సాక్షి,ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా క్లామ్‌షెల్ డిజైన్‌తో కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 2780 ఫ్లిప్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. క్వాల్కం పప్రాసెసర్, ఎఫ్‌ఎం రేడియో, వాట్సాప్,వైఫై సపోర్ట్‌తో, ఎరుపు, నీలం రెండు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది.
ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లలో అందుబాటులో ఉన్న నోకియా 2780 ఫ్లిప్ ఇతర మార్కెట్‌లలో అందుబాటులో ఉంటుందా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక ధర విషయానికి వస్తే అమెరికాలో దీని ధర డాలర్లు. 89.99. ఇండియాలో సుమారు రూ. 7,400గా ఉండొచ్చని అంచనా. కాగా ఎంట్రీ-లెవల్ వినియోగదారులే లక్ష్యంగా బడ్జెట్‌ధరల్లో ఈ సిరీస్‌లో నోకియా 2660 ఫ్లిప్, నోకియా 2760లను గతంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
నోకియా 2780 ప్లిప్ స్పెసిఫికేషన్స్
1.77 అంగుళాల TFT స్క్రీన్
2.7అంగుళాల TFT స్క్రీన్
క్వాల్కం 215 చిప్ సెట్ క్వాడ్ కోర్ సీపీయూ
T9 కీబోర్డ్ డిజైన్
5 ఎంపీ రియర్ కెమెరా విత్ ఫిక్స్‌డ్ ఫోకస్, LED ఫ్లాష్
4జీబీ ర్యామ్, 512 ఎంబీ స్టోరేజ్
1450 ఎంఏహెచ్ రిమూవల్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment