చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! | Winter2024 tips for healthy and shiny skin | Sakshi
Sakshi News home page

చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

Published Fri, Nov 8 2024 9:55 AM | Last Updated on Fri, Nov 8 2024 10:17 AM

Winter2024 tips for healthy and shiny skin

నెమ్మదిగా  చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త  ఊరటనిచ్చినా  ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు  శ్వాసకోశ వ్యాధులు, చర్మ  సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్‌లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం  చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.


పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.

  • పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్‌ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది. 
  • చర్మానికి సరైన పోషణ లేక  లేకపోతే జీవ కళ కోల్పోతుంది.  పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్‌ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. 
  • జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్‌ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. 
  • చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.
  • రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.
  • శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి.  చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటేనే  మెరుస్తూ ఉంటుంది.  అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి.  (నో జిమ్‌.. నో డైటింగ్‌ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)
  • ఫ్యాటీఫుడ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్‌ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. 
  • రోజూ వాకింగ్‌, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో  చక్కటి గ్లో వస్తుంది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement