న్యూ ఢిల్లీ: కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకున్న కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. త్వరలోనే ఈ లిస్టులో చేరేందుకు భారత్ బయోటెక్ చర్యలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. ఇప్పటికే కో వ్యాక్సిన్ పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి పరిచింది. దీన్ని మనుషులపై ప్రయోగించేందుకు అనుమతులు లభించడంతో జూలై నుంచి దేశంలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. (ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వాక్సిన్)
దీన్ని రెండు ఫేజుల్లో చేసుకునేందుకు అనుమతి లభించిన తొలి కంపెనీ భారత్ బయోటెక్ కావడం విశేషం. హైదరాబాద్‌లోని జివోమ్ వ్యాలీలో బయోసేఫ్టీ లెవల్-3తో కలిసి కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి పరిచింది. జూలైలో మానవ ప్రయోగాలు మొదలైనందున ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే కరోనా చికిత్స కోసం గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’తో పాటు మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ ఔషధాలకు డీసీజీఐ అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. (కరోనా మందు! )
Comments
Please login to add a commentAdd a comment