Ice water
-
ఐస్ వాటర్ తెగ తాగేస్తున్నారా? ఆగండాగండి! ఈ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇంకా మార్చి నెల రాకుండానే వేడి సెగ తగులుతోంది. రాత్రి పూట ఫ్యాన్లు, ఏసీలు లేనిదే నిద్రపోలేని పరిస్థితి వచ్చేసింది. ఇక ఎండాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది చల్ల.. చల్లని నీళ్లు. వేడినుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం అందరికీ అలవాటు. చల్లటి నీళ్లు, లేదా ఇతర పానీయాలు కడుపులో పడగానే హాయిగా అనిపిస్తుంది. కానీ అలా ఐస్ వాటర్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి చేటు అని మీకు తెలుసా? వేసవిలో చల్లని నీరు త్రాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు గురించి తెలియాలంటే.. ఈ కథనాన్ని చూడండి. జీర్ణక్రియ సమస్యలు చల్లటి నీరు కడుపుని సంకోచింప చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత ఆహారాన్ని జీర్ణం కాదు కష్టమవుతుంది. మనం చల్లటి నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి శరీరం చాలా కష్టపడాల్సి వస్తుంది. అవును, చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి మనం చల్లటి నీరు తాగినప్పుడు, అది శరీర ఉష్ణోగ్రతతో సరిపోలక కడుపులో ఉన్న ఆహారం జీర్ణం కష్టమవుతుంది. హార్ట్ రేట్ తగ్గిపోతుంది కొన్ని అధ్యయనాలు ప్రకారం చల్లని నీరు తాగడం గుండె స్పందన రేటు కూడా తగ్గిపోతుంది. మెడ మీద ఉండే గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడి మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ నాడి శరీరం స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. అందుకే చల్లగా తిన్నా, తాగినా హార్ట్ రేట్ ప్రభావిత మవుతుంది. నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. సైనస్ , తలనొప్పి అతి చల్లగా తాగడం వల్ల కూడా 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్రీం అధికంగా తీసుకుంటే, వెన్నెముకకు సంబంధించిన సున్నితమైన నరాలు కూడా చల్లగా అయిపోతాయి. ఫలితంగా తలనొప్పి , సైనస్ సమస్యలొస్తాయి. మలబద్ధకం చల్లటి నీరు తాగడం వల్ల పేగుల్లో ఆహారం గడ్డకడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ బుల్ లాంటివి కూడా వస్తాయి కొవ్వును పెంచుతుంది చల్లటి నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును మరింత గట్టిగా తయారు చేస్తుంది. ఒక పట్టాన కరగదు కూడా. సో.. బరువు తగ్గాలనుకున్న వారు చల్లని నీటికి దూరంగా ఉండాలి. గొంతు నొప్పి చల్లని నీరు, పానీయాల వల్ల ముఖ్యంగా భోజనం తర్వాత, అదనపు శ్లేష్మం (శ్వాసకోశ శ్లేష్మం) ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది గొంతు నొప్పి, ముక్కు దిబ్బడం సమస్య వస్తుంది. ఇది ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇది ముదిరితే జ్వరం కూడా వస్తుంది. అంతేకాదు చల్లటి నీరు తాగడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. అందుకే కుండలోని నీళ్లు అయినా, ఫ్రిజ్ వాటర్ అయినా మరీ చల్లని నీళ్లు కాకుండా, ఒక మాదిరివి తాగి, వేడినుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే సమస్యలు తప్పవు. -
ఐస్‌వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!
ఇంతవరకు ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు ట్రై చేసి ఉంటారు. కానీ అవన్నీ కూడా ఈ ఐస్ వాటర్ ట్రిక్ ముందు బలాదూర్ అంటున్నారు సౌందర్య నిపుణులు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో అవుతుంటారట. అందువల్ల వాళ్లంతా నలభైలలో కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపించేందకు రీజన్ ఇదేనట. అసలు ఐస్‌వాటర్ చర్మ సౌందర్యాన్ని కాపాడటం ఏంటీ? కామెడీగా అని కొట్టిపారేయకండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే.. ఉదయం లేచిన వెంటనే మీ ముఖాన్ని కొద్దిసేపు ఐస్‌వాటర్‌లో డిప్ చేసి ఉంచితే ఒక్కసారిగా నిద్రమత్తుతో ఉన్న ముఖం క్షణాల్లో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అది ముఖంపై ఉండే రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న రంధ్రాలతో అసహ్యంగా కనిపిస్తున్న చర్మానికి ఇది చక్కటి రెమిడీ అని చెప్పొచ్చు. అయితే ఈ చల్లటి వాటర్‌తో ముఖాన్ని రుద్దకపోవడమే మంచిది. ఎందుకంటే పొడిగా అయ్యి ర్యాష్ వచ్చే ప్రమాదం ఉంది. ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచితే ముఖం గ్లాస్ స్కిన్‌లా మెరుస్తూ తాజాగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) అదీగాక అప్పటి దాక సాధారణ టెంపరేచర్లో ఉన్న ముఖం ఒక్కసారిగి ఇలా చల్లటి నీటిలో ఉంచితే..ముఖానికంతటికీ రక్తప్రసరణ జరిగి ఒక్కసారిగా తెలియని ఉత్సాహం వస్తుంది. మనం ఉపయోగించే స్క్రబ్‌లు, మాయిశ్చరైజర్ల కంటే ఈ ఐస్ వాటర్ ట్రిక్ అత్యుత్తమమైనది అని అంటున్నారు. ఇలా రోజులో కనీసం రెండు నుంచి మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తే మెరిసే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుదంని చెబుతున్నారు. అంతేగాదు ముఖంపై వచ్చే వాపులను కూడా తగ్గిస్తుందట. వాపుగా ఉన్న ప్రాంతంలో... రక్త సరఫరా ఎక్కువ అవ్వడంతో కుచించుకుపోయిన నాళాలకు రక్తసరఫరా తగ్గి యథావిధికి రావడమే గాక నొప్పి కూడా తగ్గుతుందని చెబతున్నారు సౌందర్య నిపుణులు. అంతేగాదు ఇలా ఐస్‌వాటర్‌లో ముఖాన్ని డిప్ చేసి ఉంచే ట్రిక్‌తో తమ అందాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నామో వివరిస్తూ వీడియోలు షేర్ చేసిన కొందరూ సెలబ్రెటీల వీడియోలు నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతున్నాయి. చూసేయండి.. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!) -
Super Women: ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్
Swimming Under Ice: దక్షిణాఫ్రికాకు చెందిన ఓ స్విమ్మర్ సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేందుకు ప్రాణాలనే రిస్క్‌లో పెట్టి స్టంట్ చేసింది. ఆమె ధైర్యానికి పలువురు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, అంబర్ ఫిల్లరీ అనే మహిళ మంచు కింద 295 అడుగుల మూడు అంగుళాల దూరం ఈదుతూ రెండోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టింది. కాగా, ఫిల్లరీ రెండేళ్ల క్రితం నార్వేలోని ఓప్స్జోలో 229 అడుగుల 7.9 అంగుళాల దూరం ఈది మొదటిసారి రికార్డు క్రియేట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Fillary (@amber_fillary) తాజాగా కోంగ్స్బర్గ్లో డైవింగ్ సూట్ లేకుండా మంచు కింద నీటిలో ఆమె స్విమ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రొయేషియాకు చెందిన విటోమిర్ మారిసిక్ అనే వ్యక్తి అంతకు ముందు 3 నిమిషాల 6 సెకన్లలో పూల్‌లో 351 అడుగుల 11.5 అంగుళాల దూరాన్ని ఈది గిన్నిస్ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఈ సందర్బంగా అంబర్ ఫిల్లరీ.. ఇప్పటి వరకు తనకు ఆర్థికంగా సహకరించిన , మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ రికార్డు సాధించేందుకు తనకు సహాయం చేసిన తన టీమ్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఇది కూడా చదవండి: అత్యంత ప్రత్యేకం.. ప్రళయమొచ్చినా.. లైట్ తీసుకుంటాయ్! -
ప్రాణం పోయేలా ఉంటే ప్రాంక్ అనుకుంది
పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎప్పుడూ టిక్టాకేనా, వేరే పనే లేదా? అని ఎంతమంది మొట్టికాయలు వేసినా టిక్‌టాక్ యూజర్లకు చీమకుట్టినట్టైనా ఉండదు. పైపెచ్చు నా వీడియోను ఇంతమంది చూశారు, అంతమంది లైక్ కొట్టారని తెగ మురిసిపోతుంటారు. లేదంటే నా వీడియో ఎవరూ పట్టించుకోవట్లేదంటూనే మరో వీడియోకు పోలోమని రెడీ అయిపోతుంటారు. అన్నం తినకుండా ఒకరోజైనా ఉంటారేమో కానీ టిక్‌టాక్ లేకుండా ఒక పూట కూడా ఉండలేమన్నట్లుగా తయారయ్యారు చాలామంది జనాలు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగాలు ఊడగొట్టుకోగా మరికొంతమంది ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. చావును దగ్గర నుంచి చూశాడు కానీ కొందరు మాత్రం పిచ్చి పిచ్చి ప్రయోగాలతో చావు చివరి అంచుల దాకా వెళ్లి వస్తున్నారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే. టిక్‌టాక్ స్టార్ జాసన్ క్లార్క్ ఓ విన్యాసానికి పూనుకున్నాడు. అందరిలాగా మామూలు నీళ్లలో ఈత కొడితే మజా ఏముంది అనుకున్నాడో ఏమోగానీ గడ్డ కట్టిన మంచు నీటి కింద ఈత కొట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంచు గడ్డ కట్టిన నీళ్లలోకి ప్రవేశించి ఈత కొట్టడం ప్రారంభించాడు. తర్వాత కాసేపటికే ఊపిరాడక చేపలా గిలగిలా కొట్టుకున్నాడు. తిరిగి పైకి రావడానికి దారి కూడా కనిపించలేదు. పైగా అతని కళ్లు కూడా మంచు కట్టడం ప్రారంభించమవడంతో ఊపిరి పోవడం తథ్యం అనుకున్నాడు. కానీ ఎట్టకేలకు ఓ రంధ్రం గుండా నీళ్లలో నుంచి బయట పడ్డాడు. ఊపిరాడక చస్తుంటే ప్రాంక్ అనుకుంది ఈ భయానక అనుభవాన్ని జాసన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నీళ్లలోకి దిగి ఈత కొట్టాక నా చుట్టూ అంతా ఒకేలాగా అన్పించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో ఎలాగోలా పైకి రావాలని మంచుగడ్డను పగలగొట్టేందుకు ప్రయత్నించాను, కానీ అది సాధ్యపడలేదు. కళ్లు కూడా పనిచేయడం మానేసినట్లు అనిపించింది. దీంతో వెంటనే నా శక్తిని కూడగొట్టుకుని పైకి వచ్చేశాను’ అని పేర్కొన్నాడు. ఇక దీన్నంతటినీ చిత్రీకరిస్తున్న మహిళ అతను నీళ్ల లోపల కొట్టుమిట్టాడటాన్ని చూసి అది ప్రాంక్ అని భ్రమపడటం గమనార్హం. ఇక విశేషమేంటంటే ఇంత జరిగినా అతను మరోసారి ఈ సాహసానికి పూనుకుని అందులో సఫలీకృతుడయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకన్నాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
బ్యూటిప్స్
బంగాళదుంప తురుము – రెండు టేబుల్ స్పూన్లు, తేనె – సరిపడా. ముందుగా బంగాళదుంప తురుముని ఐస్ వాటర్‌లో అయిదు నిమిషాల పాటుంచి తీయాలి. దీంట్లో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి. రెండు టీ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ మొదలుకొని ముఖానికి పట్టించి ఆరిన తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మ కాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. -
ఫేస్‌వాష్.. మసాజ్
బ్యూటిప్స్ మృదువైన చర్మం మీ సొంతం కావాలంటే మొదట ఐస్ వాటర్‌తో ఫేస్‌వాష్ చేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్‌ను తేనెలో ముంచుతూ ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. దానిపైన గుడ్డు తెల్లసొనను అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక మళ్లీ ఐస్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే ముఖం నిగనిగలాడుతుంది. {yై స్కిన్ వారు ఈ సులువైన చిట్కా ద్వారా మంచి ఫలితం పొందొచ్చు. ముఖం, చేతులు, మెడపై బొప్పాయి పండు గుజ్జుతో బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఓట్స్, తేనె, చల్లటి పాలతో తయారు చేసుకున్న స్క్రబ్‌ను చర్మంపై ఉపయోగించాలి. వెంటనే మళ్లీ చల్లటి పాలు, నీళ్లతో చర్మాన్ని శుభ్రం చేసుకొని ఏదైనా క్రీమ్‌ను రాసుకుంటే డ్రైనెస్ దూరమవుతుంది. -
ది రియల్ చాలెంజర్.. మంజులత
రియల్ చాలెంజ్ ఫర్ రైట్ కాజ్ అంటే ఏంటో చూపించింది మంజులత కళానిధి! ప్రస్తుతం ఓ ఆంగ్ల పత్రికలో ఫీచర్స్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె మొదలుపెట్టిన రైస్ బకెట్ చాలెంజ్ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ సంచలనాన్ని గుర్తుగా ఆమె సేవకు కర మ్వీర్ చక్ర పురస్కారం అందింది. ఈ సందర్భంగా మంజులతను ‘సిటీప్లస్’ పలకరించింది. విశేషాలు ఆమె మాటల్లోనే.. నిజానికి చారిటీ అనేది నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. గత మే నెలలో నేను ఒరైజా అనే వెబ్సైట్లో జాయిన్ అయ్యాను. బియ్యం శాస్త్రీయనామం ఒరైజా సటైవా. నా పని వరికి సంబంధించిన సకల సమాచారాన్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడమే. దీనికి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడే ఐస్ బకెట్ చాలెంజ్ నా కంటపడింది. హాలీవుడ్ స్టార్స్ నుంచి మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ వరకు వేలం వెర్రిగా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అమెరికా లాంటి దేశాలకు ఆ చాలెంజ్ ఓకేనేమో.. మన దేశానికైతే అస్సలు సరికాదు. ఇక్కడ పావర్టీ ఉంది. ఎన్నో సమస్యలున్నాయి. ముందుగా వాటిపై స్పందించాలి. కనీసం కారణం తెలియకుండా ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఆ ఫాలోయింగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా మంచి పనికి శ్రీకారం చుట్టాలనే ఆలోచన కలిగింది. వన్ ఫైన్ ఫ్రైడే.. బకెట్ ఐస్ వాటర్ నెత్తిపై గుమ్మరించుకునే బదులు అదే బకెట్ బియ్యాన్ని ఆకలిగా ఉన్నవాళ్లకిస్తే బాగుంటుందన్న నిశ్చయానికి వచ్చేశాను. ఆగస్ట్ 21 శుక్రవారం.. ఉదయం.. మా బాల్కనీలో నిలబడి టీ తాగుతున్నాను. మా ఇంటి ముందు ఒకబ్బాయి ఇడ్లీలు అమ్ముకుంటుంటాడు. అతనికి బకెట్ బియ్యం ఇచ్చి నా రైస్ బకెట్ చాలెంజ్‌ను మొదలుపెడితే బాగుంటుందనుకున్నాను. ఆ అబ్బాయిని పిలిచి సాయంత్రం కనపడమన్నాను. నా సంకల్పం మా వారితో చెప్తే ఆయనకూ నచ్చింది. ఆ సాయంత్రం మా వారు ఆ అబ్బాయిని తీసుకుని వాళ్లు ఎలాంటి బియ్యం వాడతారో తెలుసుకుని అవే కొని ఇంటికి తీసుకొచ్చారు. ఇడ్లీ పాత్ర నిండుగా 20 కిలోల బియ్యం ఇస్తూ.. అడిగి మరీ ఫొటో తీయించుకున్నాను. ఆ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి రైస్ బకెట్ చాలెంజ్‌కు పిలుపునిచ్చాను. 7 లక్షల లైక్స్.. 70 వేల చాలెంజర్స్.. ఆ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో విపరీతమైన స్పందన వచ్చింది. వందలాది మంది ఈ చాలెంజ్‌కు రెస్పాండయ్యారు. ఈ పది రోజుల్లో ఏడు లక్షల అరవై వేల లైక్స్ వచ్చాయి. 70 వేల మంది రైస్ బకెట్ చాలెంజ్ స్వీకరించారు. ఉద్యమంలా ఊపందుకున్న ఈ రైస్ బకెట్ చాలెంజ్ గురించి తెలుసుకుని, చూసిన యునెటైడ్ నేషన్స్ అండ్ ఐకాంగో (ఇండియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్) సంయుక్తంగా కరమ్వీర్చక్ర అవార్డును ప్రకటించాయి. అలాగే రెక్స్ కరమ్వీర్చక్ర ఫెలోషిప్‌నూ ఇచ్చాయి. వచ్చే ఏడాది మార్చ్ 23న ఈ అవార్డును అందుకోబోతున్నాను. నా కుటుంబం సహకారంతో అనుకున్నవి సాధిస్తానన్న నమ్మకం ఉంది. - సరస్వతి రమ