాగడం మార్కెట్లలో నెలకొన్న బుల్లిష్ ధోరణిని సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ దూకుడు అమ్మకాలు ఊపందుకుంటున్న అంచనాలతో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి 3057 డాలర్లకు చేరింది. వెరసి తొలిసారి 3,000 డాలర్ల మార్క్‌ను తొలిసారి అధిగమించింది. దీంతో అమెజాన్ మార్కెట్ క్యాప్(విలువ) 1.5 లక్షల కోట్ల డాలర్లను తాకింది. జూన్‌లో కార్ల విక్రయాలు పెరగడంతో వరుసగా ఐదో రోజు ఆటో రంగ దిగ్గజం టెస్లా ఇంక్ దూకుడు చూపింది. ఏకంగా 13.5 శాతం దూసుకెళ్లింది. 1372 డాలర్ల సమీపంలో ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! ఇతర కౌంటర్లలో బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ 5 శాతం, బోయింగ్ 4 శాతం, ఉబర్ టెక్నాలజీస్ 6 శాతం, వాల్గ్రీన్ బూట్స్ 2.8 శాతం, బెర్క్‌షైర్ హాథవే 2.4 శాతం చొప్పున ఎగశాయి. -
ఉపాధి జోష్- నాస్డాక్ రికార్డ్
గత నెల(జూన్)లో ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. డోజోన్స్ 92 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 25,827 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 14 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 3,130 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 53 పాయింట్లు(0.55 శాతం) పురోగమించి 10,208 వద్ద స్థిరపడింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎస్అండ్పీ వరుసగా నాలుగో రోజు లాభపడింది. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 1.4-2.8 శాతం మధ్య ఎగశాయి. జూన్‌లో 4.8 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగినట్లు కార్మిక శాఖ తాజాగా వెల్లడించింది. విశ్లేషకులు వేసిన అంచనాలకంటే ఇవి 1.8 మిలియన్లు అధికంకావడం గమనార్హం! ఫలితంగా నిరుద్యోగిత 13.3 శాతం నుంచి 11.1 శాతానికి దిగివచ్చింది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. నేడు యూఎస్ మార్కెట్లకు సెలవు. ప్యాకేజీపై అంచనాలు జులై 4 బ్రేక్ తదుపరి ప్రభుత్వం లేదా ఫెడరల్ రిజర్వ్ మరోసారి ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌నిచ్చే చర్యలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 కారణంగా మార్చి- ఏప్రిల్ మధ్య ఏకంగా 22 మిలియన్ల ఉద్యోగాలకు కోత పడటంతో మరోసారి సహాయక ప్యాకేజీలకు వీలున్నట్లు భావిస్తున్నారు. కాగా.. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వచ్చే వారం మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లు చవిచూడవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అండ బ్లూచిప్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్ప్ 0.8 శాతం పుంజుకోవడంతో ఎస్‌అండ్‌పీకి బలమొచ్చింది. కాగా.. విశ్లేషకుల అంచనాలను మించి రెండో క్వార్టర్లో 90,650 వాహనాలను విక్రయించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 8 శాతం జంప్ చేసింది. 1209 డాలర్ల వద్ద ముగిసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఏప్రిల్-జూన్‌లో కార్ల విక్రయాలు 8 శాతం పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. టెస్లా షేరు ఈ ఏడాది 190 శాతం దూసుకెళ్లడం విశేషం! -
1987-1999 తదుపరి బెస్ట్ క్వార్టర్
లాక్‌డవున్‌లకు మంగళం పాడుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటుందన్న అంచనాలు యూఎస్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు ఊపందుకున్నాయి. డోజోన్స్ 217 పాయింట్లు(0.85 శాతం) బలపడి 25,813 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 47 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 3,100 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 185 పాయింట్లు(1.9 శాతం) పురోగమించి 10,059 వద్ద స్థిరపడింది. అయితే ఫ్లోరిడా, కనెక్టికట్ తదితర ప్రాంతాలలో రెండో దశ కరోనా కేసులు తలెత్తుతున్న వార్తలతో ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు మంగళవారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. అటు వైట్‌హౌస్, ఇటు ఫెడరల్ రిజర్వ్ భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 33 ఏళ్ల తరువాత ఈ ఏడాది(2020) రెండోత్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో ఎస్అండ్పీ.. 20 శాతం ర్యాలీ చేసింది. తద్వారా 1998 జూన్ క్వార్టర్ తరువాత భారీగా పురోగమించింది. అయితే 2008 తొలి క్వార్టర్ తదుపరి ఈ జనవరి-మార్చిలో 20 శాతం పతనంకావడం గమనార్హం! ఇక క్యూ2(ఏప్రిల్-జూన్)లో డోజోన్స్ సైతం నికరంగా 18 శాతం ఎగసింది. తద్వారా 1987 తొలి క్వార్టర్ తదుపరి అత్యధిక లాభాలు ఆర్జించింది. 1987లో డోజోన్స్ 21 శాతం పుంజుకుంది. ఈ బాటలో రెండో క్వార్టర్లో నాస్డాక్ 31 శాతం జంప్‌చేసింది. వెరసి 1999 నాలుగో త్రైమాసికం తదుపరి మళ్లీ జోరందుకుంది. 1999లో నాస్డాక్ ఏకంగా 48 శాతం దూసుకెళ్లింది. బోయింగ్ వెనకడుగు 737 మ్యాక్స్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో సోమవారం 15 శాతం దూసుకెళ్లిన బోయింగ్ ఇంక్ తాజాగా 6 శాతం పతనైంది. నార్వేజియన్ ఎయిర్ 97 విమానాల ఆర్డర్‌ను రద్దు చేసుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై నష్టపరిహారం కోరనున్నట్లు బోయింగ్ పేర్కొంది. ఇతర కౌంటర్లలో మైక్రాన్ టెక్నాలజీ 5 శాతం జంప్‌చేసింది. పవర్ నోట్‌బుక్స్, డేటా సెంటర్ల నుంచి చిప్‌లకు డిమాండ్ పెరగడంతో మైక్రాన్‌కు డిమాండ్ పెరిగింది. ఫుడ్ డెలివరీ యాప్ పోస్ట్మేట్స్ను కొనుగోలు చేయనున్న వార్తలతో ఉబర్ షేరు 5 శాతం పెరిగింది.