కరోనాకు సోరియాసిస్‌ మందు | Psoriasis Injection Cleared For Limited Use To Treat COVID Patients | Sakshi
Sakshi News home page

కరోనాకు సోరియాసిస్‌ మందు

Published Sun, Jul 12 2020 4:32 AM | Last Updated on Sun, Jul 12 2020 8:23 AM

Psoriasis Injection Cleared For Limited Use To Treat COVID Patients - Sakshi

న్యూఢిల్లీ:   చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్‌ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) డాక్టర్‌ వి.జి.సోమానీ పేర్కొన్నారు. ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఒక మోస్తరు నుంచి తీవ్రమైన దశలో ఉన్న బాధితులకు మాత్రమే ఈ సూదిమందును ఆయన సిఫార్సు చేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా ఆధారంగానే ఈ మందును సూచిస్తున్నట్లు తెలిపారు.

ఇటోలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ను బయోకాన్‌ అనే దేశీయ బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అల్జూమాబ్‌ అనే బ్రాండ్‌ నేమ్‌తో విక్రయిస్తోంది. సోరియాసిస్‌ చికిత్సకు 2013 నుంచి ఈ సూదిమందును ఉపయోగిస్తున్నారు. బయోకాన్‌ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల పట్ల డీసీజీఐ సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ఇటోలిజుమాబ్‌ను ఇచ్చేందుకు ఆమోదం తెలియజేసింది. ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సూదిమందు ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇతర ఔషధాలతో పోలిస్తే ఇటోలిజుమాబ్‌ వ్యయం చాలా తక్కువ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement