పెరుగుతున్న కాలుష్యం బారిన పడకుండా అందాన్ని సంరక్షించుకోవాలంటే... కాస్త సమయాన్ని సౌందర్య చిట్కాలకు కేటాయించాల్సిందే. ఫేస్ ప్యాక్ అంటే ఏదో పండును గుజ్జు చేసుకుని, అందులో ఏవో కొన్ని లేపనాలను కలుపుకుని, ముఖానికి అప్లై చేసుకుని, ఆరిపోయాక క్లీన్ చేసుకుంటే సరిపోదు. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలిగిపోయి, కాంతివంతంగా మెరిసేందుకు ఫేస్ ప్యాక్స్ కంటే ముందుగా క్లీనప్ చేసుకోవడం, స్క్రబ్ చేసుకోవడం, ఆవిరి పట్టించుకోవడం వంటివి చెయ్యాల్సిందే. క్లీనప్, స్క్రబ్ వంటివి చెయ్యడం వల్ల ముఖంపైన ఉండే టాన్ తొలిగిపోయి గ్లోయింగ్ వస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి:
క్లీనప్ : కలబంద గుజ్జు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, కొబ్బరి పాలు – అర టీ స్పూన్
స్క్రబ్ : పంచదార పొడి – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – 1 టీ స్పూన్,
ఆలీవ్ నూనె – అర టీ స్పూన్
మాస్క్ : ముల్తానీ మట్టి – 1 టేబుల్ స్పూన్, టమాటా జ్యూస్ – అర టేబుల్ స్పూన్
పసుపు – చిటికెడు, రోజ్ వాటర్ – 1 టీ స్పూన్
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని కలబంద గుజ్జు, తేనె, కొబ్బరిపాలు యాడ్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పొడి, నిమ్మరసం, ఆలీవ్ నూనె ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మూడు నుంచి ఐడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ముల్తానీ మట్టి, టమాటా జ్యూస్ ఒక బౌల్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో పసుపు, రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని, బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం
ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment