skin infections
-
వర్షాకాలంలో వేధించే చర్మవ్యాధులకు చెక్ పెట్టండి ఇలా..
వర్షాకాలంలో దురదలు ఇన్ఫెక్షన్లుకు ఎందుకొస్తాయని అందరి మదిలో ఎదురై ప్రశ్నే..మరీ ముఖ్యంగా కాలి వేళ్లు, చర్మం మడతలలో దురద, తామర, గజ్జి వంటి వాటితో ఒకరకమైన ఇబ్బంది ఉంటుంది. అందుకు కారణంలో వేడి తేమతో కూడిన పరిస్థితులు. ఈ కాలంలో గాల్లో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. మనం ఈ కాలంలో కురిసే వాన కారణంగా కాళ్లకు వేసుకునే సాక్స్ దగ్గర్నుంచి, వివిధ చెప్పులు తడచిపోవటం లేదా చాల సేపటి వరకు నీటిలో నానిపోయి ఉండటం జరుగుతుంది. పైగా ఈ కాలంలో తడిగా అయిన వస్తువు డ్రైగా ఉండే అవకాశమే తక్కువ. పూర్తి స్తాయిలో ్రడైగా ఉండదు ఆ దుస్తులు లేదా సాక్స్‌లు వేసుకున్నా బ్యాక్టీరియా చేసి ఈ దురద, తామర వంటి ఇన్షెక్షన్లు వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫ్టెక్టులు లేని ఆయుర్వేదంలోని ఈ చిట్కాలు ఫాలోయితో ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దామా!జ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టండి ఇలా.. హైడ్రోకార్టిసోన్ క్రీమ్: ఈ క్రీమ్ తామర, దురద, గజ్జితో సంబంధం ఉన్నవాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలమైన్ ఔషదం: కాలమైన్ లోషన్ చర్మం దురదను ఉపశమనం చేస్తుంది. అలాగే తామర, దురద, గజ్జి వల్ల కలిగే దద్దుర్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. యాంటిహిస్టామైన్లు: బెనాడ్రిల్ వంటి కొన్ని యాంటిహిస్టామైన్లు, తామర, దురద మరియు గజ్జితో సంబంధం ఉన్న దురద నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. టీట్రీఆయిల్: టీ ట్రీ ఆయిల్లో యాంటీమైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి గజ్జి, తామర దురదతో, సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కలబంద: ఇది ఒక అద్భుత మూలిక, ఇది దాదాపు ఏ చర్మ పరిస్థితికైనా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కలబంద ఆకును చూర్ణం చేసి, దానిలోని జెల్‌ను ప్రభావిత ప్రాంతంలో పూయండి. ముందుగా ఆ ప్రాంతాన్ని క్రిమిసంహారక మందుతో కడగాలని నిర్ధారించుకోండి. కొబ్బరి నూనె: దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇది బాక్టీరియా, శిలీంధ్రాల వల్ల కలిగే చర్మ వ్యాధులకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. దాల్చినచెక్క సారాంశాన్ని జోడించడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడంలో మీ చర్మాన్ని వ్యాధి రహితంగా ఉంచడంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లి: తాజా వెల్లుల్లి యొక్క కొన్ని లవంగాలను చూర్ణం చేసి, ఆ పేస్ట్‌ను దురద ఉన్న ప్రదేశంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు రాయండి. వెల్లుల్లిని నమలడం కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. గమనిక: కొందరికి పడకపోవచ్చు అది ఎలా తెలుస్తుందంటే..మీరు వెల్లులి పేస్ట్ చర్మంపై రానివెంటనే ఎర్రగా మారి దురద ఇంకాస్తా ఎక్కువై రక్తం కారేంత బాధగా ఉంటుంది. అలా అనిపిస్తే..ఉపయోగించకండి. వేప, పసుపుల పేస్ట్: కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని, తాజా పసుపు ముక్కను వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని దురద ఉన్న చోట అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుదీనా రసాం: ఇది కూడా బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తుంది. దురదలు దద్దుర్లు నిరోధించడంలో మంచి సహాయకారిగా ఉంటుంది. అలాగే వీటన్నింటి తోపాటు మనం నిత్యం తీసుకునే డైట్ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీపి ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ఎందకంటే ఇవి మీ శరీరంలోని ఈస్ట్ పెరుగుదలను పెంచి ఇన్ఫెక్షన్లను తీవ్రతరం చేస్తాయి. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్!) -
అయ్యో..వైష్ణవీ..ఎంత కష్టం! కడుపు తరుక్కుపోతోంది!
తొలికాన్పులో పుట్టిన మగబిడ్డ సాత్విక్ అల్లారుముద్దుగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో తమ కుమారుడికి బుజ్జి చెల్లాయిని ఇద్దామని కలలుకన్నారు. తమ కలల ప్రతిరూపంగా ఆడబిడ్డ వైష్ణవి ఇంటికి దేవతలా దిగిరావడంతో తమ అదృష్టానికి పొంగిపోయారు. కానీ వైష్ణవి ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాల్సి వస్దుందని అస్సలు అనుకోలేదు. ప్రస్తుతం బిడ్డను వేధిస్తున్న మాయదారి రోగాన్ని తలచుకుని తల్లడిల్లిపోతున్నారు కన్నవాళ్లు. బిడ్డకు సోకిన ఇన్ఫెక్షన్ను తన అజ్ఞానంతో నిర్లక్క్ష్యం చేశా.. లేదంటే తన పాప ఇంత దీనస్థితిలో ఉండేది కాదంటూ కంటికి ధారగా విలపిస్తున్న ఓ తల్లి ఆవేదన ఇది..! వివరాల్లోకి పరిశీలిస్తే.. ఏడాది వయసులోనే వైష్ణవి తీరని బాధతో విలవిల్లాడిపోతోంది. చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ అటు బిడ్డకు, వారి తల్లి దండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నెలల క్రితం, వైష్ణవి కుడికాలుపై చిన్న ఇన్ఫెక్షన్లా వచ్చింది. దాన్ని చూసిన తల్లి ఇవేవో మామూలు దద్దుర్లేలే....అవే పోతాయని అనుకుంది. ఎందుకంటే వైష్ణవి తల్లి, తండ్రి తారక్‌ది గ్రామీణ నేపథ్యం. ఆసుపత్రులు, వైద్యం, జబ్బులు, చికిత్సలపై వారికి పెద్దగా అవగాహన లేదు. ఫలితంగా చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయింది. చివరికి నొప్పితో బాధ పడుతున్న వైష్ణవిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో తల్లిడిల్లిన తారక్ దంపతులు అప్పుచేసి మరి ఆపరేషన్ చేయించినా దురదృష్టం వారిని వెంటాడింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన వెంటనే సర్జరీ జరిగిన ప్రదేశంలో మళ్లీ మరింతగా ఇన్ఫెక్షన్ సోకింది. మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు. పాప పూర్తిగా కోలుకోవాలంటే ఖరీదైన మందులు, చికిత్సఅవసరమని,ఇందుకు దాదాపు రూ. 7 లక్షలు (8762.92 డాలర్లు) అవుతాయని వైద్యులు తేల్చారు. ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం, ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేశారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. ఇక అమ్ముకునేందుకు వారి దగ్గర ఏమీ మిగల్లేదు. అందుకే తన పాపను కాపాడుకునేందుకు దాతలు స్పందించి విరాళాలివ్వాలని ప్రార్థిస్తున్నారు. ‘‘నిండా ఏడాది కూడా నిండకుండానే ఇంత చిన్న వయసులో పాప అనుభవిస్తున్న కష్టం చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. మాటలు రాని వైష్ణవి.. బాధను తట్టుకోలేక ‘మమ్మా...’ అని మూలుగుతోంటే నా ప్రాణాలు పోతున్నంత పని అవుతోంది. తల్లిగా, ఆ బాధను భరించలేక పోతున్నా. మా దగ్గర తాకట్టు పెట్టడానికి ఇక ఏమీ లేదు, మీ ఔదార్యం మాత్రమే మాకు రక్ష. దయచేసి నా చిన్నారి పాప ఆరోగ్యాన్ని కాపాడండి’’ అంటూ నీరు నిండిన కళ్లతో వేడుకుంటోంది తల్లి. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..
This 25 year old Woman wore tight jeans for 8 hours then had to be admitted in ICU: ఈ రోజుల్లో టైట్ జీన్సే.. ఫ్యాషన్ ఐకాన్! ప్రపంచవ్యాప్తంగా కాలేజ్ గర్ల్స్ నుంచి ముసలమ్మలదాకా క్యాజువల్ డ్రెస్సింగ్‌లో జీన్స్ భాగమైపోయింది. ఐతే గంటల తరబడి జీన్స్ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒక మహిళ 8 గంటల పాటు జీన్స్ ధరించినందుకు ఐసీయూలో 4 రోజులపాటు చికిత్స తీసుకున్న అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. నార్త్ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్ మూడేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అప్పడు ప్రియుడి కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ ధరించింది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్‌కు నడుము క్రింద నొప్పి ప్రారంభమైంది. మరుసటి రోజు డాక్టర్ని సంప్రదించడంతో సెప్సిస్, సెల్యులైటీస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది (ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైతే.. రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది). చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! తొలుత ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి మార్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సనందించారు. మరి కొన్ని రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండి వైద్యం చేయించుకుంది కూడా. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని, దాదాపు మృత్యు కుహరం నుంచి బయటికి వచ్చానని తెల్పింది. తను చవిచూసిన చేదు అనుభవాన్ని టిక్ టాక్ ద్వారా తాజాగా పంచుకుంది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది. అందుకే ఇన్ఫెక్షన్లు వస్తాయి.. నిజానికి బిగుతైన దుస్తులు ధరించినప్పుడు చర్మం కోతకు గురై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండే తేమలాంటి పదార్థం (అనోరెక్టల్ అబ్సెస్) పేరుకుపోతుంది. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్గా మారుతుంది. సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. జీన్స్‌తో జర జాగ్రత్త!! చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
కరోనాకు సోరియాసిస్ మందు
న్యూఢిల్లీ: చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) డాక్టర్ వి.జి.సోమానీ పేర్కొన్నారు. ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఒక మోస్తరు నుంచి తీవ్రమైన దశలో ఉన్న బాధితులకు మాత్రమే ఈ సూదిమందును ఆయన సిఫార్సు చేశారు. క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగానే ఈ మందును సూచిస్తున్నట్లు తెలిపారు. ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను బయోకాన్ అనే దేశీయ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అల్జూమాబ్ అనే బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. సోరియాసిస్ చికిత్సకు 2013 నుంచి ఈ సూదిమందును ఉపయోగిస్తున్నారు. బయోకాన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల పట్ల డీసీజీఐ సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ఇటోలిజుమాబ్‌ను ఇచ్చేందుకు ఆమోదం తెలియజేసింది. ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సూదిమందు ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇతర ఔషధాలతో పోలిస్తే ఇటోలిజుమాబ్ వ్యయం చాలా తక్కువ. -
సోరియాసిస్ తగ్గి తీరుతుంది
నా వయసు 42 ఏళ్లు. చర్మంపై ఎర్రటి తెల్లటి పొడలు కనిపిస్తున్నాయి. ఆ పొడల్లో దురదగా కూడా ఉంటోంది. తలలోంచి వెండి పొలుసుల్లా రాలిపోతున్నాయి. డాక్టర్‌కు చూపిస్తే సోరియాసిస్ అని మందులు ఇచ్చారు. కానీ మూడేళ్ల నుంచి వాడుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. నా సమస్య హోమియో వైద్యంతో తగ్గుతుందా? అన్ని ఇతర వ్యాధుల్లాగే సోరియాసిస్ కూడా సాధారణ వ్యాధే. కారణాన్ని తెలుసుకుని హోమియో వైద్యం అందిస్తే సోరియాసిస్‌ను సమూలంగా నయం చేయవచ్చు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మవ్యాధి. ఈ వ్యాధి తగ్గినట్టే తగ్గి... మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఇతర చర్మవ్యాధులతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో చర్మం మీద దురద, ఎర్రటి పొడలు రావడంతో పాటు, వెండి లాంటి తెల్లటి చేపపొలుసుల్లాంటివి కనిపిస్తాయి. ఈ పొలుసుల ఆధారంగానే సోరియాసిస్‌ను నిర్ధారణ చేస్తారు. ఎందుకు వస్తుందంటే : మన చర్మంలో సహజంగా పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తుంటాయి. ఇది సాధారణ కంటికి కనిపించని ప్రక్రియ. ఈ విధంగా పాతకణాలు పోయి కొత్తకణాలు రావడానికి 28 నుంచి 30 రోజులు పడుతుంది. కానీ సోరియాసిస్‌లో ఆటో ఇమ్యూనిటీ కారణంగా చర్మంలోని కొత్త కణాలు త్వరగా రావడం జరుగుతుంది. కొత్త కణాలు 3 నుంచి 6 రోజుల్లోనే వచ్చేసి, పాతకణాలను బయటకు నెట్టేసి చర్మం మీద పొలుసుల మాదిరిగా కనిపించేలా చేస్తాయి. లక్షణాలు : చర్మంపై చిన్నగా లేక పెద్దగా ఎర్రటి పొడలు రావడం, వాటి మీద వెండి లాంటి తెల్లటి పొడలు రావడం జరుగుతుంది. ఈ పొడలు దురదగా ఉండి, గోకిన వెంటనే తెల్లటి పొలుసులు ఊడి బయటకు వస్తాయి. తలలో ఉండే సోరియాసిస్ పలుసులు పెద్దగా ఉండి పెచ్చుల మాదిరిగా కనిపిస్తూ, ఎంతకూ తగ్గకపోవడం జరుగుతుంది. హోమియో చికిత్స : ముందుగా సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణాలను తెలుసుకోవడం జరుగుతుంది. రోగి మానసిక ఒత్తిడి, ఆందోళన మొదలైన కారణాలను తెలుసుకుని, దానికి అనుగుణంగా మందులు ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాల సమస్య కాబట్టి వైద్యుల సూచన మేరకు ఓపికగా మందులు వాడాల్సి ఉంటుంది. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ పైల్స్‌కు శాశ్వత పరిష్కారం ఉంటుందా? నా వయసు 55 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? అమితంగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. వీటిలో తీవ్రతను బట్టి రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. కారణాలు : ►మలబద్దకం ►మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండర బంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ►సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ►స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం ►మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం ►పోషకాహారం తీసుకోకపోవడం ►నీరు తక్కువగా తాగడం ►ఎక్కువగా ప్రయాణాలు చేయడం ►అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ►మానసిక ఒత్తిడి.. వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు : ►నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ►మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ : ►మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ►సమయానికి భోజనం చేయడం ∙ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ►నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ►మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ►మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
చిటపట చినుకుల్లో దాగుడుమూతలు!
రెయిన్టిప్స్ వర్షాలు మొదలు కాగానే ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన’ అంటూ ఆనందంతో గంతులేసే ఆడపిల్లలు.. అదే వర్షానికి తమ అందం విషయంలో భయపడతారట. ఎందుకంటే ఈ కాలంలో వారి సౌందర్యానికి కలిగే అసౌకర్యాలు బోలెడన్ని కాబట్టి. మనసుంటే మార్గం ఉండదా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ఇంట్లో కూర్చొని అద్దంలోంచి కురిసే వానను చూస్తూ ఉండాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా బయటికెళ్లి చిటపట చినుకుల్లో ఆడుకోవచ్చు. అందుకోసం మగువలు ఏం చేయాలో తెలుసా..? ఫేస్‌వాష్ : ఇది లేకుండా ఏ కాలంలో బయటికి వెళ్లినా ప్రమాదమే. ఈ వర్షాకాలంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముఖమంతా తేమతో నిండినట్టు ఉంటుంది. అలాగే రోడ్లపై వెళ్లేటప్పుడు అనేక క్రిముల సంచారం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజంతా బయట తిరిగేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవడం ముఖ్యం. అలా ఉపయోగించే ఫేస్‌వాష్ యాంటీ బ్యాక్టీరియల్ ఫేస్ వాష్ అయ్యేలా చూసుకోవాలి. ఫౌండేషన్ క్రీములే వద్దు: ఈ కాలంలో ఫౌండేషన్ క్రీములు రాసుకుంటే ముఖం జిడ్డుగా మారుతుంది. అందుకని ఫేస్ పౌడర్ మాత్రం రాసుకొని వెళ్తే ముఖం చాలాసేపటి వరకు కాంతిమంతంగా ఉంటుంది. ఎప్పుడూ ఓ చిన్న పౌడర్ బాటిల్‌ను బ్యాగ్‌లో పెట్టుకోండి. మరో విషయం. క్రీములతో వర్షంలో తడిస్తే మొటిమలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. మేలు చేసే గొడుగు: ఉద్యోగాలకు వెళ్లేవారు ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా తమతో ఉంచుకోవాల్సింది గొడుగు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు కాబట్టి రోజూ దాన్ని బ్యాగ్‌లోనే ఉంచుకోవడం మంచిది. ఆ కొనే గొడుగుల్లోనూ ‘నా అంబ్రిల్లానే బ్లూటిఫుల్’ అనుకునేలా రంగుల రంగుల గొడుగులు కొనుక్కుని వరణునితో దాగుడు మూతలాడండి. టిష్యూస్ ఉండాల్సిందే: ముందే చెప్పినట్టు ఈ కాలంలో ముఖంపై తరచూ చెమట పడుతూ ఉంటుంది. హ్యండ్ కర్చీఫ్‌తో కంటే టిష్యూ పేపర్‌తో ముఖాన్ని తుడుచుకుంటే, వాడిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు పడేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఈ ‘యూజ్ అండ్ త్రో కర్చీఫ్స్’ వాడటం చాలా సులభం. -
పాపకు ఒంటిపై పులిపిరుల వంటి కాయలు...?
మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమెకు ముఖంతో పాటు ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి కనిపిస్తున్నాయి. మేం గమనించిన దాని ప్రకారం అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. అవి జీవితాంతం వస్తూనే ఉంటాయని కొందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. - ధరణి, నరసరావుపేట మీరు చెప్పిన కొద్దిపాటి వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు : చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి. మా పాప వయస్సు ఆరేళ్లు. కొన్నాళ్ల క్రితం బాగా జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందని ఆయన చెప్పారు. జలుబు తగ్గిపోయింది గానీ... ఇప్పుడు మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మా పాపకు ఎందుకిలా జరుగుతోంది? - సురేఖ, కొత్తగూడెం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. టాన్సిల్స్‌కు వచ్చినట్లే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. ఇలాంటప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో మాత్రం చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్