
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన టారిఫ్ వార్ ఆర్థిక అనిశ్చితులకు దారి తీయోచ్చనే ఆందోళనలతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 4%, ఎస్‌అండ్‌పీ 2.5%, డోజోన్స్ 1.3% నష్టాలతో ట్రేడయ్యాయి.
టెక్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నాస్‌డాక్ ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా, టెస్లా షేర్లు 2–14% కుప్పకూలాయి.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నవంబర్‌లో టెస్లా షేరు ఆర్జించిన లాభాలన్నీ(50%) తుడిచిపెట్టుకుపోయాయి. టారిఫ్‌ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేదు.

రూపాయి 36 పైసలు డౌన్
రూపాయి విలువ నెలరోజుల్లో అతిపెద్ద పతనం చవిచూసింది. డాలర్ మారకంలో సోమవారం 36 పైసలు క్షీణించి 87.31 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 5 తర్వాత ఒక రోజులో రూపాయికిదే భారీ నష్టం. క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు.
ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?
Comments
Please login to add a commentAdd a comment