వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులతో బలపడ్డాయి. ఎస్‌అండ్‌పీ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3,397 వద్ద నిలవగా.. నాస్‌డాక్ 47 పాయింట్లు(0.45 శాతం) ఎగసి 11,312 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 191 పాయింట్లు(0.7 శాతం) పెరిగి వద్ద స్థిరపడింది. తయారీ, సర్వీసుల రంగాల దన్నుతో జులైలో బిజినెస్ యాక్టివిటీ 2019 ఆగస్ట్ స్థాయిలో పుంజుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క వరుసగా రెండో నెలలోనూ గృహ విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఇళ్ల ధరలు రికార్డ్ స్థాయికి చేరినట్లు రియల్టీ సంస్థలు తెలియజేశాయి. దీంతో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనిపించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించిందని తద్వారా సెంటిమెంటు బలపడిందని నిపుణులు పేర్కొన్నారు.
497 డాలర్లకు యాపిల్
శుక్రవారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు 5 శాతం జంప్‌చేసి 497 డాలర్లకు ఎగువన ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 2.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డుకాగా.. ఇతర టెక్ దిగ్గజాలు మైక్రొసాఫ్ట్, గూగుల్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ డీలా పడ్డాయి. ఇతర కౌంటర్లలో వ్యవసాయ పరికరాల కంపెనీ డీరె అండ్ కంపెనీ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. 200 డాలర్ల సమీపంలో నిలిచింది. 2020 ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు కంపెనీ వేసిన అంచనాలు ఇందుకు సహకరించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2.4 శాతం బలపడింది. 2050 డాలర్ల సమీపంలో ముగిసింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 382 బిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.
ఆసియా లాభాల్లో
యూఎస్ మార్కెట్ల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. హాంకాంగ్, కొరియా, జపాన్, తైవాన్, సింగపూర్, థాయ్‌లాండ్ 1.5-0.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర మార్కెట్లలో చైనా, ఇండోనేసియా స్వల్ప లాభాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment