సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకుగాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌కు సంబంధించి కేంద్రం మరో కీలక విషయాన్ని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో టీకా మూడో దశ ప్రయోగాలను 12 సంవత్సరాలకు పైన వయసు పిల్లలపై జరిపేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కోవాక్సిన్ చాలా సురక్షితమైందనీ, బలమైన రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను అందిస్తోందని డీసీజీఐ విజి సోమాని చెప్పారు. (వ్యాక్సిన్ కోసం యాప్: రిజిస్ట్రేషన్ ఎలా అంటే?)
అయితే ఇప్పటివరకు పిల్లల్లో తొలి, రెండో దశ ప్రయోగాలను భారత్ బయోటెక్ పూర్తిచేసింది. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ సురక్షితమని తేలడంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతి సాధించింది. దీంతో 12 ఏళ్ల వయసువారిపై భారత్ బయోటెక్ ప్రయోగాలను చేపట్టనుంది. అయితే, వ్యాక్సిన్ సమర్థత, సురక్షితమని నిర్ధారించే తొలి, రెండు, మూడో దశ ప్రయోగాల తాజా సమాచారాన్ని అందించాలని డీసీజీఐ కోరింది. వ్యాక్సిన్ తొలి, రెండో దశలో 800 మందిపై ప్రయోగించింది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై ప్రారంభించినట్లు డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 22,500 వేల మందికి ప్రయోగించగా సురక్షితంగా తేలిందని సోమానీ తెలిపారు. కాగా భారత్‌బయెటక్ టీకా కుసంబంధించి తన ఫేజ్ 1, 2 ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఇందులో టీకా ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన పిల్లలపై సురక్షితంగా ఉందని తేలింది. దీంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతినిస్తున్నట్లు డీసీజీఐ తాజాగా వెల్లడించింది
Comments
Please login to add a commentAdd a comment