Face wash
-
Beauty Tips: పసుపు రాసి.. ఇలా చేశారంటే ముఖం నల్లబడుతుంది!
వేసవిలో పసుపుని ముఖానికి గానీ, ఒంటికి గానీ పట్టించాలనుకుంటే నేరుగా కాకుండా పెరుగు, శనగపిండిలలో పసుపు కలిపి పట్టించాలి. ఇలాచేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. పసుపు రాసుకుంటే ముఖం రంగు వస్తుందని చాలామంది పసుపు రాసుకుంటూ ఉంటారు. అయితే పసుపు రాసిన తరువాత కడిగేటప్పుడు సాధారణ నీటితో మాత్రమే కడగాలి. సబ్బు, ఫేస్‌వాష్‌లతో కడగకూడదు. వీటితో కడిగితే ముఖం ఉన్నరంగుకంటే మరింత నల్లగా మారుతుంది. పసుపుని చర్మానికి రాసి ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. ఆరిన వెంటనే నీటితో కడిగేయాలి. ఇలా చేయకపోతే మచ్చలు, చారలు ఏర్పడతాయి. ఇక చర్మంపై ఉండే అవాంచిత రోమాలను పసుపు తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన దుష్ప్రభావాలు తక్కువ. చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! చదవండి👉🏾 Beauty Tips: క్యారెట్, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చల్ని తరిమికొట్టే హోంమేడ్ క్రీమ్! -
పెళ్లికి మేకప్!
పెళ్లి కూతురు మేకప్, అలంకరణ మిగతావారికన్నా భిన్నంగా ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కళ్ల కింద చర్మం ఉబ్బు ఉంటే తగ్గడానికి గోరువెచ్చని టీ బ్యాగ్‌తో కొద్దిసేపు కాపడం పెట్టాలి. మేకప్ చేసుకునేముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ►ఏ తరహా స్కిన్ షేడ్ నప్పుతుందో మేనిచాయను బట్టి ఎంపిక చేసుకోవాలి. అలాగే సరైన ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్ను ఎంచుకోవాలి. ►ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ►బేస్‌గా ప్రైమర్‌ని ముఖమంతా రాయాలి. దీంతో మొటిమల వల్ల అయిన మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతలు కనిపించవు. ఎక్కువ సమయమైనా మేకప్ పాడవకుండా ఉంటుంది. అలాగే ఫౌండేషన్ ప్యాచులుగా చర్మానికి పట్టే సమస్య కూడా ఉత్పన్నం అవదు. ►ప్రైమర్ రాసిన తర్వాత ఫౌండేషన్‌ని అప్లై చేయాలి. అలాగే కంటికి ఐ షాడోస్ ఉపయోగించాలి. ►చామన చాయ గలవారు బుగ్గలకు బ్రోంజర్ని అప్లై చేయాలి. ►ఈ కాలం త్వరగా పెదాలు పొడిబారే అవకాశం ఉంటుంది కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్ వాడిన తర్వాత లిప్‌గ్లాస్‌ను ఉపయోగించాలి. పెదాలు సన్నగా ఒంపుతిరిగి కనిపించాలంటే లిప్ పెన్సిల్‌తో ఔట్లైనర్ గీసి ఆ తర్వాత లిప్‌స్టిక్ వేయాలి. ►డార్క్ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. అలాగే కనుబొమలను కూడా! ►మెరుపుల కోసం ఏ ఇతర గ్లిటర్స్ని ఉపయోగించకపోవడమే మంచిది. ►ముఖంలో కనిపించేవి ముందు పెదాలు, కళ్లు మాత్రమే. అందుకే లిప్‌స్టిక్, ఐ షాడో, మస్కారాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ►షేడ్స్, గ్లిటర్స్ అంటూ అతిగా మేకప్ అయితే మిగతా అలంకరణ కూడా అంతగా నప్పదు. -
ముఖ తేజస్సుకు...
పదే పదే ముఖం శుభ్రం చేస్తే పదింతల మేలు అనేది మీ ఆలోచనా?! అయితే వెంటనే ఆ అలవాటుకు స్వస్తి పలకండి. ఎందుకంటే... అతిగా కడగడం: ముఖాన్ని రోజులో ఎక్కువ సార్లు శుభ్రం చేయడం వల్ల చర్మంపై సహజమైన నూనెలు తగ్గిపోయి, పొడిబారుతుంది. పొడిబారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పడుకునేముందు ముఖాన్ని ‘మైల్డ్ సోప్ లేదా ఫేస్‌వాష్’తో శుభ్రం చేసుకోవాలి. పొడిచర్మం: ముఖాన్ని శుభ్రపరుచుకున్న వెంటనే చాలాసార్లు దురదగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు మీది పొడి చర్మం అని గమనించాలి. సబ్బు లేదా ఫేసియల్ ఫోమ్ మీ చర్మతత్వానికి సరిపడటం లేదని తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు ముఖం కడిగిన తర్వాత లోషన్ లేదా నూనె రాసుకోవాలి. పొడి చర్మం గలవారు క్లెన్సర్స్ ఉపయోగించకపోవడమే మేలు. వేడినీళ్లు: చర్మం తన సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వేడినీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోకూడదు. బయటి ఉష్ణోగ్రతలను బట్టి చర్మం తట్టుకోగలిగేటంత గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. మాయిశ్చరైజింగ్ వాడకపోవడం: జిడ్డు చర్మం గలవారు ఈ టిప్‌ను అనుసరించాల్సిన పనిలేదు. సాధారణ, పొడి చర్మం గలవారు ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే మంచి మాయిశ్చరైజర్‌ని రాసుకుంటే రోజంతా చర్మం మృదువుగా ఉంటుంది. -
రెట్టింపు అందం
ముఖంపైన మృతకణాలను తొలగించి, ఆకర్షణీయంగా మార్చడంలో సహజమైన చిట్కాలదే ప్రథమస్థానం అంటున్నారు నిపుణులు. రోజూ ఖరీదైన ఫేస్ క్రీమ్స్, లోషన్స్ అప్లై చేసుకుని, వారానికోసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా... చక్కగా ఓ 30 నిమిషాలు ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. మరింకెందుకు ఆలస్యం..? ఇలా ప్రయత్నించండి! కావాల్సినవి : క్లీనప్ : కీరదోస జ్యూస్ – 2 టేబుల్ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు – 2 టీ స్పూన్ మాస్క్: కమలా తొక్కల పొడి – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కొబ్బరిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కమలా తొక్కల పొడి, గడ్డపెరుగు, అరటిపండు గుజ్జు బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ట్యాన్ తగ్గాలంటే..
ఎండలు పెరుగుతున్నాయి. ఎండ వల్ల చర్మం కమిలినా, ట్యాన్ ఏర్పడినా, పొడిబారినా.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటించి మేనికాంతి నిగారింపు కోల్పోకుండా చూసుకోవచ్చు. మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది. అరటిపండు గుజ్జు, 3 టేబుల్ స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ కలిపి మేనికి రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత వేడినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది. టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతిమంతం అవుతుంది. -
అందానికి సరైన చిట్కా
స్పెషల్ డేస్‌లో స్పెషల్‌గా రెడీ అయ్యేందుకు ఖరీదైన ఫేస్‌క్రీమ్స్ వాడుతుంటారు చాలా మంది. అయితే ఆ క్రీమ్స్ కేవలం ఆ క్షణానికి మాత్రమే మెరుపునిస్తాయి. ఆ తర్వాత మళ్లీ మామూలే. మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు పైపై పూతలు పూసుకునేకంటే... శాశ్వతంగా తొలగిపోయేందుకు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించాల్సిందే. అప్పుడే అందం సహజత్వాన్ని పొందుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆరెంజ్ జ్యూస్ – 3 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్, గ్లిజరిన్ – 3 చుక్కలు స్క్రబ్ : ఓట్స్ – 1 టీ స్పూన్, యాపిల్ గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు – 1 టీ స్పూన్ మాస్క్: కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, శనగపిండి – 1 టీ స్పూన్, జామపండు గుజ్జు – 2 టీ స్పూన్లు (గింజలు తొలగించి) తయారీ : ముందుగా తేనె, గ్లిజరిన్, ఆరెంజ్ జ్యూస్ ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ గుజ్జు, చిక్కటి పాలు, ఓట్స్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జామపండు గుజ్జు, కొబ్బరిపాలు, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
సౌందర్యపు బొమ్మ
మగువలు సినీతారల్లా మెరిసేందుకు ఈ మధ్యకాలంలో ఎన్నో క్రీమ్స్ పోటెత్తుతున్నాయి. కానీ ఆ మెరుపు కొన్ని గంటలు మాత్రమే నిలుస్తుంది. మేకప్ ఉన్నా లేకపోయినా ముఖం కాంతివంతంగా మెరవాలంటే... ఈ చిట్కాలను పాటించాల్సిందే. ఈ పద్ధతులు ఆచరించాల్సిందే. అప్పుడే సౌందర్యపు బొమ్మలా మెరిసిపోతారు. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. సహజ సౌందర్యాన్ని సొంతం చేసుకోండి. సౌందర్యపు బొమ్మ కావల్సినవి : క్లీనప్ : క్యారెట్ జ్యూస్ – 2 టీ స్పూన్స్, మీగడ – 1 టీ స్పూన్ స్క్రబ్ : ముల్తానీ మట్టి – అర టీ స్పూన్, ఓట్స్ – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్ మాస్క్ : ద్రాక్ష గుజ్జు – 3 టేబుల్ స్పూన్స్, పచ్చి పసుపు – 1 టీ స్పూన్ స్పూన్, చిక్కటి పాలు – అర టీ స్పూన్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని క్యారెట్ జ్యూస్, పెరుగు మీగడ యాడ్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ముల్తానీ మట్టి, ఓట్స్, తేనె, గడ్డ పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష గుజ్జు, పచ్చి పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15 లేదా 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
గోళ్లు పలచబడి విరిగిపోతుంటే...
గోళ్లు పొడవుగా పెంచుకొని, మంచి షేప్ చేయించుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ కొందరిలో గోళ్ల పెరుగుదల అంతగా ఉండదు. పైగా కొద్దిగా పెరిగినా త్వరగా విరిగిపోతుంటాయి. దీనికి ప్రధాన కారణం... కాల్షియం, ఐరన్ లోపం. దీంతో పాటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. రోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలిపి గోళ్ల మీద రాసి, మసాజ్ చేయాలి. లేదా బాదం నూనెను వేలితో అద్దుకొని, గోరు చుట్టూ రాసి మృదువుగా మర్దనా చేయాలి. కొబ్బరినూనెను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది. త్వరగా విరిగిపోవు. నెల రోజులకోసారి ఇంట్లోనే గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. దీనికి ఉప్పు, షాంపూ కలిపిన గోరువెచ్చని నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు వేళ్లు మునిగేలా ఉంచి, తర్వాత మెనిక్యూర్ టూల్‌తో గోరుచుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. గోళ్లను ఒక షేప్‌లో కత్తిరించి, పెట్రోలియమ్ జెల్లీ లేదా బాదం నూనెతో మర్దనా చేయాలి.వీటితో పాటు.. ∙ఆహారంలో కాల్షియం, ఐరన్ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. తాజా ఆకుకూరలు, నువ్వులు, పల్లీలు, బెల్లం.. మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. -
ఫ్రెష్ ఫైవ్
చాలామంది చర్మ సంరక్షణలో ఇది వాడవచ్చా, వాడకూడదా, ఏది వాడాలి, ఏది వాడకూడదు.. అనే సంశయంలో ఉంటూ ఉంటారు. చర్మం కాస్త డల్‌గా అయినా జీవం కోల్పోయినట్టు భావిస్తారు. ఈ సమస్య రాకుండా ఉండటానికి.. చర్మకాంతి పెరగడానికి... 5 సూచనలు పాటించవచ్చు.రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్‌లా చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్ సులువుగా వదిలిపోతుంది. తర్వాత ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఒంటికి చెమట పట్టేలా చేసే రన్నింగ్, జాగింగ్, వాకింగ్ వంటివి తప్పనిసరిగా రోజులో 20 నిమిషాలైనా చేయాలి. చెమట ద్వారా స్వేద రంధ్రాలలో చేరిన మురికి విడుదల అవుతుంది. యోగా వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. చర్మం పొడిబారుతోంది అంటే సరైన నిద్రకు దూరంగా ఉన్నారని అర్ధం చేసుకోవాలి. రోజూ ఎనిమిది గంటల నిద్ర లేకపోతే కళ్ల కింద వలయాలు ఏర్పడతాయి. ఉదయం, రాత్రి పడుకునే ముందు వేలి కొసలతో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తినాలి. చర్మం జీవం లేనట్టుగా కనిపిస్తే రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని అర్ధం. అందుకని రోజూ 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలనే నియమం పెట్టుకోండి. అలాగే, రోజులో మూడుసార్లు సబ్బు లేకుండా కేవలం మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రపరిచి, మాయిశ్చరైజర్ రాయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం సహజకాంతితో కళకళలాడుతుంది. -
సౌందర్యరాశిలా
చర్మసంరక్షణకు కాసింత సమయం కేటాయిస్తే చాలు.. ఎలాంటి ఫేస్‌క్రీమ్స్, లోషన్లతో పనిలేకుండా సౌందర్యరాశిలా మెరిసిపోవచ్చు. ఇంటిపట్టున దొరికే పసుపు, పెరుగు వంటి మిశ్రమాలతోనే చర్మకాంతిని రెట్టింపు చేసుకోవచ్చు. మచ్చలు, మొటిమలు లేని అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఇలా క్లీనప్, స్క్రబ్‌లతో పాటు ఫేస్‌ప్యాక్‌ని కూడా ప్రయత్నించండి. అందాన్ని రెట్టింపు చేసుకోండి. కావల్సినవి: క్లీనప్ : కీరదోస రసం(జ్యూస్) – 3 టీ స్పూన్స్, తేనె – 1 టీ స్పూన్, పెరుగు – అర టీ స్పూన్ స్క్రబ్ : కోకో పౌడర్ – అర టేబుల్ స్పూన్, ఓట్స్ – అర టేబుల్ స్పూన్, వెన్న – అర టీ స్పూన్, రోజ్ వాటర్ – 1 టేబుల్ స్పూన్ మాస్క్ : అవొకాడో – సగం ముక్క (మీడియం సైజ్), తేనె – 1 టేబుల్ స్పూన్, పెరుగు మీగడ – అర టీ స్పూన్, పసుపు – కొద్దిగా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని కీరదోస రసం, తేనె, పెరుగు బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్,ఓట్స్, వెన్న ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అవొకాడో శుభ్రం చేసుకుని గుజ్జులా చేసుకుని, అందులో తేనె, పెరుగు మీగడ, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
నాచురల్ ఫేస్ మాస్క్
ఆయిలీ స్కిన్ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్ పౌడర్ లేదా పుల్లటి పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్ క్లెన్సర్‌గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. -
కనులు చెదిరే మెరుపు
పెరుగుతున్న కాలుష్యం బారిన పడకుండా అందాన్ని సంరక్షించుకోవాలంటే... కాస్త సమయాన్ని సౌందర్య చిట్కాలకు కేటాయించాల్సిందే. ఫేస్ ప్యాక్ అంటే ఏదో పండును గుజ్జు చేసుకుని, అందులో ఏవో కొన్ని లేపనాలను కలుపుకుని, ముఖానికి అప్లై చేసుకుని, ఆరిపోయాక క్లీన్ చేసుకుంటే సరిపోదు. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలిగిపోయి, కాంతివంతంగా మెరిసేందుకు ఫేస్ ప్యాక్స్ కంటే ముందుగా క్లీనప్ చేసుకోవడం, స్క్రబ్ చేసుకోవడం, ఆవిరి పట్టించుకోవడం వంటివి చెయ్యాల్సిందే. క్లీనప్, స్క్రబ్ వంటివి చెయ్యడం వల్ల ముఖంపైన ఉండే టాన్ తొలిగిపోయి గ్లోయింగ్ వస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : కలబంద గుజ్జు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, కొబ్బరి పాలు – అర టీ స్పూన్ స్క్రబ్ : పంచదార పొడి – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – 1 టీ స్పూన్, ఆలీవ్ నూనె – అర టీ స్పూన్ మాస్క్ : ముల్తానీ మట్టి – 1 టేబుల్ స్పూన్, టమాటా జ్యూస్ – అర టేబుల్ స్పూన్ పసుపు – చిటికెడు, రోజ్ వాటర్ – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని కలబంద గుజ్జు, తేనె, కొబ్బరిపాలు యాడ్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పొడి, నిమ్మరసం, ఆలీవ్ నూనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మూడు నుంచి ఐడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ముల్తానీ మట్టి, టమాటా జ్యూస్ ఒక బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో పసుపు, రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని, బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
కోమలమైన చర్మం
పేరుకుపోయిన దుమ్ము కణాలను శుభ్రపరచకపోతే మృతకణాలు పెరిగి చర్మ మృదుత్వాన్ని, కాంతిమంతాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమస్యకు విరుగుడుగా... బియ్యప్పిండి, పసుపు, పాల మీగడ, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి, మృదువుగా రబ్ చేయాలి. దీని వల్ల స్వేదరంధ్రాల్లో మృతకణాలు తొలగిపోయి, సహజమైన మాయిశ్చరైజర్‌ని తగినంతగా ఉత్పత్తి చేస్తుంది. చర్మం మృదుత్వం దెబ్బతినదు.వాతావరణం మబ్బుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవాలి. రాత్రిపూట పెదవులకు పాల మీగడ, లేదా కొబ్బరి నూనె వంటివి రాసుకుంటే పగుళ్ల సమస్య బాధించదు. సబ్బు అవసరం లేకుండా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. జాజికాయను పొడిచేసి, అందులో పచ్చి పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు అయిన చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పన ఉల్లి, క్యారెట్ రసం, గుడ్డు సొన, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.ఆపిల్ ముక్కతో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖంలోని అదనపు జిడ్డు తొలగిపోవడంతో మొటిమలు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది. జిడ్డు చర్మం గలవారు కీరా రసంలో రోజ్‌వాటర్, నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకోబోయేముందు ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది. -
కళ్ల కింద నల్లటి వలయాలుంటే...
ముఖానికి అప్లయ్ చేసిన క్రీములను అలాగే వదిలేయడం వల్ల క్రమంగా కళ్ల కింద చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి కమిలి సహజత్వాన్ని కోల్పోతుంది. మేకప్ కోసం వాడిన క్రీములను శుభ్రం చేసేటప్పుడు కళ్ల కింద జాగ్రత్తగా తుడవాలి, వెంటనే బేబీఆయిల్ వంటివి రాయాలి.పలుచగా కోసిన బంగాళదుంప లేదా కీరదోస ముక్కలను కళ్లు మూసుకుని రెప్పలమీద పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ముక్కలను తీసిన తర్వాత చన్నీటితో ముఖం కడిగి కళ్ల కింద నరిషింగ్ క్రీమ్. రాయాలి. బంగాళదుంప రసం, కీరదోస రసం సమపాళ్లలో తీసుకుని ఆ మిశ్రమంలో ముంచిన దూదిని కళ్ల మీద పెట్టి ఇరవై నిమిషాల సేపు ఉంచాలి. కాటన్ పాడ్స్ తీసిన తర్వాత చన్నీటితో కడగాలి.తాజా నిమ్మరసంలో అంతే మోతాదు టొమాటో రసం కలిపి ఆ మిశ్రమంలోముంచిన దూదిని కళ్ల మీద పెట్టాలి. ఇలారోజుకు రెండుసార్లు చేయాలి.స్వచ్ఛమైన పసుపులో పైనాపిల్ రసం కలిపిఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసి ఆరినతర్వాత చన్నీటితో కడగాలి. పుదీనా ఆకులను చిదిమి రసాన్ని కళ్ల చుట్టూరాస్తున్నా కూడా వలయాలు పోతాయి. -
బ్యూటిప్స్
కోడిగుడ్డులోని తెల్లసొనలో టీస్పూన్ పంచదార, పావు టీ స్పూన్కార్న్ ఫ్లోర్‌ని కలిపిన మిశ్రమాన్నిముఖానికి పట్టించి ఆరిన తరువాత, నెమ్మదిగా పై పొరను తీసేయాలి. వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేస్తే ముఖం పై ఉన్నసన్నటి వెంట్రుకలు మటుమాయమవుతాయి.కోడిగుడ్డులోని తెల్ల సొనలో ద్రాక్షరసం, నిమ్మరసం కలపాలి. ఈమిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20నిముషాలపాటు ఉంచి గోరువెచ్చనినీటితో కడిగేయాలి.కోడిగుడ్డు సొనలో, పాలపొడి, నిమ్మరసాన్ని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనెలో బాదం పప్పు పొడిని కలిపిఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిఆరిన తరువాత కడిగేయాలి.పచ్చిపాలలో గంధం పొyì , తేనెసమపాళ్లలో కలిపి ముఖానికిపట్టించి ఆరిన తరువాత కడిగేయాలి.కమలాపళ్ల రసంలో పసుపుని రంగరించి ముఖానికి పట్టించి ఆరినతరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే నిగనిగలాడుతుంది.కొబ్బరి పాలు లేదా కొబ్బరి క్రీము,క్యారెట్ పేస్ట్ కలిపి ముఖానికి అప్లైచేస్తే చర్మం చాలా కాంతివంతంగాతయారవుతుంది. అలాగే చర్మసమస్యలు కూడా తగ్గుతాయి. -
కంటి చుట్టూ విశ్రాంతి కాంతులు
ముఖం జీవకళ కోల్పోయినట్టుగా కనిపిస్తుందనిపిస్తే ముందుగా చెక్ చేయాల్సింది కంటి చుట్టూ ఉండే భాగాన్ని. కంటి కింద చర్మం వదులుగా అవడం, నల్లబడటం వంటి సమస్యను గుర్తిస్తే నిద్రవేళలను సరిగ్గా పాటించడం లేదని, పోషకాహారం మీద దృష్టిపెట్టడం లేదని, మానసిక ఒత్తిడి పెరుగుతోందని గుర్తించాలి. అంతేకాదు, చర్మం ముడతలు పడుతుంది అనే విషయాన్నీ కంటిచుట్టూ ఉండే చర్మమే ముందుగా తెలియపరుస్తుంది. అందుకని... నిద్రించేటప్పుడు తల–మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీని వల్ల దేహద్రవాలు సమంగా అయి, కంటిచుట్టూ చర్మం బిగువును కోల్పోదు. చర్మం ముడతలు తగ్గడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా ఉంటుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూ మృదువుగా రెండు నిమిషాలు రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం తగ్గుతుంది. కంటి చుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. నల్లని వలయాలకు మనం తీసుకునే జాగ్రత్తలే మంచి రెమిడీగా పనిచేస్తాయి. -
ఆకుపచ్చని సౌందర్యం
గ్రీన్ టీ అంతర్గత అవయవాల ఆరోగ్యానికే కాదు, మేని సౌందర్యానికీ తోడ్పడుతుంది. చర్మ మృదుత్వాన్ని, కాంతిని పెంచుతుంది. గ్రీన్ టీ క్లెన్సర్: గ్రీన్ టీ బ్యాగ్‌తో తేనీరు తయారుచేసుకొని సేవించాలి. ఆ టీ బ్యాగ్ చల్లారిన తర్వాత, గట్టిగా పిండాలి. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖం, మెడ భాగాలపై మెల్లగా 2 నిమిషాల సేపు రుద్దాలి. అదే టీ బ్యాగ్తోనూ ముఖమంతా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మలినాలుతొలగి, వడలిన ముఖం తాజాగా మారుతుంది. గ్రీన్ టీ స్టీమ్ ఫేసియల్: ఫేసియల్ సమయంలో సాధారణ వేడి నీటితో ముఖానికి ఆవిరిపడుతుంటారు. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉపయోగించవచ్చు. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను కట్ చేసి ఆకును మాత్రమే వేయాలి. గిన్నెను కిందకు దించి, తలను ముందుకు తెచ్చి, పైన టవల్‌ను కప్పుకోవాలి. ఇలా వచ్చే ఆవిరిని 3–4 నిమిషాలు మాత్రమే ముఖానికి పట్టాలి. (వేడి భరించగలిగేటంత దూరంలో ఉండాలి). గ్రీన్ టీ రోజ్ వాటర్: రోజ్‌వాటర్‌ను (మార్కెట్లో లభిస్తుంది) వేడి చేసి, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉంచాలి. 5 నిమిషాల తర్వాత టీ బ్యాగ్ తీసేసి, మిశ్రమం చల్లబడ్డాక, గాలిచొరబడని బాటిల్లో పోసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. అలసిన కళ్లకు విశ్రాంతి, వడలిన చర్మానికి తాజా దనం రావడానికి ఈ గ్రీన్ టీ రోజ్‌వాటర్‌ని దూదితో అద్దుకొని, తుడుచుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల వయసుపైబడిన కారణంగా వచ్చే ముడతలు తగ్గుతాయి. ఎండకు కందిన చర్మం సహజకాంతిని నింపుకుంటుంది. -
కోకోనట్ సౌందర్యం
మెరిసే చర్మ సౌందర్యం కోసం నెలనెలా వందల రూపాయలు ఖర్చు చేస్తుంటారు మగువలు. కానీ కెమికల్స్ ఎక్కువగా ఉండే ఫేస్ క్రీమ్స్ కంటే.. ఇంటి పట్టున సహజసిద్ధంగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్సే సరైనవని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. మరైతే ఎన్నో గొప్పలక్షణాలున్న కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లతో చక్కటి క్లీనప్, స్క్రబ్, మాస్క్ వంటివి ప్రయత్నించండి. చర్మం పటుత్వాన్ని కోల్పోకుండా చూసుకోండి. కావలసినవి: క్లీనప్ : పెరుగు – 3 టీ స్పూన్స్, కొబ్బరి నూనె – 1 టీ స్పూన్స్క్రబ్ : కొబ్బరి నీళ్లు – 3 టీ స్పూన్స్, ఓట్స్ – 2 టీ స్పూన్స్ మాస్క్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్స్, తేనె – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు, కొబ్బరి నూనె యాడ్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకుని, ఓట్స్, కొబ్బరి నీళ్లు కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత తేనె, నిమ్మరసం, కొబ్బరి పాలు మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
హోమ్ ప్యాక్స్
కాలమేదైనా చర్మకాంతికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. పాలు, గుడ్డులోని తెల్లసొన, తేనె, కూరగాయల రసంతోనే మేనికి మెరుగు పెట్టవచ్చు. ముందు రోజు రాత్రి ఐదు బాదంపప్పులను నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే పై పొట్టు తీయాలి. వీటిని మెత్తగా రుబ్బి, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని వదలగొట్టి, చర్మకాంతిని పెంచుతాయి. బాదం పప్పు లోని సహజమైన నూనెలు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. టీ స్పూన్ గుడ్డులోని తెల్ల సొనను ఒక గిన్నెలో వేసి, అందులో అర టీ స్పూన్ పాల మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేస్తూ ఉంటే చర్మకాంతి పెరుగుతుంది. టేబుల్ స్పూన్ తేనెలో అరముక్క నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి, 10 –15 నిమిషాలు ఉండాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మంపై మలినాలను తొలగించడంలో మైల్డ్ ఫేస్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. కాంతి పెరుగుతుంది. బంగాళదుంప, క్యారెట్‌ను ఉడికించి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమంలో చిటికెడు బేకింగ్ సొడా, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసుకొని రెండు నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారించడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్‌లో ఒక చుక్క గ్లిజరిన్, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని దూది ఉండతో అద్దుకుంటూ ముఖం, మెడకు రాసి, తుడవాలి. ఇది రోజంతా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడం నివారిస్తుంది. చర్మం ముడతలు తగ్గి, యవ్వనకాంతితో మెరుస్తుంది. -
బ్యూటిప్స్
ఇలా చేయకండి... చర్మంలోని తేమను బట్టే ముఖం తాజాగా కనిపిస్తుంది. ఎంత ఎక్కువగా ఫేస్ వాష్ చేస్తే ముఖం అంత తాజాగా కనిపిస్తుందనుకుంటారు కొందరు. అదే పనిగా ఫేస్ వాష్ చేస్తారు కూడా. అయితే ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడి బారుతుంది. ఇలా చేయండి... స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి బాగా పట్టించాలి. అలా గంట పాటు వదిలేస్తే తేమను చర్మ గ్రంథులు పీల్చుకుంటాయి. తరువాత ముఖం శుభ్రంగా కడుక్కుంటే ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తారు. -
ఫేస్‌వాష్.. మసాజ్
బ్యూటిప్స్ మృదువైన చర్మం మీ సొంతం కావాలంటే మొదట ఐస్ వాటర్‌తో ఫేస్‌వాష్ చేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్‌ను తేనెలో ముంచుతూ ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. దానిపైన గుడ్డు తెల్లసొనను అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక మళ్లీ ఐస్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే ముఖం నిగనిగలాడుతుంది. {yై స్కిన్ వారు ఈ సులువైన చిట్కా ద్వారా మంచి ఫలితం పొందొచ్చు. ముఖం, చేతులు, మెడపై బొప్పాయి పండు గుజ్జుతో బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఓట్స్, తేనె, చల్లటి పాలతో తయారు చేసుకున్న స్క్రబ్‌ను చర్మంపై ఉపయోగించాలి. వెంటనే మళ్లీ చల్లటి పాలు, నీళ్లతో చర్మాన్ని శుభ్రం చేసుకొని ఏదైనా క్రీమ్‌ను రాసుకుంటే డ్రైనెస్ దూరమవుతుంది. -
చిటపట చినుకుల్లో దాగుడుమూతలు!
రెయిన్టిప్స్ వర్షాలు మొదలు కాగానే ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన’ అంటూ ఆనందంతో గంతులేసే ఆడపిల్లలు.. అదే వర్షానికి తమ అందం విషయంలో భయపడతారట. ఎందుకంటే ఈ కాలంలో వారి సౌందర్యానికి కలిగే అసౌకర్యాలు బోలెడన్ని కాబట్టి. మనసుంటే మార్గం ఉండదా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ఇంట్లో కూర్చొని అద్దంలోంచి కురిసే వానను చూస్తూ ఉండాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా బయటికెళ్లి చిటపట చినుకుల్లో ఆడుకోవచ్చు. అందుకోసం మగువలు ఏం చేయాలో తెలుసా..? ఫేస్‌వాష్ : ఇది లేకుండా ఏ కాలంలో బయటికి వెళ్లినా ప్రమాదమే. ఈ వర్షాకాలంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముఖమంతా తేమతో నిండినట్టు ఉంటుంది. అలాగే రోడ్లపై వెళ్లేటప్పుడు అనేక క్రిముల సంచారం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజంతా బయట తిరిగేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవడం ముఖ్యం. అలా ఉపయోగించే ఫేస్‌వాష్ యాంటీ బ్యాక్టీరియల్ ఫేస్ వాష్ అయ్యేలా చూసుకోవాలి. ఫౌండేషన్ క్రీములే వద్దు: ఈ కాలంలో ఫౌండేషన్ క్రీములు రాసుకుంటే ముఖం జిడ్డుగా మారుతుంది. అందుకని ఫేస్ పౌడర్ మాత్రం రాసుకొని వెళ్తే ముఖం చాలాసేపటి వరకు కాంతిమంతంగా ఉంటుంది. ఎప్పుడూ ఓ చిన్న పౌడర్ బాటిల్‌ను బ్యాగ్‌లో పెట్టుకోండి. మరో విషయం. క్రీములతో వర్షంలో తడిస్తే మొటిమలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. మేలు చేసే గొడుగు: ఉద్యోగాలకు వెళ్లేవారు ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా తమతో ఉంచుకోవాల్సింది గొడుగు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు కాబట్టి రోజూ దాన్ని బ్యాగ్‌లోనే ఉంచుకోవడం మంచిది. ఆ కొనే గొడుగుల్లోనూ ‘నా అంబ్రిల్లానే బ్లూటిఫుల్’ అనుకునేలా రంగుల రంగుల గొడుగులు కొనుక్కుని వరణునితో దాగుడు మూతలాడండి. టిష్యూస్ ఉండాల్సిందే: ముందే చెప్పినట్టు ఈ కాలంలో ముఖంపై తరచూ చెమట పడుతూ ఉంటుంది. హ్యండ్ కర్చీఫ్‌తో కంటే టిష్యూ పేపర్‌తో ముఖాన్ని తుడుచుకుంటే, వాడిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు పడేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఈ ‘యూజ్ అండ్ త్రో కర్చీఫ్స్’ వాడటం చాలా సులభం. -
ముఖ తేజస్సుకు...
పదే పదే ముఖం శుభ్రం చేస్తే పదింతల మేలు అనేది మీ ఆలోచనా?! అయితే వెంటనే ఆ అలవాటుకు స్వస్తి పలకండి. ఎందుకంటే... అతిగా కడగడం: ముఖాన్ని రోజులో ఎక్కువ సార్లు శుభ్రం చేయడం వల్ల చర్మంపై సహజమైన నూనెలు తగ్గిపోయి, పొడిబారుతుంది. పొడిబారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పడుకునేముందు ముఖాన్ని ‘మైల్డ్ సోప్ లేదా ఫేస్‌వాష్’తో శుభ్రం చేసుకోవాలి. పొడిచర్మం: ముఖాన్ని శుభ్రపరుచుకున్న వెంటనే చాలాసార్లు దురదగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు మీది పొడి చర్మం అని గమనించాలి. సబ్బు లేదా ఫేసియల్ ఫోమ్ మీ చర్మతత్వానికి సరిపడటం లేదని తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు ముఖం కడిగిన తర్వాత లోషన్ లేదా నూనె రాసుకోవాలి. పొడి చర్మం గలవారు క్లెన్సర్స్ ఉపయోగించకపోవడమే మేలు. వేడినీళ్లు: చర్మం తన సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వేడినీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోకూడదు. బయటి ఉష్ణోగ్రతలను బట్టి చర్మం తట్టుకోగలిగేటంత గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. మాయిశ్చరైజింగ్ వాడకపోవడం: జిడ్డు చర్మం గలవారు ఈ టిప్‌ను అనుసరించాల్సిన పనిలేదు. సాధారణ, పొడి చర్మం గలవారు ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే మంచి మాయిశ్చరైజర్‌ని రాసుకుంటే రోజంతా చర్మం మృదువుగా ఉంటుంది. అందమె ఆనందం -
మెళకువలతో మేనికాంతి...
ఈ వయసులో చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువ. అందుకని పడుకునేముందు తప్పనిసరిగా ‘ఫేస్ వాష్‌తో’ (సబ్బును ఉపయోగించకూడదు) ముఖాన్ని శుభ్రపరుచుకోండి. మార్కెట్లో లభించే ‘నైట్ క్రీమ్స్’ చర్మతత్వానికి సరిపడేవి ఉపయోగించడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. త్వరగా ముడతలు పడదు. మసాజ్‌కి ఆలివ్, కొబ్బరినూనెలు మేలైనవి. ఈ వయసులో చర్మం పొడిబారడం సహజం. తైలగ్రంథుల పనితీరు మందగిస్తుంది. దాంతో వాటినుంచి చమురు ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా పొడిబారిన చర్మం దురద పెడుతుంటుంది. దీంతో చర్మం నల్లబడుతుంది. కొన్నిసార్లు చారలు కూడా పడిపోతుంటాయి. వీరిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. గోళ్లు విరిగిపోతుంటాయి. పాదాల పగుళ్లు బాధిస్తుంటాయి. డయాబెటిస్, రీనల్ ఫెయిల్యూర్, బీపీ సమస్యలు సాధారణం. వీటి వల్ల చర్మం దెబ్బతింటుంది. * ఏ కాలంలోనైనా, గోరువెచ్చని నీటితో, టిఎస్ఎఫ్ఎమ్ ఎక్కువ కంటెంట్ ఉన్న సోప్‌తో స్నానం చేయాలి. తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. * పాదాల చర్మం బాగుండటానికి రాత్రి సగం చెంచా ఉప్పు కలిపిన లీటర్ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచి, శుభ్రంగా తుడిచి, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోని పడుకోవాలి. * పదే పదే పాదాలను తడపకూడదు. గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే గోళ్ల రంగు మారుతుంది. దానికీ తగు చికిత్స తీసుకోవాలి. * ఎండలోకి వెళ్లేటప్పుడు బిడియపడకుండా పెద్ద హ్యాట్ లేదా గొడుగు, సన్‌గ్లాసెస్, మేనికి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. * లో దుస్తులు సరైనవి కానప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రోజూ స్నానం చేసి, పొడి దుస్తులను మాత్రమే ధరించాలి. * 8-10 గ్లాసుల నీరు తప్పక తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. నాన్‌వెజ్ తినేవారు ఎగ్‌వైట్, ఫిష్, చికెన్, మల్టీ విటమిన్ ట్యాబెట్ తీసుకుంటే ఇమ్యూన్ పెరుగుతుంది.