ముఖంపైన మృతకణాలను తొలగించి, ఆకర్షణీయంగా మార్చడంలో సహజమైన చిట్కాలదే ప్రథమస్థానం అంటున్నారు నిపుణులు. రోజూ ఖరీదైన ఫేస్ క్రీమ్స్, లోషన్స్ అప్లై చేసుకుని, వారానికోసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా... చక్కగా ఓ 30 నిమిషాలు ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. మరింకెందుకు ఆలస్యం..? ఇలా ప్రయత్నించండి!
కావాల్సినవి : క్లీనప్ : కీరదోస జ్యూస్ – 2 టేబుల్ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్
స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు – 2 టీ స్పూన్
మాస్క్: కమలా తొక్కల పొడి – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 1 టీ స్పూన్
తయారీ : ముందుగా కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కొబ్బరిపాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కమలా తొక్కల పొడి, గడ్డపెరుగు, అరటిపండు గుజ్జు బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment