అధ్యక్షుడు ట్రంప్ సైతం కోవిడ్-19 బారిన పడటంతో వారాంతాన నమోదైన నష్టాలకు చెక్ పెడుతూ సోమవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 466 పాయింట్లు(1.7%) ఎగసి 28,149 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 60 పాయింట్లు(1.8%) బలపడి 3,409 వద్ద ముగిసింది. నాస్‌డాక్ మరింత అధికంగా 257 పాయింట్లు(2.3%) జంప్‌చేసి 11,332 వద్ద స్థిరపడింది. ప్రెసిడెంట్ ట్రంప్ కోలుకోవడంతో తిరిగి ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రంప్ పట్టుబడుతున్న ప్యాకేజీపై ఒప్పందం కుదిరేవీలున్నట్లు వైట్‌హౌస్ చీఫ్ మార్క్ మెడోస్ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
బ్రిస్టల్ మైయర్స్ అప్
యాంటీబాడీలు వృద్ధిచెందేలా అభివృద్ధి చేస్తున్న ఔషధంపై అంచనాలతో హెల్త్‌కేర్ దిగ్గజం రీజనరాన్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. యూరోపియన్ దేశాలలో పనిచేస్తున్న సిబ్బందిలో 11 శాతంవరకూ కోత పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇంధన రంగ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ తొలుత 3 శాతం క్షీణించింది. చివరికి 2.3 శాతం లాభంతో ముగిసింది. కాగా.. హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలో ప్రత్యేకత కలిగిన మోకార్డియాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం బ్రిస్టల్ మైయర్స్ 1 శాతం బలపడింది. అయితే మోకార్డియా ఏకంగా 58 శాతం దూసుకెళ్లింది.
మోడర్నా జోరు
కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధిలో దూకుడు చూపుతున్న మోడర్నా ఇంక్ 4.6 శాతం జంప్‌చేయగా.. ఫైజర్ 1 శాతం, ఆస్ట్రాజెనెకా 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఫాంగ్ స్టాక్స్‌లో యాపిల్ 3 శాతం, మైక్రోసాఫ్ట్, గూగుల్ 2 శాతం చొప్పున ఎగశాయి. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 2.6 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో షెవ్రాన్, బోయింగ్ 2 శాతం చొప్పున బలపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment