రెయిన్‌టిప్స్
వర్షాలు మొదలు కాగానే ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన’ అంటూ ఆనందంతో గంతులేసే ఆడపిల్లలు.. అదే వర్షానికి తమ అందం విషయంలో భయపడతారట. ఎందుకంటే ఈ కాలంలో వారి సౌందర్యానికి కలిగే అసౌకర్యాలు బోలెడన్ని కాబట్టి. మనసుంటే మార్గం ఉండదా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ఇంట్లో కూర్చొని అద్దంలోంచి కురిసే వానను చూస్తూ ఉండాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా బయటికెళ్లి చిటపట చినుకుల్లో ఆడుకోవచ్చు. అందుకోసం మగువలు ఏం చేయాలో తెలుసా..?
ఫేస్‌వాష్ : ఇది లేకుండా ఏ కాలంలో బయటికి వెళ్లినా ప్రమాదమే. ఈ వర్షాకాలంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముఖమంతా తేమతో నిండినట్టు ఉంటుంది. అలాగే రోడ్లపై వెళ్లేటప్పుడు అనేక క్రిముల సంచారం వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజంతా బయట తిరిగేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవడం ముఖ్యం. అలా ఉపయోగించే ఫేస్‌వాష్ యాంటీ బ్యాక్టీరియల్ ఫేస్ వాష్ అయ్యేలా చూసుకోవాలి.
ఫౌండేషన్ క్రీములే వద్దు: ఈ కాలంలో ఫౌండేషన్ క్రీములు రాసుకుంటే ముఖం జిడ్డుగా మారుతుంది. అందుకని ఫేస్ పౌడర్ మాత్రం రాసుకొని వెళ్తే ముఖం చాలాసేపటి వరకు కాంతిమంతంగా ఉంటుంది. ఎప్పుడూ ఓ చిన్న పౌడర్ బాటిల్‌ను బ్యాగ్‌లో పెట్టుకోండి. మరో విషయం. క్రీములతో వర్షంలో తడిస్తే మొటిమలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే.
మేలు చేసే గొడుగు: ఉద్యోగాలకు వెళ్లేవారు ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా తమతో ఉంచుకోవాల్సింది గొడుగు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు కాబట్టి రోజూ దాన్ని బ్యాగ్‌లోనే ఉంచుకోవడం మంచిది. ఆ కొనే గొడుగుల్లోనూ ‘నా అంబ్రిల్లానే బ్లూటిఫుల్’ అనుకునేలా రంగుల రంగుల గొడుగులు కొనుక్కుని వరణునితో దాగుడు మూతలాడండి.
టిష్యూస్ ఉండాల్సిందే: ముందే చెప్పినట్టు ఈ కాలంలో ముఖంపై తరచూ చెమట పడుతూ ఉంటుంది. హ్యండ్ కర్చీఫ్‌తో కంటే టిష్యూ పేపర్‌తో ముఖాన్ని తుడుచుకుంటే, వాడిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు పడేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఈ ‘యూజ్ అండ్ త్రో కర్చీఫ్స్’ వాడటం చాలా సులభం.
చిటపట చినుకుల్లో దాగుడుమూతలు!
Published Fri, Jul 24 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement
Advertisement