
వేసవిలో పసుపుని ముఖానికి గానీ, ఒంటికి గానీ పట్టించాలనుకుంటే నేరుగా కాకుండా పెరుగు, శనగపిండిలలో పసుపు కలిపి పట్టించాలి. ఇలాచేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది.
పసుపు రాసుకుంటే ముఖం రంగు వస్తుందని చాలామంది పసుపు రాసుకుంటూ ఉంటారు. అయితే పసుపు రాసిన తరువాత కడిగేటప్పుడు సాధారణ నీటితో మాత్రమే కడగాలి. సబ్బు, ఫేస్‌వాష్‌లతో కడగకూడదు.
వీటితో కడిగితే ముఖం ఉన్నరంగుకంటే మరింత నల్లగా మారుతుంది. పసుపుని చర్మానికి రాసి ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. ఆరిన వెంటనే నీటితో కడిగేయాలి. ఇలా చేయకపోతే మచ్చలు, చారలు ఏర్పడతాయి.
ఇక చర్మంపై ఉండే అవాంచిత రోమాలను పసుపు తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన దుష్ప్రభావాలు తక్కువ.
చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం!
చదవండి👉🏾 Beauty Tips: క్యారెట్, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చల్ని తరిమికొట్టే హోంమేడ్ క్రీమ్!