ఫేస్‌వాష్.. మసాజ్
బ్యూటిప్స్
మృదువైన చర్మం మీ సొంతం కావాలంటే మొదట ఐస్ వాటర్‌తో ఫేస్‌వాష్ చేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్‌ను తేనెలో ముంచుతూ ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. దానిపైన గుడ్డు తెల్లసొనను అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక మళ్లీ ఐస్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే ముఖం నిగనిగలాడుతుంది.
{yై స్కిన్ వారు ఈ సులువైన చిట్కా ద్వారా మంచి ఫలితం పొందొచ్చు. ముఖం, చేతులు, మెడపై బొప్పాయి పండు గుజ్జుతో బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఓట్స్, తేనె, చల్లటి పాలతో తయారు చేసుకున్న స్క్రబ్‌ను చర్మంపై ఉపయోగించాలి. వెంటనే మళ్లీ చల్లటి పాలు, నీళ్లతో చర్మాన్ని శుభ్రం చేసుకొని ఏదైనా క్రీమ్‌ను రాసుకుంటే డ్రైనెస్ దూరమవుతుంది.