Clean Up
-
ప్రభుత్వానికి ఖర్చులు తగ్గిస్తున్న కాకులు.. ఎలాగో తెలుసా?
నీళ్లు తాగడానికి ఓ కుండ దగ్గరకు వెళ్లిన కాకికి అందులోని నీళ్లు అందకపోతే రాళ్లు తీసుకొచ్చి కుండలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసిన కథను విని ఉంటారు. మరి అదే కాకికి ఆకలేస్తే..! ఏముంది రోడ్డుపై పడేసిన చెత్తను తీసుకొచ్చి ఓ డబ్బాలో వేస్తే చాలు. అలా చెత్త వేయగానే ఇలా తిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీడన్లో కాకులు ఇదే పని మీదున్నాయి. చెత్తను డబ్బాల్లో వేస్తూ తిండి సంపాదిస్తున్నాయి. పక్క కాకులకు కూడా ఈ ట్రిక్‌ను నేర్పిస్తున్నాయి. అసలు కాకులు అలా ఎందుకు చేస్తున్నాయి, చెత్తను డబ్బాలో వేస్తే తిండి వస్తుందని వాటికెలా తెలిసింది, దాని వల్ల ప్రజలకు, సిటీకేంటి లాభం, తెలుసుకుందామా? చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు.. స్వీడన్ ప్రజలు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. సిగరెట్ తాగి పీకలను రోడ్డుపై విసిరేస్తున్నారు. ఆ దేశ వీధుల్లో పడే చెత్తలో దాదాపు 62 శాతం సిగరెట్ పీకలే ఉంటున్నాయని స్వీడన్ టైడీ ఫౌండేషన్ చెబుతోంది. అక్కడి వీధుల్లో ఏటా దాదాపు 100 కోట్ల వరకు సిగరెట్ పీకలను పడేస్తున్నారంటోంది. ఇవే సిగరెట్ పీకలు, చెత్త సమస్యతో స్వీడన్ లోని సోడెర్టాల్జె మున్సిపా లిటీ కూడా ఇబ్బంది పడుతోంది. రహదారులను పరిశుభ్రం చేసేందుకు ఏటా దాదాపు రూ. 16 కోట్లను ఆ మున్సిపాలిటీ ఖర్చు చేస్తోంది. దీంతో ఆ నగరంలోని స్టార్టప్ సంస్థ ‘కోర్విడ్ క్లీనింగ్’ తెలివిగా కాకులను రంగంలోకి దింపింది. చెత్తను, సిగరెట్ పీకలను తీసుకెళ్లి ఓ డబ్బాలో పడేసేలా శిక్షణ ఇచ్చింది. ఆ వెంటనే ఆ డబ్బా నుంచి తిండి వచ్చేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ఆ సంస్థ ఓ డబ్బాను రూపొందించింది. కాకులనే ఎందుకు? కోర్విడ్ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైనవని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఏడేళ్లున్న మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో అచ్చం అలా ఆలోచించే సామర్థ్యం వీటి సొంతమని తేలింది. ఇవి ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటాయి. పక్క వాటికి నేర్పిస్తాయి కూడా. ఈ పక్షులకే ఇప్పుడు చెత్త క్లీనింగ్‌పై శిక్షణనిచ్చారు. సిగరెట్ పీకలను, చెత్తను ఆహారం అనుకొని తినే అవకాశమే లేదని తేలింది. వీటి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాకే శిక్షణ ఇచ్చారు. ఏమైనా లాభముందా? మున్సిపాలిటీ సిబ్బందికి ఒక్కో సిగరెట్ పీకను తీయడానికి అయ్యే ఖర్చుల్లో నాలుగో వంతు ఖర్చు చేస్తే చాలు కాకులు ఆ పని చేసి పెడుతున్నాయి. అంటే మొత్తంగా పీకలను తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 75% తగ్గించేస్తున్నాయి. ఇప్పటి వరకు కాకులకే శిక్షణ ఇచ్చామని, మున్ముందు మరిన్ని రకాల పక్షులకు శిక్షణ ఇస్తామని అధికారు లు చెబుతున్నారు. ఇది కేవలం నగరాన్ని పరిశు భ్రంగా ఉంచడానికి మాత్రమే కాదని.. ప్రజలు కూడా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చేయాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. మనుషులు నేర్చుకునేదెప్పుడో! ఏదేమైనా చెత్తను తొలగించడానికి పక్షులకు కూడా శిక్షణ ఇస్తున్నాం కానీ.. చెత్త వేయొద్దని మనుషులకు చెప్పలేకపోతున్నామని అక్కడి అధికారులు అంటున్నారు. కాకులు చెత్త తీసుకెళ్లడంపై కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పుటికైతే చెత్తను తీసుకెళ్లే పనే పక్షులకు అప్పగించారు. ఇకముందు చెత్త వేస్తే చాలు.. వచ్చి వెనక నుంచి తన్నేలా శిక్షణనిస్తారేమో’ అని ఫన్నీగా అంటున్నారు. సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చైనా సైబర్‌స్పేస్ చివరి యుద్ధం!...ఇంటర్నెట్ క్లీన్ అప్!!
Cyberspace Administration of China: ఇంటర్నెట్ను "క్లీన్ అప్" చేయడానికి చైనా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఇంటర్నెట్ను "క్లీన్ అప్" చేసే డ్రైవ్‌లో భాగంగా నకిలీ ఖాతాల సమాచారాన్ని అరికట్టడానికి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు, వీడియో-షేరింగ్ సైట్ల వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను చైనా పరిశీలిస్తుందని ఆ దేశ సైబర్ రెగ్యులేటర్ తెలిపింది. చైనాలోని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఏసీ) మోసపూరిత ఆన్లైన్లను లక్ష్యంగా చేసుకోని రెండు నెలల ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. (చదవండి: అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!) నకిలీ అకౌంట్లు, సాంకేతికత, రియల్ ఎస్టేట్, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీలు వంటి వాటికి సంబంధించిన ఫైనాన్స్‌లో కంపెనీల పర్యవేక్షణను అధికారులు కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ, మున్సిపల్ బాడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అంతేకాదు ఈ సమావేశంలో సీఏసీ ఆన్లైన్ ట్రాఫిక్, హానికరమైన పబ్లిక్ రిలేషన్స్, కామెంట్లు, నగదు కోసం రూపొందించే వెబ్‌లు వంటివి... నెటిజన్ల చట్టబద్ధమైన హక్కుల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొంది. పైగా చైనా సీఏసీ "చివరి యుద్ధం" గా అభివర్ణించిది. అంతేకాదు ఇంటర్నెట్ను "క్లీన్ అప్" డ్రైవ్ చేయండి అని పిలుపినిచ్చింది. (చదవండి: ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు ఏకంగా 4,500 మిస్డ్ కాల్స్ వచ్చాయి!!) -
ముంబై బీచ్‌లో చెత్త ఏరిన రాజదంపతులు
ముంబై : స్వీడన్ రాజదంపతులు కింగ్ కార్ల్-16 గుస్టాఫ్, క్వీన్ సిల్వియా ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. భారత పర్యటనలో రాజదంపతులు ప్రదర్శిస్తున్న నిరాడంబరత పలువురుని ఆకట్టుకుంటుంది. తాజాగా బుధవారం రాజదంపతులు ముంబై వెర్సోవా బీచ్‌లోని చెత్తను ఏరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో అక్కడి వాలంటీర్లకు సహాయం అందించారు. పర్యావరణ ఉద్యమకారుడు ఆఫ్రోజ్ షాతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, వెర్సోవా బీచ్‌లోని వ్యర్థాలను తొలగించడానికి ఆఫ్రోజ్ రెండేళ్ల క్రితం ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన వెంట 12,000 మది వాలంటీర్లు ఉన్నారు. ఆఫ్రోజ్ కృషికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. బీచ్‌లో చెత్త ఏరుతున్న సమయంలో రాజదంపతులు అక్కడి వాలంటీర్లతో ముచ్చటించారు. అలాగే బుధవారం సాయంత్రం వారు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో సమావేశం కానున్నారు. అనంతరం డెహ్రాడూన్ బయలుదేరి వెళ్తారు. ఉత్తరఖాండ్‌లోని రామ్ జూలాను సందర్శిస్తారు. అలాగే గురువారం హరిద్వార్‌లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ను స్వీడన్ రాజదంపతులు ప్రారంభించనున్నారు. -
రెట్టింపు అందం
ముఖంపైన మృతకణాలను తొలగించి, ఆకర్షణీయంగా మార్చడంలో సహజమైన చిట్కాలదే ప్రథమస్థానం అంటున్నారు నిపుణులు. రోజూ ఖరీదైన ఫేస్ క్రీమ్స్, లోషన్స్ అప్లై చేసుకుని, వారానికోసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా... చక్కగా ఓ 30 నిమిషాలు ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. మరింకెందుకు ఆలస్యం..? ఇలా ప్రయత్నించండి! కావాల్సినవి : క్లీనప్ : కీరదోస జ్యూస్ – 2 టేబుల్ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు – 2 టీ స్పూన్ మాస్క్: కమలా తొక్కల పొడి – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కొబ్బరిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కమలా తొక్కల పొడి, గడ్డపెరుగు, అరటిపండు గుజ్జు బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఇక ఇప్పుడు ఆపరేషన్ క్లీన్!
’మా పిల్లలు బడికెళ్ళేందుకు పుస్తకాలు లేవు. మా కోళ్ళూ, పశువులూ అన్నీ వరదనీటిలో కొట్టుకుపోయాయి. మాకిప్పుడు తలదాచుకునేందుకు ఇంత నీడ లేదు మూడు లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా కట్టుకున్న ఇల్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాము’’అన్నీ పోగొట్టుకొని ప్రాణాలను మాత్రం చిక్కబట్టుకొని బతికిబయటపడ్డ శోభన ఆవేదన ఇది. ముంచెత్తిన చెత్తాచెదారం మధ్య గుర్తించలేని విధంగా తయారైన తమ ఇళ్ళను చూసుకొని జనం బావురుమంటున్నారు. ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి విలపిస్తున్నారు. పునరావాస కేంద్రం నుంచి ఎర్నాకుళం జిల్లాలోని కొత్తాడ్లోని తమ ఇంటికి తిరిగి వెళ్ళిన 68 ఏళ్ళ వృద్ధుడు అక్కడి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదం కంటతడిపెట్టించింది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తిరిగి సురక్షితంగా తమ ఇళ్ళకు చేర్చాలంటే ముందుగా బహిరంగ ప్రదేశాలనూ, వారి ఇళ్ళనూ శుభ్రపరిచి, నివాసయోగ్యంగా తయారు చేయాలి. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం దానిపైనే దృష్టికేంద్రీకరించింది. బావులను శుభ్రపరచడం, పైపులైన్లను పునరుద్ధరించడం, విద్యుత్ పునరుద్ధరణ లాంటి తక్షణావసరాలపైన ప్రభుత్వం దృష్టిసారించింది. ఇళ్ళను శుభ్రపరిచేపనిలో వేలాది మంది వాలంటీర్లు... స్థానిక స్వయంపాలన, ఆరోగ్య విభాగాల కింద దాదాపు 3000 కిపైగా బృందాలు ఇళ్ళను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యాయి. వీళ్ళు కాకుండా ఇప్పటికే దాదాపు 12,000 మంది వాలంటీర్లు ఇదే పనిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 12,000 ఇళ్ళను శుభ్రం చేసారు. దాదాపు 3000 పశువుల కళేబరాలను బుధవారం పూడ్చిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ’’దాదాపు ప్రజలందరినీ రక్షించాం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వరదనీటిలో చిక్కుకుపోయారేమోనని ఇంకా వెతుకుతూనే ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నెల్లిపట్టి, పలక్కాడ్ జిల్లాల్లో మట్టిపెళ్ళలు విరిగిపడి నీటిలో చిక్కుకుపోయిన 11 మందినీ, మరో 15 మందినీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రక్షించినట్టు వెల్లడించారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్! ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి డిమాండ్ పెరిగింది. కొన్ని బావులు పూర్తిగా వరద బురదతో నిండిపోవడంతో వాటిని శుభ్రపరిచేందుకు ఒక్కొక్కరికీ 15000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి వేసవిలో దాదాపు 40 బావులను శుభ్రపరిచే కూనమ్తాయ్కి చెందిన పికె.కుట్టాన్ బావులు శుభ్రం చేయాలంటూ తనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అన్నారు. పెద్దగా లోతులేని చిన్న చిన్న బావులు ఒక్కొక్కదాన్ని శుభ్రపరిచేందుకు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద బావులు శుభ్రపరచడం మరింత రిస్క్‌తో కూడుకున్నదంటున్నారు కుట్టాన్. ’’ముందుగా ఓ క్యాండిల్ని వెలిగించి బావిలోకి దింపి, అది ఆరిపోకుండా ఉంటేనే మేం బావిలోనికి దిగుతున్నాం. ఇలా చేయడం వల్ల బావిలోని ఆక్సిజన్ని అంచనావేసే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని సార్లు అది చాలా ప్రమాదకరం’’ అంటారాయన. త్రీ బెడ్రూం ఫ్లాట్‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు దాదాపు 20,000 ఖర్చు అవుతుందని ఉదయంపెరూర్లోని సానోజ్ జోసెఫ్ అన్నారు. ’’ఒక్కో ఇంటికి రెండ్రోజుల పని ఉంటుంది. అదంతా ఫ్రీగా చేయాలంటే సాధ్యంకాదు. మా కుటుంబాలను కూడా పోషించుకోవాలి కదా?’’ అని ప్రశ్నిస్తున్నారు జోసెఫ్. ఫిక్స్ ఆల్... ఇదిలా ఉంటే ఉచితంగా సేవలందించేందుకు ’’ఫిక్స్ ఆల్’’ అనే ఆన్లైన్ వేదికొకటి ఏర్పాటయ్యింది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, రిఫ్రిజిరేటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చేందుకు ’ ఫిక్స్ ఆల్’ ఆన్లైన్ సహాయకులు లిజి జాన్ బృందం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. -
ఉత్తరప్రదేశ్ గిన్నీస్ రికార్డు!
లక్నో: ఒక మంచి కార్యక్రమంతో ఉత్తరప్రదేశ్ గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. అతి తక్కువ సమయంలో అత్యధిక మొక్కలు నాటి గిన్నీస్ లో చోటు సంపాదించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం 'క్లీన్ యూపీ, గ్రీన్ యూపీ'కి పిలుపునిచ్చింది. దీనికి స్పందించి రాష్ట్రవ్యాప్తంగా 8 గంటల్లో 10 లక్షల మొక్కలు నాటారు. ఈనెల 7న ఉదయం 8.30 నుంచి 4.30 గంటలోపు 10.15 ఒక్కలు నాటినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అటవీ, నీటిపారుదల శాఖల సహకారంతో అన్నివర్గాలు వారు మొక్కలు నాటడంతో రికార్డు సొంతమైందన్నారు. సాయ్ పాయ్ లో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు గిన్నీస్ నిర్వాహకులు రికార్డు తాలూకు ధ్రువపత్రాన్ని అందజేశారు. తమ ప్రభుత్వం సాధించిన రికార్డు గురించి ట్విటర్ ద్వారా అఖిలేశ్ తెలిపారు. ఆయన కూడా హమీపూర్ జిల్లాలో మౌదాహ డామ్ వద్ద రావి మొక్క నాటారు. -
పోషకాలు పోకుండా...
కూరగాయలు కరెక్ట్‌గా కడగండి ఆహారాన్ని తినడం ఎంత ముఖ్యమో, దాన్ని అపాయకరం కాకుండా, సురక్షితంగా ఉండేలా చూసుకోవడమూ అంతే ముఖ్యం. తినేముందు మనం చేతులు కడుక్కోవడం ఎంత ప్రధానమో, మనం తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రం చేయడమూ అంతే అవసరం. అయితే అన్నిరకాల కూరగాయలనూ ఒకేరకంగా శుభ్రం చేయడం సరికాదు. పదార్థాన్ని బట్టి శుభ్రం చేసే తీరుతెన్నులేమిటో తెలుసుకుందాం. ఆహారం శుభ్రం చేయడానికి ముందు చేతులూ శుభ్రంగా ఉండాలి... మనం ఏదైనా ఆహారం శుభ్రం చేయడానికి ముందుగా మనం చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో చేతుల్ని కడుక్కోవాలి. లేకపోతే మన చేతికి ఉన్న అపరిశుభ్రమే మన ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఆహారం శుభ్రపరచడంలో చేయకూడనివి... ఆహారాన్ని ఎప్పుడైనా సబ్బుతోగాని, డిటెర్జెంట్‌తో గాని, బ్లీచింగ్ పదార్థాలతో గాని, రసాయన పదార్థాలతోగాని శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోండి. కేవలం పరిశుభ్రమైన నీటితో మాత్రమే శుభ్రం చేయాలని తెలుసుకోండి. ఆహారాన్ని ఎలా శుభ్రం చేయాలంటే... ఆహారాన్ని శుభ్రం చేసే ముందర వాటిని శుభ్రమైన నీటితో లేదా తగినన్ని నీళ్లు పోసి పలచగా చేసిన వెనిగర్ సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. ఈ సొల్యూషన్ తయారు చేయడానికి అవలంబించాల్సిన పద్ధతి... నాల్గింట మూడొంతుల నీళ్లు తీసుకొని అందులో కేవలం ఒక వంతు వెనిగర్ పోసి ఈ సొల్యూషన్‌ను తయారు చేయాలి. ఒకవేళ ఇవేవీ లేకుండా కేవలం కిచెన్‌లోని నీళ్లతోనే శుభ్రం చేస్తుంటే కడగబోయే కూరగాయలపైనా, పండ్లపైనుంచి నీరు కాసేపు పైనుంచి పడుతూ ప్రవహించేలా చేయాలి. వేర్వేరు వెజిటబుల్స్ శుభ్రపరిచే పద్ధతులివి... చిన్న తొడిమకు అంటి ఉండే పండ్లను బాగా శుభ్రం చేశాక... మురికి పేరుకునే అవకాశాలు ఎక్కువగా తొడిమ వద్ద ఉంటాయి. కాబట్టి ఇలా కాడ ఉన్న పండ్లను శుభ్రం చేశాక అటు తొడిమ, ఇటు కాడకు రెండోవైపున చెక్కు తీసినట్లుగా కత్తితో కోయడం మేలు. ఈ నియమం ఆపిల్, పియర్ పండు, పీచ్ పండ్లకు వర్తిస్తుంది.మందంగా ఉండే తోలు ఉన్న పండ్లు (ఉదాహరణకు నారింజ, కమలాలు) తినబోయే ముందు, మనం ఎలాగూ పండు తోలును తినకపోయినా.. ఒక్కసారి తేలిగ్గా కడగడం మేలు.ఆకుకూరల్ని శుభ్రంగా కడిగాక వాటిపై నీళ్లు ఆరేలా కాసేపు ఆగాలి. ఆ తర్వాత శుభ్రమైన టవల్‌తో వాటిని తుడవాలి. అప్పుడే వాటిని కోయాలి. అంతేగానీ ఆకుకూరల్ని కోశాక వాటిని కడగడం సరికాదు. అలా చేయడంవల్ల పోషకాలు కోల్పోతాం. దుంపల్ని కూరల్ని శుభ్రం చేయడమిలా... మట్టి కింద ఉండే బంగాళదుంప (ఆలుగడ్డ), క్యారట్ వంటి వాటిని వెంటనే శుభ్రపరచకుండా కొద్దినిమిషాల పాటు నీళ్లలో నాననివ్వాలి. వాటిని ఎలాగూ చెక్కుతీసి వాడినప్పటికీ, నాననిచ్చిన తర్వాత కోసే ముందుగా ధారగా పడే నీళ్లలో కడగాలి.కాలిఫ్లవర్, బ్రకోలీ లాగా ముడుతలు ముడుతలుగా ఉండి, ఆ ముడుతల్లో మట్టి చేరే అవకాశమున్న పువ్వుకూరలను కాసేపు నీళ్లలో నాననివ్వాలి. ఆ తర్వాత నీళ్లు కారిపోయేలా రంధ్రాలుండే పాత్ర (కొలాండర్)లోకి వాటిని తీసుకోవాలి.కాయగూరల పైపొర చెక్కు తీసేలా ఉండే దోసకాయ, బీరకాయ, సొరకాయ వంటివాటిని పైనుంచి ధారగా పడుతున్న నీటిలో ఒకటికి రెండుసార్లు కడిగి,కోయాలి. కూరగాయలలో వంకాయలను కోసే పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. ముందుగా వంకాయలను ధారగా పడుతున్న నీటిలో కలగాలి. ఆ తర్వాత వాటిని కాస్తంత నిమ్మనీరు లేదా చిటికెడు ( 2 శాతం) చింతపండు నానేసిన నీరు లేదా చిటికెడు ఉప్పు లేదా 4 శాతం అసిటిక్ ఆసిడ్ ద్రవాలను ఒక పెద్ద పాత్రలోని నీళ్లలో కలిపి, ఆ ద్రవంలో ఒక్కొక్క వంకాయను విడివిడిగా కడగాలి. దీనివల్ల వంకాయల మీద చల్లి ఉన్న క్రిమిసంహారకాలు తొలగిపోతాయి.పుచ్చకాయ, కర్బూజకాయ లాంటి వాటిని ధారగా పడుతున్న నీటికింద కడుగుతూ మెత్తటి కుచ్చులున్న వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రంగా కడిగాకే, ముక్కలుగా కోయాలి. మొత్తం ఒకే కట్టగా ఉపయోగించే వాటిని కడగడం ఇలా... కొత్తిమీర, కర్వేపాకులను సాధారణంగా మొత్తం కట్టకట్టనంతా ఒకేసారి కడుగుతుంటారు. ఇలా కడిగే వాటిని నీరు నిండి ఉన్న బౌల్లో రెండు మూడుసార్లు తిప్పుతూ కడగాలి. ఆ తర్వాత పేపర్ టవల్‌తో తుడవాలి. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం ఇలాంటి వాటిని కడగడానికి ఉపయోగించే నీటిలో కాస్తంత నిమ్మరసం, కొంత వెనిగర్ వేయడం వల్ల కట్ట మీది బ్యాక్టీరియా, ఈ-కొలై శుభ్రంగా కడుక్కుపోవడంతో పాటు ఆకుకు కొత్త రుచి కూడా వస్తుంది. ఇక నేరేడు, బెర్రీపండ్ల వంటి వాటిని వెనిగర్ సొల్యూషన్‌లో కడగాలి. మనం షాపింగ్ చేస్తున్నప్పుడే పండుపై దెబ్బలేని వాటిని ఎంపిక చేయాలి. కడగటం అవసరం లేకున్నా ఒకసారి కడిగితే మేలు.. వాస్తవానికి ఈ కింద పేర్కొన్న ఆహారపదార్థాలను కడగాల్సిన అవసరం లేదు. కడగకున్నా పర్లేదు. అయినా ఒకసారి కడగడం వల్ల నష్టం లేదు. అవి... ఉల్లిగడ్డ అవకాడో మొక్కజొన్నగింజలు పైనాపిల్ మామిడిపండ్లు కివీ క్యాబేజీ బొప్పాయి పుచ్చకాయ బ్రకోలీ టొమాటో చిలగడదుంప (మోరంగడ్డ) వేటిని కడగకూడదు... లేబుల్స్ మీద అప్పటికే ‘రెడీ టు ఈట్’, ‘వాష్డ్’, ‘ట్రిపుల్ వాష్డ్’, ‘డోంట్ వాష్’ అని ప్రత్యేకంగా, నిర్దిష్టంగా రాసినవి మాత్రం కడగకూడదు. ఒకసారి శుభ్రంగా కడిగి, కట్ చేసుకున్న తర్వాత వెంటనే వాడుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మళ్లీ నిల్వ చేయాల్సి వస్తే వాటిని ఫ్రిజ్‌లో 40 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాలి. ఒకవేళ కట్ చేసి ఉన్న పదార్థాలే కొనాల్సి వస్తే అవి ఫ్రిజ్‌లో లేకుండా విడిగా ఉంటే మాత్రం కొనవద్దు.