Angul district
-
పట్టాలు తప్పిన గూడ్సు
భువనేశ్వర్: ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని అంగుల్–తాల్చేరు సెక్షన్‌లోని 167/1–2 కిలోమీటరు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి 2.35 గంటలకు గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఫిరోజ్‌పూర్ నుంచి ఖుర్దారోడ్డుకు గోధుమలు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరిగ్గా వంతెనపై జరిగిన ఈ దుర్ఘటనలో 9 వ్యాగన్లు పలీ్టకొట్టి ఒకదానిపై మరొకటి పేరుకుపోగా, ఇంజిన్ పట్టాలపైనే ఉండటంతో లోకో పైలట్, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఢెంకనాల్–సంబల్పూర్ సెక్షన్ మధ్య రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైల్వే సేవలను పాక్షికంగా రద్దు చేసి, దారి మళ్లించి, నడిపిస్తున్నారు. చురుగ్గా పునరుద్ధరణ పనులు.. ఖుర్దారోడ్డు డివిజన్ డీఆర్ఎమ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలం సందర్శించింది. దుర్ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కారణాలను బృందం పరిశీలిస్తోంది. కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద నీరు ఉధృతికి వంతెన ఇరువైపుల భాగాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సంబల్పూర్ నుంచి క్రేన్‌ని తెప్పించి, వ్యాగన్ల పునరుద్ధరణ చేపడుతున్నారు. ప్రయాణికులకు ఆహారం సరఫరా.. ఈ ప్రమాదం దృష్ట్యా మధ్యలో నిలిచిపోయిన బికనీర్–పూరీ స్పెషల్ రైలు, దుర్గ్–పూరీ స్పెషల్ రైలులోని ప్రయాణికులకు సంబల్పూర్ రైల్వే డివిజన్ కేకులు, బిస్కెట్లు, టీ, తాగునీరు సరఫరా చేసింది. టిట్లాగడ్ రైల్వే స్టేషనులో దుర్గ్–పూరీ స్పెషల్, హతియా–పూరీ స్పెషల్, ఎల్టీటీ– పూరీ స్పెషల్ రైలు ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లను కూడా రైల్వే సరఫరా చేసింది. -
సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులపై ప్రజల్లో గౌరవం పెరిగింది. ప్రత్యక్ష దైవంగా వారిని భావించారు. అలాంటి భావనను కొందరు వైద్యులు తమ నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. విధులపై నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే గార్డుతో ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అంగుల్‌లోని జిల్లా ఆస్పత్రికి మంగళవారం ప్రమాదంలో గాయపడిన వ్యక్తితో పాటు అతడి బంధువులు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు ఎవరూ లేరు. దీంతో సెక్యూరిటీ గార్డే వైద్యం చేశారు. క్షతగాత్రుడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడి బంధువులు సెల్ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పరిణామంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవడంతో ప్రభుత్వం స్పందించింది. ‘ఆ రోజు ఆస్పత్రిలో ఇన్చార్జ్ ఎవరో తెలుసుకుంటున్నాం. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. విచారణ అనంతరం కారకులపై చర్యలు తీసుకుంటాం’ అని అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ తెలిపారు. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై లైంగిక దాడి
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి మహిళా డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగికదాడి చేశాడు. వివరాలు.. అంగూల్ జిల్లాలోని చెండిపద ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కేటాయించిన ప్రభుత్వ కార్వర్ట్స్‌లో తన సోదరుడితో పాటు కలిసి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి అక్కడికి సమీపంలోని దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. దాబాలో భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సోదరి కోసం ఫుడ్ పార్శిల్ పంపాడు. దీంతో దాబా యజమాని కుమారుడు.. సుకంత బెహరా రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నఆమెపై బెహరా అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై మహిళా డాక్టర్, ఆమె సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెహరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: గూడూరులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం -
ప్రయివేట్ బస్సు బోల్తా, 30 మంది మృతి
భువనేశ్వర్: ఒడిశాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్గూల్ జిల్లా ఆత్మలిక్ వద్ద ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. 15మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు. కాగా 50మంది ప్రయాణికులతో బస్సు భౌద్ జిల్లా నుంచి ఆత్మలిక్కు వెళుతుండగా ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ సెల్‌ఫోన్ లో మాట్లాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అన్గూల్ జిల్లా ఎస్పీ కవిత జలాన్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.