1 Year Old Baby Girl Vaishnavi Needs Your Urgent Help for Skin Infection Treatment
Sakshi News home page

అయ్యో..వైష్ణవీ..ఎంత కష్టం! కడుపు తరుక్కుపోతోంది!

Published Mon, Sep 12 2022 4:07 PM | Last Updated on Tue, Sep 20 2022 3:49 PM

Kindly help for my daughter who suffering from skin infection - Sakshi

తొలికాన్పులో పుట్టిన మగబిడ్డ సాత్విక్‌ అల్లారుముద్దుగా ఎదుగుతున్నాడు.  ఈ క్రమంలో తమ కుమారుడికి బుజ్జి చెల్లాయిని ఇద్దామని కలలుకన్నారు. తమ కలల ప్రతిరూపంగా ఆడబిడ్డ వైష్ణవి ఇంటికి దేవతలా దిగిరావడంతో తమ అదృష్టానికి పొంగిపోయారు. కానీ వైష్ణవి  ట్రీట్‌మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాల్సి వస్దుందని అస్సలు అనుకోలేదు. ప్రస్తుతం బిడ్డను వేధిస్తున్న మాయదారి రోగాన్ని తలచుకుని తల్లడిల్లిపోతున్నారు కన్నవాళ్లు. బిడ్డకు సోకిన ఇన్ఫెక్షన్‌ను తన అజ్ఞానంతో నిర్లక్క్ష్యం చేశా.. లేదంటే తన పాప ఇంత దీనస్థితిలో ఉండేది కాదంటూ కంటికి ధారగా  విలపిస్తున్న ఓ తల్లి ఆవేదన ఇది..!

వివరాల్లోకి పరిశీలిస్తే.. ఏడాది వయసులోనే వైష్ణవి తీరని బాధతో విలవిల్లాడిపోతోంది. చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ అటు బిడ్డకు, వారి తల్లి దండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నెలల క్రితం, వైష్ణవి కుడికాలుపై చిన్న ఇన్ఫెక్షన్‌లా వచ్చింది. దాన్ని చూసిన తల్లి  ఇవేవో మామూలు దద్దుర్లేలే....అవే పోతాయని అనుకుంది. ఎందుకంటే వైష్ణవి తల్లి, తండ్రి తారక్‌ది గ్రామీణ నేపథ్యం. ఆసుపత్రులు, వైద్యం, జబ్బులు, చికిత్సలపై వారికి పెద్దగా అవగాహన లేదు.  

ఫలితంగా చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్‌ బాగా ముదిరిపోయింది. చివరికి నొప్పితో బాధ పడుతున్న వైష్ణవిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు  ఆపరేషన్‌ చేయాలని సూచించారు. దీంతో తల్లిడిల్లిన తారక్‌ దంపతులు అప్పుచేసి మరి ఆపరేషన్‌ చేయించినా దురదృష్టం వారిని వెంటాడింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన వెంటనే సర్జరీ జరిగిన ప్రదేశంలో మళ్లీ మరింతగా ఇన్ఫెక్షన్ సోకింది. మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు.  పాప పూర్తిగా కోలుకోవాలంటే ఖరీదైన మందులు, చికిత్సఅవసరమని,ఇందుకు దాదాపు రూ. 7 లక్షలు (8762.92 డాలర్లు) అవుతాయని వైద్యులు తేల్చారు. ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం, ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేశారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. ఇక అమ్ముకునేందుకు వారి దగ్గర ఏమీ మిగల్లేదు. అందుకే తన పాపను కాపాడుకునేందుకు దాతలు స్పందించి విరాళాలివ్వాలని ప్రార్థిస్తున్నారు. 

‘‘నిండా ఏడాది కూడా నిండకుండానే  ఇంత చిన్న వయసులో  పాప అనుభవిస్తున్న కష్టం చూస్తే  నా గుండె  తరుక్కుపోతోంది.  మాటలు రాని వైష్ణవి.. బాధను తట్టుకోలేక ‘మమ్మా...’ అని మూలుగుతోంటే నా ప్రాణాలు పోతున్నంత పని అవుతోంది. తల్లిగా, ఆ బాధను భరించలేక పోతున్నా. మా దగ్గర తాకట్టు పెట్టడానికి ఇక ఏమీ లేదు, మీ ఔదార్యం మాత్రమే మాకు రక్ష. దయచేసి నా చిన్నారి పాప ఆరోగ్యాన్ని కాపాడండి’’ అంటూ నీరు నిండిన కళ్లతో వేడుకుంటోంది తల్లి. (అడ్వర్టోరియల్‌)

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement