నీ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గించే కొత్త ఇంజెక్షన్ | Once your replacement operation The new injection to reduce pain | Sakshi
Sakshi News home page

నీ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గించే కొత్త ఇంజెక్షన్

Published Fri, Aug 21 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

Once your replacement operation   The new injection to reduce pain

కొత్త పరిశోధన
 
ఒక వయసు దాటాక మోకాలి కీలు అరిగిపోతే మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) చేయించుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దాంతో శస్త్రచికిత్స తర్వాత మోకాలిలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు పరిశోధకులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత వచ్చే నొప్పిని (పోస్ట్ ఆపరేటివ్ పెయిన్) తగ్గించడానికి ‘లైపోజోమల్ బ్యుపివెకెయిన్’ అనే మోకాలి చుట్టూ ఉండే కండరాలు, నరాలను మొద్దుబార్చే ఇంజెక్షన్‌ను యాంటీబయాటిక్‌తో పాటు మరికొన్ని ఇంజెక్షన్ల  కాక్‌టెయిల్‌ను ఇవ్వడం బాగా ఉపయోగపడుతుందని సర్జన్లు పేర్కొంటున్నారు.


 ఇటీవల అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హిప్ అండ్ నీ సర్జన్స్ వార్షిక సమావేశంలో ఈ అంశాన్ని ఆర్థోపెడిక్ సర్జన్లు నిర్ధారణ చేశారు. ఈ అధ్యయనం కోసం 216 మంది పేషెంట్లను ఎంపిక చేశారు. వారిలో సగం మందికి సంప్రదాయ నొప్పి నివారణ మందులను ఇచ్చారు. ఇక మరో సగం మందికి పైన పేర్కొన ‘లైపోజోమల్ బ్యుపివెకెయిన్ అనే ఇంజెక్షన్‌తో పాటు మరికొన్ని ఇంజెక్షన్ల కాక్‌టెయిల్ ఇవ్వడం వల్ల శస్త్రచికిత్స అనంతరం వచ్చే నొప్పి (పోస్ట్ ఆపరేటివ్ పెయిన్) గణనీయంగా తగ్గినట్లు తేలింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement