భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులపై ప్రజల్లో గౌరవం పెరిగింది. ప్రత్యక్ష దైవంగా వారిని భావించారు. అలాంటి భావనను కొందరు వైద్యులు తమ నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. విధులపై నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే గార్డుతో ఇంజెక‌్షన్ ఇప్పించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు
అంగుల్‌లోని జిల్లా ఆస్పత్రికి మంగళవారం ప్రమాదంలో గాయపడిన వ్యక్తితో పాటు అతడి బంధువులు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు ఎవరూ లేరు. దీంతో సెక్యూరిటీ గార్డే వైద్యం చేశారు. క్షతగాత్రుడికి ఇంజెక‌్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి బంధువులు సెల్‌ఫోన్‌లో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పరిణామంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ప్రభుత్వం స్పందించింది. ‘ఆ రోజు ఆస్పత్రిలో ఇన్‌చార్జ్ ఎవరో తెలుసుకుంటున్నాం. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. విచారణ అనంతరం కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ తెలిపారు.
చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు
Comments
Please login to add a commentAdd a comment