
ఎండలు పెరుగుతున్నాయి. ఎండ వల్ల చర్మం కమిలినా, ట్యాన్ ఏర్పడినా, పొడిబారినా.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటించి మేనికాంతి నిగారింపు కోల్పోకుండా చూసుకోవచ్చు. మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.
అరటిపండు గుజ్జు, 3 టేబుల్ స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ కలిపి మేనికి రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత వేడినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది. టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతిమంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment